Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

వినికిడి కళ
వినికిడి కళ
వినికిడి కళ
Ebook392 pages1 hour

వినికిడి కళ

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

దేవుని ఖచ్చితమైన చిత్తము కంటే ఎక్కువ ప్రాముఖ్యమైన విషయము లేదు. సువార్త పరిచారకుల భేదము గుర్తించే ఒక విషయము దేవుని స్వరమును స్పష్టముగా వినగలిగే వారి సామర్థ్యత. దేవుని ఖచ్చితమైన చిత్తములో పరిశుద్ధాత్మను అనుసరించుట ఎంత ప్రాముఖ్యము. నీవు దేవుని పరిపూర్ణ చిత్తములో ఉన్నప్పుడు, దేవుని కొరకు నీవు ఆశించే అన్నిటిలో ఫలించి మరియు పొందుకొందువు. Dag Heward-Mills గారి అసాధారణమైన పని నీ జీవితములో మరియు పరిచర్యలో ఒక గొప్ప ప్రభావము చూపును.

LanguageTelugu
Release dateMay 24, 2018
ISBN9781641348737
వినికిడి కళ
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to వినికిడి కళ

Related ebooks

Reviews for వినికిడి కళ

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    వినికిడి కళ - Dag Heward-Mills

    సంపూర్ణమైన మరియు అసంపూర్ణమైన దేవుని చిత్తము

    ... ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు ...

    రోమా. 12:2

    దేవుని చిత్తమును సంపూర్ణం మరియు అసంపూర్ణం అని వర్ణించవచ్చు. అసంపూర్ణమైన దేవుని చిత్తమును అసంపూర్ణమని ఎందుకు పిలుస్తామంటే, అది నిజమైన దేవుని చిత్తము వలెనే కనిపిస్తుంది గాని అది దేవుడు కోరుకొనేది కాదు.

    సంపూర్ణ దేవుని చిత్తము పూర్ణమైన, పరిపక్వత కలిగిన పూర్తి దేవుని చిత్తము. అసంపూర్ణమైన దేవుని చిత్తమనగా వారి కొరకు అది ఆయన కలిగియున్న ప్రథమ ఎంపిక కానపట్టికీ ప్రజలు ఆ పనిని చేయుటకు దేవుడు అనుమతిని ఇచ్చుట.

    సంపూర్ణమైన దేవుని చిత్తము

    సంపూర్ణ దేవుని చిత్తము దేవుడు నిజముగా మీరు ఉండాలని కోరుకొనుచున్న స్థలము. మీరు ఆయన సంపూర్ణ చిత్తములో ఉన్నప్పుడు దేవుడు మిమ్మును బట్టి సంతోషిస్తాడు మరియు మీ పేరు ప్రస్తావించబడినప్పుడు ఆయన అతిశయిస్తాడు.

    సంపూర్ణ దేవుని చిత్తములో మీరు మంచి స్థానములో నిలువబడియున్నారు, మరియు దేవుని యొక్క వాస్తవిక ప్రణాళికలో నాటబడియున్నారు.

    సంపూర్ణ దేవుని చిత్తములో, దేవుడు మిమ్మును రూపించిన కారణములను మీరు పరిపూర్ణంగా నెరవేరుస్తారు.

    అసంపూర్ణమైన దేవుని చిత్తము

    దేవుని బిడ్డలు ఆయన వారి కొరకు కలిగియున్న వాస్తవిక మరియు పరిపూర్ణమైన ప్రణాళికను తిరస్కరించి తిరుగుబాటు చేసినప్పుడు, దేవుడు వారిని అసంపూర్ణమైన చిత్తములోనికి విడచిపెడతాడు.

    మీరు అసంపూర్ణమైన దేవుని చిత్తములో ఉన్నప్పుడు, దేవుడు మిమ్మును బట్టి సంతోషించడు. ఆయన కేవలం మీకు కొంత స్థలమిస్తున్నాడు, మీ పట్ల ఓర్పును చూపుతున్నాడు మరియు పశ్చాత్తాప పడుటకు మీకు సమయమును ఇస్తున్నాడు.

    అసంపూర్ణమైన దేవుని చిత్తములో మీపై దేవుని కృపా దృష్టి ఉంది అని మీకు అనిపించవచ్చుగాని, ప్రభువు కొరకు మీరు చేసే సేవలో అసంపూర్ణంగా ఉన్నారు మరియు దేవుడు మీ జీవితాల కొరకు కలిగియున్న వాస్తవిక ఉద్దేశములను నెరవేర్చుట లేదు.

    అసంపూర్ణమైన దేవుని చిత్తములో మీరు అయోగ్యంగా నిలబడియున్నారు మరియు దేవుని పనికి మీరు అర్హులు కారు.

    దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తము నుండి అసంపూర్ణమైన చిత్తములోనికి నడచుట

    బైబిల్ అంతటిలో, వారి పట్ల దేవుడు కలిగియున్న సంపూర్ణ చిత్తము అది కానప్పటికి, ప్రజలు వారికి తోచినది చేయుటకు దేవుడు అనుమతి ఇచ్చిన అనేక ఉదాహరణలను మనం చూడవచ్చు. చాలా సార్లు, దేవుని ప్రజలు సంపూర్ణమైన దేవుని చిత్తముపై తిరుగుబాటు చేయువారిగాను దానిని ద్వేషించువారిగాను ఉన్నారు. వెంటనే వారికి తీర్పు తీర్చకుండా, దేవుడు వారిని తన అసంపూర్ణమైన (అనర్హమైన, సరిగాని, అంగీకారయోగ్యము కాని, మాదిరికరము కాని) చిత్తములోనికి వెళ్లుటకు అనుమతి ఇచ్చి, వారి తిరుగుబాటుకు తగిన ఎదురు దెబ్బలు తగులుటకు అవకాశం ఇస్తాడు.

    ఈ పుస్తకములో, దేవుడు ప్రజల కోరిక మేరకు రాజును ఎలా ఇస్తాడో, మరియు వారిని శిక్షించుటకు రాజులను ఎలా ఉపయోగించుకుంటాడో మీరు కనుగొంటారు. ఆయన ప్రజలకు ఐశ్వర్యమును ఇస్తాడు గాని, వారి ఆత్మలకు భ్రమలను మరియు బలహీనతను కలిగిస్తాడు. ప్రజలు విగ్రహాలను కట్టుకొనుటకు ఆయన అనుమతి ఇస్తాడు గాని, వారిని తరువాత నాశనం చేస్తాడు.

    ఒక ప్రవక్త తన పని కొరకు వెళ్లుటకు ఆయన అనుమతి ఇస్తాడు గాని, వానిని గద్దించుటకు గాడిదను పంపుతాడు.

    ఆయన అసంపూర్ణమైన చిత్తములోనికి వెళ్లుటకు ప్రజలకు అనుమతి ఇచ్చి దేవుడు తనను తాను ఖండించుకొనడు. ఆయన చిత్తముపై తిరుగుబాటు, మొండితనం మరియు తిరస్కారమునకు ఆయన ఇచ్చు ప్రత్యుత్తరము ఇది. తుదకు, మనుష్యులందరు దేవుని నుండి తగిన, ఖచ్చితమైన, వినూత్నమైన తీర్పును పొందుతారు!

    కొందరు ఈ అసంపూర్ణమైన చిత్తమును దేవుడు అనుమతించు చిత్తమని అంటారు. అనేక మంది సువార్త పరిచారకులు ఈ అసంపూర్ణమైన దేవుని చిత్తములోనే ఉన్నారు. కొందరు వారి పూర్తి జీవితాలను ఈ అసంపూర్ణమైన చిత్తములోనే జీవిస్తారు.

    అసంపూర్ణమైన దేవుని చిత్తములో ప్రజలకు అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. వారి పరిచర్యలు అభివృద్ధి చెందుతాయి మరియు వారు చేయు ప్రతిదానిపై దేవుని దయ ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే సమృద్ధి మరియు సఫలత దేవుడు మిమ్మును బట్టి సంతోషించుచున్నాడు అనుటకు రుజువు కాదు.

    మనలో చాలా మంది, ప్రజలు ఆశీర్వాదములు అని పిలచే స్పష్టమైన దయ ద్వారా మోసపోతుంటాము.

    డబ్బు మరియు సమృద్ధి దేవుడు మన యందు సంతోషించుచున్నాడు అనుటకు చిహ్నము ఎన్నడు కాదు. వానిని సేవించువారికి అపవాది కూడా ధనమును ఇస్తాడు. సాతాను యేసును సాగిలపడమని అడిగాడు మరియు లోకమంతటిని ఆయనకు ఇస్తానని చెప్పాడు.

    మీరు దేవుని సన్నిధి మరియు పరిశుద్ధాత్మ యొక్క స్వరము కొరకు ఎదురుచూడాలిగాని డబ్బు లేక ఐహిక వస్తువుల సన్నిధి కొరకు కాదు.

    మీరు ఒక సేవకుని కలసినప్పుడు వానిలో దేవుని సన్నిధి ఉన్నదో లేదో మీరు చూడాలి. దేవుని స్వరం మరియు ప్రభువు యొక్క మాటలు ఉన్నాయో లేవో మీరు చూడాలి.

    దేవుని ప్రజలు సంపూర్ణమైన దేవుని చిత్తము నుండి అసంపూర్ణమైన దేవుని చిత్తములోనికి వెళ్లిన అనేక ఉదాహరణలు బైబిల్ లో ఉన్నాయి. అసంపూర్ణమైన దేవుని చిత్తములో ఉన్న వారిని దేవుడు దీవించినట్లు అనిపిస్తుందిగాని దేవుడు వారిని బట్టి సంతోషించుట లేదు.

    ప్రజలు అసంపూర్ణమైన దేవుని చిత్తములోనికి వెళ్లిన కొన్ని ఉదాహరణలను మనం చూద్దాం.

    రాజు కావాలని కోరుకొనుట ద్వారా ఇశ్రాయేలీయులు అసంపూర్ణమైన దేవుని చిత్తములోనికి ప్రవేశించారు.

    రాజును కలిగియుండుట దేవుడు ఇశ్రాయేలు కొరకు కలిగియున్న సంపూర్ణ, పరిపక్వ ఆలోచన కాదు. కాని దేవుడు వారికి ఇచ్చాడు గాని, ప్రజలు ఆయనను తిరస్కరించారని సమూయేలుతో వ్యక్తిగతంగా చెప్పాడు.

    రాజును కలిగియుండుట సంపూర్ణమైన దేవుని చిత్తము కాదు, కాని దేవుడు దానిని అనుమతించాడు. మీరు తరువాత కనుగొనునట్లు, ఈ సదుపాయం తరువాత మేలు కలిగించలేదు మరియు ఇశ్రాయేలు పిల్లలు తమ రాజుల చేతులలో బహుగా శ్రమపొందారు.

    దేవుడు కొన్ని విషయాలను అనుమతించినప్పుడు మనం మోసపోకుండా ఉండుట చాలా అవసరము. నిజమైన దేవుని హృదయము ఆయనకు నిజాయితీగా దగ్గరగా ఉన్నవారికి బయలుపరచబడుతుంది.

    దీనిని మనం చాలా సార్లు చేస్తుంటాము, బహిరంగంగా ఉన్నప్పుడు సమాజంలో సరిపడిన మాటలు మాట్లాడతాము మరియు వేరొక చోట మన నిజమైన హృదయాలను బయలుపరుస్తాము. ఒక విషయంలో మీరు దేవుని యొక్క నిజమైన మనస్సు మరియు హృదయమును మీరు వెదకువారిగా ఉండాలి.

    రాజును నియమించుటకు సమూయేలుకు అనుమతి ఇచ్చినప్పుడు దేవుడు దుఖించాడు. ప్రజలు ఆయనను తిరస్కరించారని ఆయనకు తెలుసు. ఆయనను తిరస్కరించుటకు ప్రజలు సమూయేలు పిల్లలను కేవలం ఒక నెపముగా వాడుతున్నారని ఆయనకు తెలుసు. దేవుడు వారి విన్నపమును అంగీకరించాడుగాని అది ఇశ్రాయేలుకు పూర్తిగా మేలు కలిగించదు. దేవునికి ఇష్టముకాని విషయములను దేవుడు మీ జీవితాలలోనికి అనుమతించినప్పుడు జాగ్రత్తపడండి.

    ఇశ్రాయేలీయుల పెద్దలందరు కూడి రామాలో సమూయేలునొద్దకు వచ్చి,

    చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తనవంటి ప్రవర్తన గలవారు కారు గనుక, సకలజనుల మర్యాదచొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి.

    మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను.

    అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము; వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించియున్నారు.

    1 సమూ. 8:4-7

    మోయాబు రాజు కొరకు ప్రవచించునట్లు అవకాశం కొరకు మాటిమాటికి విజ్ఞాపన చేయుట ద్వారా బిలాము సంపూర్ణమైన దేవుని చిత్తము నుండి తొలగిపోయాడు.

    మోయాబు రాజైన బాలాకుతో ఎలాంటి సంబంధము కలిగియుండవద్దని దేవుడు బిలాముకు స్పష్టముగా చెప్పాడు. అయితే, బాలాకు ఇస్తున్న ధనములో కొంత బిలాము కోరుకున్నాడు. రాజుతో మాట్లాడుటకు అనుమతి ఇవ్వాలని అతడు దేవుని బలవంతము చేశాడు. చివరికి, అతడు వెళ్లుటకు దేవుడు అనుమతి ఇచ్చాడు. వారితో ఎలా మాట్లాడాలో సలహా కూడా దేవుడు అతనికి ఇచ్చాడు. ఆధునిక క్రైస్తవులు దీనిని నిశ్చయముగా దేవుని చిత్తమని భావించేవారు. మనం తిరుగుబాటుతో నిండియున్నట్లు ఆయన గ్రహించినప్పుడు మనకు నచ్చినది చేయుటకు దేవుడు అనుమతి ఇస్తాడని మనకు హెచ్చరించుటకు ఈ వాక్యభాగము ఉంది.

    దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ యొద్దనున్న యీ మనుష్యులు ఎవరని అడుగగా,

    బిలాము దేవునితో యిట్లనెను -సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు

    -చిత్తగించుము; ఒక జనము ఐగుప్తునుండి బయలుదేరి వచ్చెను; వారు భూతలమును కప్పుచున్నారు; నీవు ఇప్పుడేవచ్చి నా నిమిత్తము వారిని శపింపుము; నేను వారితో యుద్ధముచేసి వారిని తోలివేయుదునేమో అని వీరిచేత నాకు వర్తమానము పంపెను.

    అందుకు దేవుడు నీవు వారితో వెళ్లకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పెను.

    కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెళ్లుడి; మీతో కూడ వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా

    మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్లి బిలాము మాతో కూడ రానొల్లడాయెననిరి.

    అయినను బాలాకు వారికంటె బహు ఘనతవహించిన మరి యెక్కువ మంది అధికారులను మరల పంపెను.

    వారు బిలామునొద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నాయొద్దకు వచ్చుటకు ఏమియు అడ్డము చెప్పకుము.

    నేను నీకు బహు ఘనత కలుగజేసెదను; నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసెదను గనుక నీవు దయచేసి వచ్చి, నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిరి.

    అందుకు బిలాము బాలాకు తన యింటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్ది పనినైనను గొప్పపనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటిమాట మీరలేను.

    కాబట్టి మీరు దయచేసి యీ రాత్రి ఇక్కడ నుండుడి; యెహోవా నాతో నిక నేమి చెప్పునో నేను తెలిసికొందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను.

    ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చిఆ మనుష్యులు నిన్ను పిలువ వచ్చినయెడల నీవు లేచి వారితో వెళ్లుము; అయితే నేను నీతో చెప్పిన మాటచొప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చెను.

    ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడ వెళ్లెను.

    అతడు వెళ్లుచుండగా దేవుని కోపము రగులుకొనెను; యెహోవా దూత అతనికి విరోధియై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితోకూడ నుండిరి.

    సంఖ్యా. 22:9-22

    ఇశ్రాయేలు ప్రజలు ఐశ్వర్యమును వెంబడించినప్పుడు వారు సంపూర్ణమైన దేవుని చిత్తము నుండి బయటకు వెళ్లిపోయారు.

    అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచి పోయిరి ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి

    వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ జేసెను.

    కీర్తనలు 106:13-15

    ఆధునిక సంఘము వలెనే ఇశ్రాయేలు ప్రజలు ధనాశకు లోనైయ్యారు. ఆ రోజులలో జరిగినట్లే, దేవుడు వారికి కూడా ఇహలోక వస్తువుల పట్ల తమ వాంఛను న్యాయమైనదిగా చూపుటకు వాక్యమును వాడుకునే ఐశ్వర్యమును గూర్చి మాట్లాడు బోధకులను ఇచ్చాడు.

    గొప్ప జనసముహము కలిగి ఐశ్వర్యమును గూర్చి తరచుగా వక్కాణించి మాట్లాడుట దేవుని చిత్తము అనిపిస్తుంది. గొప్ప జనసముహము కలిగియుండుట మరియు అనేక సంఘాల యొక్క సఫలత వారు చేయుచున్న ప్రతిదానిలో దేవుడు సంతోషించుచున్నాడు అనే ఒక ఆలోచనను కలిగిస్తుంది.

    ఐశ్వర్యము కొరకు వారు కలిగియున్న కోరికను దేవుడు తీర్చాడుగాని, వారు ధనాశ కలిగియుండుట వలన దేవుడు వారిని శిక్షించాడు కాబట్టి వారు అసంపూర్ణమైన దేవుని చిత్తములో ఉన్నారు. మరియు వారి ప్రాణములకు క్షీణత కలుగజేయుట వారికి ఇవ్వబడిన శిక్ష.

    వారు సరైన పని చేస్తుంటే దేవుడు వారిని శిక్షించేవాడు కాదు.

    తన ప్రజలు అభివృద్ధి చెంది ఫలించాలని దేవుడు ఆశపడుచున్నాడు గాని అది తప్పు మార్గములో తప్పు కారణముల వలన కాకూడదు. ఆయన వారికి ఐశ్వర్యము కలిగించాడు ఎందుకంటే ఆయన ఐశ్వర్యమునకు విరోధి కాదు. నేడు, దేవుడు సంఘమునకు ఐశ్వర్యమును కలిగిస్తున్నాడు గాని, దానికి తోడుగా ప్రాణముల క్షీణత, ఆత్మీయ లేమి, రోగం, విడాకులు, జారత్వము మరియు స్వలింగ సంయోగము ఉన్నట్లు ఉన్నాయి. దేవుడు మనకు ఇవ్వాలని కోరుకొనుచున్న వాటిని గూర్చి జాగ్రత్తపడద్దాము ఎందుకంటే మన సొంత విషయములను కోరుటతో పాటు వచ్చు శిక్షలను బట్టి మనం సంతోషించము.

    ఒక దూడను చేయమని అహరోనును బలవంతము చేయుట ద్వారా ఇశ్రాయేలు ప్రజలు అసంపూర్ణమైన దేవుని చిత్తములోనికి ప్రవేశించారు.

    వారిని నడిపించుటకు దేవతలను చేయమన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారి సొంత చిత్తమును అనుసరించినట్లుగా ఉంది.

    అహరోను వారి కొరకు దూడను చేయగా, విగ్రహారాధనతో కూడిన ఒక నూతన మతమును దేవుడు వారి కొరకు చేశాడని వారు ఆలోచించియుండవచ్చు.

    అహరోను దానిలో పాలివాడైనందున దేవుడు వారి నూతన మతమును అనుమతించాడని ఊహించి ఇశ్రాయేలీయులు దానిలో సంతోషించారు.

    దేవుని దాసుడు వారిని నడిపించినట్లు అనిపించినప్పటికీ, వారు దేవుని చిత్తములో లేరు. అసంపూర్ణమైన దేవుని చిత్తములో ఉండుట వలన వారు శిక్షను ఎదుర్కొనుటకు ఎక్కువ సమయం పట్టలేదు.

    మోషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చిలెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి.

    అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నాయొద్దకు తెండని వారితో చెప్పగా

    ప్రజలందరు తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి.

    అతడు వారి యొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి.

    నిర్గమ. 32:1-4

    హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి.

    తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి.

    ఐగుప్తులో గొప్ప కార్యములను హాముదేశములో ఆశ్చర్యకార్యములను

    ఎఱ్ఱసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి.

    అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసెదననెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను.

    కీర్తనలు 106:19-23

    దేవుడు కోరని బలిని అర్పించుట ద్వారా నాదాబు మరియు అబీహులు అసంపూర్ణమైన దేవుని

    Enjoying the preview?
    Page 1 of 1