Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Ruchi Suchi
Ruchi Suchi
Ruchi Suchi
Ebook177 pages45 minutes

Ruchi Suchi

Rating: 3 out of 5 stars

3/5

()

Read preview

About this ebook

Sree Chakra Publishers had published many spiritual, puranam and stotram books in Telugu.
LanguageTelugu
Release dateSep 21, 2020
ISBN6580306100943
Ruchi Suchi

Read more from Sree Chakra Publishers

Related to Ruchi Suchi

Related ebooks

Reviews for Ruchi Suchi

Rating: 3 out of 5 stars
3/5

3 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Ruchi Suchi - Sree Chakra Publishers

    http://www.pustaka.co.in

    రుచి - శుతి

    Ruchi - Suchi

    Author:

    విషయ సూచిక

    Sree Chakra Publishers

    For more books

    http://www.pustaka.co.in/home/author/sree-chakra-publishers-novels

    Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.

    All other copyright © by Author.

    All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.

    విషయసూచిక

    బొంబాయి రవ్వతో ఉపాహారాలు

    మజ్జిగతో చల్లగా చలువ చేసే వంటలు

    మామిడి పళ్ళతో మధురమైన వంటకాలు

    వెజ్ & ఫ్రూట్ బజ్జీలు

    తాటి గారెలు

    కమ్మని గుమ్మడితోచేసే వంటలు

    ఆరోగ్యాన్నిచ్చే రాగితో వంటలు

    రకారకాల ఇడ్లీలు

    పోషక విలువలున్న పెసలతో వంటలు

    చలవ చేసే/ పెరుగు పచ్చళ్ళు

    రుచికరమైన వెల్లుల్లి

    కాల్చిన కూరలు

    మామిడికాయతో పుల్లని చల్లని వంటలు

    దొండకాయతో వంటలు

    చింతచిగురు చేర్చిన వంటకాలు

    సొరకాయ - తురుముతో వంటలు

    గింజలతో వంటలు

    అరటికాయతో రకరకాల వంటలు

    ఆరోగ్యకరమైన బీట్రూట్ వంటకాలు

    బంగాళదుంపతో

    వంకాయ వంటలు

    కాకరతో కమ్మని వంటలు

    ఆరోగ్యాన్నిచ్చే తోటకూర వంటలు

    రుచికరమైన రకరకాలపులుసులు

    రకరకాల కూరినకూరలు

    కొబ్బరితో రుచికరమైన వంటలు

    నైవేద్యా ల వంటలు

    ఆరోగ్యకరమైన శాకాహార వంటలు

    బొంబాయి రవ్వతో ఉపాహారాలు

    దోసెలు

    కావలసిన పదార్థాలు :

    వరి పిండి - ఒక కప్పు, మైదాపిండి - ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు,పచ్చిమిరపకాయలు - నాలుగు, జీలకర్ర - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె-సరిపడా.

    తయారుచేయు విధానం :

    ముందు రోజు రాత్రి వరిపిండిలో మైదాపిండి, రవ్వ కలిపి సరిపడా నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మర్నాడు పొద్దుట ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర వేసి గరిటతో బాగా కలపాలి. పొయ్యి మీద పెనం పెట్టి కొద్దిగా నూనె వేసి కాగాక, కొద్దిగా చిలకరించి దోసెలు పోసుకోవాలి. మెత్తగా, కమ్మగా ఉండే ఈ దోసెల్ని చట్నీ లేకుండా కూడా తినొచ్చు.

    ఇడ్లీ

    కావలసిన పదార్థాలు :

    మినపప్పు - ఒక కప్పు, బొంబాయి రవ్వ - ఒక కప్పు, ఉప్పు - తగినంత, పోపుగింజలు - సరిపడా, కరివేపాకు - ఒక రెబ్బ, నూనె - సరిపడా.

    తయారుచేసే విధానం:

    మినపప్పుని పొద్దునే నానబెట్టుకుని రాత్రి మెత్తగా రుబ్బుకోవాలి. అందులో రవ్వ కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. మర్నాడు పొద్దునే ఆ పిండిలో ఉప్పువేసి బాగా కలుపుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి పోపుగింజలు, కరివేపాకు వేసి వేగించాలి. ఈ తాలింపుని ఇడ్లీ పిండిలో వేసి బాగా కలిపి అప్పుడు ఇడ్లీలు వేసుకోవాలి. అక్కడక్కడా పోపుగింజలు కనిపిస్తూ ఉండే ఈ ఇడ్లీలు చాలా మృదువుగా, రుచిగా ఉంటాయి.

    పునుగులు

    కావలసిన పదార్థాలు :

    మినపప్పు - ఒక కప్పు, బొంబాయి రవ్వ - ఒక కప్పు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిరపకాయలు - రెండు, జీలకర్ర - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, సోడా

    - చిటికెడు, నూనె - సరిపడా.

    తయారుచేసే విధానం :

    మినపప్పుని ముందురోజు నానబెట్టుకుని మర్నాడు పొద్దుటే మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, బొంబాయిరవ్వ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఓ గంట తర్వాత పొయ్యి మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె వేసి బాగా కాగాక పునుగుల్లా వేసుకోవాలి. కరకరలాడుతూ చాలా రుచిగా ఉండే ఈ పునుగులను పల్లీ పచ్చడితో తింటే ఇంకా బాగుంటాయి.

    ఉప్మా బేల్ పూరి

    కావలసిన పదార్థాలు :

    బొంబాయి రవ్వ - రెండు కప్పులు, ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు, పచ్చిమిరపకాయలు - మూడు, కరివేపాకు - ఒక రెబ్బ, అల్లంతురుము - రెండు టీ స్పూన్లు, జీలకర్ర - ఒక టీ స్పూను, ఆవాలు - ఒక టీ స్పూను, కారంపూస - అరకప్పు, బూందీ - అరకప్పు, వేగించిన అటుకులు - అరకప్పు, వేగించిన పుట్నాలు - ఒక టేబుల్ స్పూను, వేగించిన పల్లీలు - పావు కప్పు, ఉప్పు - తగినంత, నూనె

    - సరిపడా.

    తయారుచేసే విధానం :

    ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం తురుము వేసి వేగించాక నాలుగు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. సరిపడా ఉప్పు వేసి నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వ వేసి నాలుగుసార్లు గరిటతో కలిపి దించేయాలి. ఒక పళ్లెంలో ఈ ఉప్మాని వెడల్పుగా వేసి దానిపై కారప్పూస, బూందీ, వేగించిన అటుకులు, వేగించిన పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వీటితో కలిపి తినే ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది.

    స్వీట్ రవ్వ పూరి

    కావలసిన పదార్థాలు :

    మైదా పిండి - అరకిలో, బొంబాయి రవ్వ - 200 గ్రాములు, పంచదార - 200 గ్రాములు, ఉప్పు - చిటికెడు, నూనె - సరిపడా.

    తయారుచేయు విధానం :

    మైదా పిండిలో బొంబాయి రవ్వ, పంచదార, చిటికెడు ఉప్పు ఒక టేబుల్ స్పూను నూనె, సరిపడా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఓ గంట తర్వాత ఈ పిండితో చిన్న ఉండలు చేసుకుని పూరీలుగా ఒత్తుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద కడాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక అందులో వీటిని వేసి దోర రంగు వచ్చే వరకూ వేగించుకోవాలి. కమ్మగా, తియ్యగా ఉండే ఈ పూరీలను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

    మజ్జిగతో చల్లగా చలువ చేసే వంటలు

    రసా లా :

    సీతారాముల వనవాస సమయంలో అనేక ప్రాంతాలలో సంచరించారు.

    Enjoying the preview?
    Page 1 of 1