Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

భగవద్గీత
భగవద్గీత
భగవద్గీత
Ebook331 pages1 hour

భగవద్గీత

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

భగవత్కృపవలన, సద్గురువుల కృపవలన, నేను గీతానువాదమును తెలుగుభాషలో, సరళభాషలో, సాధ్యమైనంత ఛందోబద్ధముగా వ్రాసితిని. ఇది తేటతెలుగు లలితగీత. ప్రౌడ కవితా గ్రాంధికముకాదు. తెలుగు తెలిసిన వారందరికీ సులభముగా అర్థమయ్యేవిధముగా, వినసొంపుగా వ్రాయుటకు నా శక్త్యానుసారముగా రచించినాము. మహానుభావులగు పండితశ్రేష్ఠులు నన్ను “మన తెలుగు మహిళ” వ్రాసినదన్న అభిమానముతో తప్పులను ఒప్పులుగా దిద్దుకొని, చదివి, అంగీకరించి, ఆశ్వీరదింప వలయునని వేడుకొనుచున్నాను

LanguageTelugu
Release dateNov 14, 2013
ISBN9781311385178
భగవద్గీత
Author

Sarada Devi Pillutla

She is a poetess. She writes poetry in Telugu, a language of India. She writes in a traditional 'grandhika' form of telugu poetry, but still easily understandable by any telugu speaking person. She is a highly spiritual person, who has translated many of her guru's works in hindi to english and telugu. At the age of 90 she started writing Bhagavad Gita in telugu poetry and completed within 3 months. She lives in Hyderabad , India.

Related to భగవద్గీత

Related ebooks

Related categories

Reviews for భగవద్గీత

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    భగవద్గీత - Sarada Devi Pillutla

    Chapter భగవద్గీత

    జై శ్రీ గం గణపతయె నమ:

    శ్రీమదాంధ్ర భగవద్గీత

    విషయసూచిక

    ౧. అర్జున విషాద యోగము

    ౨. సాంఖ్య యోగము

    ౩. కర్మ యోగము

    ౪. జ్ఞాన యోగము

    ౫. కర్మ సన్యాస యోగము

    ౬. ఆత్మ సంయమ యోగము

    ౭. విజ్ఞాన యోగము

    ౮. అక్షర పరబ్రహ్మ యోగము

    ౯. రాజవిద్యా రాజగుహ్య యోగము

    ౧౦. విభూతి యోగము

    ౧౧. విశ్వరూప సందర్శన యోగము

    ౧౨. భక్తి యోగము

    ౧౩. క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము

    ౧౪. గుణత్రయ విభాగ యోగము

    ౧౫. పురుషోత్తమ ప్రాప్తి యోగము

    ౧౬. దైవాసుర సంపద్విభాగ యోగము

    ౧౭. శ్రద్ధాత్రయ విభాగ యోగము

    ౧౮. మోక్షసన్యాస యోగము

    ****

    Chapter ప్రార్థన

    మంగళాశాసనము

    ప్రార్థన

    గురువే బ్రహ్మ విష్ణువు

    గురువే మహేశ్వరుండు గురు పరబ్రహ్మం

    గురువే తల్లియు దండ్రియు

    గురువే నా పతియుగతియు గురువర జయహో!

    విఘ్నేశ్వరునకు మ్రొక్కెద శ్రీలక్ష్మికి, సరస్వతికి గౌరీ సతికిన్

    శ్రీవేదవ్యాసునకు, శ్రీరామ, కృష్ణులకు హనుమంతునకున్

    శ్రీకృష్ణుడు పరమాత్ముడు

    నరులందరి మేలుకోరి నరునకు చెప్పెన్

    శ్రీమద్భగవద్గీతను అందుకె

    భగవద్గీతకు వందన మనెదన్

    పరమపూజనీయుడు పరమశ్రద్ధేయుడు

    ఆచార్య శ్రీసుధాంశు మహారాజ్‌కు వందనం

    సరళ సహజ సులభుడు సత్కార్యాచరణుడు

    సద్గురువు శ్రీ నృశింహ ప్రభువునకిదే వందనం

    పార్థాయప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం

    వ్యాసేనగ్రధితం పురాణమునినా మధ్యేమహా భారతం

    అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశా ధ్యాయినీం

    అంబా! త్వామనుసంధదామి భగవద్గీతే! భవద్వేషిణీం

    మూకం కరోతి వాచాలం పంఘుం లంఘయతేగిరిం

    యత్ కృపాతమిదం వందే! పరమానందమాధవం!

    కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే

    ప్రణత:క్లేశనాశాయ గోవిందాయ నమోనమ:

    ****

    Prologue

    మహాభారత యుద్దము ప్రారంభమై పది దినములు గడచినది. భీష్ముడు రణరంగమున కూలి పోయెను, కౌరవ పాండవులు యుద్ధము చేయనెంచి, ధర్మక్షేతమగు కురుక్షేత్రమునకు వచ్చినప్పుడు, ధృతరాష్ట్రుడు మిక్కిలి కలత చెందెను. అప్పుడు వేదవ్యాస మహాముని యుద్ధమును చూడ గోరినచో నీకు దృష్టిని ప్రసాదింతును అనగా, స్వజనుల మరణమును నేను చూడలేను, కానీ యుద్ధ వార్తలను వినగోరుచున్నాను అని చెప్పెను. అప్పుడు వేదవ్యాస మహాముని, సంజయునకు దూరదృష్టియును, దూరశ్రవణమును, అందరి మనోగత భావములను తెలుసు కొనుట మొదలగు దివ్యశక్తులను సంజయునకు ప్రసాదించి, ఆ వార్తలను ధృతరాష్ట్రునకు చెప్పుము అని నియమించెను.

    సంజయుడు యుద్ధరంగమునకు పోయి, అచ్చట పది దినములు ఉండి, యుద్ధమును చూచి వచ్చి, అప్పటి వరకు భీష్ముడు అంపశయ్యపై కూలెను. అన్న దుర్వార్తవరకు, జరిగినది అంతయును ధృతరాష్ట్రునకు చెప్పెను. ఇచ్చటి నుండియే భగవద్గీత ప్రారంభము.

    ****

    Chapter మనవి

    పాఠక మహాజనులకు రచయిత్రి అభివాదములు చేసి చేయు విన్నపములు:

    సోదరసోదరీమణులారా! చిన్నారి బాలబాలికలారా! పండితులారా! స్నేహితులారా! బంధుజనులార! అందరికీ వందనములు.

    యీ బృహత్‌కృతిని వ్రాయుటకు ప్రేరేపణ నామనుమడైన శ్రీయుత పిల్లుట్ల శ్రీనివాసవరప్రసాద్, అతని సద్గురువగు శ్రీయుత పూజ్యపాద నరశింహప్రభువుగారు. దక్షిణ భారత భాషలైన తెలుగు, తమిళము, కన్నడము, మళయాళము మొదలగు భాషలలో శ్రీమద్భగవద్గీతను ఆబాలగోపాలమునకు అర్థమయ్యేవిధముగ, సరళమైన భాషలలో వెలువరించుటకు నాకు అవకాశము లభించినది. భగవత్కృపవలన, సద్గురువుల కృపవలన, నేను గీతానువాదమును తెలుగుభాషలో, సరళభాషలో, సాధ్యమైనంత ఛందోబద్ధముగా వ్రాసితిని. ఇది తేటతెలుగు లలితగీత. ప్రౌడ కవితా గ్రాంధికముకాదు. తెలుగు తెలిసిన వారందరికీ సులభముగా అర్థమయ్యేవిధముగా, వినసొంపుగా వ్రాయుటకు నా శక్త్యానుసారముగా రచించినాము. మహానుభావులగు పండితశ్రేష్ఠులు నన్ను మన తెలుగు మహిళ వ్రాసినదన్న అభిమానముతో తప్పులను ఒప్పులుగా దిద్దుకొని, చదివి, అంగీకరించి, ఆశ్వీరదింప వలయునని వేడుకొనుచున్నాను.

    ఇట్లు

    భవదీయ

    శారదాదేవి

    ౧౨౨, ‘రాగ’ బృందావన్ కాలనీ,

    నేరేడ్‌మెట్ క్రాస్ రోడ్స్ ,

    సికింద్రాబాదు.

    ****

    Chapter అర్జున విషాదయోగము

    జై శ్రీ గం గణపతయె నమ:

    శ్రీ మదాంధ్ర భగవద్గీత

    మొదటి అధ్యాయము

    అర్జున విషాదయోగము

    ధృతరాష్ట్రుడు ఇట్లనెను:

    ధర్మక్షేత్రమగు కురుక్షేత్రమున

    నా కుమారులు పాండవులు

    యుద్ధోత్సాహులు ఏమొనరించిరి?

    సర్వము దెలుపుము సంజయ!

    సంజయుడిట్లనెను:

    మహారాజ! వ్యూహముగ నమర్చిన

    పాండవ సైన్యముగని దుర్యోధన

    మహారాజు ద్రోణుని గని ఇట్లనె

    అవధరింపు మాచార్యవరా

    ద్రుపదుని పుత్రుడు దుష్టద్యుమ్నుడు

    తమరి శిష్యుడు తానే ఈ వ్యూ

    హమురచించెను హననము లక్ష్యము

    పాండవసైన్యము పరికింపగలరు

    మహారథులు భీమార్జున సములు

    యుయుధానుండు విరాటుడు

    ద్రుపదుడు కృపణుడు అపరాజితుడు

    మీకు దెలిపితిని మూకల వివరము

    దుష్టకేతుడు చేకితానుడు

    కాశీపతియగు పురుజిత్తు

    కుంతిభోజుడు కులపుంగవుడగు

    శైభ్యుడు కలడిటశైనేయునితో

    యుధామన్యుడు విక్రాంతుడు

    ఉత్తమౌజుడు ఉత్తమయోధుడు

    సౌభద్రకుడు ద్రౌపదేయులు

    అందరు అతిరధ మహారధులేగద!

    మీకు తెలియదా? మిన్నక, గుర్తుకు

    గుణకము చెప్పితి గురువర ఇప్పుడు

    తమసేనా నాయకులగు వీరుల

    పేర్కొనుచుంటిని పెద్దలు పెక్కురు.

    మీరు, భీష్ముడు, మిత్రుడు కర్ణుడు

    కృపా చార్యులు సమితింజయుడు

    అశ్వత్థామ, ఆ వికర్ణుడు

    సౌమదత్తియు సోమదత్తుడు

    వీరుగాక సరి వీరులనేకులు

    శూరులు, నాకై వారి ప్రాణముల

    నిచ్చెదరు, నిరుపమ రణవి

    ద్యా విశారదులు సంసిద్ధముగా

    అస్మత్ సైన్యము భీష్మరక్షితము

    అపారమైనది అవధులు లేనిది

    పాండవసైన్యము పరిమితమైనది

    భీష్మరహితమది భీమరక్షితము

    ఐనాగానీ ఆచార్యవరా!

    సైన్యాధ్యక్షుని, మాన్యుని, భీష్ముని

    శిఖండి వీక్షకు చిక్కకుండ, మన

    మందరమేమఱకుండవలెను

    రారాజున కుత్సాహము గూర్పగ

    కురుపితామహుడు వృద్ధుడు భీష్ముడు

    సింహనాదమొనరించి బిగ్గరగ

    సంఖువూది తన శక్తి చాటెను

    వారివెంటనే కౌరవులందరు

    బింకముగా తమ సంకువులూదిరి

    గోముఖ పణపానక ఘోషలతో

    నింగి నేలలదరంగ జేసిరి

    అటు పిమ్మట తెల్లనిగుఱ్ఱములను

    గూర్చిన రథమున కూర్చొన్నకృష్ణ

    పాండవులిరువురు ప్రపద్మతగ తమ

    శంఖములూదిరి సత్యధర్మముగ

    పాంచజన్యమును హృషీకేశుడు

    దేవదత్తమును ధనంజయుడు

    పౌండ్రక శంఖము వృకోదరుండు

    భీమ కర్ముడగు భీముడు నూదిరి

    అనంత విజయము నా కుంతీసుతు

    డగు యుధిష్ఠరుడు మ్రోగింప

    సుఘోష, మణిపుష్పకముల నూదిరి

    కవలు, నకుల సహదేవులు బిగ్గర

    ఘన ధనుర్ధరుడు కాశీరాజు

    మహారధి యగునా శిఖండియు

    విరాటరాజు వెంట సాత్యకియు

    దుష్టద్యుమ్నుడు దుమ్మును లేపిరి

    ద్రుపదుడు, ద్రౌపది సుపుత్రులేవురు

    పృధ్వీపతులు ప్రభువులు రాజులు

    మహాబాహు వభిమన్యుడు మరిమరి

    సంక్రమించి తమ సంఖువులూదిరి

    సంజయుడిట్లనెను

    ఓ ధృతరాష్ట్ర మహారాజా! విను

    మాశంఖ ధ్వనులంబర మంటెను

    ధార్త రాష్ట్రుల ధైర్యము సడలెను

    కౌరవసేనల గుండియలదరెను

    కపికేతనుడగు అర్జునుడు

    గాండీవమ్మును ధరియించి

    ధార్తరాష్ట్రులను గుర్తించి

    వైరి వీరులను వీక్షించె

    శ్రీ కృష్ణునితో అర్జునుడిట్లనెను

    యుద్ధారంభమున యోధులెవ్వరితో

    నేప్రతియోగము చేయవలెనో

    వారిని చక్కగ పరికింపవలయు

    ఉత్తమ యోధులకుండు లక్షణము

    ఉభయసేనలమధ్య నునచుము రథమును

    అచ్యుతా! ఏలనన, ఆ పరిపంధులు

    యుద్ధప్రియుడగు దుర్యోధనుని

    పక్షమున, ఎవరెచట? ప్రత్యక్షముగ జూతు

    ధార్తరాష్ట్రుడు ధూర్తుడు దుష్ఠుడు

    ఈ వీరులందరు వీని కోసరమే

    ప్రాణములొడ్డి పోరాడంగ వచ్చిరి

    వారినొకమారు పరికించెదననె

    గుఢాకేశుడిట్లనగానే

    రథమటునడిపెను హృషీకేశుడు

    ఉభయసేనల మధ్యనుంచెను రథమును

    చూచెదనంటివి చూడు మనెన్

    భీష్మద్రోణుల కెట్టెదుట

    అందరు రాజుల ముంగలను

    శ్రేష్ఠమగు రధము స్థిరపరచి

    కౌరవబలముల గాంచుమనెన్

    అర్జునుడంతట ఆసైన్యములను

    కలయజూచి కడు కలవరపడెను

    తాతలు, తండ్రులు, తమ్ములు, గురువులు

    తనయులు, తన స్నేహితులును మనుమలు

    మామలను మేనమామలను

    బంధు మిత్రులను అందరినీ

    ఉభయుల నడుమ నున్న హితులను

    గాంచి జాలితో గుండె కరిగినది

    యుద్ధోత్సవులై వున్నారిచ్చట

    స్వజనుల నందరి స్వయముగ జూచితి

    అపార కృపచే అంతరంగమిటు

    నిండిపోయినది నేనెటు లోర్తును?

    ఆత్మబంధువులనందరిని జూచి

    ఉల్లము తల్లడమొందుచున్నది

    సంధులు తెగి నోరెండిపోయినది

    తనువు పులకించె ధనువు నేలబడె

    తనువు నిలుపలేకుంటిని కృష్ణ!

    మనసు మరుపలేకున్నాను

    దహించుచున్నది దేహము ప్రాణము

    ఒడలు బడలి, కడు ఒణకుచున్నది

    దుర్నిమిత్తములు దోచుచున్నవి

    విపరీతములై విసరుచున్నవి

    స్వజనుల జంపుట సమీచీనమా!

    శ్రేయస్కరమా? సేమమా?

    విజయము వలదీ వికలము వలదు

    కృష్ణా! నాకీరాజ్యము వలదు

    కావలమెందుకు గోవింద!

    అసలీ బ్రతుకే అవసరమా?

    ఎవరికై రాజ్యమేల దలచితిమొ

    వారే వుండరు పోరెందులకిక!

    రాజ్యభోగములు త్యాజ్యములనినా

    బుద్ధికి తోచెను, వద్దీయుద్ధము

    ఆచార్యులు, మా మామలు బావలు

    పితరులు, మరుదులు పుత్రులు పౌత్రులు

    వియ్యంకులు, అల్లుండ్రు వీరు మా

    బావమరుదులు బంధుబలగములు

    త్రైలోకాధిపత్యమైనా

    తృణప్రాయముగ త్యజింతునన, యీ

    పంపకమునకై పరితపింతునా!

    వారు చంపినా నేను చంపను

    ధార్తరాష్ట్రులు ఆతతాయులే

    మహాపాపులే - మనము చంపిన

    మనకేమి సుఖము మాధవా!

    స్వజనుల దునుముట సరియగునా?

    దగ్గరివారు దాయాదులు

    యుద్ధముచేయుట ఉచితముకాదు

    మనవారి జంపి మనమెట్లు సుఖము

    నొందగలము గోవింద! హితమౌన?

    కులవినాశనము కూడని పాపము

    మిత్రద్రోహము మేలగునా?

    వారికి జ్జానము కరవైనా,

    మూర్ఖులవలె మరి మనమూనా?

    దుర్యోధనునకు దోషమె సుగుణము

    నీచుల కరతకు నివృత్తిలేదు

    వీరికన్నా వివేకులము గద?

    కలుషవిముఖులము కావలదా?

    సనాతనమ్మగు సత్కుల ధర్మము

    సమూలమ్ముగా సమసిపోవును

    ధర్మము తప్పును అధర్మమగును

    కులక్షయంబే కులనాశనము

    ప్రతికూలస్థితి ప్రబలునధర్మము

    కులసతులు చెడిన కులమే చెడును

    వర్ణసంకరము, వలసలు పెరుగును

    ద్వాపరమున కలి దాపురించును

    వర్ణసంకరము నరకప్రాప్తి

    కులమువారికి కులఘాతకులకు

    పితరులకందవు పిండోదకములు

    వారి కధోగతి వీరి కతనచే

    వర్ణసంకరులైన వారు కులఘ్నులు

    వారి వలన జాతి వక్రమగును

    జాతి పతనమైన నీతి నిర్మూలమగు

    ధర్మహాని వలన దావంతము

    సంఘవ్యవస్థలో సత్వమరుదగును

    ఆధ్యాత్మికతయూ అంతరించు

    ఐహిక సుఖములే ఐతిహ్యమవగా

    ఐశ్వర్యమే లక్ష్యమగును మనుజులకు

    అయయో కృష్ణ! రాజ్యకాంక్షచే

    ఎంతదారుణము కేరుపడితిమి!

    గురువధకైనా గొంచకుంటిమి

    ఇప్పటికైనా తప్పు తెలిసినది

    నా నిశ్చయమును వినుము నేనిపుడె

    ధనుర్భాణముల త్యజించుచుంటిని

    నిరాయుధుని, నను వీరు చంపనీ

    చంపుటకన్నా చచ్చుటమేలు

    సంజయుడిట్లనెను:

    ఓ ధృతరాష్ట్ర మహోదయా!

    అర్జునుడిట్లు అరిమురిపడి తన

    ఆయుధములను అరదమునందే

    వదలి అచటనే చదికిల పడెను

    ఇట్లు ఉపనిషత్తులు బ్రహ్మవిద్యయును యోగశాస్త్రమును,

    శ్రీకృష్ణార్జున సంవాదమును

    అగు భగవద్గీతలయందు అర్జున విషాదయోగము

    అను మొదటి అధ్యాయము

    ****

    Chapter సాంఖ్య యోగము

    జై శ్రీ గం గణపతయె నమ:

    శ్రీ మదాంధ్ర భగవద్గీత

    రెండవ అధ్యాయము

    సాంఖ్య యోగము

    సంజయుడిట్లనెను

    ఓధృతరాష్ట్రమహోదయా!

    బంధువధకు మది కుందుచు కనుగవ

    అశృలొలికించు అర్జునుని గని

    మధుసూధనుడీ మాటలాడెను

    శ్రీ భగవాను డిట్లుపలికెను

    విషమపరిస్థితి వేళ అర్జునా!

    ఈమోహము నీకేల గలిగెను?

    అవివేకముయిది అస్వర్గ్యమ్ము

    అపకీర్తికరము, అనార్యము

    శతృతపనుడవు శౌర్యమువీడి

    షండునివలెనిట్లుండదగునా?

    జాలి యనెదవా, జాలికాదుఇది

    క్షుద్రమైనట్టి హృదయదుర్బలత

    అర్జునుడిట్లనెను:

    తాతభీష్ముడు విద్దెదాత ద్రోణుడు గురువు

    పూజనీయులు వీరు పురుషోత్తమా!

    అట్టి వీరి నెట్లు అలజడిన బెట్టుట!

    అనుకంపలేకయే అనరాస్త్రములనేసి?

    మహానుభావులు మహావీరులు

    వీరిని వధించి నెత్తుటి కూటిని

    తినుటకన్ననే తిరిపెమెత్తు కొని

    జీవింపమేలు అని భావించుచుంటిని

    జయాపజయములు జన్యు డెరుంగును

    ఎవరు గెలుతురో ఎవరోడెదరో

    ఫలితముసందేహమే! ‘జ్ఞాతులను

    చంప జీవేచ్చ చనక మిగులునా?

    బుద్ధి మాంద్యమున బొగులుచునుంటిని

    ఏది శ్రేయస్కరమొ ఏది కీడో,

    నీవేదెలుపుము నేను శిష్యుడను

    శరణాగతుడను, శరణు జగద్గురూ!

    ఏకచ్ఛత్రాధిపత్యమైనా

    అనపాయాధ్యక్షత చేజిక్కిన

    శోకాగ్ని కాక సోకక తప్పదు

    అమితమైన వ్యథ శమితముగాదు

    గొంతి కుమరుడు గుఢాకేశుడు

    హృషీకేశునితొ ఇట్లనెను

    "గోవిందా! యీ కొరకొర యుద్ధము

    చేయజాల" నని చెప్పి యూరకొనె

    ఉభయసేనల నడుమనున్న హతాశుని

    ఉమ్మలిక బాపగ హృషీకేశుండు

    అలవోకగా నవ్వి అవ్యాజకృపచే

    పార్థునితోనిట్లు పరిహాసముగ బల్కె

    శ్రీ భగవానుడిట్లనెను

    ప్రాజ్ఞునివలె నీవు

    Enjoying the preview?
    Page 1 of 1