Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Srimannarayaniyam Slokalu - Bhavalu
Srimannarayaniyam Slokalu - Bhavalu
Srimannarayaniyam Slokalu - Bhavalu
Ebook809 pages3 hours

Srimannarayaniyam Slokalu - Bhavalu

Rating: 3 out of 5 stars

3/5

()

Read preview

About this ebook

Sree Chakra Publishers had published many spiritual, puranam and stotram books in Telugu.
LanguageTelugu
Release dateSep 21, 2020
ISBN6580306100970
Srimannarayaniyam Slokalu - Bhavalu

Read more from Sree Chakra Publishers

Related to Srimannarayaniyam Slokalu - Bhavalu

Related ebooks

Reviews for Srimannarayaniyam Slokalu - Bhavalu

Rating: 3 out of 5 stars
3/5

1 rating0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Srimannarayaniyam Slokalu - Bhavalu - Sree Chakra Publishers

    http://www.pustaka.co.in

    శ్రీమన్నారాయణీయం

    (శ్లోకాలు - భావాలు)

    srimannarayaniyam

    (Slokalu - Bhavalu)

    Author:

    శ్రీ చక్ర ప్రచురణకర్తలు

    Sree Chakra Publishers

    For more books

    http://www.pustaka.co.in/home/author//sree-chakra-publishers-novels

    Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.

    All other copyright © by Author.

    All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.

    శ్రీమన్నారాయణీయం

    శ్లోకాలు - భావాలు

    సంస్కృత మూలం

    నారాయణ భట్టతిరి

    జిల్లెళ్ళమూడి అమ్మ

    మాతృశ్రీ అనసూయాదేవి ఆశీస్సులతో...

    భావం: డాక్టర్ జయంతి చక్రవర్తి

    గురువాయూర్ శ్రీకృష్ణుడు

    అభివందనం

    శ్రీ వత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితమ్ |

    శంఖచక్రధరం దేవం, కృష్ణం వందే జగద్గురుమ్ ||

    మహాభక్తకవి కేరళి నివాసి నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయం మహిమాన్వితమైన స్తుతికావ్యం. భాగవతసారంగా ప్రసిద్ధి చెందిన ఈ నారాయణీయాన్ని కేరళ ప్రాంతంలో నిత్యం పారాయణ చేస్తారు. జగద్గురువైన శ్రీకృష్ణుడి లీలావిశేషాలని సరళంగా సంస్కృత భాషలో వర్ణించాడు నారాయణ భట్టతిరి. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో తనకున్న దీర్ఘవ్యాధిని సైతం పోగొట్టుకున్నాడు. ఆనాటి నుంచీ నేటివరకు కేరళలో నారాయణీయాన్ని పారాయణ చేసి ఎందరో తమతమ వ్యాధుల్ని పోగొట్టుకున్నారు. ఇందుకు ఎన్నో నిదర్శనాలు కూడా కనిపిస్తున్నాయి. మన తెలుగువారు కూడా ఈ మహిమాన్వితమైన శ్రీమన్నారాయణీయాన్ని పఠించి, శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందాలనే సదుద్దేశంతో గొల్లపూడి వీరాస్వామి సన్ పబ్లికేషన్ వారు ఈ గ్రంథాన్ని ముద్రించాలని సంకల్పించారు. అందుకు వారు సర్వదా అభినందనీయులు.

    గీతా ప్రెస్ వారు, శ్రీరామకృష్ణ మిషన్ వారు ప్రచురించిన శ్రీమన్నారాయణీయం గ్రంథం ఆధారంగా ఇందులోని భావాలన్నీ సరళమైన వ్యవహార భాషలో రచించటం జరిగింది. ఈ గ్రంథంలో అనుబంధంగా శ్రీ గురువాయూర్ దివ్యస్థలం విశేషాలని కూడా అందించాము. అవకాశమున్న వారు గురువాయూర్ క్షేత్రాన్ని దర్శించండి. అందరూ శ్రీమన్నారాయణీయాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుడి దివ్యానుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందాలని ఆశిస్తున్నాను.

    నమస్కారాలతో బుధజనవిధేయుడు

    డా॥ జయంతి చక్రవర్తి

    శ్రీమన్నారాయణీయం పారాయణా విధానం

    దీర్ఘవ్యాధులతో బాధపడేవారు భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణీయాన్ని | 11/21/40 రోజుల పాటు రోజుకి ఒకసారి చొప్పున పఠిస్తే స్వామి అనుగ్రహంతో | | వ్యాధి నివారణ జరుగుతుంది. ఇందులోని సంస్కృత శ్లోకాలు చదవలేనివారు | | వాటి క్రింద ఇచ్చిన తెలుగు భావాలను చదివినప్పటికీ పారాయణఫలం లభిస్తుంది. |

    నారాయణ భట్టతిరి -

    మేల్ పత్తూర్ నారాయణ భట్టతిరి :

    మేల్ పత్తూర్ నారాయణ భట్టతిరి కేరళప్రాంత నివాసి. ఈయన క్రీ||శ|| (1559-1645) కాలానికి చెందినవాడు. ఈయన చిన్నతనం నుంచే వేదవేదాంగాలను అభ్యసించాడు. వ్యాకరణంలో దిట్ట. వ్యాకరణంలో ఈయన వ్రాసిన 'ప్రక్రియాస్వరూపం' ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇంకా 'అపాణినీయ ప్రమాణం'. 'ధాతుకావ్యం ', వంటి వ్యాకరణ, గ్రంథాలు, భారత, రామాయణ, భాగవత కథాంశాలతో కూడిన చంపూ కావ్యాలు, 'శ్రీపాదస్తుతి', 'నారాయణీయం' వంటి స్తుతి కావ్యాలు రచించారు. వీరి

    రచనలో అన్నిటికన్నా తలమానికమైనది, మహిమాన్వితమైనది. శ్రీమన్నారాయణీయం.

    జన్మస్థలం :

    నారాయణ భట్టతిరి కేరళలోని మేల్ పత్తూర్ గ్రామంలో జన్మించారు. ఇది తిరూర్ కి సమీపంలో వున్న తిరునావయ పట్టణానికి దగ్గరలో వుంది. తిరూర్ ప్రాంతం 'మమాకం' ఉత్సవానికి ప్రసిద్ధి. నారాయణ భట్టతిరి తండ్రి మధురదత్తన్. తండ్రి దగ్గరే ఈయన సంస్కృత సాహిత్యంలోని విశేషాలు నేర్చుకున్నాడు. అలాగే మాధవుడనే గురువు దగ్గర ఋగ్వేదాన్ని, దామోదర అనే పండితుడి దగ్గర తర్కశాస్త్రాన్ని, అచ్యుత దొషాత్రి అనే మహాపండితుడి దగ్గర వ్యాకరణాన్ని నేర్చుకున్నాడు. ఇలా అన్ని శాస్త్రాలు నేర్చుకున్న భట్టాత్రి 16 సంవత్సరాల వయసు వచ్చేసరికే పండితుడయ్యాడు. ఈయన తన వ్యాకరణ గురువైన అచ్యుతపిషాత్రి మేనకోడలిని వివాహం చేసుకుని, తిరూర్ సమీపంలోని, త్రికండియూర్ ప్రాంతంలో స్థిరపడ్డాడు.

    కేరళలో మాధవుడిచేత స్థాపించబడిన సంగమగ్రామ పాఠశాలలో ఆఖరి గణితశాస్త్రజ్ఞుడు నారాయణ భట్టతిరి. ఈయన పూర్వ మీమాంస, ఉత్తరమీమాంసలకి వ్యాఖ్యాన గ్రంథాలు కూడా రచించాడు.

    నారాయణీయం :

    నారాయణ భట్టతిరి రచించిన సంస్కృత స్తుతికావ్యం శ్రీమన్నారాయణీయం. ఇందులో మొత్తం 1036 శ్లోకాలున్నాయి. ఇది వంద దశకాలుగా విభాగించబడింది. ఒక్కో దశకంలో పది లేక 12 వరకూ శ్లోకాలుంటాయి. ఈ పవిత్ర గ్రంథం క్రీ|శ|| 1586లో రచించబడింది. ఇది 18000 శ్లోకాలతో వున్న భాగవత పురాణానికి సంగ్రహ రూపం.

    నారాయణ భట్టతిరి గురువు పీషాత్రి కీళ్ళవాతంతో బాధపడేవాడు. గురువుగారి బాధను చూసి చలించిపోయిన భట్టతిరి గురువుగారి వ్యాధిని తాను స్వీకరించాడు. అదే ఆయనకి తను ఇచ్చే గురుదక్షిణగా భావించాడు. ఆవిధంగా తనకి సంక్రమించిన కీళ్ళవాత వ్యాధిని పోగొట్టుకోవాలని గురువాయూరు క్షేత్రానికి చేరి, అక్కడి స్వామి శ్రీకృష్ణుడి మీద రోజుకి పదిశ్లోకాలు అనగా ఒక దశకం చొప్పున, వందరోజుల్లో వేయికి పైగా శ్లోకాలతో స్వామిని స్తుతించాడు. ప్రతి దశకం చివరి శ్లోకంలో తనకున్న వాతవ్యాధిని తొలగించమని స్వామిని దీనంగా ప్రార్థించాడు. ఈ విధంగా నారాయణ భట్టతిరి వంద దశకాలనీ పూర్తిచేసాడు. చివరిదశకం పూర్తయ్యేసరికి ఆయనకున్న వాతరోగం సమూలంగా తొలగిపోయింది. వేణుగోపాలస్వామి రూపంలో స్వామి ఆయనకి దర్శనమిచ్చాడు.

    శ్రీమన్నారాయణీయం

    విషయసూచిక

    ఓం నమో నారాయణాయ

    శ్రీ నారాయణభట్ట తిరి రచించిన

    శ్రీమన్నారాయణీయం

    గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిమ్ |

    వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుమ్ ||

    ప్రధమస్కంధ పరిచ్ఛేదం - 1వ దశకం

    భగవంతుడి మహిమ

    సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం ,

    నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహసేణ నిర్భాస్యమానమ్ |

    అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్త్వం

    తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానామ్ || 1

    సచ్చిదానంద స్వరూపుడు, జ్ఞాని, దేశకాల వస్తువులన్నిటికీ అతీతంగా వుండేవాడు.సర్వత్రా వ్యాపించినవాడు నిత్యముక్తుడు, సాటిలేని గొప్పదనం కలిగినవాడు పరమాత్మ. అలాంటి పరమాత్ముణ్ణి గురించి చెప్పాలని వేదాల్లోని లక్షలాది అనువాకాలు ప్రయత్నించినా పూర్తిగా ఆయన స్వరూపాన్ని వర్ణించలేకపోయాయి. మహాయోగులు కూడా ఎంతోకాలం కఠినమైన తపస్సు చేసి గాని, ఆ పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకుని పరమపురుషార్థమైన మోక్షాన్ని పొందలేకపోతున్నారు. ఇలా ఎంతో గొప్పవాడుగా చెప్పబడ్డ ఆ పరబ్రహ్మ భూలోకంలోని గురువాయూరు క్షేత్రంలో సగుణుడుగా ఆకారాన్ని ధరించి 'నారాయణుడు' అనే పేరుతో విరాజిల్లుతూ భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఆ గురువాయూరు వాసులు ఎంత భాగ్యవంతులో కదా!

    ఏవం దుర్లభ్యవస్తున్యపి సులభతయా హస్తలజే యదన్యత్

    తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయమ్ |

    ఏతే తావద్వయం తు స్థిరతరమనసా విశ్వపీడాపహత్యై

    నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవాశ్రయామః ||

    ఇప్పుడు చెప్పిన పరబ్రహ్మ జీవులందరి మీద ఎంతో దయతో చేతికి అందేంత దగ్గరగా గురువాయూరులో వెలిసాడు. నిజానికి ఆయన్ని చేరుకోవటం ఎంతో దుర్లభం. నారాయణ పరమాత్మ ఇంత సులభంగా భక్తులందరికీ అందుబాటులో వుంటే, అజ్ఞానులైన మానవులు మనసా, వాచా, కర్మణా ఇతరులందర్నీ సేవిస్తూ తమ కాలాన్ని వ్యర్ధం చేసుకుంటున్నారు. ఇదెంతో విచారకరం. మన తాపత్రయాల్ని తొలగించేవాడు. సకల ప్రాణులకీ ఆత్మ స్వరూపుడు. ఈ గురువాయూరులో వెలసిన శ్రీమన్నారాయణుడే కనుక అందరం స్థిరచిత్తంతో నారాయణుణ్ణి ఆశ్రయిద్దాం.

    సత్త్వం యత్తత్సరాభ్యామపరికలనతో నిర్మలం తేన తావత్

    భూతైర్భూతేంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యమ్ |

    తత్స్వచ్ఛత్వాద్యదచ్ఛాదితపరసుఖచిద్దర్భనిర్భాసరూపం

    తస్మిన్జన్యా రమంతే శ్రుతిమతిమధురే సుగ్రహే విగ్రహే తే || 3

    నారాయణా! నీ దివ్య దేహం శుద్ధ సత్త్వగుణంతో నిండివుంటుంది. నీలో రజోతమో గుణాలు ఏ కొంచెం కూడా కనబడవు. ఎంతో నిర్మలమైన నీ శరీరం పంచభూతాత్మకమైనది. పరమపావనమైనదని వేదవ్యాస మహర్షి ఎన్నోసార్లు చెప్పారు. ఆయన చెప్పిన విధంగా సచ్చిదానంద స్వరూపంతో విలసిల్లే నీరూప సౌందర్యాన్ని గురించి విన్నా, స్మరించినా, ఎంతో ఆనందం కలుగుతుంది. ఇంతటి ఆనందాన్ని కలిగించే నిన్ను ఈ గురువాయూరులో భక్తులందరూ సులభంగా దర్శించుకోగలుగుతున్నారు. అదృష్టవంతులైన వాళ్ళు మాత్రమే నిన్ను దర్శిస్తూ, నీ నామాన్ని స్మరిస్తూ దివ్యానందాన్ని పొందుతారు.

    నిష్కంపే నిత్యపూర్లే నిరవధిపరమానందపీయూషరూపే

    నిర్లీనానేకముక్తావళి సుభగతమే నిర్మల బ్రహ్మసింధౌ |

    కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్త్వమాహూస్తదాత్మా

    కస్మాన్నో నిష్కళస్యం సకల ఇతి వచస్త్వత్కలా స్వేవ భూమన్ || 4

    పరబ్రహ్మ స్వరూపం అపారమైన సముద్రం లాంటిది. సముద్రానికి, పరబ్రహ్మానికి మధ్య ఎన్నో పోలికలు, భేధాలు వున్నాయి. పోలికలు గురించి చెప్పాలంటే పరబ్రహ్మ - సముద్రం రెండూ, నిశ్చలంగా వుంటాయి. నిత్యంగా పూర్ణంగా వుండేది. పరమానందం అనే అమృతంతో నిండివున్నది అయిన పరబ్రహ్మ అనే సముద్రంలో, మోక్షాన్ని పొందిన జీవులంతా ముత్యాలుగా, మణులుగా ప్రకాశిస్తూ వుంటారు. ఆవిధంగా మోక్షం పొందిన జీవులతో పరబ్రహ్మ అనే సముద్రం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆ సముద్రంలో పరిశుద్ధమైన సత్వగుణం అలలలాగా చలిస్తూ వుంటుంది. నారాయణా! నీవు శుద్ద సత్త్వ స్వరూపుడివి. ఎలాంటి కళలు లేకపోయినా ప్రకాశించగలవు. కానీ మా అందరికోసం అన్ని కళల్ని ధరించి దివ్య మంగళాకారంతో మాకు దర్శనమిస్తున్నావు. నీవెంత గొప్ప హృదయం గలవాడవు స్వామీ!

    నిర్వ్యాపారో2పి నిష్కారణమజ! భజసే యత్రియామీక్షణాఖ్యాం

    తేనైనోదేతి లీనా ప్రకృతిరసతికల్పా . కల్పాదికాలే |

    తస్యాస్సంశుమంశం కమపి తమతిరోధాయకం సత్త్వరూపం

    సత్త్వం ధృత్వా దధాసి స్వమహిమవిభవాకుంఠ! వైకుంఠ! రూపమ్ || 5

    పరంధామా! అయస్కాంతం దగ్గరున్న ఇనుము దానికి ఆకర్షించబడ్డట్టు నీదయా కటాక్ష వీక్షణాల ప్రభావంతో నీలోనే లీనమైపోయిన 'ప్రకృతి', సృష్టి ప్రారంభకాలంలో అనగా కల్పం ప్రారంభంలో వ్యక్తమవుతోంది. దానినే మాయ అంటారు. ఆమాయకి సంబంధించిన ఆచరణరహితమైన పరిశుద్ధమైన అంశనే 'సత్త్వం' అంటారు. స్వామీ నీవు ఎలాంటి కర్మల్నీ ఆచరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీవు ప్రకృతికి అతీతుడివి. నీ భక్తులందర్నీ అనుగ్రహించటానికి నిన్ను నీవు వ్యక్తపరుచుకుంటూ, అకుంఠితమైన వైకుంఠ రూపం ధరించి వెలుగొందుతున్నావు.

    తత్తే ప్రత్యగ్రధారాధర లలితకలాయావలీకేలికారం

    లావణ్యస్యైకసారం సుకృతిజనదృశాం పూర్ణపుణ్యావతారమ్ |

    లక్ష్మీ నిశ్శంకలీలానిలయనమమృతస్యందసందోహమంతః

    సించత్కంచింతకానాం వపురనుకలయే మారుతాగారనాథ! || 6

    ఓ గురువాయురప్పా! నారాయణా! నీదివ్యరూపం కొత్త మేఘంలాగా ఎంతో అందమైనది. అందమంతా రాశిపోసినట్టుగా కనిపించే నీ దివ్యశరీరం కలువపూలలగా భక్తుల్ని ఆనంద పరవశుల్ని చేస్తుంది. పుణ్యాత్ములకి పుణ్యఫలాన్ని ప్రసాదించే ఆ దేహం లక్ష్మీదేవి స్వేచ్ఛగా నివసించే దివ్య ప్రదేశం. మధురాతి మధురమైన నీ సుందరరూపాన్ని ఎప్పుడూ భక్తిగా ధ్యానించే వారి మనసుల్లో అమృతధారలు కురుస్తాయి. అలాంటి జగన్మోహనకరమైన నీ రూపాన్నే నేను సదా ధ్యానిస్తాను.

    కష్టా తే సృష్టిచేష్టా బహుతరభవభేదావహా జీవభాజాం

    ఇత్యేవం పూర్వమాలోచితమజిత ! మయా నైవమద్యాభిజానే |

    నోచేట్టేవాః కథం వా మధురతరమిదం త్వద్వపుశ్చిద్రసార్థం

    నేత్రైః శ్రోతైశ్చ పీత్వా పరమరససుధాంభోధి పూరే రమేరన్ || 7

    స్వామీ! నీవు చేసిన సృష్టి వల్ల జీవులందరికీ సంసార బంధాలు ఏర్పడి తద్వారా వారందరికి కష్టాలు, బాధలు కలుగుతాయని నా అజ్ఞానంతో ముందు భావించాను. అది నిజం కాదని తెలుసుకున్నాను. జీవులందరి మీద నీకు అపారమైన దయ వుంది. మాకోసం ఆకారాన్ని ధరించిన నీరూపం ఎంతో అందమైనది. అంతేకాదు దయాపూరిత మైనది కూడా. అందుకే జీవులంతా తమ కళ్ళతో నిన్ను చూస్తూ, నీ దివ్యలీలల్ని అందంగా వర్ణిస్తూ, చెవులారా వింటూ, ఆనందడోలికల్లో ఎందుకు తేలిపోకుండా వుంటారు!

    నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురసైరనభ్యర్థితాన -

    వ్యర్థాన్ కామానజసం వితరతి పరమానన్దసాంద్రాం గతిం చ |

    ఇత్తం నిశ్శేషలభ్యో నిరవధికఫల: పారిజాతో హరే ! త్వం

    క్షుద్రం తం శక్రవాటిద్రుమమభిలషతి వ్యర్ధమర్ధివజో2 యమ్ || 8

    నారాయణా! ఈ సృష్టిలోని ప్రాణులందరిలో అంతరాత్మగా వుండేది నీవే. అందుకే భక్త సులభుడిగా నిన్ను స్మరించే వారికి ఎప్పుడూ సాక్షాత్కరిస్తుంటావు. వాళ్ళందరూ ఎలాంటి కోరికలు కోరకపోయినా, వారి అవసరాలకి తగిన వరాలిచ్చి ఆదుకుంటావు. అంతేనా దుర్లభమైన మోక్షాన్ని కూడా వారికి ప్రసాదిస్తావు. కనుక నీవు సాక్షాత్తు కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షమే. కొందరు అజ్ఞానులు నీ గొప్పతనాన్ని గుర్తించక కల్పవృక్షాన్ని ఆశ్రయిస్తారు. అది ఇచ్చే ఫలితం చాలా చిన్నది. నీవిచ్చే ప్రతిఫలం అపరిమితమైనది. ఇది తెలియక వారంతా తమ కాలాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు. నీ ముందు ఆ కల్పవృక్షం గొప్పతనం ఎంత?

    కారుణ్యాత్కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్యం విశేషాత్

    ఐశ్వర్యాదీశతే2 న్యే జగతి పరజనే స్వాత్మనో2 పీశ్వరస్త్వమ్ |

    త్వయ్యుచ్చైరారమంతి ప్రతిపదమధురే చేతనాః స్పీతభాగ్యాః

    త్వం చాత్మారామ ఏవేత్యతులగుణగణాధార!శౌరే! నమస్తే || 9

    స్వామీ! శ్రీహరీ! బ్రహ్మాది దేవతలంతా మోక్షం తప్ప, ఇతర కోరికలన్నీ తీర్చగలరు. నీవు మాత్రం అన్ని కోరికలతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తావు. కనుక వారందరికీ నీవే ప్రభువు. నీవే సర్వేశ్వరుడువు. ఇక నిన్ను ఎవరు శాసించగలరు. నీ పరబ్రహ్మ రూపం ప్రతిక్షణం మనసుకి మధురానుభూతిని అందిస్తుంది. ధన్యులైన వాళ్ళు మాత్రమే ఆ ఆనందాన్ని పొంది ఆనందిస్తూంటారు. అనంత కళ్యాణ గుణాలకి ఆధారమైన ఆత్మారాముడైన ఓ నారాయణా! నీకు నమస్కారం.

    ఐశ్వర్యం శంకరాదీశ్వరవినియమనం విశ్వతేజోహరాణాం

    తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్సృహైశ్చోపగీతమ్ |

    అంగాసంగా సదా శ్రీరఖిలవిదసి న క్వాపి తే సంగవార్తా

    తద్వాతాగారవాసిన్ ! మురహర! భగవచ్చబముఖ్యాశ్రయో2 సి || 10

    ఓ మురహరా! అధికారం అనే ఐశ్వర్యం, అంతులేని పరాక్రమం, పవిత్రమైన కీర్తి, సకల సంపదలు, సర్వజ్ఞత్వం, వైరాగ్యం అనే ఆరు దివ్య గుణాలు వున్నవాడే భగవంతుడు. ఈ గుణాలన్నీ కలిగిన నీవు బ్రహ్మాది దేవతలందర్నీ నియమించగల ప్రభువువి. నీ దివ్యతేజస్సు బ్రహ్మరుద్రాదుల తేజస్సు కన్నా గొప్పది. నిర్మలమైన నీకీర్తిని మహర్షులంతా నిత్యం స్మరిస్తుంటారు. సకల సంపదల రూపమైన లక్ష్మీదేవి నిన్నెప్పుడూ ఆశ్రయించే వుంటుంది. సర్వం తెలిసిన వాడివీ, దేని మీద కాంక్ష లేనివాడివీ నీవే. కాబట్టి 'భగవంతుడు' అనే పేరుకి నీవు తగినవాడివి ప్రభూ!

    మొదటి దశకం సమాప్తం

    2వ దశకం

    భగవంతుడి రూప భక్తి మాహాత్మ్యం

    సూర్యస్సర్దికిరీటమూర్ద్వతిలకప్రోద్భాసి ఫాలాంతరం

    కారుణ్యాకులనేత్రమార్దహసితోల్లాసం సునాసాపుటమ్ |

    గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్జ్వలత్కౌస్తుభం

    త్వద్రూపం వనమాల్యహారపటలశ్రీవత్సదీపం భజే  1

    స్వామీ! సూర్యుడి తేజస్సు కన్నా నీ కిరీటం ఎంతో గొప్పగా వెలిగిపోతోంది. నీ నుదుటి మీదున్న కస్తూరి తిలకం ఎంతో మనోజ్ఞంగా వుంది. నీ చల్లని చూపులు జీవులందరి మీద కరుణని కురిపిస్తున్నాయి. నీ చిరునవ్వు ఎంతో ఆహ్లాదంగా ప్రేమతో నిండివుంది. నాసిక ఎంతో అందంగా వుంది. అలాగే నీ బుగ్గల మీద, చెవికి పెట్టుకున్న మకర కుండలాలు ప్రతిఫలిస్తూ మనోహరంగా వున్నాయి. నీవు కంఠంలో ధరించిన కౌస్తుభమణి అందమైన కాంతుల్ని వెదజల్లుతోంది. ఈ విధంగా అపూర్వమైన పవిత్రమైన, వనమాలలు, దివ్య మణిహారాలు, శ్రీవత్స చిహ్నం వంటివి గుండెలమీద ధరించిన శ్రీకృష్ణా, నీ దివ్యరూపాన్నే నేను నిత్యం ధ్యానిస్తాను.

    కేయూరాంగదకం కణోత్తమమహారత్నాంగులీయాంకిత

    శ్రీమద్భాహుచతుష్క సంగతగదా శంఖారిపంకేరుహామ్ |

    కాంచిత్కాంచనకాంచిలాంఛితలసత్పీతాంబరాలంబినీం

    ఆలంబే విమలాంబుజద్యుతిపదాం మూర్తిం తవారిచ్ఛిదమ్ 2

    ప్రభూ! శంఖం, చక్రం, గద, పద్మం అనేవి నీ నాలుగు చేతుల్లో అమరి దివ్యశోభల్ని వెదజల్లుతున్నాయి. అలాగే నీవు ధరించిన భుజకీర్తులు, చేతికి ధరించిన దండ కడియాలు, వేలి వుంగరాలు కూడా గొప్పగా ప్రకాశిస్తున్నాయి. నీ నడుముకి ధరించిన ఆభరణాలు, పట్టు పీతాంబరాలు అందంగా వెలుగొందుతున్నాయి. ఎంతో పవిత్రమైన నీ దివ్యపాదాలు నిర్మలంగా కమలాల కాంతులీనుతున్నాయి. భక్తుల బాధల్ని రూపుమాపే ఇలాంటి నీ దివ్యమంగళ రూపాన్నే నేను ఆశ్రయిస్తాను.

    యత్రైలోక్యమహీయసో2పి మహితం సమ్మోహనం మోహనాత్

    కాంతం కాంతినిధానతో పి మధురం మాధుర్యధుర్యాదపి |

    సౌందర్యోత్తరతో 2 పి సుందరతరం త్వద్రూపమాశ్చరతో -

    ప్యాశ్చర్యం భువనే న కస్య కుతకం పుష్ణాతి విక్షే! విభో! 3

    ఓ మహావిష్ణూ! ముల్లోకాలలో వున్న అందరి కన్నా గొప్పది, మోహాన్ని కలిగించే వాటన్నిటి కన్నా ఎక్కువ మోహాన్ని కలిగించేది, కాంతివంతమైన వాటికన్నా అదిక కాంతి కలిగినది, మధురమైన వాటికన్నా అధికంగా మధురమైనది, అందమైన వస్తువుల కన్నా అందమైనది, ఆశ్చర్యాన్ని కలిగించే వాటన్నిటికన్నా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేది నీదివ్యరూపం. అలాంటి జగన్మోహకారుడవైన నిన్ను దర్శించాలని ఎవరు కోరుకోరు. ఎవరు కుతూహలపడరు?

    తత్తాదృజ్మధురాత్మకం తవ వపుః సంప్రాప్య సంపన్మయీ

    సా దేవీ పరమౌత్సుకా చిరతరం నాస్తే స్వభశ్లేష్వపి |

    తేనాస్యా బత కష్టమచ్యుత! విభో! త్వద్రూపమానోజ్ఞక -

    ప్రేమ సైర్యమయాదచాపలబలాచ్చాపల్యవార్తో దభూత్ 4

    స్వామీ! సకల సంపదలకీ ఆలవాలమైన లక్ష్మీదేవి ఎంతో మధురమైన నీ సుందర రూపానికి ఆకర్షితురాలై, నిన్ను పతిగా పొందింది. అందుకే లక్ష్మీ స్థిరంగా ఎవ్వరి దగ్గరా వుండడం లేదు. నీ మీద అంతులేని ప్రేమ కలిగిన కారణంగా ఆమె ఆవిధంగా అస్థిరంగా వుంటోంది. అది చూసి లోకులందరూ దేవిని 'చపల' అని అంటున్నారు.

    లక్ష్మీస్తావకరామణీయకహృతైవేయం పరేష్వప్రే

    త్యస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే! |

    యే త్వద్ధ్యానగుణానుకీర్తనరసాసక్తా హి భక్తా జనాః

    తేష్వేషా వసతి స్థిరై దయిత ప్రస్తావదత్తాదరా 5

    ఓ లక్ష్మీపతీ! నారాయణా! నీ దివ్యరూప గుణగణాలు చూసి నీ మీద అనురాగం పెంచుకున్న లక్ష్మీదేవి నీ దగ్గర స్థిరంగావుంది. అలాగే నిన్ను నీ గుణగణాల్ని భక్తి శ్రద్ధలతో కీర్తించే భక్తుల దగ్గర కూడా స్థిరంగానే వుంటోంది. అంటే నీ భక్తుల కాని వారి దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా వుండదని భావించాలి.

    ఏవంభూతమనోజ్ఞతా నవసుధానిష్యందసందోహనం

    త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతామ్ |

    సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమంచాయత్యంగకం

    వ్యాషించత్యపి శీతబాష్పవిసరైరానందమూర్చోద్భవైః 6

    స్వామీ! నీ దివ్య సుందరరూపం ఎంతో రసానందాన్ని కలిగించే అమృతాన్ని చిందిస్తుంది. పరమానందభరితమైన నీ రూపగుణగానం వినే వారి హృదయాల్ని హరించి బుద్ధిని ప్రేరేపించి వెంటనే మత్తు కలిగిస్తుంది. అంతేనా! భక్తుల శరీరానికి గగుర్పాటు కలిగించి, ఆనంద పారవశ్యంతో వారి కళ్ళు వర్షించేలా చేసి, ఆ ఆశ్రు ధారలతో వారి శరీరమంతా తడిసిపోయేలా చేస్తుంది.

    ఏవంభూతతయా హి భక్త్యభిహితో యోగస్సయోగద్వయాత్

    కర్మజ్ఞానమయాద్ భృశోత్తమతరో యోగీశ్వరెర్గీయతే |

    సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమప్రకర్ణాత్మికా

    భక్తిర్నిశ్ర్మమమేవ విశ్వపురుషైర్లభ్యా రమావల్లభ! 7

    ఓరమావల్లభా! అందం-ఆనందం కలిసిన దివ్యస్వరూపం నీది. నిన్ను చూడగానే సామాన్య భక్తులు కూడా ఎలాంటి శ్రమ లేకుండా నీ మీద భక్తి ప్రపత్తులు పెంచుకుంటారు. అందుకే కర్మ జ్ఞానయోగాల కన్నా భక్తియోగం గొప్పదని యోగీశ్వరులు చెబుతారు.

    నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మయోగాభిధమ్

    తదూరేత్యఫలం యదౌపనిషదజ్ఞానోపలభ్యం పునః |

    తత్త్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో !

    త్వత్ ప్రేమాత్మకభక్తిరేవ సతతం స్వాదీయసీ శ్రేయసీ 8

    స్వామీ! ధర్మశాస్త్రాల్లో నాలుగు వర్ణాలవారికే చెప్పబడ్డ నిత్య నైమిత్తిక కర్మలని విధిగా ఆచరిస్తూ వాటి ఫలితాలమీద ఎలాంటి ఆసక్తి లేకపోవటాన్ని కర్మయోగం అంటారు. ఇలాంటి కర్మయోగాన్ని ఆచరిస్తే ఫలితం చాలా ఆలస్యంగా వస్తుంది. ఇక ఉపనిషత్తుల గురించి చెప్పాలంటే వాటిలో చెప్పిన బ్రహ్మజ్ఞానం పొందటం సామాన్యులకు సాధ్యం కాదు. చాలా కష్టపడాలి. ఈ రెండింటినీ విచారించి చూస్తే జ్ఞాన, కర్మయోగాలకన్నా నీమీద గాఢమైన విశ్వాసాన్ని ప్రేమను కలిగివుండే భక్తియోగమే ఎంతో సులభమైనది, శ్రేయస్సు కలిగించేది అని తెలుస్తోంది.

    అత్యాయాసకరాణి కర్మపటలాన్యాచర్య నిర్యన్మలా

    బోధే భక్తిపథే ధవా ప్యుచితతామాయాంతి కిం తావతా |

    క్లిష్ట్యా తర్కపథే పరం తవ వపుర్ర్బహ్మాఖ్యమన్యే పునః

    చిత్తార్బత్వమృతే విచింత్య బహుబిస్సిధ్యంతి జన్మాంతం: 9

    నారాయణా! జీవులంతా నిత్యనైమిత్తిక కర్మలని క్రమం తప్పకుండా ఆచరించాలంటే ఎంతో కష్టం. అలా కష్టాల్ని పొందినప్పటికీ చలించక కర్మల్ని శ్రద్ధగా ఆచరించినవాళ్ళు తమ యోగ్యత ప్రకారం జ్ఞాన లేదా భక్తి మార్గంలోకి ప్రవేశిస్తున్నారు. మరి కొందరు ముందుగా జ్ఞానమార్గంలో ప్రవేశించి ఎన్నో కష్టాలు పడి, చివరికి ఆర్థపూరితమైన మనస్సుతో నీమీద భక్తిభావాన్ని పెంచుకుని మరోజన్మలో మాత్రమే పరబ్రహ్మవైన నిన్ను చేరుతున్నారు.

    త్వద్భక్తిస్తు కథారసామృతఝరీనిర్మజనేన స్వయం

    సిద్ధ్యంతీ విమలప్రబోధపదవీమకేశతస్తన్వతీ |

    సద్యస్సిద్దికరీ జయత్వయి విభో! సైవాస్తు మే త్వత్పద

    ప్రేమప్రౌఢరసార్ధతా ద్రుతతరం వాతాలయాధీశ్వర! 10

    కృష్ణమూర్తీ! నీదివ్యకథల్ని వింటే చాలు నిర్మలమైన జ్ఞానం కలుగుతుంది. ఆ కథారస ప్రవాహంతో మునిగితేనే చాలు నీ మీద అచంచలమైన భక్తి కలుగుతుంది. ఆ భక్తి వల్ల జీవుడు తాను కోరిన కోరికల ఫలాన్ని పొందగలుగుతున్నాడు. కనుక స్వామీ! నాకు నీ పాదాలమీద స్థిరమైన భక్తి కలిగి, నేను ఆనందామృతంలో మునిగి పరవశించేలా అనుగ్రహించు.

    రెండవ దశకం సమాప్తం

    3 వ దశకం

    భక్తి స్వరూప వర్ణన - భక్తి కోసం ప్రార్ధన

    పఠంతో నామాని ప్రమదభరసింధౌ నిపతితాః

    స్మరంతో రూపం తే వరద కథయంతో గుణకథాః |

    చరంతో యే భక్తాస్త్వయి ఖలు రమంతే పరమమూన్

    అహం ధన్యాన్ మన్యే సమధిగతసర్వాభిలషితాన్ 1

    గురువాయూరు నాథా! నీ భక్తులు నిత్యం నీ దివ్యనామాన్ని పఠిస్తూ, జపిస్తూ, నీ సుందరరూపాన్ని స్మరిస్తున్నారు. అలాగే మంగళ ప్రదమైన నీదివ్య కథలల్ని మధురంగా గానం చేస్తూ ఆనందంగా సంచరిస్తున్నారు. అలా ధ్యానించే నీ భక్తుల కోరికలన్నీ నీవు తీరుస్తావు. నీపై భక్తి వల్ల కోరికలు తీరిన భక్తులు ఎంతో ధన్యాత్ములని నేను భావిస్తాను.

    గదక్లిష్టం కష్టం తవ చరణ సేవారసభరే -

    2 ప్యనాసక్తం చిత్తం భవతి బత విష్ణో! కురు దయామ్ |

    భవత్పాదాంభోజస్మరణరసికో నామనివహాన్

    అహం గాయం గాయం కుహచన వివత్స్యామి విజనే 2

    విష్ణుదేవా! నేను ఎంతో భక్తితో నీ పాద పద్మాలని సేవించాలని అనుకున్నాను. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న నా మనసు నీమీద ఏకాగ్రత చూపలేకపోతోంది. ఏంచేయను? నామీద కొంచెం దయచూపితే చాలు నీదివ్య పాదపద్మాలని సేవించుకుంటూ, ఏకాంతంగా నీ నామాన్ని ప్రతిక్షణం ఆనందంగా గానం చేస్తుంటాను.

    కృపా తే జాతా చేత్ కిమివ న హి లభ్యం తనుభృతాం

    మదీయకేశౌఘ ప్రశమనదశా నామ కియతీ |

    న కే కే లోకే2 స్మిన్ననిశమయి శోకాభిరహితా

    భవద్భక్తా ముక్తాః సుఖగతి మసక్తా విదధతే 3

    కృష్ణా! నీ అనుగ్రహం వుంటే లోకంలో జీవులందరికీ సిద్ధించని మనోరథం వుంటుందా? ఎంతో దయామయుడవైన నీకు నారోగాన్ని తగ్గించటం చాలాచిన్న విషయం. నీ అనుగ్రహంతోనే ఎలాంటి కోరికలు లేకుండా నిర్మలమైన మనసుతో నిన్ను ధ్యానించే భక్తులు, ఎలాంటి బాధలు లేకుండా మోక్షాన్ని పొంది, శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు.

    ముని డా రూఢా జగతి ఖలు గూఢాత్మగతయో

    భవత్పాదాంభోజస్మరణవిరుజో నారదముఖాః |

    చరంతీశ! స్వైరం సతతపరినిర్మాతపరచిత్

    సదానందాద్వైతప్రసరపరిమగ్నా: కిమపరమ్ 4

    స్వామీ! రహస్యమైన ఆత్మజ్ఞానాన్ని కలిగిన నారదాది మునీశ్వరులు ఎందరో నిత్యం నీ పాద పద్మాలని ధ్యానిస్తుంటారు. వారు అలా ధ్యానించటం వల్లనే ఎలాంటి బాధలు లేకుండా సదానందభరితులై స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. వారికి ఇంతకంటే వేరేం కావాలి.

    భవద్భక్తి: స్పీతా భవతు మమ సైవ ప్రశమయేత్

    అశేషజేశోఘం న ఖలు హృది సందేహకణికా |

    న చేద్వ్యాసస్యోక్తిస్తవ చ వచనం నైగమవచో

    భవేన్మిథ్యా రథ్యాపురుషవచనప్రాయమఖిలమ్ 5

    నారాయణా! నీదివ్య చరణాల మీద నాకు స్థిరమైన భక్తి కలిగేలా అనుగ్రహించు స్వామీ! నీమీద భక్తి నాకున్న రోగాల్ని బాధల్ని తప్పకుండా తొలగిస్తుంది. ఇందుకు ఏమాత్రం సందేహం లేదు. అలా జరుగక పోతే వేదవ్యాసుడు, వేదాలు నీ గురించి చెప్పిన మాటలన్నీ దారిన పోయేవారు చెప్పిన మాటల్లాగ వ్యర్ధమౌతాయి.

    భవద్భక్తిస్తావత్ ప్రముఖమధురా త్వద్గుణరసాత్

    కిమప్యారూఢా చేదఖిలపరితాపప్రశమనీ |

    పునశ్చాంతే స్వాంతే విమలపరిబోధోదయమిలత్

    మహానందాద్వైతం దిశతి కిమతః ప్రార్ధ్యమపరమ్ 6

    స్వామీ! నీపాదారవిందాలమీద భక్తి నీదివ్య గుణగణాల్ని గానం చేయటం వల్ల కలిగిన మధురానుభూతి ఎంతో గొప్పది. నీభక్తి ఉంటే తాపత్రయాలన్నీ నశిస్తాయి. అంతేకాదు చివరికి నిర్మలమైన జ్ఞానం కలిగి తద్వారా బ్రహ్మానందం కూడా లభిస్తుంది. జీవుడికి ఇంతకంటే ఏం కావాలి?

    విధూయ క్లేశాన్ మే కురు చరణయుగ్మం ధృతరసం

    భవ క్షేత్ర ప్రాప్తా కరమపి చ తే పూజనవిధౌ |

    భవన్మూర్యా లోకే నయనమథ తే పాదతులసీ -

    పరిఋణే ణం శ్రవణమపి తే చారుచరితే 7

    నాకున్న బాధల్ని తొలగించి, నాపాదాలు నీ దివ్యక్షేత్రమైన గురువాయూరు చేరేడట్టు, నాచేతులు నిత్యం నీ పూజ చేసేట్టు, నాకళ్ళు నీదివ్య రూపాన్నే దర్శించేట్టు, నాముక్కు నీపాదాలమీద తులసీ దళపరిమళాన్ని ఆఘ్రాణించేట్టు, నా చెవులు రెండూ మధురాతి మధురమైన నీదివ్య కథల్ని శ్రద్ధగా, భక్తిగా వినేడట్టు నన్ను అనుగ్రహించు స్వామీ!

    ప్రభూతాధివ్యాధి ప్రసభచలితే మామకహృది

    త్వదీయం తద్రూపం పరమరసచిద్రూపముదియాత్ |

    ఉదంచద్రోమాంచో గలితబహుహర్షాశ్రునివస

    యథా విస్మర్యాసం దురుపశమపీడాపరిభవాన్ 8

    నారాయణా! నా శరీరం ఎన్నో వ్యాధులతో మానసిక బాధలతో నిండిపోయింది. అలాంటి నా మనసులో పరమానందాన్ని కలిగించే నీ సుందరరూపాన్ని ఉదయింపచేసేదాన్ని స్థిరంగా వుంచు. తద్వారా నేను ఆనందామృతాన్ని మనసారా తాగి శరీరమంతా గగుర్పాటు చెందేలా సంతోషంగా కన్నీరు కారుస్తూ, నాకున్న తీవ్రమైన బాధల్ని సైతం మరిచిపోతాను.

    మరుధేహాధీశ త్వయి ఖలు పరాంచో2పి సుఖినో

    భవత్ స్నేహీ సో హం సుబహు పరితప్యే చ కిమిదమ్ |

    అకీర్తిస్తే మాభూద్వరద! గదభారం ప్రశమయన్

    భవద్భక్టోత్తంసం ఝటితి కురు మాం కంసదమన! 9

    స్వామీ! గురువాయూరువాసా! నీ మీద ఏమాత్రం భక్తి శ్రద్ధలు లేని వాళ్ళు లోకంలో ఎంతో ఆనందంగా వున్నారు. నీమీద అచంచల భక్తి విశ్వాసాలు పరిపూర్ణంగా కలిగిన నేను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఇదేమి న్యాయం! భక్తులు కోరికలు తీర్చే కంస దమనా! ఇలాచేస్తే నీకు చాలా అపకీర్తి వస్తుందయ్యా! దయచేసి నారోగాల బాధల్ని పోగొట్టి, నన్ను నీ భక్తుల్లో గొప్పవాడిగా చేయి.

    కిముకైర్భూయోభి స్తవ హి కరుణా యావదుదియాత్

    అహం తావద్దేవ! ప్రహితవివిధారప్రలపితః |

    పురః క్లుపై పాదే వరద! తవ నేష్యామి దివసాన్

    యథాశక్తి వ్యక్తం నతినుతినిషేవా విరచయన్, 10

    భక్తవరదా! ఇలా చాలాసార్లు నా రోగబాధల్ని నీకు విన్నవించడం వ్యర్ధమనిపిస్తోంది. రోగాలవల్ల కలిగిన బాధతో నేను అనవసర ప్రేలాపనలు చేస్తున్నాను. ఇకపై అవిచేయకుండా, నీదయ నామీద కలిగేంతవరకూ భక్తి శ్రద్ధలతో నీకు నమస్కరిస్తూ నీ సేవలు చేయాలని స్థిరంగా నిర్ణయించుకున్నాను.

    మూడవ దశకం సమాప్తం

    ద్వితీయ స్కందపరిచ్ఛేదం

    4 వ దశకం

    అష్టాంగయోగం - యోగసిద్ది

    కల్యతాం మమ కురుష్వ తావతీం కల్యతే భవదుపాసనం యయా

    స్పష్టమష్టవిధయోగచర్యయా పుష్టయాశు తవ తుష్టిమాప్నుయామ్ 1

    స్వామీ! నీ ఉపాసన చేయాలని నాకోరిక. అందుకు తగిన ఆరోగ్యాన్ని నాకు ప్రసాదించు. అష్టాంగయోగం ఎంతో గొప్పది దాన్ని పూర్తిగా సాధనచేస్తే నీ దివ్యానుగ్రహం త్వరగా లభిస్తుందని నా విశ్వాసం.

    బ్రహ్మచర్యదృఢతాదిభిర్యమైః ఆప్లవాదినియమైశ్చ పావితాః

    కుర్మహే దృఢమమీ సుఖాసనం పంకజాద్యమపి వా భవత్పరా: 2

    నారాయణా! ప్రతిరోజూ నీ భక్తులమైన మేమందరం పవిత్రంగా స్నానం చేసి నియమంగా నిష్ఠగా సుఖాసనం లేక పద్మాసనాన్ని వేసుకుని కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ యోగాన్ని అభ్యాసం చేస్తున్నాం.

    తారమంతరనుచింత సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలా:

    ఇంద్రియాణి విషయాదథాపహృత్యాస్మహే భవదుపాసనోన్ముఖాః 3

    స్వామీ! మా మనసులో శుద్ధ ఓంకారాన్ని దీక్షగా ధ్యానం చేస్తూ, ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ ప్రాణాయామం ద్వారా ప్రాణ, వాయువుని బంధించి నిర్మల శరీరంతో నీ ఉపాసన చేస్తాము.

    అస్ఫుటే వపుషి తే ప్రయత్నతో ధారయేమ ధిషణాం ముహుర్ముహుః

    తేన భక్తిరసమంతరార్ఖతాముద్వహేమ భవదంఫ్రి చింతకాః 4

    కృష్ణా! నీ దివ్యరూపాన్ని దర్శించాలని ఎంతో శ్రద్ధగా మేము నిత్యం ధ్యానం చేస్తున్నాం. అయితే నీరూపం మాకు స్పష్టంగా కనబడటం లేదు. అది కనిపించేంతవరకూ మా బుద్ధిని కేంద్రీకరించి మరింత తీవ్రంగా ధారణ చేస్తాం. ఇలా నీగురించే చేసే సాధన వల్ల, నీపాదపద్మాలని నిత్యం ధ్యానించటం వల్ల, మేమంతా భక్తిరసంలో మునిగి తరిస్తున్నాం.

    విస్ఫుటావయవభేదసుందరం త్వద్వపుస్సుచిరశీలనావశాత్ |

    అశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగనిరతాస్త్వదాశ్రయాః 5

    స్వామీ! నీదివ్య మంగళాకారాన్ని దర్శించాలని ఎంతో కాలం దీక్షగా ధారణ చేస్తూ క్రమంగా ధ్యానయోగంలో ఉన్నతస్థాయిని చేరుకున్నాం. తద్వారా నీరూపం మాగుండెల్లో స్థిరంగా నిలచిపోయింది. ఇకనుంచి మేము ఎలాంటి శ్రమ లేకుండా నీరూపాన్ని మనసారా ధ్యానిస్తాం.

    ధ్యాయతాం సకలమూర్తి మీదృశీం ఉన్మిషన్మధురతాహృతాత్మనామ్

    సాంద్రమోదరసరూపమాంతరం బ్రహ్మరూపమయి! తే2 వభాసతే 6

    ప్రభూ! సకలకళావల్లభుడవైన నీదివ్యరూపాన్ని నిత్యం ధ్యానించే వారి మనసుల్లో ఆ రూప దర్శనం కాగానే వారంతా ఎంతో పరవశించిపోతున్నారు. అదే సమయంలో పరబ్రహ్మ స్వరూపంతో నీవు వారి హృదయాలలో ప్రకాశిస్తున్నావు.

    తత్సమాస్వదనరూపిణీం స్థితిం త్వత్సమాధిమయి విశ్వనాయక ! -

    ఆశ్రితాః పునరతః పరిచ్యుతా వారభీమహి చ ధారణాదికమ్ 7

    విశ్వనాయకా! నీదివ్య మంగళరూపం మీద మా మనస్సుల్ని గాఢంగా లగ్నం చేయటం వల్ల మేము సమాధి స్థితి పొందుతున్నాం. ఏదైనా ఆటంకం జరిగి ఆ దివ్య సమాధి స్థితిని కోల్పోతే నీ పాదాల్ని ఆశ్రయించి తిరిగి మా ధ్యానాన్ని కొనసాగిస్తాం.

    ఇష్టమభ్యసన నిర్భరోల్లసత్ త్వత్పరాత్మ సుఖకల్పితోత్సవాః

    ముక్తభక్తకులమౌలితాం గతాః సంచరేమ శుకనారదాదివత్ 8

    స్వామీ! ఈ విధంగా నీమీద గాఢమైన భక్తి ప్రపత్తులు పెంచుకుని నీ సాధన చేయటం వల్ల మేమంతా ఎంతో సుఖశాంతుల్ని పొందుతున్నాం. ఇలా కొనసాగి చివరికి మహాభక్తులైన శుక్రుడు నారదాది మహర్షులలాగా సంచరిస్తూ జీవన్ముక్తుల మవుతాం.

    త్వత్సమాధి విజయే తు యః పునర్మకు మోక్షరసికః క్రమేణ వా

    యోగవశ్యమనిలం షడాశ్రయైః ఉన్నయత్యజ ! సుషుమ్నయా శనైః 9

    కృష్ణా నీదయవల్ల అష్టాంయోగం మాకు సిద్ధించింది. ఆ యోగంలో చెప్పిన విధంగా ప్రాణాయామంతో శ్వాసని స్వాధీనం చేసుకొని, మూలాధారం నుంచి ఆ శ్వాసని ఆరుచక్రాల్ని దాటించి సుంషుమ్న నాడి ద్వారా మెల్లగా శిరస్సులో వున్న బ్రహ్మరంధ్రం దాకా తీసుకువస్తాం. అపుడు సమాధిస్థితి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. దీనివల్ల వెంటనే గానీ, కాలక్రమంలో గానీ మోక్షాన్ని పొందగలుగుతాం.

    లింగదేహమపి సంత్యజన్మథో లీయతే త్వయి పరే నిరాగ్రహః

    ఊర్ధ్వలోకకుతుకీ తు మూర్ఖతః సార్ధమేవ కరణెర్నిరీయతే 10

    ప్రభూ! నీదయతో సంపూర్ణ సమాధి స్థితికి చేరిన వాళ్ళలో, వెంటనే ముక్తిని కోరుకునేవాళ్ళు తమ లింగ (సూక్ష్మ) శరీరాన్ని కూడా వదిలేసి నీలో లీనమై పోతున్నారు.

    మరికొందరు భక్తులు ఊర్థ్వలోకాల్ని చూడాలని ఉత్సాహ పడుతుంటారు. అలాంటి వాళ్ళు తమ ప్రాణాల్ని బ్రహ్మరంధ్రం ద్వారా వదిలి ఇంద్రియాలతో వున్న సూక్ష్మదేహంతో ఊర్ధ్వలోకాలను చేరుకుంటున్నారు.

    అగ్నివాసర

    Enjoying the preview?
    Page 1 of 1