Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

నిజమే కల అయితే
నిజమే కల అయితే
నిజమే కల అయితే
Ebook418 pages5 hours

నిజమే కల అయితే

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

మనిషి చనిపోయాక ఏమవుతాడు? పునర్జన్మ అనేది నిజంగా వుందా? అనే ప్రశ్నలు, కొంచెం ఆలోచించే ప్రతివాళ్ళకీ, జీవితంలో రకరకాల సందర్భాల్లో ఆసన్నమవుతాయి. అందులోనూ ఎవరికి కావలసిన మతాలు నమ్మకాలు, ప్రపంచం అంతటా ఎవరికి వారు, ఏర్పరచుకున్నాక ఈ సమస్య ఇంకా క్లిష్టమైంది. ఇలాటి క్లిష్టమైన విషయం మీద ఒక పరిశీలనాత్మకమైన, శాస్త్రీయ నవల వ్రాయాలని, ఎన్నో దశాబ్దాలుగా కలలు కంటున్నాను. మూడేళ్ళ నించీ, కావలసిన సమాచారం ఎన్నో పుస్తకాల ద్వారానూ, శాస్త్రీయ వ్యాసాల ద్వారానూ, కొంతమంది సైకియాట్రిస్టులు, పారాసైకాలజిస్టులు, హిప్నోటిష్టులతో కబుర్ల ద్వారానూ, మధ్యే మధ్యే గూగులమ్మ సహయంతోనూ, ఎంతో సమాచారం సేకరించాను. నా కల నిజమయే అవకాశం అప్పుడు బాగా కనపడింది. ఇక దీని మీదే కూర్చుని, మూడు నెలల్లో ఈ నవల పూర్తిచేశాను. చదివి ఎలా వుందో చెబుతారు కదూ!

LanguageTelugu
Release dateAug 17, 2017
ISBN9781386364542
నిజమే కల అయితే
Author

Satyam Mandapati

Satyam Mandapati is a very popular writer in Telugu, publishing more than 300 short stories, 4 novels, several plays, and a dozen features in all the leading Telugu magazines in India and USA. Some of his stories were translated into other languages.  In 1994-95, Satyam wrote "America Betaaludi Kathalu", the first Telugu serial stories from USA depicting the life of Indian immigrants in USA. They were released as a book in 1995. "America Betaaludi Kathalu" the first ever book on India/Telugu Diaspora sold out in about a year and it went into a second edition soon selling all copies. Satyam so far published thirteen print books, out of which three books went into second print and were also sold out. He also published eight e-books that are sold currently on all key websites, including Kinige, Apple iBooks and Kindle. Satyam received six awards from Vanguri Foundation of America and two from Rachana magazine for his short stories. Satyam also received several awards for his contribution to Telugu literature from film actor Akkineni Nageswara Rao in 1997 and from Sri PV Narasimha Rao, Prime Minister of India in 2000. Other awards received are from Vamsee International, SAPNA, Siri Foundation, Vamsee Cultural Trust, Friendship Foundation of India, Chaitanya Bharati, TANA, ATA, TAMA, TANTEX, TCA etc.  Satyam is conducting monthly Telugu Sahitya Sadassulu in Austin, TX since 1992 and is the force behind the statewide Texas Telugu Sahitya Sadassulu conducted twice a year for the last 21 years. Satyam Mandapati currently lives in the metro area of Austin, Texas. Satyam did his B. Sc. Physics from Hindu College, Guntur; B.E from Engineering College, Kakinada and M.E. from Andhra University, Vizag. He worked in the Indian Space Research Organization as a Senior Manager for ten years and moved to USA in 1982 and recently retired after working as Vice President of Operations and General Manager from two Hi-Tech companies in Austin. Satyam Mandapati Contact Information: E-mail:             satyam_mandapati@yahoo.com

Read more from Satyam Mandapati

Related to నిజమే కల అయితే

Related ebooks

Reviews for నిజమే కల అయితే

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    నిజమే కల అయితే - Satyam Mandapati

    Nijame Kala Ayite

    A Sensational Novel By Satyam Mandapati

    Andhra Bhoomi Monthly Magazine Serial

    Satyam Mandapati e-Books

    Language: Telugu

    August, 2017

    Copy Right: Satyam Mandapati

    Telugu Typesetting:  Satyam Mandapati and Ujwal Manepalli

    For Print Book Copies in India:

    Navodaya Book House

    Opp. Arya Samaj Mandir, Kachiguda X Roads,

    Hyderabad – 500 027

    Phone: (040) 24652387

    Print Books are also Available in India at:

    V. Sri Lakshmi, 

    1-1-231/4, First Floor, Jyothi Bhavan, Chikkadpalli,

    Hyderabad 500020

    Phone: (040) 27651264

    For Print Book Copies in USA:

    Email: satyam_mandapati@yahoo.com

    Price: $ 4.99

    మానవాతీత శక్తులున్నాయా?

    ఉంటే వాటికాధారాలేమిటి?

    ఆస్టిన్, టెక్సాస్, యు.ఎస్.ఏ.లో జరుగుతున్న ఆంథ్రపాలజీ పేరా సైకాలజీ సెమినారుకి వివిధ దేశాల నించి ప్రొఫెసర్ ఆండ్రూ ఛాంగ్, డేవిడ్ మార్టిన్, ఆంధ్రా నించి ప్రొఫెసర్ బొడ్డుపల్లి శంకర్, రచయిత ప్రహ్లాద్, ఆయన మామయ్య నారాయణరావు, ఇత్యాది మహామహులు విచ్చేశారు. ఈ సెమినారులో వీరు చేసే ప్రసంగాలూ, చర్చలూ కనిపిస్తాయి, సత్యం మందపాటిగారి కొత్త నవల నిజమే కల అయితేలో. మీరు సరిగ్గానే చదివారు. పేరు తిరగబళ్ళేదు. కలే నిజమయితే కాదు. అచ్చు తప్పూ కాదు, హల్లు తప్పూ కాదు. కథ ఆస్టిన్లో మొదలయి, కేరళ మీదుగా, ఆంధ్రాలో గుంటూరు జిల్లా పర్యటించి, మళ్ళీ ఆస్టిన్ చేరుతుంది.

    సత్యంగార్ని పాఠకలోకానికి పరిచయం చెయ్యడం SP బాల సుబ్రహ్మణ్యాన్ని పాడుతా తీయగా ప్రేక్షకులకి పరిచయం చేయడం వంటి చర్య. ఆయన బాగా రాశాడు అని చెప్పడం, దశకంఠుడికి పది మెడలున్నాయని చెప్పడం వంటిది. పునరుక్తి. అయితే ఈ నవల్లో, సత్యంగారు తన సహజ సామాజిక వ్యంగ్య హాస్య చురకలతో పాటు, ఒక అపరాధ పరిశొధక శైలిలో విశ్వరూపం దాల్చారని చెప్పాలి. 

    పునర్జన్మ ఉందా? దేముడనేవాడున్నాడా? దయ్యాలున్నాయా? మనసు, బుద్ధి ఎక్కడుంటాయి. బ్రెయిన్లో ఉంటాయా? మతం అంటే ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు మానవుడు పుట్టినప్పటినించీ అన్ని తరహాల వారినీ, అన్ని జాతుల వారినీ, అన్ని వర్గాల వారినీ, అన్ని మతాల వారినీ వేధిస్తున్న సమస్య. ఎవరి మనసునిబట్టి, ప్రతి విషయం వారికలా అవగాహనమౌతుంది. భగవద్గీతకి అద్వైతపరంగా ఆది శంకరులు, విశిష్టాద్వైతపరంగా రామానుజులు, ద్వైతపరంగా మధ్వాచారి వ్యాఖ్యలు రాశారు. అందరూ మహానుభావులే! ఎవరిని నమ్మాలి? సారాంశం? ఎవరి మనసునిబట్టి ప్రతి విషయం వారికలా అవగాహనమౌతుంది. బావిలో కప్పకదే సముద్రం కదా! ఎవరి తల్లి వారికి గొప్ప. అందరి అమ్మలకన్నా గొప్పది. అదేవిధంగా మన నమ్మకాలు. పుట్టి బుద్ధెరిగాక మొదటి దైవం, అమ్మ. ఇంకొంచెం పెద్దయ్యాక, నాన్న. ఆ తరవాత గురువు, తరవాత సమాజం. మన జ్ఞానం పెరిగే కొద్దీ మన గురువుల సంఖ్య కూడా పెరుగుతుంది. చివరికి ఈ విశ్వమే ఒక విద్యాలయమౌతుంది. ఒక విశాల దృక్పథం ఏర్పడుతుంది. విష్ణుసహస్రనామాలు కూడా విశ్వం, విష్ణుః వషట్కారతో ప్రారంభం అవుతాయికదా!

    మనస్సు, బుద్ధి ఎక్కడుంటాయి? బ్రెయిన్లోనా? కాదు. William Boyd అని ఒక గొప్ప డాక్టర్, ‘The eyes see what the mind knows’ (మన మనసులొ ఉన్నదే మన కళ్ళకి కనబడుతుంది) అంటే మనం చూసేది, అనుభవించేది మనోకల్పనే అంటారు మిధ్యావాదులు. మిధ్యావాదం, అద్వైత వాదం మనకెందుగ్గానీ, ఈ పాయింట్ అర్థం చేసుకోవటానికి ఒక సార్వజనిక ఉదాహరణ చెప్తాను. నా పర్సనల్ అనుభవం. గుంటూరులో చదువుకునే రోజుల్లో మా మెడికల్ లాలేజి స్టేటస్కి తగినట్టు మేం ఇంగ్లీషు సినిమాలు చూసేవాళ్ళం. నలుగురం కలిసి వెళ్ళి లీలామహల్లో సినిమా చూసి, బయటికొచ్చాక సినిమా అర్థమయినట్టుగా ఇంగ్లీషులో మాట్లాడుకుంటూ, ఒక్కొక్కడూ ఒక్కో కథ చెప్పేవాడు. సినిమాలో చూసిన కథగా! అంటే వాడి మనసుకి ఆ సినిమా అలా అర్థమయ్యిందన్నమాట! అర్థమయ్యింది కదా?

    ఒక్కోసారి అక్కడే ఉన్నది కూడా కనబడదు. మెడిసిన్లో Agnosis అని ఒక లాటిన్  మాట వుంది. ఇది అజ్ఞానం నించి వచ్చింది. ఇందులో చాలా రకాలున్నాయి. అందులో ఒఖ్కటి చెప్తాను. Visual Agnosia అంటే వస్తువక్కడే వుంటుంది. మన కళ్ళక్కనబడదు. అంటే మనసెక్కడో వుందన్నమాట. దీన్నే మనం ‘పరధ్యానం’ అంటాం. భార్యల చేత తిట్ట్లు తినే భర్తలందరూ చేసే పనే... ఏ విషయమైనా మనం ఆకళింపు చేసుకునేది మనసుతోనేనని సారాంశం.

    అయితే మరుజన్మ వున్నదా అంటే సమాధానం, నీ మనసుందనుకుంటే వుంది, లేదనుకుంటే లేదు. అలాగే స్వర్గం, నరకం వగైరా. మతం మానవ సృష్టి అంటారు సత్యంగారు. మతం అంటే సామూహిక మనోవ్యాపకం. ఒక సొసైటీ నడవడానికి కొన్ని రూల్స్ ఉండాలి కదా. దాన్నే ధమ్మపదమన్నారు బుద్ధులు, మనుస్మృతి ఇత్యాది అన్నారు హిందువులు. వాడెవడో జీవితం రెప్పపాటు కాలం అన్నాట్ట. అంటే పుట్టగానే కళ్ళు తెరిచి, చచ్చిపోయేటప్పుడు కళ్ళు మూస్తాడు. జీవితం ఆ మధ్య సమయమన్నమాట. ఆ తరవాత ఏమి జరిగిందో వచ్చి ఎవరూ చెప్పరు. ఇక్కడే వస్తాయి, సత్యంగారు చెప్పే హిప్నోసిస్, పూర్వజన్మ స్మృతులూ వగైరా. ఈ విషయంలో ఎవరి పిచ్చి వారికానందం. నీళ్ళలో H2, O వున్నాయా అని నిఝంగా మనం ఎప్పుడూ అడగం. వాడెవడో చెప్పాడని మిగతా ఫిజిక్స్ అంతా చదువుతాం. నమ్మకపోతే మనం లాబ్కి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలి. అలాగే రామకృష్ణ పరమహంస, కృష్ణభగవానుడూ లేక వ్యాస భగవానుడూ, మరుజన్మలు వున్నాయి అన్నారు కనక నమ్ముదాం. తప్పేముంది. మనకి తెలియని విషయాలు, మన పెద్దలూ, గురువులూ చెప్పినప్పుడు నమ్ముతాము కదా! అయితే ఈ నమ్మకాలు ఆకాశంబుననుండి శంభుని సిరంబందుండి శీతాద్రి అన్నట్టుగా, గంగ ఆకాశాన్నించి వచ్చి, హిమాలయాల మీదుగా కాలవల్లోకీ, దరిమిలా మురికి కాలవల్లోకీ పారుతున్నట్లు, మతసాంప్రదాయాలూ, ఆచార  వ్యవహారాలూ, సాంఘిక వ్యవస్థలూ చివరికి అర్థం లేని చాదస్తాలుగానూ, సమాజ పురోగమనానికి అడ్డుపడే మూఢనమ్మకాలుగానూ, దురాచారాలుగానూ మారుతున్నాయి. ఉదా: బాల్య వివాహాలూ, వరకట్నాలూ, కన్యాశుల్కాలూ, సతీ సహగమనాలూ. అందుకనే ధర్మం దేశకాల పరిస్థితులబట్టి మారుతుంది. అమావాస్య మనకు చెడు రోజు. అరవ్వాళ్ళకి పర్వదినం. మరియొకరి చెడురోజు, మనకు నేడు ఉగాది, పంచాంగమొక సోది అన్న ఆద్రీయం అందరికీ సుపరిచయమే. అందుకనే మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ‘A little knowledge leads to dogma, a little bit more knowledge leads to enquiry and a  little more leads to prayer  అన్నారు. ఒక వేదాంతి చెప్పాడు, Patriotism is a delusion that my country is better than any other country". (దేశభక్తి అనేదిగూడా ఒక రకమైన మానసిక రుగ్మతే సుమా)

    భగవంతుడెక్కడున్నాడో చూపించమన్నాట్ట ఒక నాస్తికుడు. ఎక్కడ లేడో చూపించమన్నాట్ట ఒక ఆస్తికుడు. కలడందురు దీనులయెడ, కలడందురు సర్వ భూత గణములపాలిన్, కలడందురన్ని దిశలను.. అన్నాడు అద్వితీయ, అద్వైత పోతన. మనం చిన్నప్పుడు కంఠతా పట్టిన భాగవతంలోని పద్యం ఎవ్వనిచే జనించు ఈ అద్వైత భావాన్నే ప్రతిపాదిస్తుంది. అందులో చివర సర్వము తానే అయినవాడు, వాని ఆత్మభవు... అంటాడు మహాకవి. అందులో ఆత్మభవుడంటే నీ మనసులోనే ఉదయించాడని అర్థం చెప్పుకోవాలిట. విశ్వమంతా ప్రాణవిభుని మందిరమైన, వీధి వాకిలి ఏదె చెల్లెలా! అన్నారు కృష్ణశాస్త్రిగారు.

    ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే. ఇది మీరు చదవబోయే ‘నిజమే కలయితే’ అన్న సత్యం మందపాటిగారి సరికొత్త నవలకి పునాది. మీరు సరిగ్గానే చదివారు. టైటిల్ తిరగబళ్ళేదు. కల నిజమైతే తమాషా ఏముంది. నిజం కలైతేనే సస్పెన్స్. ఈ నవల్లో, సత్యంగారు నేను పైన ఉదాహరించిన అంశాలన్నింటినీ చాలా క్షుణ్ణంగా రీసెర్చి చేసి, మరుజన్మలున్నాయా, పాతస్మృతులు మళ్ళీ వస్తాయా, హిప్నోసిస్తో అవన్నీ పైకి తీసుకు రాగలమా, బ్రెయిన్ డెత్ [Brain Death] అంటే ఏమిటి, నియర్ డెత్ అనుభవాలుంటాయా [Near Death Experiences, NDE], అందులో జరిగిన సంఘటనలు, తరవాత గుర్తుంటాయా? ఇలాటి ఎన్నో మానసిక, మత సంబంధ, శాస్త్రీయ విషయాలన్నీ ఎంతో పరిశోధన చేసి, కూలంకషంగా చర్చించి మంచి కథ నడిపించారు.

    ఇటువంటి పుస్తకానికి ముందుమాట రాయడానికి నాకున్న అర్హతలేమని అడుగుతారు కదూ? ఏమీ లేదు. ముఖ్యంగా సత్యం మందపాటిగారు నా చిరకాల స్నేహితుడు. ఇహ చాలా? ముందస్తుగా ఈ పుస్తకాన్ని చదివిన పాఠకుణ్ణి నేను. ఒక సాధారణ పాఠకుడిగా, ఒక అనుభవమున్న సైకియాట్రిస్టుగా, ఆధ్యాత్మిక విద్యార్థిగా, అంటే త్రిగుణాత్మకంగా (స్వోత్కర్షకి క్షమాపణ), త్రికోణాల్లో (ఎఱ్ఱది కాదు) విశాల దృక్పథంతో (అంటే అచ్చ తెలుగులో Comprehensively) వ్రాయగలనని, నాకు వారు చూపిన ఆత్మీయత, నమ్మకం.

    ఆధ్యాత్మికంగా, శాస్త్రీయపరంగా నాకు తెలిసీ తెలియని విషయాలు మీకప్పుడే సుత్తి వేశాను. ఇంక సగటు పాఠకుడిగా ఈ పుస్తకం నన్నెంత అలరించిందో ముందే చెప్పాను. రెండు మూడు నా స్వంత అనుభవాలు (నా మతం) చెప్పేసి ముగిస్తాను.

    నేను మరుజన్మని నమ్ముతాను. ESPని నమ్ముతాను. సూక్ష్మశరీరం ఉందని నమ్ముతాను. పూర్వజన్మల వాసనల ప్రభావం చిత్త రూపంగా, వాసనా రూపంగా ఉంటుందన్న ఉపనిషదృషుల మాట నమ్ముతాను. ముఖ్యంగా ఎందుకంటే నేను డిస్ప్రూవ్ చెయ్యలేనుగనక, నీళ్ళ ఎనాలిసిస్ లాగే. చనిపోయిన తరవాత ప్రాణి సూక్ష్మశరీరం రూపంలో ఇక్కడే తిరుగుతుందని, కొన్ని నా స్వంత అనుభవాల వల్ల నమ్ముతాను. ఆలోచనా తరంగాల్ని, మన రేడియో తరంగాల్లాగానే ట్యూన్ చేసి సాధించవచ్చు. (వివేకానంద ఉవాచ) మన సాముద్రిక శాస్త్రంలో దీన్ని ముఖ సాముద్రికమంటారు.(VS. హస్త సాముద్రికం) మెడిసిన్లో అనస్తీసియాలో వున్నవాళ్ళకి కొన్ని అనుభూతులుంటాయి అన్నది నిర్వివాదాంశం. అలాగే కోమాలో వున్నవాళ్ళకి నియర్ డెత్ అనుభవం [Near Death Experience, NDE] వుంటుందని చాలామంది నమ్ముతారు. చాలా పుస్తకాలున్నాయి. అన్నీ నిజం కాదు. (మన స్వాములవాళ్ళ లాగానే) డబ్బులు సంపాదించడానికి రాసిన సెన్సేషనల్ వాఙ్మయం  చాలా వుంది.

    ‘Life depends upon the liver’ అని ఇంగ్లీషులో ఒక నానుడి. ఇందులోని శ్లేష గమనార్హం. అలాగే ఈ పుస్తకం చదువుతుంటే చాలా అనుభూతులు కలుగుతాయి. ఆస్టిన్లో మొదలయి, కేరళ వెళ్ళి, గుంటూరు జిల్లాలో పర్యటించి, మళ్ళీ అమెరికాలో టూర్ చేస్తూ...ఒక దృశ్యం ఇండియాలో, తరవాత సీను అమెరికాలో, మళ్ళీ ఇండియాలో.. అడుగడుగునా ఉత్కంఠ కలిగిస్తూ కదన కుతూహలంగా సాగుతుంది. మందపాటివారి రచనల్లో సాధారణంగా మందహాసపు జల్లులూ, మందమందంగా చురకలు వేసే వ్యంగ్యపు ఝళుకులూ వుంటాయి. కానీ ఈ పుస్తకంలో శాస్త్రపరిజ్ఞానంతో కూడిన అద్భుత, ఆశ్చర్యరసాల్ని తొణికించారు.  అడుగడుగునా ఆశ్చర్యం, అద్భుతం కలిగిస్తూ ఒక అపరాథ పరిశోధక కథలాగా నడుస్తుంది. మనోరమా, రాజు, అప్పు, గిరిజ, ప్రహ్లాద్, మీరా, ఖాన్, శంకర్... యిత్యాది వ్యక్తులు కనిపిస్తారు. చివరికి కథ అనూహ్యమైన మలుపు తిరిగి నిబిడాశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఒక హిచ్కాక్ సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది.

    చివరికేమౌతుంది? నారాయణరావు ఇంకా మనసు చేసే ఆటల గురించి ఏం చెబుతాడు? మెలిస్సా అసలు నిజాన్ని ఎలా కనుక్కుంటుంది? మనోరమా, అప్పు గుంటూరులోనే స్థిరపడిపోతారా? డేవిడ్ చెప్పిన విషయాలు నిజమేనా? ఇలా ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు పుస్తకం ఆమూలాగ్రం చదివి తెలుసుకోండి.

    తప్పు, తప్పూ! చివరి పేజీ చూడద్దప్పుడే! మోసం చేసి ముగింపు ముందుగా చదివారనుకోండి, విక్రమార్కుడు భేతాళుడు కథలాగా, మీ ఆలోచనలు వెయ్యి ముక్కలైపోయి, అయోమయంలో పడి మళ్ళీ మొదటికొస్తారు జాగ్రత్త!

    పునరుక్తి దోషమైనా, మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చెప్తున్నా, ఈ పుస్తకం చాలా, చాలా బాగుంది. 

    ––––––––

    డాక్టర్ గిరిజా శంకర్ చింతపల్లి

    టెంపుల్, టెక్సస్

    కలయే నిజమయితే..

    మనిషి చనిపోయాక ఏమవుతాడు? పునర్జన్మ అనేది నిజంగా వుందా? అనే ప్రశ్నలు, కొంచెం ఆలోచించే ప్రతివాళ్ళకీ, జీవితంలో రకరకాల సందర్భాల్లో ఆసన్నమవుతాయి. అందులోనూ ఎవరికి కావలసిన మతాలు నమ్మకాలు, ప్రపంచం అంతటా ఎవరికి వారు, ఏర్పరచుకున్నాక ఈ సమస్య ఇంకా క్లిష్టమైంది. కొందరు పునర్జన్మ వుందంటే, కొందరు జన్మ పూర్తయాక ఇక ఆత్మ విశ్రాంతి తీసుకుంటుంది అంటారు. కొందరు ఆత్మ అనేది వేరుగా లేదు, అవి జ్ఞాపకాలు మాత్రమే అంటారు. కొందరు చనిపోయాక శరీరాన్ని తగలబెడితే బూడిద అవుతుంది, పాతిపెడితే మట్టిలో కలిసిపోతుంది అంటారు. ఎవరి వాదాన్ని వారు గుడ్డిగా సమర్ధించుకోవటమే కానీ,  ఇంతవరకూ నిర్ధారణగా ఇది అని నిరూపించిన వాళ్ళు ఎవరూ లేరు.

    ఇలాటి క్లిష్టమైన విషయం మీద ఒక పరిశీలనాత్మకమైన, శాస్త్రీయ నవల వ్రాయాలని, ఎన్నో దశాబ్దాలుగా కలలు కంటున్నాను. మూడేళ్ళ నించీ, కావలసిన సమాచారం ఎన్నో పుస్తకాల ద్వారానూ, శాస్త్రీయ వ్యాసాల ద్వారానూ, కొంతమంది సైకియాట్రిస్టులు, పారాసైకాలజిస్టులు, హిప్నోటిష్టులతో కబుర్ల ద్వారానూ, మధ్యే మధ్యే గూగులమ్మ సహయంతోనూ, ఎంతో సమాచారం సేకరించాను. నా కల నిజమయే అవకాశం అప్పుడు బాగా కనపడింది. ఇక దీని మీదే కూర్చుని, మూడు నెలల్లో ఈ నవల పూర్తిచేశాను. మిత్రులు డాక్టర్ గిరిజాశంకర్ గారికి ఇచ్చి, శాస్త్రీయ పరంగా ఎక్కడా తప్పులు లేకుండా చూడండి మహాప్రభో, అని చెప్పాను. ఆయన వృత్తిరీత్యా సైకియాట్రిస్టు మాత్రమే కాకుండా, స్వతహాగా రచయిత. ఎన్నో పుస్తకాలు వ్రాసిన, చదివిన పాఠకుడు. ప్రతి శుక్రవారం ఇంట్లో సత్సంగ్ పెట్టి పదిమందితో ఆధ్యాత్మిక విందులు చేసేవాడు. అదీకాక మా గుంటూరు ఆయన. ముఖమాటం పడకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టవచ్చుననుకునే, మంచి స్నేహితుడు. ఆయన చాల వాటిలో నేను వ్రాసినవాటిని ఒప్పుకుంటూ, మెచ్చుకుని, కొన్ని పేపర్లు పంపించి, ‘ఇవి కూడా చదివి చూడండి’ అని చెప్పారు. ఆయనకీ, ఆయన ఓపికకీ ఎన్నో, ఎన్నెన్నో ధన్యవాదాలు.

    ఈ నవలలో సస్పెన్సు వుంది కనుక, కథలోకి వెళ్లటం లేదు. తినబోయే ముందు మీకు రుచులు చెప్పటం ఎందుకు?

    ఈ నవల చదివి ఎన్నో సలహాలిచ్చింది నా శ్రీమతి విమల. ఆవిడ లేకపోతే, నేను లేను. నా సాహిత్యం లేదు. అందుకే ఆవిడకి నా ధన్యవాదాలు.

    ఈ నవలని ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించిన ఎ.ఎస్.లక్ష్మిగారికి, నా ‘ఎన్నారై కబుర్లు’ రోజుల నించీ, నన్ను ప్రోత్సహిస్తున్నందుకు సర్వదా కృతజ్ఞుడినే!

    నేను అమెరికాలో ఎన్నో దశాబ్దాలుగా వుంటున్న బహుదూరపు బాటసారినే అయినా, ఇండియాలో నేను లేని లోటు తీర్చి, నా కథలు, పుస్తకాల విషయంలో, నా పక్కనే నిలబడి, ఎంతో శ్రమకోర్చి, నన్ను ప్రోత్సహిస్తున్న, అక్కయ్య రచయిత్రి శ్రీమతి ఉంగుటూరి శ్రీలక్ష్మి, మా బావగారు వి.వి.సుబ్బారావుగార్లకు, నేను ఎంతో ఋణపడి వున్నాను. వారిద్దరూ నాకు సహాయ సహకారాలింతగా ఇవ్వకపోతే, నా తెలుగు సాహిత్య సమారాధన ఏనాడో కొండెక్కి వుండేది. వారిద్దరికీ గౌరవంతో, ప్రేమతో, నా నమస్సుమాంజలి.

    అందమైన ముఖచిత్రాన్ని చిత్రించిన వాసుగారికి ధన్యవాదాలు.

    పుస్తకాన్ని ఎంతో అందంగా ప్రింటు చేసిన శ్రీకళా ప్రింటర్స్ శ్రీనివాసరావు గారికీ, పుస్తకాన్ని ఇండియాలో పంపిణీ చేస్తున్న ‘నవోదయ’ సాంబశివరావుగారికీ కృతజ్ఞుడిని.

    ఇది ప్రింటు చేసిన వాటిలో నా పన్నెండవ పుస్తకం. మూడు ఈ-పుస్తకాలు కూడా కినిగే.కాం సైటులో వున్నాయి. వీటినన్నిటినీ ఆదరిస్తున్న మీకు ఈ నవల  కూడా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను.

    సత్యం మందపాటి

    ఆస్టిన్, టెక్సస్, యు.ఎస్.ఎ.

    ––––––––

    ఆస్టిన్, టెక్సస్.

    ఫోర్ సీజన్స్ హోటల్లో, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్లోని సోషల్ ఆంథ్రపాలజీ, పారా సైకాలజీ డిపార్ట్మెంటుల ఆధ్వర్యంలో, ఇంటర్నేషనల్ సోషల్ సైన్సెస్ వారి సహకారంతో జరుగుతున్న సెమినార్ అది.

    ‘మానవాతీత శక్తులు వున్నాయా లేవా, వుంటే వాటికి ఆధారాలేమిటి’ అనే ఆ సెమినార్లో మాట్లాడటానికే కాక, వినటానికి కూడా దేశదేశాలనించీ ఎందరో శాస్త్రజ్ఞులు, నిపుణులు, మేధావులు, ఉత్సాహవంతులూ వచ్చారు. దాదాపు ఐదు వందల మంది, ఆ మూడు రోజుల సెమినార్లో తమకు తెలిసింది ఇతరులకు చెబుతూ, ఇతరులు చెప్పింది తెలుసుకుంటూ, సమయం దొరికినప్పుడల్లా చర్చా గోష్టులు చేయటానికి వచ్చారు.

    మొదటి రోజు ప్రొద్దున్న ఆ సెమినార్లో పాల్గొనే వారి పేర్లు నమోదు చేసుకోవటంతో కార్యక్రమం ప్రారంభం అయింది. అక్కడ వున్న నాలుగు బల్లల దగ్గర, అంతకుముందే పేర్లూ తదితర వివరాలూ వ్రాసి వుంచిన బాడ్జీలు, కార్యక్రమ వివరాలు, ఒక పెన్ను, కాఫీ కప్పు, నోట్స్ వ్రాసుకోవటానికి నోట్బుక్  లాటివి పెట్టిన ఒక అందమైన సంచీ కూడా ఇస్తున్నారు.

    మొదటి గంటసేపూ, పరిచయాలూ పలకరింపుల కార్యక్రమం.

    ఆంధ్రా యూనివర్సిటీ నించీ వచ్చిన డాక్టర్ శంకర్, తన పేరు వున్న బాడ్జీని మెడలో వేసుకుని, ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు, ముఖ్యంగా భారతీయులు ఎవరైనా కనిపిస్తారేమోనని అటూ ఇటూ చూస్తూ అక్కడే నుంచున్నాడు.

    ఒక తెల్లతను, బాడ్జీ మీద శంకర్ పేరు చూసి దగ్గరగా వచ్చి అన్నాడు. నా పేరు డేవిడ్. ప్రొఫెసర్ డేవిడ్ మార్టిన్ ఫ్రం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఇంగ్లండ్. మీ పేపర్లు కొన్ని చదివాను, ముఖ్యంగా మనిషికి ప్రాణం పోయాక మతపరంగా ఏమవుతుంది, భౌతికంగా ఏమవుతుంది అని ప్రశ్నించిన పరిశీలన! అన్నాడు.

    శంకర్ ఆయనకి షేక్హాండ్ ఇస్తూ, "మీ పేపర్లు నేను కూడా చదివాను. ప్రొఫెసర్ మార్టిన్! మిమ్మల్ని కలవటం సంతోషంగా వుంది. అవును. ఇది విషయపరంగా పరిశీలనకి బాగుంటుంది కానీ, సమాధానం దొరకటం కష్టం. అందుకే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది. అయినా మీరు నా పేపర్ గుర్తుపెట్టుకున్నందుకు ధన్యవాదాలు. ఆ విషయం మీదే కాసేపట్లో ఇంకో పేపర్

    చదువుతున్నాను. వస్తున్నారా" అన్నాడు నవ్వుతూ.

    డేవిడ్ కూడా నవ్వుతూ మీ ప్రసంగానికి తప్పకుండా వస్తున్నాను. మీరు వ్రాసిన దానిలో నాకు నచ్చిన విషయాలు కొన్ని వున్నాయి. మనిషి పుట్టుకనించీ చనిపోయేదాకా ఏమవుతుందో మనకి తెలుసు. కానీ పుట్టుక ముందూ, పోయిన తర్వాతా ఏం జరుగుతుంది అన్నది అనాదిగా వస్తున్న ప్రశ్న. దానికి జవాబు ఇవ్వటం ఇప్పుడు కష్టమే అయినా, మనలాటి వారంతా కలిసి పూనుకుంటే జవాబు లభిస్తుందని నా నమ్మకం. మనం ఇంకా నాలుగు రోజులు కలిసే వుంటాం కనుక, ఈ విషయం గురించి వివరంగా మాట్లాడుకుందాం అన్నాడు.

    ఈలోగా ఇంకెవరో పిలిస్తే, మన్నించాలి, సెమినార్ హాల్లో కలుద్దాం అంటూ ముందుకి వెళ్ళాడు డేవిడ్.

    శంకర్ అక్కడ బల్ల మీద పేర్చి పెట్టిన ఖాళీ గ్లాసుల్లోనించీ ఒకటి

    Enjoying the preview?
    Page 1 of 1