Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Rasaayana Vaajikara Tantram
Rasaayana Vaajikara Tantram
Rasaayana Vaajikara Tantram
Ebook563 pages11 hours

Rasaayana Vaajikara Tantram

Rating: 3.5 out of 5 stars

3.5/5

()

Read preview

About this ebook

Sree Chakra Publishers had published many spiritual, puranam and stotram books in Telugu.
LanguageTelugu
Release dateSep 21, 2020
ISBN6580306100942
Rasaayana Vaajikara Tantram

Read more from Sree Chakra Publishers

Related to Rasaayana Vaajikara Tantram

Related ebooks

Reviews for Rasaayana Vaajikara Tantram

Rating: 3.375 out of 5 stars
3.5/5

8 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Rasaayana Vaajikara Tantram - Sree Chakra Publishers

    http://www.pustaka.co.in

    చరక-శుశ్రుత వాగ్బటుల

    Rasaayana Vaajikara Tantram

    Author:

    Sree Chakra Publishers

    For more books

    http://www.pustaka.co.in/home/author/jayanthi-chakravarthi-novels

    Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.

    All other copyright © by Author.

    All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.

    వైద్య రాజ

    పండిత శ్రీ భైరవ మూర్తి

    సంపాదకుడు :

    డా॥ జయంతి చక్రవర్తి

    ఎమ్.ఎ. తెలుగు, ఎమ్.ఎ. సంస్కృతం

    ఎమ్.ఫిల్.పిహెచ్.డి.

    ఆరోగ్యమే మహాభాగ్యం

    మన భారతీయ వాజ్మయంలో ఆయుర్వేదానికి ఎంతో ప్రాముఖ్యం వుంది. నారాయణుడి స్వరూపమైన ధన్వంతరి ద్వారా ఎన్నో అయుర్వేద యోగాలు మానవాళికి అందించబడ్డాయి. తరువాత కాలంలో ఆయుర్వేద త్రయంగా ప్రసిద్ధి పొందిన చరకమహర్షి, శుశ్రుతుడు, వాగ్భటుడు. తమ తమ గ్రంథాల ద్వారా ఆయుర్వేద వైద్య విధానాల్ని విస్తృతంగా ప్రచారం చేసారు. మానవాళికి మహోపకారం చేసిన ఈ ముగ్గురు మహర్షులూ తమ రచనలైన చరకసంహిత, శుశ్రుతసంహిత, అష్టాంగ హృదయం, అష్టాంగ సంగ్రహం గ్రంథాలలో శరీశక్తిని, శృంగార పటుత్వాన్ని, దీర్ఘాయుర్దాయాన్ని కలిగించే ఎన్నో రసాయన వాజీకర ఔషధాలు, వాటి తయారీ విధానాలు గురించి ప్రామాణికంగా తెలియచేసారు. అలాగే వీరితోపాటు శారంగధరుడునే వైద్యుడు కూడా మరికొన్ని ఔషధాల్ని, యోగాల్ని పేర్కొన్నాడు.

    అనే ఈ గ్రంథంలో చరక, శుశ్రుత, వాగ్భట, శారంగధరులు, చెప్పిన రసాయన, ఔషధాలు, వాజీకర యోగాలు ఒక వరుసక్రమంలో సంకలనం చేయబడ్డాయి. ఈ గ్రంథానికి సంబంధించి సుమారు 80 సం|| పూర్వం నాటి ప్రాచీన ప్రతి ఒకటి మాకు లభించింది ఎంతో శిధిలావస్థలలో వున్న ఆ గ్రంథం వైద్యరాజ పండిత శ్రీ భైరవమూర్తిగారు సంకలనం చేసినట్టుగా తెలుస్తోంది. ఎంతో విలువైన ఆ గ్రంథం పాఠకులకి, వైద్యులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావించి దానిని సంస్కరించి తిరిగి ప్రచురిస్తున్నాం.

    ఇందులో చెప్పిన వివిధ రకాల ఔషధాలు, యోగాలు అన్నీ ఎంతో ప్రాచీనమైనవి. నేటి ఆధునిక కాలంలో కూడా వాటి ప్రభావం చాలా గొప్పగా వుంటుంది. అందుకు నిదర్శనం నేడు ఆయుర్వేద వైద్యానికి పెరుగుతున్న జనాదరణే. అయితే పాఠకులు గమనించవలసిన విషయం ఏమిటంటే? ఈ గ్రంథంలో చెప్పిన యోగాలలో కొన్ని అందరూ వినియోగించే విధంగా ఉంటాయి. మరికొన్ని ఆయుర్వేద వైద్యులకు మాత్రమే తెలిసే విధంగా వుంటాయి. కనుక సరియైన జాగ్రత్తలు తీసుకుని సమర్థులైన వైద్యులను సంప్రదించి ఈ గ్రంథంలోని ఔషధాలను వినియోగించు కోవాలసిందిగా ప్రార్ధిస్తున్నాము.

    సంపాదకుడు - ప్రకాశకులు

    ఆయుర్వేద ఋషులు

    ఎంతో గొప్పదైన మన చరిత్రలో ఎంతోమంది సుప్రసిద్ధ వైద్యులు ఉన్నప్పటికీ, ధన్వంతరీ, సుశ్రుతుడు, చరకుడు, వాగ్భటుడు, కశ్యపుడు, జీవకుడు, నాగార్జునుడు వంటివారు వారిలో ప్రముఖంగా కనిపిస్తుంటారు. మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదించే వైద్య విధానాలను అందించిన వీరి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.

    మన భారత సంస్కృతి ప్రకృతిలో మమేకమై, ప్రకృతిలోని ప్రతిజీవిని, వస్తువును, దైవంగా భావించి జీవనగమనంలో ముందుకు సాగమని చెబుతుంటుంది. అందుకే నాడు రోగాలు, రుగ్మతలు కూడ తక్కువగా ఉండేవి. ఒకవేళ ఏమైనా రోగాలు దాపురిస్తే, అందుకు తగిన ప్రకృతి సహజంగా లభ్యమయ్యే మూలికలతో వైద్యం చేయబడేది.

    ధన్వంతరి

    'వైద్యోనారాయణో హరిః' అని అన్నారు. వైద్యుడు సాక్షాత్తు నారాయణ స్వరూపమని, అనుభవజ్ఞుడైన వైద్యుణ్ణి 'అపర ధన్వంతరి' అని మన వాళ్ళు స్తుతిస్తుంటారు.

    శ్రీమద్భాగవతం ధన్వంతరిని దృఢమైన శరీరంతో, పొడవైన చేతులతో, నలుపురంగు శరీరంతో, ఎర్రనికళ్ళతో, పసుపురంగుదుస్తులను ధరించి, వివిధ రకాల ఆభరణాలను అలంకరించుకుని దర్శనమిస్తుంటాడు అని వర్ణించింది. ఇలా వివిధ పురాణాలు ఆయన అవతారగాథను వివరించాయి. భాగవతపురాణం ప్రకారము, క్షీరసాగరమథనం ద్వారా ధన్వంతరి ఆవిర్భావం జరిగింది.

    రాక్షసులు పెట్టే బాధలను భరించలేకపోయిన దేవతలు బ్రహ్మదేవునితో మొర పెట్టుకోగా, ఆయన శ్రీహరిని ప్రార్థించమన్నాడు. అందరూ కలిసి శ్రీమన్నారాయణుని ప్రార్థించగా క్షీరసాగరమథనం చేస్తే ఫలితం ఉంటుందని చెబుతాడు. అలా వారు విష్ణుదేవుని సలహాననుసరించి గడ్డి, తీగలు, ఓషధులను పాల సముద్రములో వేసి, మందర పర్వతం కవ్వంగా, వాసుకి తాడుగా , కవ్వం కిందుగా కూర్మావతార విష్ణువు ఆధారంగా ఉండగా, పాల సముద్రాన్ని మధించారు. ఈ మధనంలో ముందుగా హాలహలం పుట్టగా, దానిని పరమశివుడు కంఠంలో ధరించాడు. ఆ తరువాత కామధేనువు, ఉచ్చైశ్రవం, ఐరావతం, కల్పవృక్షం, అప్సరసలు, చంద్రుడు, లక్ష్మీదేవి, వారుణీ కన్య ఉద్భవించారు.

    ఆ తర్వాత పొడవైన చేతులతో, శంఖం వంటి కంఠంతో నడుముకు పట్టుపుట్టం, కంఠాన పూదండలు, ఎర్రటికన్నులు, విశాలవక్షం, నల్లని కురులు, నీలమేఘ శరీరం, చెవులకు రత్నకుండలాలు, కాళ్ళకు రత్నమంజీరాలలో ఓ దివ్యపురుషుడు ఉద్భవించాడు. సకల విద్యా శాస్త్రాలలో నిపుణుడైన అతని చేతితో అమృతకలశం ధగధగలాడుతోంది.

    ఈ విధంగా భాగవత పురాణం ధన్వంతరి ఆవిర్భావాన్ని వర్ణించింది. మరొకచోట అమృతకలశం, మరొకచేత వనమూలికలు పట్టుకుని ధన్వంతరి దర్శనమిచ్చినట్లు చెప్పబడింది. కొన్ని పురాణాలు ఆయన వనమూలికలకు బదులుగా జలగలను పట్టుకుని ఉంటాడని పేర్కొన్నాయి. రామాయణంలో కమండలం, దండం నుంచి ధన్వంతరి ఉద్భవించాడని చెప్పబడింది. ఆయన నాలుగు చేతులతో దర్శనమిస్తూ, పై రెండు రెండు చేతులలో శంఖు, చక్రాలను ధరించి, క్రింది రెండు చేతులతో జలగను అమృతకలశాన్ని పట్టుకుని ఉంటాడని కొన్ని పురాణాల కథనం.

    దేవవైద్యుడైన ధన్వంతరి భూలోకానికి వచ్చిన ఉదంతాన్ని గురించి హరివంశంలో వివరించబడింది. కాశీ రాజైన దీర్ఘతమునికి చాలా కాలంపాటు సంతానభాగ్యం లేక పోవడంతో విష్ణుమూర్తిని వేడుకుంటూ ఘోరమైన తపస్సును చేసాడు. అప్పుడు స్వామి దీర్ఘతమునికి ధన్వంతరి కొడుకుగా పుట్టేవరాన్ని అనుగ్రహించాడు. అలా దీర్ఘతముని ఇంట మానవరూపంలో జన్మించిన ధన్వంతరి దేవలోకంలోని వైద్య విధానాలను మానవలోకానికి అందుబాటులోకి తెచ్చాడని ప్రతీతి.

    బ్రహ్మవైవర్తపురాణం, ధన్వంతరి భూలోకానికి వచ్చిన తదనంతరం జరిగిన సంఘటనలను వివరిస్తోంది. ఒకానొకసారి ధన్వంతరి, తన శిష్యులతో కలసి కైలాస పర్వత దర్శనానికి బయలుదేరాడు. దారిలో వారిని అడ్డగించిన దక్ష అనే పాము, తన పడగలను విప్పి బెదిరించింది. ధన్వంతరి శిష్యులలో ఒకడు దూకుడుగా ముందుకు వెళ్ళి 'దక్ష' పామును పట్టుకుని ఓ మంత్రాన్ని పఠించడంతో, ఆ మంత్ర ప్రభావానికి దక్షపాము మూర్ఛపోయింది. ఈ విషయానిన గురించి విన్న సర్పరాజు వాసుకి, ద్రోణ, పుండరీక అనే క్రూర పాముల నాయకత్వంలో కొన్నివేల పాములను ధన్వంతరి శిష్యుల పైకి పంపాడు. ఆ పాముల సైన్యం తమ విషంతో ధన్వంతరి శిష్యులంతా మూర్ఛపోయేట్లు చేసాయి. అయితే ధన్వంతరి ఆయుర్వేద మూలికలతో తన శిష్యులందరూ మూర్ఛ నుండి తేరుకునేట్లు చేసాడు. ఈ సంఘటన వాసుకిని మరింత ఆవేశానికి లోనుచేయగా, ధన్వంతరితోపాటు అతని శిష్యులను నాశనం చేసేందుకు తిరిగి మానసాదేవి అనే పాములరాణిని పంపాడు. మానసాదేవి తన విషాన్ని ఎగజిమ్ముతుండగా, ధన్వంతరి ఆవిషానికి విరుగుడు చేసాడు. తదనంతరం మానసాదేవికి, ధన్వంతరికి మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. ఆ యుద్ధజ్వాలలకు సకల లోకాలు కంపించిపోసాగాయి. సరిగ్గా అప్పుడు వారి మధ్య శివుడు ప్రత్యక్షం కాగా, తన తప్పును గ్రహించిన వాసుకి పరుగుపరుగున వచ్చి శివుని పాదాలపై వాలిపోయాడు.

    ఇలా ధన్వంతరి గురించి అనేక పురాణకథలను చెప్పబడ్డాయి. శస్త్ర చికిత్సలో ఉద్దండుడైన 'దివోదాసు' ధన్వంతరి వంశావళిలో నాలుగవ తరానికి చెందినవాడు.

    శ్రీ ధన్వంతరి ములమంత్రం

    ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ

    ధన్వంతరయే అమృత కలశ హస్తాయ సర్వభయ వినాశకాయ

    సర్వరోగ నివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్యనిధయే

    శ్రీ మహావిష్ణుస్వరూపాయ శ్రీ ధన్వంతరీ స్వరూప

    శ్రీ ఔషధచక్ర నారాయణ స్వాహా

    (పై మంత్రాన్ని నిత్యం 108 జపిస్తే రోగబాధలు ధరిచేరవు) సుశ్రుతుడు

    సుశ్రుతుడు

    ఓ గొప్ప శస్త్రచికిత్సా నిపుణుడు, శస్త్రచికిత్స అనేటప్పటికీ మనకు ముందుగా గుర్తుకొచ్చేది సుశ్రుతుడే. గొప్ప గురువు, సుశ్రుతుడు ప్లాస్టిక్ సర్జరీకి ఆద్యుడని చెబుతారు. సుశ్రుతుడు హిపోక్రెటు ఓ వంద సంవత్సరాలు ముందుగా, సెల్సియస్ మరియాగాల కంటే రెండు సంవత్సరాల ముందుగా ఈ భూమిపై ఆపరేషన్లు చేశాడని చరిత్రకారులు చెబుతారు. సుశ్రుతుడు ఓ గొప్ప వైద్యపరంపర నుంచి వైద్యాన్ని నేర్చుకున్నాడు. ధన్వంతరి నుంచి దివోదాసు వైద్యాన్ని నేర్చుకుంటే, దివోదాసు నుంచి సుశ్రుతుడు వైద్యవిద్యను నేర్చుకున్నాడు. సుశ్రు తుని కీర్తి దేశదేశాలను పాకింది. ఆయన రాసిన వైద్య గ్రంథాలు ముందుగా అరబిక్ భాషలోకి అనువదించబడి, అరబిక్ భాషనుండి పర్షియన్ భాషలోకి, ఆ తదనంతరం మిగతా భాషలకు విస్తరించాయి. సుశ్రుతసంహిత రెండు భాగాలను కలిగిఉంది. మొదటిభాగం 'పూర్వసంహితగా', రెండవభాగం 'ఉత్తర సంహిత' గా విభజింపబడ్డాయి. 184 అధ్యాయాలుగా విభజింపబడిన ఈ గ్రంథంలో 1,120 రుగ్మతలను గురించి ప్రస్తావించబడటమే కాక, వాటికి సంబంధించిన చికిత్సా పద్ధతులు కూడ వివరించబడ్డాయి.

    అయితే, ఆయన ఇన్ని విధాలైన వైద్య విధానాలను సూచించినప్పటికీ, ఆయన మధుమేహ, ఊబకాయాలను తగ్గించే వైద్యునిగానే చాలా మంది గుర్తు పెట్టుకుంటున్నారు. ఆయన కాశీలో నివసించినందువల్ల ప్రస్తుతం బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయంలో సుశ్రుతని విగ్రహం ప్రతిష్టించబడింది.

    చరకుడు

    చరకుడు గర్భస్థ శిశివు పెరుగదల గురించి, మానవ శరీర నిర్మాణము గురించి స్పష్టమైన వివరాలను అందించాడు. సుశ్రతుడు శస్త్రచికిత్స నిపుణుడైతే చరకుడు ఆయుర్వేద వైద్యుడు. ఏ రోగానికి ఏ మూలిక తగినదన్న విషయాన్ని నిర్ణయించడంలో నిష్ణాతుడు. ఆయన శస్త్రచికిత్సావిధానాల్లో అనేక అద్భుతాలను చేశాడు.

    వాత, పిత్త, కఫములను అనుసరించి చరకుడు శరీరంలోని ఆరోగ్యస్థితిని అంచనా వేసేవాడు. అదేవిధంగా రోగాలను నిర్ధారించడమే కాదు, వాటికి తగిన చికిత్సా పద్దతులను సూచించడంలో కూడ ఘటికుడు చరకుడు. ఈయన వృద్దాప్యాన్ని వెనక్కి మళ్ళించే మూలికలను కూడా అందుబాటులోకి తెచ్చాడని ప్రతీతి.

    ఆయనచే విరచితమైన 'చరకసంహిత'లో పలు విధాలైన మూలికల వివరాలను, చికిత్సా విధానాలను చూడొచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో చరకుడు వైద్యం చేసేందుకు లోహథాతువులను, జంతు సంబంధ పదార్థాలను కూడా ఉపయోగించేవాడట. మందులు ఉపయోగించే పద్ధతిని అనుసరించి చరకుడు ఆయామందులను 50 రకాలుగా విభజించాడు. మందులను పొడి రూపంలో, జిగురుగా, ద్రవరూపంలో తయారుచేసిన చరకుడు ఆ మందులను ఉ పయోగించాల్సిన విధానాన్ని గురించి కూడా చాలా వివరంగా తన గ్రంథంలో పేర్కొన్నాడు.

    వాగ్బటుడు

    పూర్వకాలంలో వృద్ధత్రయీ అని పేర్కొనబడినవారిలో వాగ్భటుడు ఒకరు. మిగతా ఇద్దరు ఆత్రేయుడు, సుశ్రుతుడు. ఈయనచే వివరించబడిన ప్రఖ్యాత వైద్య గ్రంథాలు అష్టాంగ సంగ్రహం, అష్టాంగ హృదయం. సింహగుప్తుని కుమారుడైన వాగ్భటుడు సింధునదీ పరివాహక ప్రాంతంలో జన్మించాడు. అవలోకితుడు అనే బౌద్ధగురువు దగ్గర వాగ్భటుడు వైద్యవిద్యను అభ్యసించాడు. అయితే వాగ్భటుడు పుట్టుకతో హిందువే అయినప్పటికీ, జీవనప్రస్థానంలో హిందూ ధర్మాన్నే అనుసరిస్తున్నప్పటికీ, తనయొక్క గ్రంథాలలో బుద్ధుడి స్మరణ చేస్తాడు.

    ఈయన 'అష్టాంగ సంగ్రహం' భారతదేశం అంతా ప్రసిద్ధి పొందింది. ఈయన తన కాలంలో లభ్యమైన వైద్యగ్రంథాలన్నింటినీ పరిష్కరించి అందరికీ అందుబాటులో ఉండేట్లుగా చేసాడు. చరకుడు, సుశ్రుతుడు చెప్పినవాటిని చక్కగా పరిష్కరించాడు. ఈయన ఋతువులను అనుసరించి చేయాల్సిన దినచర్యల గురించి, ఋతుచర్యల గురించి వివరించాడు. వీటిని పాటించడంవల్ల ఆయుర్ వృద్ధి జరుగుతుందని ప్రయోగాత్మకంగా తెలిపేవాడాయన.

    ఈయన రాసిన అష్టాంగ సంగ్రహంలో 6 అధ్యాయాలు, 150 విభాగాలున్నాయి. మొదటి అధ్యాయంలో నిత్యకర్మల గురించి, రెండవ అధ్యాయంలో శరీరనిర్మాణము, గర్భము ధరించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రసవ సమయములో పాటించాల్సిన పద్ధతులు, మూడవ అధ్యాయంలో మధుమేహం, చర్మవ్యాధుల నివారణలను గురించి, నాలుగవ అధ్యాయములో ఆయావ్యాధులకు తగిన చికిత్సా పద్ధతులు, ఐదవ అధ్యాయంలో చిన్నపిల్లలకు వచ్చే రోగాలు, మూర్ఛలు, పిచ్చి గురించి, వాటి నివారణ పద్ధతులను గురించి వివరించబడింది.

    కశ్యపుడు

    కశ్యపుడు పిల్లలకు సంబంధించిన వైద్యవిధానంలో, ప్రసూతి వైద్యవిధానంలో నిష్ణాతుడు. ఈయనచే విరచితమైన గ్రంథం 'కశ్యప సంహిత'. ఇది ప్రశ్నోత్తరాల రూపంలో ఉంటుంది. ప్రసూతి వైద్యంలో కశ్యపుని కృషి గణనీయమైనది. ఆయుర్వేదానికి సంబంధించిన ఎనిమిది విభాగాలలో కశ్యపుని కృషి అనితర సాధ్యం .

    1. కాయ చికిత్స

    2. శల్య చికిత్స

    3. శాలక్య తంత్రం

    4. అగాధ తంత్రం

    5. భూత విద్య

    6. కౌమార భృత్య

    7. రసాయన తంత్రం

    8. వాజీకరణ తంత్రం

    అని అంటూ ఆయుర్వేదానికి సంబంధించిన అన్ని విభాగాల గురించి కశ్యపుడు ప్రస్తావించాడు.

    అదేవిధంగా కశ్యపుడు తన వైద్య విధానంలో ఏడు విధాలుగా మందులను తయారు చేసేవాడట.

    1. చూర్ణం

    2. శీతకషాయం

    3. స్వరస

    4. అభినవ

    5. ఫంట

    6. కలక

    7. క్వత తన

    గ్రంథంలో పిల్లల పెరుగుదలకు సంబంధించిన ఎన్నో సూచనలను అందించి, ఆయుర్వేద వైద్యులలో తనకొక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

    జీవకుడు

    మెదడు, నరాలకు సంబంధించిన వైద్యనిపుణుడు జీవకుడు. బౌద్ధ గ్రంథాలలో ఆయనవైద్య విధానాన్ని గురించిన ప్రశంసలను చూడగలం. బింబిసారుని కాలానికి చెందిన జీవకుడు ఒక కుప్పతొట్టిలో కనిపించాడనీ, రాజుకు ఈ విషయం తెలిసి, ఆ పసికందును ఆస్థానానికి రప్పించి జీవకుడు అనే పేరు పెట్టాడని చారిత్రక కథనం. పెరిగి పెద్దయిన జీవకుడు తక్షశిలలో వైద్యవిద్యను అభ్యసించాడు. ఏడేళ్ళపాటు సాగిన ఆ విద్య ముగిసిన అనంతరం, అతనిని గురువు పిలిచి, తక్షశిలకు వలయాకారంలో ఎనిమిది మైళ్ళ పర్యంతంలో వైద్యానికి పనికిరాని మొలకను తీసుకురమ్మన్నాడు. జీవకుడు గురువు చెప్పిన ప్రకారం, ఒక యోజన పర్యంతము తిరిగి, అటువంటి మొక్క కోసం వెదకి, వైద్యానికి పనికిరాని మొక్కను కనిపెట్టడం తన వల్ల కాదన్నాడు. అప్పుడు అతని అర్హత పట్ల సంతృప్తి చెందిన గురువు, అతనిని ఆయుర్వేద వైద్యం చేయడానికి అనుమతిని ఇచ్చాడు.

    అనంతరం జీవకుడు నరాలకు సంబంధించిన వైద్యాన్ని చేసేందుకు సాకేతపురానికి చేరుకున్నాడు. వైద్యవృత్తి ద్వారా జీవకుడు బాగా ధనవంతుడయ్యాడు. అనంతరం ఒకానొక సమయంలో జీవకుడు బుద్ధునికి కూడా వైద్యాన్ని అందించాడు. ఒకప్పుడు బుద్ధుని కాలికి రాయి తగలగా గాయమైంది. అప్పుడు జీవకుడు కొన్ని మూలికలను ఆ గాయంపై పూసి, కట్టు కట్టాడట. ఆ కట్టు ఓ కాలపరిమితి తర్వాత విప్పివేయాలి. కానీ, ఆ సమయంలో జీవకుడు వేరేపనిపై పొరుగూరుకెళ్ళాడు.

    అప్పుడు జీవకుడు బుద్ధునితో మానసిక తరంగాల ద్వారా సంప్రదించి, అక్కడ్నుంచే బుద్ధుని కాలికి కట్టివున్న

    Enjoying the preview?
    Page 1 of 1