Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

నీకొక నిజం చెప్పాలని.. Neekoka Nijam Cheppalani
నీకొక నిజం చెప్పాలని.. Neekoka Nijam Cheppalani
నీకొక నిజం చెప్పాలని.. Neekoka Nijam Cheppalani
Ebook64 pages12 minutes

నీకొక నిజం చెప్పాలని.. Neekoka Nijam Cheppalani

Rating: 3.5 out of 5 stars

3.5/5

()

Read preview

About this ebook

చిరు బాల్యపు చిలిపితనమనుకో..
కౌమారపు తొలివలపనుకో..
ప్రౌఢపు పలు వాంఛల, చింతల కదంబమనుకో..
నాకూహ తెలిసి
నా మదిని రేగిన పెను తుఫానుల సారం..
ప్రేమలు, బాధలు,
వేదాంతం, వైరాగ్యం,
ఆరాటం, విరహం,
కోరికల సమూహం,
ఇవన్నీ కలగి, కనలి,
సంక్షిప్తమై, సంరావమై,
ఘనీభవించిన ఒక నిజం
నా కవిత్వం.
ప్రతి సాయంత్రం సముద్రపు తీరం
క్షితిజంలో నీకోసం వెదుకుతూ
నే విసిరిన గాజుసీసాల సందేశాల హారం
ఈ నిజం - నా కవిత్వం.

LanguageTelugu
Release dateJan 10, 2014
ISBN9781310722431
నీకొక నిజం చెప్పాలని.. Neekoka Nijam Cheppalani
Author

Praneeth Tammiraju

Hello!A piece of flesh...A drop of blood...A war of emotions...A sea of boredom!I am an Engineer by profession, a Poet by passion and a Romantic by choice!

Related to నీకొక నిజం చెప్పాలని.. Neekoka Nijam Cheppalani

Related ebooks

Related categories

Reviews for నీకొక నిజం చెప్పాలని.. Neekoka Nijam Cheppalani

Rating: 3.5 out of 5 stars
3.5/5

2 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    నీకొక నిజం చెప్పాలని.. Neekoka Nijam Cheppalani - Praneeth Tammiraju

    అన్నీ నీవే!

    29-12-04

    అంబరం, అర్ణవం,

    అగాథం, అమేయం,

    అనుభూతి, ఆనందం,

    అనుభవం, అభిమానం,

    పులకించే పూరేకుల

    బహుమానం పరిమళం,

    ఆకాశాపు సాగరాన

    విరిసే బహుతారాపుష్పం,

    ఉరికే ప్రతి జలపాతం,

    కురిసే స్వాతి ముత్యాల వర్షం,

    పసిపాపల చిరుదరహాసం,

    వేణువులో గాలూచే ధ్వని,

    అలలై ఎగసే కోరికలు,

    రెక్కలొచ్చి ఎగిరే చూపులు,

    పలికే ప్రతి వేదాంతం,

    వ్రాసే నా ప్రతి వాక్యం,

    రోగం, భోగం,

    దప్పిక, దాహం,

    మెదిలే ఊసులు,

    చేసిన బాసలు,

    నా వాక్కు, నా చలనం,

    నా మనస్సు, నా కవనం,

    భేదాలు, బాధలు,

    శోకాలు, లోకాలు,

    ఆపేక్ష, ఆరాటం,

    తేజస్సు, అంధకారం,

    వ్యసనం, హసనం,

    నడత, మమత,

    ప్రేమ, పాశం,

    స్నేహం, మోహం,

    ఓటమి, దైన్యం,

    గెలుపు, మోక్షం,

    తెలిసినది, తెలియనిది,

    ఆలోచన, ఆవేశం,

    దైవత్వం, వ్యక్తిత్వం,

    భావం, జీవం,

    మరణం, జీవితం,

    అన్నిటా నీ ప్రమేయం,

    అన్నిటా నీ ప్రభావం,

    అన్నిటా నీ దివ్యరూప సాక్షాత్కారం.

    నీవు లేని సృష్టి లేదు.

    సృష్టి లేనిది నీవు లేవు.

    నీవు లేక, సృష్టి లేక

    నేను లేను, కవిత లేదు.

    ఆహ్వానం

    13-06-05

    ఒంటరితనం ఊడలమఱ్ఱి

    దాపున తలదాల్చుకు

    కార్చిన నా కన్నీటి కాటుక చీకట్లు

    కరిగి, పొంగి, పారిపాడిన

    వ్యథానివేశం, వ్యర్థవిలాపం.

    నిదురలోనూ నిముషమైనా

    నీకు నీడై బ్రతుకుదామని

    కలలనన్నీ కనులమీద

    పోగుచేసుకు ఆదమరిస్తే

    ఊహనైననూ నీ రూపం

    సముద్రానికి ఆవలి తీరం.

    మెలకువలో..

    గుప్పిట నా ప్రాణాన్నీ,

    గుండెల్లో నీ రూపాన్నీ పెట్టుకుని

    పూజించి, ప్రేమించి, రోదించి

    Enjoying the preview?
    Page 1 of 1