Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Sri Ganapathi Visesha Pooja Kalpam
Sri Ganapathi Visesha Pooja Kalpam
Sri Ganapathi Visesha Pooja Kalpam
Ebook260 pages1 hour

Sri Ganapathi Visesha Pooja Kalpam

Rating: 4 out of 5 stars

4/5

()

Read preview

About this ebook

Sree Chakra Publishers had published many spiritual, puranam and stotram books in Telugu.
LanguageTelugu
Release dateSep 21, 2020
ISBN6580306100969
Sri Ganapathi Visesha Pooja Kalpam

Read more from Sree Chakra Publishers

Related to Sri Ganapathi Visesha Pooja Kalpam

Related ebooks

Reviews for Sri Ganapathi Visesha Pooja Kalpam

Rating: 4 out of 5 stars
4/5

4 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Sri Ganapathi Visesha Pooja Kalpam - Sree Chakra Publishers

    http://www.pustaka.co.in

    శ్రీ మహా గణపతి విశేష పూజా కల్పం

    Sri Ganapathi Visesha Pooja Kalpam

    Author:

    శ్రీ చక్ర ప్రచురణకర్తలు

    Sree Chakra Publishers

    For more books

    http://www.pustaka.co.in/home/author/sree-chakra-publishers-novels

    Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.

    All other copyright © by Author.

    All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.

    విషయసూచిక

    శ్రీ మహాగణపతి చతుషష్టి (64) ఉపచార పూజావిధానం

    శ్రీ మహాగణపతి పూజా ప్రారంభం

    గకారాది గణేశ సహస్రనామ స్తోత్రం

    శ్రీ గణేశ సహస్రనామ స్తోత్రమ్

    శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పం

    శ్రీ గణేశ ప్రార్ధన

    శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కథ

    (విఘ్నేశ్వరుని మంగళహారతులు)

    విఘ్నేశ్వరుని పూజాపత్రి విశేషాలు

    విఘ్నేశ్వరుని దండకము

    వినాయకుని ప్రార్థన పద్యము

    (1. నవగ్రహ దోష నివారణకి గణపతి పూజ)

    (2.శ్రీ గణపతి ప్రత్యేక విశేషాలు)

    వివిధ ప్రతిమల పూజఫలాలు

    శ్రీగణేశ కవచమ్

    (వినాయకచవితి నైవేద్యాలు)

    గం గం గం గం గం గం గం గం గం గం గం గం గం గం గం

    శ్రీ మహా గణపతి విశేష పూజా కల్పం

    చతుషష్టి (64) ఉపచార పూజా విధానం

    శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పం

    (అష్టోత్తర, సహస్రనామాది స్తోత్రాలు, నైవేద్యాలు )

    సంకలనం

    రామకృష్ణ శర్మ

    శ్రీ చక్ర

    గం గం గం గం గం గం గం గం గం గం గం గం గం గం గం

    *****

    *****

    శ్రీ మహాగణాధిపతయే నమః

    నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం |

    శ్రీ సిద్ధేశ్వరానంద పర్యంతాం వందే గురు పరంపరాం ||

    శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|

    అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే |

    సమస్తమైన విఘ్నాల్ని తొలగించి మనోభీష్టాల్ని నెరవేర్చే ఆది పూజ్యుడు శ్రీ మహాగణపతి. సకల గణాలకు నాయకుడుగా సమస్త ప్రాణకోటిచేత పూజలందుకుంటున్న దైవం శ్రీ గణపతి అందుకే ప్రతి సంవత్సరం మన దేశంలో వినాయక చవితి ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటూ, స్వామి ఎడల మన భక్తి ప్రపత్తులను చాటుతున్నాం. ఓ బొజ్జగణపయ్య నీబంటు నేనయ్యా. ఉండ్రాళ్ళ మీదకి దండు రావయ్య! పువ్వులతో నినుగొల్తు | పత్రాల నిను గొల్తు | ఎప్పుడును గొల్తు నిను ఏకచిత్తమున | అంటూ పిల్లలూ, పెద్దలు అందరూ స్వామిని కొలుస్తారు.

    గణపతులలో ఎన్నో రూప భేదాలున్నాయి. వాటిలో షోడశ (16) గణపతులు ఎంతో ప్రసిద్ధమైనవిగా పురాణాలు చెబుతున్నాయి. మహాగణపతి హరిద్రాగణపతి, లక్ష్మీగణపతి, బ్రహ్మగణపతి, విఘ్నగణపతి, హేరంబగణపతి, తాండవగణపతి, డుంఢీగణపతి, ద్విముఖ గణపతి, త్రిముఖ గణపతి, యోగ గణపతి, వల్లభ గణపతి, ఉచ్చిష్టగణపతి, వీరగణపతి, విజయ గణపతి, సిద్ధగణపతి అని పదహారు రూపాలుగా గణేశుడు పూజించబడుతున్నాడు, ఈ పదహారు మూర్తులలో ఆదిమూర్తి శ్రీ మహాగణపతి,

    ఏనుగు ముఖంతో నెలవంక శిరోభూషణంతో, మూడుకళ్ళతో పదిచేతులతో ప్రకాశిస్తూ, తన చేతుల్లో దంతాన్ని, దానిమ్మ పండుని, కలువ పువ్వుని, వరికంకులని, చక్రాన్ని, చెరుకు విల్లుని, పద్మాన్ని, పాశాన్ని, తొండంతో రత్న కలశాన్ని ధరించి తన అంకంమీద ప్రియపత్నిని కూర్చుండ బెట్టుకుని ఎర్రని వర్ణంతో వెలుగొందే దైవంగా మహాగణపతి పురాణాలలో వర్ణించబడ్డాడు.

    గణపతి పూజ ఎంతో ప్రాచీనకాలం నుంచి ఆచరణలో వుంది. యుగయుగాలుగా ఎందరో దేవతలు, ఋషులు, మునులు, మానవులు, రాజధిరాజులు గణపతిని పూజించి తరించారు. మహాభారతంలో ధర్మరాజు వినాయకుణ్ణి పూజించి యుద్ధంలో విజయుడవగా, దమయంతి కూడా గణనాధుణ్ణి పూజించే నలమహారాజును పతిగా పొందింది. ఇలా ఎన్నో ఉదాహరణలు మనకు చరిత్రలో కనిపిస్తాయి.

    గణపతిలో 'గ' శబ్దం బుద్ధికి 'ణ' శబ్దం విజ్ఞానానికి ప్రతీక అని పండితులు చెబుతారు. గణపతి అంటే బుద్ధి, జ్ఞానాలకు అధిపతి అని అర్థం కనుక ప్రతి ఒక్కరు సద్భుద్ధి, విజ్ఞానం లభించటం కోసం గణపతి ఆరాధన చెయ్యాలి. 'కలౌ చండీ వినాయకౌ' అని లోకోక్తి అనగా కలియుగంలో అత్యంత వేగంగా సిద్ధిని ప్రసాదించి భక్తుల్ని అనుగ్రహించే దేవతలు చండీదేవి శ్రీ వినాయకుడు మాత్రమే. కనుక మనందరం వరసిద్ది వినాయకస్వామిని భక్తిశ్రద్ధలతో అర్చించి తరిద్దాం.

    ఈ గ్రంథంలో అత్యంత ప్రాచీనమైన శ్రీ మహగణపతి చతుషష్టి ఉపచారపూజనీ భక్తులకు అందిస్తున్నాం. ఈ పూజని ప్రతిమాసంలో వచ్చే చతుర్థి తిధి రోజు చేస్తే ఐహికాముష్మిక ఫలాలను గణపతి మనకందిస్తాడు. అలాగే ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితినాడు అందరూ ఆచరించే శ్రీ వరసిద్ది వినాయక వ్రత కల్పాన్ని కూడా విపులంగా అందిస్తున్నాం. వీటితో పాటు గకారాది గణేశ సహస్రనామాది స్తోత్రాలను అనుబంధంగా శ్రీ మహాగణపతికి ప్రీతి పాత్రమైన నైవేద్యాలను అవి తయారుచేసే విధానాలను కూడా సవివరంగా అందిస్తున్నాం.

    శ్రీ సిద్ధివినాయకుడి భక్తులందరికీ ఈ గ్రంథం ఎంతో ఉపయుక్తంగా వుంటుందని ఆశిస్తూ, శ్రీ మహాగణపతి దివ్యానుగ్రహం అందరికి కలగాలని కోరుకుంటూ...

    రామకృష్ణ శర్మ

    *****

    శ్రీ మహాగణపతి

    చతుషష్టి (64) ఉపచార పూజావిధానం

    పురాణపద్ధతి

    చతుషష్టి ఉపచారాలు అంటే 64 ఉపచారములు అని అర్ధం. అవి: 1.ధ్యానం, 2. ఆవాహనం, 3. ప్రబోధనం, 4. మణిమందిరం, 5.రత్నమండపం, 6.దంతధావనం, 7.శిబికాం, 8.రత్నసింహాసనం, 9.వితానం, 10. పాద్యం, 11. అర్ఘ్యం, 12.ఆచమనీయం, 13.మధుపర్కం, 14. అభ్యంగనం, 15. ఉద్వర్తనం, 16. పంచామృత స్నానం, 17. ఫలోదకస్నానం, 18. శుదోదకస్నానం, 19.సమ్మార్జనం, 20. వస్త్రం, 21.పాదుకాం, 22. ఆభరణాని, 23. కిరీటం, 24.కుండలం, 25.కవచం, 26. యజోపవీతం, 27.శ్రీగంధం, 28. అక్షతాం, 29. హరిద్రా చూర్ణం, 30. కుంకుమమ్, 31.పరిమళద్రవ్యం, 32. సిందూరం, 33. పుష్పాణి, 34. దూర్వాదళం, 35. ధూపం, 36. దీపం, 37. కుంభనీరాజనం, 38.నైవేద్యం, 39. హస్త ప్రక్షాళనం, 40.కరోద్వర్తనం, 41.పానీయం, 42.ఫలసమర్పణ, 43. తాంబూలం, 44.దక్షిణ, 45. ఛత్రం, 46.చామరం, 47.దర్పణం, 48.మంగళ నీరాజనమ్, 49.మంత్రపుష్పమ్, 50. ప్రదక్షిణం, 51. నమస్కారమ్, 52. తురంగవాహనమ్, 53.మదగజం, 54. రథం, 55. సైన్యం, 56. దుర్గం, 57.మూషికవాహనం, 58. ఆయుధాని, 59. వ్యజవీజనం, 60. నృత్యం, 61. వాద్యాని, 62. గీతశ్రవణం, 63. అభినయం, 64. క్షమాప్రార్ధన.

    ఈ 64 రకాల ఉపచారాలు ప్రధానమైనవిగా శాస్త్రాలలో చెప్పబడ్డాయి. అత్యంత విశిష్టమైన ఈ ఉపచారాలతో శ్రీ మహాగణపతిని అర్చించి ఆ స్వామి దివ్యానుహ్రాన్ని అందరం పొందుదాం.

    పూజా సామగ్రి

    శ్రీ మహాగణపతి చతుషష్టి ఉపచార పూజకు ఈ తెలిపిన సామాగ్రిని ముందుగా సిద్ధం చేసుకోవాలి. "రాగి గ్లాసు, మంచినీరు, రాగి ఉద్దరిణె, రాగిపళ్ళెము, తీర్థపాత్ర, పుష్పములు, గంధము, ఘంట, అక్షతలు, యథాశక్తిగా పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార),

    గోక్షీరము, నైవేద్యమునకు పటికబెల్లం, కిసిమిస్ లేక ద్రాక్ష, అరటిపండ్లు, బెల్లంతో చేసిన పాయసం, అటుకులు, ఉండ్రాళ్ళు, లడ్డూలు, వడపప్పు, పానకం యధాశక్తి గారెలు, బూరెలు వంటి పిండివంటలతో మహానైవేద్యము. దీపము, ధూపము, హారతి, కర్పూరము వగైరా.......

    తూర్పు ముఖముగా గాని, ఉత్తరముఖముగా దర్భాసనం లేదా చిత్రాసనం మీద గాని కూర్చొని దైవారాధన చేయాలి. మనకు ఎదురు ముఖముగా ఆరాధ్యమూర్తి విగ్రహంగాని, చిత్రపటంగాని ఉండాలి. శిరస్స్నానము చేసి పూజ ప్రారంభించాలి. అలా వీలులేని వారు కంఠ స్నానమైనా చేసి పూజ చేయాలి. ముఖాన విభూతి, కుంకుమ తిలకధారణ చేసికొని పీటమీద కూర్చుని శ్రీ మహాగణపతి పూజకు ఉపక్రమించాలి. ముందుగా గణపతి పూజతో ప్రారంభించాలి.

    ఆసనం:

    శ్లో ||

    పృధ్విత్వయా ధృతాలోకా దేవిత్వం విష్ణునాధృతా |

    త్వం చధారయ మాం దేవీ పవిత్రం కురు చాసనమ్ ||

    పై శ్లోకాన్ని పఠించి దేవుడి ముందు ఏర్పరచుకొన్న ఆసనము మీద కూర్చోవాలి.

    గణపతి ప్రార్థన

    శ్లో

    శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |

    ప్రసన్నవదనం ధ్యాయే స్పర్వవిఘ్నోపశాన్తయే ||

    గురుప్రార్ధన

    శ్రీ గురుర్జహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |

    గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||

    ఆచమనమ్

    (రాగి గ్లాసులోని నీటిని ఉద్దరిణెతో ఎడమచేతితో తీసుకొని కుడి అరచేతిలో పోసుకొని) కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా (అని మూడుసార్లు పుచ్చుకోవాలి) గోవిందాయ నమః, మధసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః

    తాత్పర్యం:

    1. కేశవాయస్వాహా - కేశవుని కొరకు సమర్పిస్తున్నాను. అని ఉదకము లోపలికి స్వీకరించాలి. తిరిగి పైవిధముగా ఉదకము తీసికొని

    2. నారాయణాయ స్వాహా - నారాయణుని కొరకు సమర్పిస్తున్నాను. అని ఉదకమును లోపలికి తీసుకోవాలి. తిరిగి వైవిధముగా ఉదకమును తీసుకొని

    3. మాధవాయ స్వాహా - మాధవుని కొరకు సమర్పిస్తున్నాను. అని ఉదకమును లోపలికి స్వీకరించాలి.

    4. గోవిందాయ నమః - (గోవిందునకు నమస్కారము)

    5. విష్ణవే నమః - (విష్ణువునకు నమస్కారము)

    6. మధుసూదనాయ నమః - (మధుసూదనునకు నమస్కారము)

    7.

    Enjoying the preview?
    Page 1 of 1