Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Navagrahalu Navaratnalu
Navagrahalu Navaratnalu
Navagrahalu Navaratnalu
Ebook252 pages19 hours

Navagrahalu Navaratnalu

Rating: 3.5 out of 5 stars

3.5/5

()

Read preview

About this ebook

Sree Chakra Publishers had published many spiritual, puranam and stotram books in Telugu.
LanguageTelugu
Release dateSep 21, 2020
ISBN6580306100938
Navagrahalu Navaratnalu

Read more from Sree Chakra Publishers

Related to Navagrahalu Navaratnalu

Related ebooks

Reviews for Navagrahalu Navaratnalu

Rating: 3.5 out of 5 stars
3.5/5

2 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Navagrahalu Navaratnalu - Sree Chakra Publishers

    http://www.pustaka.co.in

    నవగ్రహాలు నవరత్నాలు

    Navagrahalu Navaratnalu

    Author:

    విషయ సూచిక

    Sree Chakra Publishers

    For more books

    http://www.pustaka.co.in/home/author/sree-chakra-publishers-novels

    Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.

    All other copyright © by Author.

    All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.

    విషయ సూచిక

    ఉపోద్ఘాతం

    సూర్యగ్రహ విశేషాలు

    సూర్యగ్రహ అష్టోత్తర శతనామాలు

    చంద్రగ్రహవిశేషాలు

    చంద్రగ్రహ అనుగ్రహాన్ని కలిగించే రత్నం

    చంద్రగ్రహ అష్టోత్తర శతనామాలు

    కుజగ్రహవిశేషాలు

    కుజగ్రహ అనుగ్రహాన్ని కలిగించే రత్నం

    కుజగ్రహ అష్టోత్తర శతనామాలు

    బుధగ్రహ విశేషాలు

    బుధగహ అనుగ్రహాన్నికలిగించే రత్నం

    బుధగ్రహ అష్టోత్తర శతనామాలు

    గురుగ్రహ విశేషాలు

    గురుగ్రహ అనుగ్రహాన్ని కలిగించే రత్నం

    గురుగ్రహ అష్టోత్తర శతనామాలు

    శుక్రగ్రహ విశేషాలు

    శుక్రగ్రహ అనుగ్రహాన్ని కలిగించే రత్నం

    శుక్రగ్రహ అష్టోత్తర శతనామాలు

    శనిగ్రహ విశేషాలు

    శనిగ్రహ అనుగ్రహాన్ని కలిగించే రత్నం

    శనిగ్రహ అష్టోత్తర శతనామాలు

    రాహుగ్రహవిశేషాలు

    రాహుగ్రహ అనుగ్రహాన్ని కలిగించే రత్నం

    రాహుగ్రహ శతనామాలు

    కేతుగ్రహ విశేషాలు

    కేతుగ్రహ అనుగ్రహాన్నికలిగించే రత్నం

    కేతుగ్రహ శతనామాలు

    జన్మతేదీలను బట్టి ధరించవలసిన రత్నాలు

    నవరత్నాలు ధరించటానికి మంచి సమయం

    ఉపరత్నాలు

    నవగ్రహ పీడాహర స్తోత్రమ్ |

    ఉపోద్ఘాతం

    నవగ్రహాలకు, నవరత్నాలకు సంబంధం ఉంది. సాధారణంగా గ్రహదేవతలను ఆరాధించడానికి జప, తప, హోమ, దానాలవంటి అనేక మార్గాలున్నాయి. వాటిలో సమిధలు, పుష్పాలు, ఫలాలు, ధాన్యం, ఓషధులు, రత్నాలు వంటి అనేక ఉపకరణాలున్నాయి. మన జాతకంలో ఎటువంటి గ్రహదోషం ఉన్నదో తెలుసుకుని, ఆ దోషనివారణార్థం, దానికి సంబంధించిన రత్నాన్ని ధరిస్తే, ఆ గ్రహదోషం గణనీయంగా తగ్గి అనుకున్న కార్యాలలో విజయం లభిస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుకే పూర్వం కొందరు రాజులు రత్నాలను తమ కిరీటాల్లో, సింహాసనాల్లో పొదిగి, ఫలితంగా అనేక విజయాలను, అశ్వర్యాలను పొందారని చరిత్ర చెబుతోంది.

    నవరత్నాల గురించి వేదంలోనే చెప్పబడింది. భరద్వాజ స్మృతి, కాశ్యపస్మృతులలో వివిధ రకాలైన రత్నాలను గురించిన చర్చలను చూడగలం. రత్నపరీక్ష, యుక్తికల్పతరువు, జాతక పారిజాతము, ఉత్పలపరిమళ, రసజలనిధి వంటి గ్రంథాలు రత్నాల గురించి విపులంగా చర్చించాయి. అగస్త్యుడు, వరాహ మిహిరుడు, భోజరాజు, వైద్యనాథ దీక్షితుడు రత్నాల గురించి ఎంతో విలువైన సమాచారాన్ని మనకు అందించారు.

    అలాగే నవరత్నాలు ధరించటం ద్వారా రోగనివారణ జరుగుతుందంటారు. ఆయా రత్నాల నుంచి వెలువడే కిరణాలు, మందులు కూడ నయం చేయలేని కొన్ని రోగాలను నయం చేస్తాయట. ఉదాహరణకు పక్షవాతం, గుండెపోటు, మూర్ఛ వంటి వ్యాధుల చికిత్సలో రత్నాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఏ గ్రహమైనా జాతకుని జన్మజాతకంలో, షష్టాష్టమ వ్యాపకాల్లో (6,8,12 స్థానాలలో) గానీ, శత్రు, నీచస్థానాల్లో గానీ బలహీనుడై లేక అస్తంగతుడై ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన రత్నాన్ని ధరించాలని మన జ్యోతిష పండితులు చెప్తారు.

    సాధారణంగా ఎండావానల నుండి మనకు గొడుగు ఎలా రక్షణను ఇస్తుందో, అలాగే నవరత్నాలు కూడ మనకు గ్రహాల నుండి రక్షణ కల్పిస్తుంటాయి. పాతకాలం వారు దీనిని గ్రహదోషం అంటే ఈనాటివారు కాస్మిక్ కిరణాల నుండి రక్షణ అంటున్నారు. రత్నాలు ఒక్కొక్క గ్రహం నుంచి బయటకు వస్తున్న కాస్మిక్ కిరణాలను తమలో ఇముడ్చుకొనగలిగే శక్తిని కలిగి ఉంటాయి. గ్రహాల నుంచి భూమిపైకి దూసుకువచ్చే కిరణాలు ఎల్లప్పుడూ చెడు ఫలితాలను కలిగించే విధంగా ఉంటాయన్నది నేటి శాస్త్రజ్ఞులు కూడ అంగీకరిస్తున్న సత్యం. రత్నాల నుంచి బైటకు వచ్చే కిరణాలు ఎల్లప్పుడూ సానుకూల స్పందననే కలుగజేస్తుంటాయి. ఇలా ప్రతికూల, సానుకూల కిరణాలు ఒకదానితో ఒకటి కలసి రక్షణ కవచంగా పనిచేస్తుంటాయి. రత్నాలకు ఆరోగ్యానికి సంబంధం ఉంది. శాస్త్రీయంగా చెప్పాలంటే మన శరీరం సప్తవర్ణమిళితం. శరీరంలో ఆయా రంగుల తేడాల వల్ల అనేక రోగాలు కలుగుతుంటాయి.

    మనం ధరించే రత్నం కూడ తగినంత బరువు గలదిగా ధరించినట్లయితే, దాని వల్ల మనకు పూర్తి ఫలం లభిస్తుంది.

    రత్నాలలో తొమ్మిదిరకాలైన రత్నాలు ముఖ్యమైనవి. అవి : 1. కెంపు, 2. ముత్యం, 3.పగడం, 4.పచ్చ, 5. పుష్యరాగం, 6.వజ్రం, 7.నీలం, 8. గోమేధికం, 9.వైఢూర్యం. ఈ తొమ్మిది రత్నాలే కాక ఇంకా అనేక రకాలైన రత్నాలున్నాయి. వాటిని మరలా 22 ప్రధాన విభాగాలుగా, 84 ఉప విభాగాలుగా విభజించారు. వీటిలో ముత్యం, పగడం సముద్రంలో తయారవుతుండగా మిగతావి భూమి లోపల, భూమిపైన తయారవుతుంటాయి.

    ఈ గ్రంథంలో నవగ్రహాల విశేషాలు, నవగ్రహ దోషాలను తొలగించుకుని వాటి అనుగ్రహాన్ని పొందటానికి ధరించాల్సిన నవరత్నాలను వాటిని ధరించే విధానాలను, అలాగే ద్వాదశరాశుల వారు 27 నక్షత్రాల వారు తమ జీవితంలోని వివిధ దశలలో ధరించాల్సిన రత్న, ఉపరత్నాల విశేషాలను అందిస్తున్నాము.

    ఈ గ్రంథాన్ని కేవలం నవగ్రహాల-నవరత్నాల విశేష సమాచారాన్ని తెలియజేయటం కోసమే రూపొందించాము. పాఠకులు అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితుల సూచనలతో మాత్రమే తగిన రత్నాన్ని ధరించి శుభఫలితాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాము.... ..

    నమస్కారాలతో

    మీ

    - సంకలన కర్త , ప్రకాశకులు

    సూర్యగ్రహ విశేషాలు

    సూర్యగ్రహ స్వభావం స్వరూపం :

    సూర్యుడు జ్యోతిష శాస్త్రంలో గుండ్రని ముఖం, రక్తవర్ణం, పొడగరి, గోధమువర్ణం కలిగిన జట్టు కలిగిన వాడుగా వర్ణించబడ్డాడు. గుణత్రయాలలో సూర్యుని స్వభావం రజోగుణం. రుచులలో సూర్యుడు కారం రుచికి కారకత్వం వహిస్తాడు. చాతుర్వర్ణములలో సూర్యుడు క్షత్రియ జాతికి కారకత్వం వహిస్తాడు. తత్వం అగ్నితత్వం, ప్రకృతి పిత్త ప్రకృతి. దిక్కు తూర్పుదిక్కు లోహము రాగి, రత్నము మాణిక్యము, దిక్బలం దశమస్థానం, రాశిసంఖ్య 1, కృత్తిక, ఉత్తరఫల్గుణి, ఉత్తర ఆషాఢ నక్షత్రాలకు నక్షత్రాధిపత్యం వహిస్తాడు. శరీరావయవాలలో గుండె మరియు పురుషులకు కుడికన్ను, స్త్రీలకు ఎడమకన్ను, రాశ్యాధిపత్యం సింహరాశి, మేషరాశిలో 10 డిగ్రీలలో పరమోచ్ఛ స్థితిని, సింహరాశిలో 20 డిగ్రీలలో రాజ్యాన్ని, తులారాశి 10 డిగ్రీలలో నీచను పొందుతాడు.

    సూర్యుని ప్రభావం :

    సూర్యుని ప్రభావం ఉన్నవారు ఆత్మాభిమానం, చురుకుతనం కలిగి ఉంటారు. సంఘంలో పలుకుబడి ఉంటుంది. దుబారా వ్యయం, పొగడ్తలకు లొంగుట, నవగ్రహాలు - నవరత్నాలు " ఆవేశపడుట, సమయస్ఫూర్తి కలిగి ఉంటారు. చక్కని సంపాదన ఉంటుంది. కంటి జబ్బులు, గుండెజబ్బులు, వడదెబ్బకు గురి అగుట వంటి శారీరక అవస్థలకు గురి ఔతుంటారు. పిత్త ప్రకృతి కలిగి ఉంటారు.

    కారకత్వములు :

    సూర్యుడు ఆత్మకు, తండ్రికి, శక్తికి, అగ్నికి, ప్రతాపానికి, ఆకాశము, దిక్కుతూర్పు, దేశాధిపత్యములకు కారకత్వము వహిస్తాడు. ముళ్ళచెట్లకు, పంటలలో మిరియాలు, మిరపకాయలు, కొబ్బరి, వాము, బియ్యం మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు. శివభక్తులు, శివపూజ, శివాలయాలకు కారకత్వం వహిస్తాడు. జంతువులలో సింహం, ఎలుగుబంటి, గుర్రము, సర్పములకు కారకత్వం వహిస్తాడు. పక్షులలో కాకి, కోకిల, కోడి, హంసలకు కారకత్వం వహిస్తాడు. వృత్తులలో ప్రభుత్వ కార్యాలయాలు, హృదయ సంబంధిత మందులు, వైద్యులు, రిజర్వ్ బ్యాంక్ సంబంధిత వృత్తులకు కారకత్వం వహిస్తాడు. ఆకాశ సంబంధిత విమానాలు, విమానాశ్రయము, ఖగోళము, వాతావరణము, విమానచోదకులు, విద్యుత్ సంబంధిత బ్యాటరీలు, విద్యుత్తు ఉత్పత్తి, భూకంపాలు, ఆకాశవాణి, దూరదర్శన్ వంటి ప్రసార సంబంధిత మాద్యమ వృత్తులు, విద్యుత్తు ఉపకరణ సంబంధిత వృత్తులకు కారకత్వం వహిస్తాడు.

    సూర్య ఆరాధన :

    సూర్యుడు తెలుగు సంవత్సరం ప్రభవ మాఘశుద్ధ సప్తమి ఆదివారం నాడు విశాఖ నక్షత్రంలో అతిధి, కశ్యపులకు జన్మించాడు కనుక సూర్యునికి రధసప్తమి నాడు విశేషపూజలు జరుపుతారు. సూర్యుడి పూజార్ధం రాగి విగ్రహం ప్రతిష్ఠిస్తారు. గోధుమలు, బెల్లంతో వండిన పాయసం నైవేద్యంగా పెడతారు. గ్రహ ప్రీత్యర్ధం బెల్లం కలిపిన అన్నం సమర్పిస్తారు. సూర్యుడికి పళ్ళులేవని అందువలన పాయసం అతడికి ప్రీతి కలిగిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. సూర్యుడు సప్తవర్ణాలకు ప్రతీకగా సప్త అశ్వములు పూన్చిన రధం మీద ఆరూఢుడై ఉంటాడు. వినతా పుత్రుడైన అనూరుడు సూర్యుడికి సారధి. అనూరుడు గరుత్మంతుని అన్న. శ్రీరామనవమి సూర్యగ్రహ ప్రీత్యర్ధం చేయబడే మరి ఒక పండుగ. సూర్యుడికి ప్రీతికరమైన తిధి జ్యేష్ట శుక్ల ద్వాదశి, కార్తిక శుక్లసప్తమి. సూర్యుడి ప్రీత్యర్ధం ఆదివార వ్రతం చేస్తారు. సూర్యుడిని వివిధ రకాలుగా స్తోత్రం చేస్తారు. వాటిలో కొన్ని ఆదిత్య హృదయం,

    Enjoying the preview?
    Page 1 of 1