Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Aarogyame Mahabhagyam
Aarogyame Mahabhagyam
Aarogyame Mahabhagyam
Ebook176 pages3 hours

Aarogyame Mahabhagyam

Rating: 4 out of 5 stars

4/5

()

Read preview

About this ebook

Dr.Jayanthi Chakravarthi Ph.D in Telugu is currently working as a Freelance Writer & Editor. He has done M.A.Telugu, M.A. Sanskrit, M.A. Archaeology, M.Phil. Archaeology, S.L.E.T. in Telugu and Sanskrit. He has written more than 75 on various subjects. He has worked as an editor for 4 years with Sri Kanaka Durga Prabha
LanguageTelugu
Release dateSep 21, 2020
ISBN6580304600665
Aarogyame Mahabhagyam

Read more from Dr.Jayanthi Chakravarthi Ph.D.

Related to Aarogyame Mahabhagyam

Related ebooks

Reviews for Aarogyame Mahabhagyam

Rating: 4 out of 5 stars
4/5

7 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Aarogyame Mahabhagyam - Dr.Jayanthi Chakravarthi Ph.D.

    http://www.pustaka.co.in

    ఆరోగ్యమే మహాభాగ్యం

    Aarogyame Mahabhagyam

    Author:

    జయంతి చక్రవర్తి

    Dr. Jayanthi Chakravarthi Ph.D.

    For more books

    http://www.pustaka.co.in/home/author//jayanthi-chakravarthi-novels

    Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.

    All other copyright © by Author.

    All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.

    విషయ సూచిక

    100 రకాల రోగాలు నివారణోపాయాలు

    వివిధ పదార్థాలు - ఆరోగ్య విశేషాలు

    తిప్పతీగె:

    ఆరోగ్యాన్నిచ్చే అద్భుత వస్తువులు

    శరీరసౌందర్య యోగాలు

    ముఖ సౌందర్యయోగాలు

    శరీరాన్ని మెరిపించే పదార్థాలు

    ఆరోగ్యమే మహాభాగ్యం

    - వివిధరకాల ఆరోగ్య చిట్కాలు –

    సేకరణ: పి.రంగనాథాచార్యులు

    విషయసూచిక

    1) 100 రకాల రోగాలు నివారణోపాయాలు 2

    2) వివిధ పదార్థాలు - ఆరోగ్య విశేషాలు

    3) ఆరోగ్యాన్నిచ్చే అద్భుత వస్తువులు

    4) శరీరసౌందర్య యోగాలు

    5) ముఖ సౌందర్యయోగాలు

    6) శరీరాన్ని మెరిపించే పదార్థాలు

    100 రకాల రోగాలు నివారణోపాయాలు

    1. అజీర్ణము

    1) కరక్కాయ చూర్ణము, సైంధవలవణము సమభాగములుగా కలుపుకొని పూలకు పావు తులము (3 గ్రాములు) ఉదయము మరియు సాయంత్రము భోజనము తరువాత సేవించిన అన్ని రకముల అజీర్ణ రోగములు శమించును.

    2) పచ్చి అరటికాయను ముక్కలు కోసి ఎండించి పొడిచేసి 1 నుండి 2 గ్రాముల పొడిని కొద్దిగా ఉప్పు కలిపి సేవించిన అజీర్ణము, పులిత్రేపులు గల అగ్నిమాంద్యము హరించును.

    2. అతిదాహము

    1) కొన్ని చలువ మిరియాలను నోటిలో వేసుకొని చప్పరిస్తే ఎన్ని నీళ్ళు త్రాగినా ఆగని దప్పిక తగ్గిపోవును.

    2) ధనియాలు కషాయముగా కాచి, 20 నుండి 30 మి.లీ. కషాయములో తగినంత పంచదార కలుపుకొని త్రాగుచుండిన అతి దాహము హరించును.

    3. అరుచి

    1) ఉప్పు మరియు అల్లము కలిపి ప్రతిరోజూ అన్నము తినేముందు తీసుకోవాలి.

    2) ఎండు ద్రాక్ష పండ్లు, కరక్కాయ మరియు కండశర్కర సమభాగములుగా తీసుకొని మెత్తగా దంచి పొడివలె చేసి ఉంచుకొనవలెను. 2 నుండి 4 గ్రాములు పొడిని గోరువెచ్చని నీళ్ళతో దినములో రెండు సార్లు తీసుకొను చుండిన నోటిలో అరుచి తగ్గిపోయి ఆకలి పెరుగును.

    4. అర్శస్సు లేదా అర్శమొలలు

    మొలల వ్యాధి

    1) ఆవువెన్న మరియు నువ్వులు సమానముగా కలిపి ప్రతిరోజూ తినుచున్న యెడల

    మూల వ్యాధి నశించును. ఈ విధముగా ప్రతిరోజూ రెండుపూటలా ఒక వారం రోజుల పాటు తినవలెను.

    2) ఆవు నెయ్యిని ఒక టీ స్పూను, ఒక గ్లాసు ఆవుపాలలో కలిపి ప్రతిరోజూ త్రాగుచున్న యెడల మొలలు ఊడి పడిపోవును.

    5. ఆకలి తగ్గిపోవుట

    1) నేలతాడిగడ్డల చూర్ణము, శొంఠి చూర్ణములును సమభాగములుగా కలిపి పూటకు చేడెత్తు (2 గ్రాములు) చొప్పున వేడినీళ్ళు అనుపానముతో రోజుకు రెండుపూటలా సేవించవలెను.

    6. ఉబ్బసము

    1) చక్కెరకేళీ అరటిపండును కొద్దిగా గోమూత్రములో కలిపి త్రాగించిన ఉబ్బసవేగము వెంటనే ఉపశమించును.

    2) పరిశుద్ధమైన వేపనూనె 5 నుండి 10 చుక్కలు తమలపాకులో వేసుకొని రోజు

    ఒకటి నుండి రెండు సార్లు తినుచుండిన వారము రోజులలో ఉబ్బసము తగ్గిపోవును.

    3) కుంకుడు గింజలోని పప్పు ప్రతినిత్యమూ తినుచుండిన ఉబ్బసవ్యాధి నిరోధించబడును.

    4) పరగడుపున కాఫీ కషాయము లేక నిత్యమూ టీ త్రాగుచున్న యెడల ఉబ్బసము

    హరించును.

    5) పచ్చి జిల్లేడు పూవులు సమానముగా నల్ల మిరియాలు కలపి మెత్తగా నూరి 3 గురిగింజలెత్తు (400 మి.గ్రా.) మాత్రలు చేసి ఎండించవలెను. వీటిని పూటకొక మాత్ర చొప్పున ఉదయము, సాయంత్రము సేవించిన యెడల ఉబ్బసము నిస్సందేహముగా నశించును.

    7. ఋతుశూల

    1) చెంగల్వ కోష్టు వేళ్ళను నాలుగు రెట్ల నీళ్ళలో సగము మిగులునట్లుగా కాచి వడగట్టి 4 నుండి 5 చుక్కలు చెవులలో వేసిన ముట్టునొప్పి హరించి పోవును.

    8. ఎక్కిళ్ళు

    1) వండిన ఆముదములో కొంచెము పసుసుతో చేసిన కుంకుమ కలిపి నాలుకకు రాసిన యెడల ఎక్కిళ్ళు కట్టును.

    9. కడుపుబ్బరము

    1) ఒక గ్రాము సైంధవలవణము, ఐదు గ్రాములు అల్లము కలిపి ప్రతిరోజూ ఉదయము, సాయంత్రము సేవించిన కడుపుబ్బరము శమించును.

    10. కడుపులో నల్లదబ్బ పెరుగుట - (ప్లీహైదరము)

    1) బాగుగా పండిన మామిడి పండ్ల రసములో కొంచెము తేనె కలుపుకొని త్రాగుచున్న ప్లీహూదరము హరించును.

    11. కడుపులో విషపునీరు పెరుగుట - (జలోదరము)

    1) పిప్పళ్ళు ఒక తులము (12 గ్రాములు), మరియు సైంధవలవణము పావు తులము (3 గ్రాములు), తియ్యటి మజ్జిగ పావుశేరు (పావు లీటరు) కలిపి ప్రతిరోజూ ఉదయము ఒక మోతాదుగా పుచ్చుకొనవలెను. ఈ విధముగా ఒక

    Enjoying the preview?
    Page 1 of 1