Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Dasopanishatulu Part - 1 By Gowri Viswanatha Sastry
Dasopanishatulu Part - 1 By Gowri Viswanatha Sastry
Dasopanishatulu Part - 1 By Gowri Viswanatha Sastry
Ebook254 pages1 hour

Dasopanishatulu Part - 1 By Gowri Viswanatha Sastry

Rating: 5 out of 5 stars

5/5

()

Read preview

About this ebook

Sree Chakra Publishers had published many spiritual, puranam and stotram books in Telugu.
LanguageTelugu
Release dateSep 21, 2020
ISBN6580306100892
Dasopanishatulu Part - 1 By Gowri Viswanatha Sastry

Read more from Sree Chakra Publishers

Related to Dasopanishatulu Part - 1 By Gowri Viswanatha Sastry

Related ebooks

Reviews for Dasopanishatulu Part - 1 By Gowri Viswanatha Sastry

Rating: 5 out of 5 stars
5/5

5 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Dasopanishatulu Part - 1 By Gowri Viswanatha Sastry - Sree Chakra Publishers

    http://www.pustaka.co.in

    దశోపనిషత్తులు

    Dasopanishatulu Part - 1

    Author:

    గౌరీ విశ్వనాథ శాస్త్రి

    Gauri Viswanatha Sastry

    For more books

    http://www.pustaka.co.in/home/author/ahila

    Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.

    All other copyright © by Author.

    All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.

    విషయ సూచిక

    1. ఈశావాస్యోపనిషత్తు

    2.కేనోపనిషత్తు

    3. కఠోపనిషత్తు

    4. ప్రశ్నోపనిషత్తు

    5. ముండకోపనిషత్తు

    6. మాండూక్యోపనిషత్తు

    7. తైత్తిరీయోపనిషత్తు

    8. ఐతరేయోపనిషత్తు

    1. ఈశావాస్యోపనిషత్తు

    వాజసనేయ సంహితోపనిషత్

    మంత్రము. శ్లోకము ||

    ఓం ఈశావాస్య మిదగ్ం సర్వం యత్కించ జగత్యాం జగత్ |

    తేన త్యక్తేన భుజ్జిథా మాగృధః కస్యస్విద్ ధనమ్ || 1

    ఈ ప్రపంచంలో మార్పుచెందేది ఏదైతే వుందో అదంతా భగవంతుడిచే ఆవరించబడి వుంది. ఈ విషయాన్ని గ్రహించి ఆ త్యాగంతోనే నిన్ను నీవు పోషించుకో. ఎవరి ధనాన్నీ నీవు ఆశించకు.

    మం.శ్లో॥

    కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషే చ్చతగ్ం సమాః |

    ఏవం త్వయి నా న్యథేతో 2-సిన కర్మ లిప్యతే నరే || 2

    మానవుడు, శాస్త్ర విహితమైన నైమిత్తిక కర్మల్ని ఆచరిస్తూ మాత్రమే తాను నూరు సంవత్సరాలూ జీవించి వుండాలని కోరుకోవాలి. మానవులకి తమ జీవితం మీద ఆసక్తి ఉన్నంతకాలం, దుష్కర్మల కాలుష్యాన్ని హరింప చేసుకోవటానికి ఇలా చేయడం తప్ప మరోమార్గం లేదు.

    మం.శ్లో॥

    అసుర్యానామ తే లోకా అంధేన తమసావృతాః |

    తాంగిస్తే ప్రేత్యాభిగచ్ఛని యేకే ఉత్మహనో జనాః || 3

    రాక్షసులకి చెందిన లోకాలు కటికచీకటితో ఆవరించబడివుంటాయి. నిజంగా చెప్పాలంటే ! ఆత్మహంతకులైన జనాలు (ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేని వారు) ఎవరైతే ఉన్నారో వారు మరణించిన తరువాత రాక్షసలోకానికి చేరుకుంటారు.

    మం.శ్లో॥

    అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్!

    తద్ధావతో న్యానత్యేతి తిష్ఠ త్తస్మిన్నపో మాతరిశ్వా దధతి || 4

    ఆత్మ అనేది ఒక్కటే ఏ మాత్రం చలించనిది. అయితే అది మనసుకన్నా వేగవంతమైంది. అది మనసుకన్నా ముందే వెళ్ళగలదు కనుక ఇంద్రియాలు దాన్ని అందుకోలేవు. ఆత్మనిత్యమైనది. స్థిరమైనదీ అయినప్పటికీ అది పరుగెత్తే అన్నిటికన్నా వేగంగా పరుగెత్తేది. ఆ 'ఆత్మ' సకలప్రాణుల కార్యకలాపాలని భరించటానికి తగిన ప్రాణశక్తిని సమకూరుస్తోంది.

    మం.శ్లోll

    తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతి కే |

    తదన్తరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః || 5

    'ఆత్మ' అనేది కదిలేది, కదలనిది, అది దూరంలోవుంది అలాగే దగ్గరగా కూడా వుంది. ఆ 'ఆత' జీవుల లోపలా బయటా నిండి ఉంది.

    మం.శ్లో॥

    యస్తు సర్వాణి భూతాన్యాత్మ న్యేవాను పశ్యతి |

    సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే || 6

    ఎవడైతే సకలజీవుల్నీ తన ఆత్మలోనే దర్శిస్తాడో, అలాగే అన్ని జీవులలో తన ఆత్మనే చూస్తాడో అటువంటివాడు ఎవరినీ ద్వేషించడు.

    మం.శ్లో||

    యస్మిన్ సర్వాణి భూతా న్యాత్మా వాభూ ద్విజానతః |

    తత్ర కో మోహః కః శోక ఏకత్వ మనుపశ్యతః || 7

    ఎప్పుడైతే సకలజీవులనీ, ఈ చరాచర ప్రపంచాన్ని తన ఆత్మగా ఏకత్వంగా దర్శిస్తాడో, అలాంటి ఆత్మ జ్ఞానం కలిగినవాడికి మోహం ఏమిటి ? శోకం ఏమిటి? అనగా మోహం, శోకం అనేవి ఆత్మజ్ఞానికి వుండవడని భావం.

    మం.శ్లో! ll

    సపర్యగాచ్చు క్రమకాయ మర్రణ మస్నావిరగ్ం శుద్ధమపాప విద్ధమ్, కవిర్మనీషీ

    పరిభూః స్వయం భూర్యథా తథ్యతో-డౌన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః || 8

    స్వయంభువు, సర్వత్రా వ్యాపించినవాడు, శరీరంలేనివాడు, కండలు లేనివాడు, పాపరహితుడు, ప్రకాశించేవాడు, పరిపూర్ణ స్వరూపుడు, స్వచ్ఛంగా వుండేవాడు, అన్నిటినీ దర్శించగలిగేవాడు, అన్నీ తెలిసినవాడు అయిన ఆత్మ (పరమాత్మ) శాశ్వతంగా వుండే ప్రజాపతులకి యధావిధిగా వారి వారి కర్తవ్యాలని పంచి ఇచ్చాడు.

    మం.శ్లో॥

    అంధం తమః ప్రవిశని యే విద్యా ముపాసతే |

    తతో భూయఇవ తే తమో య ఉ విద్యాయాగ్ం రతాః || 9

    ఎవరైతే ఆ విద్యని ఉపాసిస్తారో (అజ్ఞానాన్ని కలిగివుంటారో) వారు గాఢమైన చీకట్లోకి ప్రవేశిస్తారు. కర్మప్రారంబంతో చిత్తశుద్ధి లేకుండా బ్రహ్మ విద్యని ఉపాసించేవారు. అంతకన్నా ఘోరమైన అంధకారంలో పడిపోతారు.

    మం.శ్లో॥

    అన్యదేవాహు ర్విద్యయా అన్యదాహు రవిద్యయా |

    ఇతి శుశ్రుమ ధీరాణాం యేన స్త ద్విచచక్షిరే || 10

    ప్రాజ్ఞులైన పండితుల ద్వారా మేమం విద్యవల్ల ఒక ఫలితం లభిస్తుందనీ, అవిద్యవల్ల మరొక ఫలితం లభిస్తుందని విన్నాం.

    మం.శ్లో॥

    విద్యాం చావిద్యాం చ యస్త ద్వేదోభయగ్ం సహl

    అవిద్యయా మృత్యుం తీర్వా విద్యయా మృతమశ్నుతే || 11

    ఎవడైతే విద్యని, అవిద్యని, రెండిటినీ తెలుసుకుంటాడో అలాంటివాడు 'అవిద్య'వల్ల మృత్యువుని జయించి, 'విద్య' వల్ల అమరత్వాన్ని పొందుతాడు.

    మం.శ్లో॥

    అంథం తమః ప్రవిశన్తియేసంభూతి ముపాసతే |

    తతో భూయ ఇవ తే తమో య ఉ సంభూత్యాగ్ం రతాః || 12

    ఎవరైతే! ఈ ప్రకృతిని ఉపాసిస్తున్నారో, వారు గాఢమైన అంధకారంలోకి ప్రవేశిస్తారు. అలాగే హిరణ్యగర్భుణ్ణి ఉపాసించేవారు, అంతకంటే మించిన కటిక చీకటిలోకి ప్రవేశిస్తారు. (అసంభూతి = ప్రకృతి, సంభూతి = హిరణ్యగర్భుడు)

    మం.శ్లో॥

    అన్యదేవాహుః సంభవా దన్యదాహు రసంభవాత్ |

    ఇతి శుశ్రుమ ధీరాణాం యేన స్త ద్విచచక్షిరే || 13

    హిరణ్యగర్భుణ్ణి ఉపాసించటం వల్ల ఒకరకమైన ఫలితం, ప్రకృతిని ఉపాసించటం వల్ల మరొక రకమైన ఫలితం లభిస్తుందని ధీరులు చెబుతారు.

    మం.శ్లో॥

    సంభూతించ వినాశంచ యస్త ద్వేదోభయగ్ం సహ |

    వినాశేన మృత్యుం తీర్వా సంభూత్యామృతమశ్నుతే || 14

    అసంభూతి అనగా ప్రకృతిని, వినాశనం అనగా హిరణ్య గర్భుణీ కలిపి ఎవడైతే తెలుసుకుంటాడో, అలాంటివాడు హిరణ్య గర్భుడి ఉపాసన ద్వారా మృత్యువుని జయించి, ప్రకృతి (అసంభూతి) మీద భక్తి వల్ల అమరత్వాన్ని పొందుతాడు.

    మం.శ్లో॥

    హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖమ్ |

    తత్త్వం పూష న్నపావృణు సత్యధర్మాయ దృష్టయే || 15

    బంగారు పాత్ర (సూర్యబింబం) చేత 'సత్యం' అనే ద్వారం మూయబడి వుంది. ఓ సూర్య భగవానుడా ! ఆ ద్వారాన్ని, సత్య ధర్మాని ఆచరించే నేను చూడటానికి వీలుగా నీవు తొలగించు.

    మం.శ్లో॥

    పూషన్నేకరే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మీన్ సమూహ |

    తేజోయ తే రూపం కల్యాణ తమం త తే పశ్యామి

    యో సావసా పురుషః సోహమస్మి ||16

    ఓ విశ్వపోషకా! ఒంటరిగా సంచరించేవాడా! ప్రజాపతిపత్రా! సూర్యభగవానుడా! సర్వనియంతా! నీ దివ్యకిరణాలని తొలగించి కాస్త నీ కాంతిని ఉపసంహరించుకో అలా చేస్తేనే నీ అనుగ్రహంతో కల్యాణ ప్రదమైన నీ రూపాన్ని నేను చూడగలను స్వామీ! నీలో వుండే ఆ పురుషుణ్ణి నేను అని గ్రహించాను.

    మం.శ్లో॥

    వాయురనిలమమృత మథేదం భస్మాంత? శరీరమ్ |

    ఓం క్రతోస్మర కృతగ్గ స్మర క్రతో స్మర కృతగ్గ స్మర || 17

    ఈ నా శరీరంలో వున్న ప్రాణవాయువు సర్వవ్యాప్తి, శాశ్వతం అయిన ప్రాణంలో లీనమౌగాక! ఈ నా శరీరం భస్మమౌగాక! ఓ మనసా నీవు బాగా గుర్తు తెచ్చుకో, నీ పూర్వ జన్మల్ని బాగా గుర్తు తెచ్చుకో.

    మం.శ్లో||

    అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్ | యుయోధ్యస్మజుహురాణమేనో భూయిషాంతే నమ ఉక్తిం విధేమ || 18

    ఓ అగ్నిదేవా! మేము చేసిన కర్మఫలాన్ని అనుభవించటానికి మమ్మల్ని మంచిదారిలో నడిపించు. మేము చేసిన కర్మలన్నీ నీకు స్పష్టంగా తెలుసు. కనుక ఓ అగ్నిదేవా ! మాలో వున్న పాపాల్ని నాశంచేయి, స్వామీ నీకు తిరిగి తిరిగి నమస్కారం చేస్తున్నాం.

    2.కేనోపనిషత్తు

    ప్రథమః ఖండః

    మం.శ్లో ||

    ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః సైతియుక్తః l

    కేనేషితాం వాచ మిమాం వదంతి చక్షుః శ్రీం క ఉ దేవో యునక్తి || 1

    శిష్యుడు గురుదేవా! దేనిచేత ప్రేరేపించబడి మనస్సు తనపనులు తాను చేయటానికి ముందుకు దూకుతోంది? ఎవరిచేత నియోగించబడి ప్రాణం తన పనులు తాను కొనసాగిస్తోంది? దేని ఇష్టాన్ని అనుసరించి మానువులు మాట్లాడుతున్నారు? నిజంగా ఏ దేవుడు కళ్ళని చూడటానికి, చెవుల్ని వినటానికి నియమిస్తాడు?

    మం.శ్లో॥

    శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయద్ వాచో హ వాచం స ఉ ప్రాణస్య |

    ప్రాణః | చక్షుష శక్తురతిముచ్యధీరాః ప్రేత్యాస్మాల్లో కాదమృతాభవం తి || 2

    గురువు! ఆత్మ శక్తివల్లనే చెవి వినగలుగుతుంది. కన్ను చూడగలుగుతుంది. నాలుక మాట్లాడగలుగుతుంది. మనస్సు గ్రహించగలుగుతోంది. ప్రాణాలు పనిచేస్తున్నాయి. జ్ఞాని అయినవాడు ఈ ఇంద్రియ వ్యాపారాల నుంచి ఆత్మని వివక్షిస్తాడు. అనగా వేరుగా చూస్తాడు. అలా ఆత్మని ప్రత్యేకంగా తెలుసుకున్నవాడు ఇంద్రియబద్ధమైన జీవితాన్ని దాటి అమరత్వాన్ని పొందుతాడు.

    మం.శ్లో॥

    నతత్ర చక్షుర్ గచ్చతి, న వాగ్గచ్చతి నో మనః న విద్మోన |

    విజానీమోయథైత దనుశిష్యా దన్యదేవ తద్విదితా దథో అవిదితాదధి

    ఇతి శుశ్రమ పూర్వేషాం యేన స్తద్ వ్యాచచక్షిరే || 3

    ఆ పరబ్రహ్మని కళ్ళతో చూడలేం. మాటతో చెప్పటానికి వీలుకాదు. మనసుతో భావించలేం. కనుక దాని గురించి మాకు తెలియదు. ఆ పరబ్రహ్మ తత్త్వం తెలిసినదాని కన్నా భిన్నమైనది, తెలియని దానికన్నా అతీతమైనది. ఈ విషయాలని మా పూర్వీకుల నుంచి మేము విన్నాం.

    మం.శ్లో!

    యద్వాచా నభ్యుదితం, యేన వా గభ్యుద్యతే |

    తదేవ బ్రహ్మ త్వం విద్ధి, నేదం యదిద ముపాసతే || 4

    ఏదైతే మాటలచేత ప్రకటించబడదో! దేనిచేత మాటలు ప్రకటించ బడతాయో! అది మాత్రమే 'బ్రహ్మం' అని నువ్వు తెలుసుకో. ఈ జనులు పూజించేదేదీ బ్రహ్మంకాదు.

    మం.శ్లో||

    యన్మనసా నమనుతే, యేనాహు ర్మనో మతమ్ |

    తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిద ముపాసతే || 5

    ఏది మనస్సుచేత గ్రహించబడదో! దేనిచేత (ఏ ఆత్మ చైతన్యంచేత) మనస్సు అన్ని సంకల్పాలనీ చేయగలుగుతుందో! అది మాత్రమే 'బ్రహ్మం' అని నీవు తెలుసుకో - ఈ జనులు పూజించేది బ్రహ్మం కాదు.

    మం.శ్లో॥

    య చ్చక్షుషా న పశ్యతి యేన చక్షూషి పశ్యతి |

    తదేవ బ్రహ్మ త్వంవిద్ది, నేదం యదిద ముపాసతే || 6

    దేనినైతే మానవుడు తన కళ్ళతో చూడలేడో? దేని (పరబ్రహ్మ) చేత కళ్ళను (అంతఃకరణాన్ని) చూస్తాడో! అది మాత్రమే 'బ్రహ్మం' అని నీవు తెలుసుకో. ఈ జనులు పూజించేది బ్రహ్మం కాదు.

    మం.శ్లో।

    Enjoying the preview?
    Page 1 of 1