Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Satyanarayana Swamy Vrata Kalpam
Satyanarayana Swamy Vrata Kalpam
Satyanarayana Swamy Vrata Kalpam
Ebook155 pages2 hours

Satyanarayana Swamy Vrata Kalpam

Rating: 5 out of 5 stars

5/5

()

Read preview

About this ebook

Sree Chakra Publishers had published many spiritual, puranam and stotram books in Telugu.
LanguageTelugu
Release dateSep 21, 2020
ISBN6580306100959
Satyanarayana Swamy Vrata Kalpam

Read more from Sree Chakra Publishers

Related to Satyanarayana Swamy Vrata Kalpam

Related ebooks

Reviews for Satyanarayana Swamy Vrata Kalpam

Rating: 5 out of 5 stars
5/5

3 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Satyanarayana Swamy Vrata Kalpam - Sree Chakra Publishers

    http://www.pustaka.co.in

    శ్రీ సత్యనారాయణస్వామి వ్రతకల్పం

    Satyanarayana Swamy Vrata Kalpam

    Author:

    శ్రీ చక్ర ప్రచురణకర్తలు

    Sree Chakra Publishers

    For more books

    http://www.pustaka.co.in/home/author//sree-chakra-publishers-novels

    Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.

    All other copyright © by Author.

    All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.

    శ్రీ సత్యనారాయణస్వామి వ్రతకల్పం

    (9 అధ్యాయాలతో)

    సంకలనం

    లక్ష్మీగణపతి శాస్త్రి

    - శ్రీ చక్ర 'ఇ' పబ్లిషర్స్ లో

    శ్రీ సత్యనారాయణ స్వామి వత్రానికి కావలసిన వస్తువులు

    శ్రీ సత్యనారాయణ స్వామివారి ప్రతిమ, బియ్యపు పిండి, పసుపు, కుంకుమ, తమలపాకులు, పళ్ళు, లవంగాలు, ఏలకులు, సుగంధ ద్రవ్యాలు, ఖర్జూర కాయలు, ద్రాక్ష పళ్ళు, కిస్ మిస్, సాంబ్రాణి, హారతి కర్పూరం, కొబ్బరికాయలు, పంచామృతాలు (పాలు, పెరుగు, తేనె, నేయి, పంచదార), పటికబెల్లం, అరటిపళ్ళు, గోధుమరవ్వ, పూలు, కలశం, నూతన వస్త్రాలు, రవికెలగుడ్డ, బియ్యము, మామిడి ఆకులు మొదలైనవి వ్రతం చేయటానికి ముందుగానే సమకూర్చుకోవాలి.

    మండపారాధనకు నూతన వస్త్రాలు, అగరవత్తులు స్వామికి సువాసనా ద్రవ్యాలు, మంచిగంధం మొదలైనవి సేకరించి ఉంచుకొనవలెను. నూతన వస్త్రాలతోడను, దక్షిణ తాంబూలాలతో పురోహితుణ్ణి సంతుష్ఠపరచాలి. యధాశక్తిగ వ్రతాన్ని ఆచరించాలి గానీ లోభం కూడదు. భక్తి శ్రద్ధలు ప్రధానం.

    ఈ గ్రంథంలో తెలిపిన విధంగా భక్తులందరూ సకల శుభాలనూ ప్రసాదించే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని 9 అధ్యాయాలతో ఆచరించి, స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము.

    - ప్రకాశకులు

    మంగళహారతి

    శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా

    మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా 2

    నోచినవారికి నోచినవరము చూచినవారికి చూచిన ఫలము

    స్వామిని పూజించే చేతులే చేతులట

    ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట

    తన కథ వింటే ఎవ్వరికైన జన్మ తరించునట

    ||శ్రీ సత్య||

    ఏ వేళయినా ఏ శుభమయినా

    కొలిచే దైవం ఈ దైవం

    అన్నవరంలో వెలసిన దైవం

    ||శ్రీ సత్యం||

    అర్చన చేదామా మనసు అర్పరణ చేదామా

    స్వామికి మదిలోనే కోవెల కడదామా

    పదికాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా

    ||శ్రీ సత్యం ||

    మంగళమనరమ్మా - జయ మంగళమనరమ్మా

    కరములు జోడించి శ్రీ చందన మలరించి

    మంగళకరమగు ఈ సుందరమూర్తికి వందన మనరమ్మా

    || శ్రీ సత్య, ||

    శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఆచరించే విధానం

    వ్రతాలలో ఎంతో గొప్పది శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం. ఈ వ్రతాన్ని ఏ నెలలోనైనా పౌర్ణమి, ఏకాదశి తిథులలోగానీ, రవి సంక్రమణ జరిగిన రోజునగానీ ఏదైనా ఒక శుభతిథిన గానీ చెయ్యాలి. వ్రతం చేయదలచుకున్న రోజు ఉదయం లేక సాయంత్రం శుచిగా స్నాన సంధ్యాది నిత్యకర్మల్ని ఆచరించి బంధుమిత్రులందర్నీ ఇంటికి ఆహ్వానించాలి. తరువాత మంగళవాద్యాలతో స్వస్తివాచకాలతో వేదపఠనాలతో స్వామివారి వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ వ్రతం స్వగృహంలోగానీ, పుణ్యక్షేత్రాలలో గానీ, సముద్రతీరంలోగానీ, వనాలలోగానీ భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. పూజా స్థలాన్ని గోమయంతో శుద్ధి చేసి తూర్పుదిశగా బియ్యప్పిండి, పసుపు కుంకుమలతో ముగ్గులు పెట్టి మండపాన్ని ఏర్పాటుచేయాలి. ఆ మండపాన్ని మామిడితోరణాలతో అందంగా అలంకరించి పూజాద్రవ్యాలు పంచపాత్ర ఉద్దరిణ నూతనవస్త్రాలు కొబ్బరికాయ పూజాస్థలంలో ఉంచి ఆవునెయ్యితో భక్తిగా దీపారాధన చేయాలి. తరువాత యధావిధిగా శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని యోగ్యుడైన పురోహితుడి ద్వారా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. వ్రతం చేయటంలో ఎటువంటి లోభం చూపించకూడదు. భక్తి ప్రధానంగా ఉండాలి.

    శ్రీ సత్యనారాయణ వ్రతకల్పము వ్రత సంకల్పం:

    దైవ ప్రార్థనలు

    శ్లో||

    యశ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా

    తయోస్సంస్మరణా త్పుంసాం సర్వతో జయమంగళమ్

    శ్లో!!

    లాభస్తేషాం జయస్తేషాం కుత స్తేషాం పరాభవః

    యేషామిందీవరశ్యామో హృదయ జనార్ధనః

    || శ్లో||

    ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం

    లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్

    || శ్లో||

    సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే

    శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే ||

    శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః | ఉమా మహేశ్వరాభ్యాం నమః |

    వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః | శచీపురందరాభ్యాం నమః

    అరుంధతీవసిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః

    సర్వేభ్యో మహాజనేభ్యో నమః అయం ముహూర్త స్సుముహూర్తో స్తు

    భూతోచ్చాటనం : ఉత్తిష్ఠంతు, భూతపిశాచాః, ఏతే భూమిభారకాః |

    ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే

    Enjoying the preview?
    Page 1 of 1