Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

అజ్ఞానులుగా ఉండెడి వారు
అజ్ఞానులుగా ఉండెడి వారు
అజ్ఞానులుగా ఉండెడి వారు
Ebook340 pages1 hour

అజ్ఞానులుగా ఉండెడి వారు

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

ఈ ఉత్తమ పుస్తకములో, బిషప్ Dag Heward-Mills నమ్మకమనే ఒక పదార్థము ఒక నాయకుని యొక్క పనితీరును ఎలా స్థిరపరచునో బోధించును. బైబిలు సంబంధమైన, చారిత్రాత్మక మరియు సాహిత్య ప్రస్తావనలు ఉపయోగిస్తూ, ప్రతి విధమైన పాఠకునికి మరింతగా విషయాన్ని అనుసరించి ఈ విషయము రూపొందించబడెను.

LanguageTelugu
Release dateMay 24, 2018
ISBN9781641349420
అజ్ఞానులుగా ఉండెడి వారు
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to అజ్ఞానులుగా ఉండెడి వారు

Related ebooks

Reviews for అజ్ఞానులుగా ఉండెడి వారు

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    అజ్ఞానులుగా ఉండెడి వారు - Dag Heward-Mills

    విశ్వాస్యత మరియు అవిశ్వాస్యత

    అజ్ఞానులుగా ఉండెడి వారు

    డ్యాగ్ హెవర్డ్-మిల్స్

    పార్చమెంట్ హౌస్

    వేరుగా చెప్పబడని యెడల, లేఖన ఉద్దారములు అన్ని తెలుగు OV బైబిల్ వెర్షన్ నుండి సేకరించబడినవి.

    1వ అధ్యాయములో ఉన్న కొన్ని నేరువాక్యములు Rick Joynerచే రచింపబడిన The Final Quest అనే పుస్తకము నుండి సంగ్రహించబడినవి (1వ భాగములో ఉన్న నేరువాక్యములు – నరకముల యొక్క సమూహము దండెత్తుతున్నాయి, అనే శీర్షికలో 16-19 పేజీల నుండి తీసికొనబడినవి). అసలుగా ప్రచురింపబడినవి. © 1996. Morning Star Publications & Ministries, P.0. బాక్స్ 19409, Charlotte, NC 28219-9409, వారి అనుమతితో ఉపయోగింపబడినవి Order Department: 1-800-542-0278; Fax: 1-704-522-7212

    కాపీరైట్ © 2017 Dag Heward-Mills

    Dag Heward-Mills గురించి అధిక సమాచారం కొరకు:

    Healing Jesus Camp వద్ద తెలుసుకోండి

    mailto:evangelist@daghewardmills.orgకు వ్రాయండి

    వెబ్ సైట్: www.daghewardmills.org

    ఫేస్ బుక్: Dag Heward-Mills

    ట్విట్టర్: @EvangelistDag

    ISBN: 978-1-64134-942-0

    సమర్పణ: Rev. Robert Dodoo నకు

    నాకు సోదరునిగా నాకు శ్రేష్టమైన మనిషిగా ఉన్నందుకు వందనాలు

    అంతర్జాతీయ కాపీహక్కులు క్రింద అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి. విశ్లేషణలు లేక వ్యాసాలలో క్లుప్త ఉద్ధారముల కొరకు మినహా ఈ పుస్తకములోని ఏ భాగామునైనా ఉపయోగించుటకు లేక ముద్రించుటకు ముద్రణకర్త నుండి వ్రాతపూర్వక అనుమతి తీసుకొనవలెను.

    విషయ సూచిక

    1. అజ్ఞానము మరియు అవిశ్వాస్యత

    2. విశ్వాస్యతకు పది ధర్మాలు

    3. విశ్వాస్యతకు ఐదు నియమాలు

    4. విశ్వాస్యతకు ఆరు సూత్రాలు

    5. అవిశ్వాస్యతకు మూడు కారణములు

    6. అవిశ్వాస్యత కలుగు సమయము

    7. అవిశ్వాస్యత యొక్క ఆరు వ్యక్తీకరణలు

    8. క్రీస్తు యొక్క విశ్వాస్యత

    9. తండ్రి యొక్క విశ్వాస్యత

    10. విశ్వాస్యతకు మూడు పరీక్షలు

    11. విశ్వాస్యతకు ప్రతిఫలములు

    12. అవిశ్వాస్యతతో పోరాడుటకు ఏడు విధానములు

    అధ్యాయము 1

    అజ్ఞానము మరియు అవిశ్వాస్యత

    ఎవడైనను తెలియనివాడైతే తెలియని వాడుగానే యుండనిమ్ము.

    1 కొరింథీయులకు 14:38

    విశ్వాస్యత మరియు అవిశ్వాస్యతను గూర్చి తెలిసికొనుటకు చాలా విషయాలు ఉన్నాయి. నేర్చుకొనుటకు చాలా విషయములు ఉన్నప్పటికీ కూడా ఇంకా అజ్ఞానులుగానే ఉండుటకు ఇష్టపడే కొంతమంది అజ్ఞానులు ఇంకను ఉన్నారు. విశ్వాస్యత మరియు అవిశ్వాస్యత అను విషయములను నిర్దేశించే అనేకమైన నియమములను, ధర్మములను, నిబంధనలను మరియు వాస్తవాలను ఈ పుస్తకము కలిగి ఉంటుంది. నిరక్షరాస్యులు తిరుగుబాటుకు మరియు అవిశ్వాస్యతకు ఎక్కువగా లోనగుతూ ఉంటారు ఎందుకంటే వారు చేస్తున్న దానికి పరిణామాలు వారికి అంతగా తెలిసి ఉండవు. ఈ పుస్తకములోని బోధల ద్వారా, మీ జీవితములోనికి మీ పరిచర్యలోనికి అజ్ఞానము తీసుకొచ్చే అనేకమైన నష్టాలను మీరు అధిగమించగలుగుతారు.

    నాకు తెలిసినంత వరకు వేరే విషయముల కంటే కూడా అవిశ్వాస్యత వలననే అనేకమైన సంఘములు నాశనమగుచున్నవి! నా పరిచర్యలో మొదటి సంవత్సరములోనే ఈ విషయమును నేను కనుగొన్నాను. అనుభవములేని నా పరిచర్య కుట్ర, నిందలు, తప్పులను కనుగొనుట, అపవాదులు మరియు విడిపోవడం అనే అనేకమైన సాతాను దాడులను అనుభవించినది. ఆ రోజులలో నేను చూసిన గందరగోళమును మరి ఏ కాలములో కూడా చూడలేదు.

    పరిచర్యలో చాలా పిన్నవయసులోనే ఉండగా, అవిశ్వాస్యత మరియు దానితో కూడా ఉండే ఇతర దురలవాట్లు అపవాది యొక్క అంబులపొదిలో ఉండే అనేకమైన నాశనకర ఆయుధములు.

    అపవాది యొక్క ఉత్తమమైన ఆయుధం తంత్రములు, భూత వైద్యము, మరియు ఇతర రకములైన క్షుద్ర పూజలు అని చాలామంది క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు. అపవాది యొక్క ఆయుధముల వనరులలో ఇవన్నియు ఉన్నాయి అని నేను ఒప్పుకుంటాను.

    కాని సాతాను యొక్క అతి బలమైన ఉద్యమం అనేది మోసగించుటలో ఉన్నది అని ప్రజలు గమనించవలసిన విషయం. ఒకవేళ సాతాను నిన్ను మోసపరచగలిగితే, అది నిన్ను నాశనము చేయగలదు! న్యాయము మరియు సత్యము అనే పేరులో వారు దేవుని యొక్క వ్యక్తితోనే పోరాడుతున్నారు అని అనుకునేట్లు సాతాను అనేక మందిని నమ్మునట్లు చేస్తుంది. కాని, త్వరలోనే వారు చేసేది కేవలము మేకులకు మరియు ముళ్లకు ఎదురు తన్నడం తప్ప మరేమీ చేయడం లేదని చాలా బాధతో తెలుసుకుంటారు.

    పౌలు సంఘమునకు వ్యతిరేకముగా పోరాడుతూ దాని నాయకులలో ఒకడైన స్తెఫనును సంహరించుటకు పూనుకున్నప్పుడు ఆయన కనుగొన్నది ఇదే. చాలా మంచి మనసాక్షి కలిగిన మనిషి సౌలు. సమాధానముతో నిండిన పట్టణమైన యెరూషలేము నుండి ఇబ్బందులు కలిగించువారిని పారద్రోలుతున్నాను అని ఆయన చాలా నిష్టగా అనుకున్నాడు. నీతి కొరకు ఆయన చేసిన పోరాటంలో, సమాజమునకు హానికరముగా ఉన్నాయి అని ఆయన అనుకున్న కొన్ని వాటిని నిర్మూలము చేయాలని ఆయన అనుకున్నాడు. అబద్ధ బోధకులను మరియు పరిచర్యలను పసిగట్టి బట్టబయలు చేయడంలో తాము ఒక పరిశుద్ధమైన యుద్ధము జరిగించుచున్నాము అనుకొనేవారు చాలామందే ఉన్నారు. సౌలులానే, బలిపీఠములమీద వేషధారులుగా ఉన్న అనేకమందిని గూర్చిన సత్యాలు ఇతరులకు తెలుపుటకు వారికి ఒక దైవికమైన ఆజ్ఞ ఇవ్వబడినది అని వారు అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి సౌలు క్రీస్తునకే విరోధముగా పోరాడుతున్నాడు అని అపొస్తలుడైన పౌలు తెలుసుకొని చాలా ఆశ్చర్యపడిపోయాడు.

    అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను. అప్పుడతడు నేలమీదపడి – సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. – ప్రభువా, నీవవడవని అతడడుగగా ఆయన – నేను నీవు హింసించుచున్న యేసును; లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను...

    అపొస్తలుల కార్యములు 9:3-6

    ఆయన చేయుచున్న పని ఏమిటో ఆయన కనుగొనినప్పుడు నిజముగా పౌలు ఆశర్యపోయాడు! వారు చేయుచున్నదేమిటో ప్రజలకు తెలియనప్పుడు, వారు తరచు తప్పు చేస్తుంటారు. తానేమి చేయుచున్నాడో అతనికి తెలియదు గనుక ఆయన దేవుని వద్ద నుండి కరుణను పొందుకున్నాడు అని పౌలు తరువాత కాలములో అన్నాడు.

    నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనైయున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.

    1 తిమోతి 1:13

    విశ్వాసము, విశ్వాస్యత, నిలకడ, ఖచ్చితత్వము అనునవి కలిగి ఉండుటలో సామర్థ్యం లేకుండా ఉండడం అనేది పరిచర్యలను నాశనం చేసే ఒక గొప్ప వినాశిని. అది వ్యాపారములను కూడా నాశనము చేస్తుంది. ఒక చిన్నదైన, త్వరితమైన మరియు సులువైన మార్గము అంటూ ఉంటుంది అనేది ప్రజలందరి యొక్క ఆలోచన. ఆ ఆలోచననే సాతాను పట్టుకుంటాడు.

    తిరుగుబాటుదారులను మరియు అసంతృప్తితో ఉన్న దార్శనికులను వెంబడించుటకుగాను క్రైస్తవులు పురికొల్పబడతారు. అజ్ఞానంతో చాలా మంది ఈ పనులను చేస్తుంటారు. నిరంకుశులైన సంఘ నాయకులను వెంబడిస్తూ తిరుగుబాటు తనము మరియు అవిశ్వాస్యత అనేవాటిని సంఘములో పెంపొందించునట్లు వారి మాదిరిని అపవాది ఉపయోగిస్తాడు. వారు చెప్పే విషయాల ద్వారా మరియు వారు చేసేవాటిని బట్టి కూడా వారు తిరుగుబాటుతనమును ప్రోత్సహిస్తారు. వారిపట్ల ఒకరు ఎందుకు అవిశ్వాసులుగా మరియు విశ్వాస్యతలేనివారిగా ఉంటున్నారో వారిది తెలియదు. మీరు చూడండి, మోసగించడం అనేది చాలా బలమైన విషయం. మీరు మోసగిమ్పబడినప్పుడు తెలుపే నలుపుగా నలుపే తెలుపుగా అనుకుంటారు.

    అవిశ్వాస్యతను గూర్చిన దర్శనం

    The Final Quest అనే పుస్తకములో దేవుడు Rick Joyner అనే రచయితకు ఇచ్చిన ఆలోచనలను బట్టి నేను నిజముగా ఆశ్చర్యపోయాను. సంఘమునకు వ్యతిరేకముగా దండెత్తి వస్తున్న ఒక పెద్దదైన సాతాను సైన్యమును గూర్చి ఆయన అక్కడ వివరిస్తున్నాడు. సహవాసములలో ఉండే అనేకమైన విధానాలలో ఏదో విధంగా విభజనలు తేవడమే ధ్యేయంగా ఈ సాతాను యొక్క సైన్యం కొనసాగుతుంది: ఒక సంఘముతో ఇతర సంఘములు, సంఘ విశ్వాసులకు మరియు వారి సంఘకాపరికి, మరియు భార్యభర్తల మధ్యన కూడా విభజనలు తేవాలనునదే వీటి ధ్యేయం.

    ఈ రచయితకు ఇవ్వబడిన ప్రత్యక్షతలోని మరొక పేర్కొనదగిన విషయం ఏదనగా ఈ సాతాను యొక్క సైన్యము మోసుకొని వెళుతున్న ఆ ఆయుధములు. వారు మోస్తున్న బల్లెములు ఏమంటే ‘దగా’ అనేది నేను గమనించాను. ఈ దగా అనునది అవిశ్వాస్యతలో ఉన్నతమైన దశ అని మీకు తెలుసా? సాతానుకు ఉన్న ఆయుధములలో ఒకదానికి మాత్రమే పేరు ఇవ్వబడినది, ఆ పేరే దగా, ఇది చాలా ఆశక్తికరమైన విషయం. సంఘమునకు వ్యతిరేకముగా సాతాను ప్రయోగించే ప్రధానమైన బల్లెము ఏమంటే ఈ అవిశ్వాస్యత మరియు దగాకోరుతనము.

    ఈ విషయములను గూర్చి ఆలోచిస్తూ ఉండగా, ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటున్న సంఘములు అవిశ్వాస్యత మరియు దగా అనువాటివలన ఈ ఇబ్బందులను అనుభవించాయి అని నేను గుర్తించాను. నేను అభినందిస్తూ పెరిగిన అనేకమంది దేవుని దాసులను గూర్చి మరియు వారి పరిచర్యలు ఏవిధంగా పడిపోయాయో కూడా నేను ఆలోచించాను. ఈ సంఘటనలన్నిటి నేపధ్యంలో అవిశ్వాస్యత అనునది చాలా పెద్దదైన పాత్రనే పోషించింది.

    ఈ దర్శనములో నాలుగు బాణములను గూర్చి తెలుపబడింది: నిందారోపణ, కొండెములు, అపవాదులు, మరియు తప్పులను కనుగొనడం. మాములుగా చూస్తే, ఈ బాణములు అంత ప్రభావంతమైనవిగా అనిపించవు. అసలు సాతాను ప్రయోగించే బాణములుగానే ఇవి అనిపించవు. కాని, కొన్ని సంవత్సరముల పాటు పరిచర్యలో కొనసాగిన తరువాత అపవాది ప్రయోగించే అత్యంత శాతివంతమైన ఆయుధములు ఇవే అనే విషయాన్ని నేను గుర్తించాను. మొదటి చూపులో, ఈ సమస్యలనన్నిటిని అంతగా అనుభవంలేనివారు చాలా తక్కువగా ప్రక్కకు నెట్టేస్తారు.

    ఇక్కడ పేర్కొనబడిన ఈ బాణములను ఒక దైవసేవకుడు చాలా సునాయాసంగానే ఎదిరించగలడు అని చాలా మంది అనుకొనే ఉంటారు అని నేను అనుకుంటున్నాను. నిందలు అనునవి నిందకు గురగుతున్న వ్యక్తిని బలహీనపరచి, గందరగోళముకు గురిచేసి, ఆఖరుకు కుంటుపరుస్తాయని అపవాదికి తెలుసు. నిందితుడు ఎంతటి అమాయకుడైన పర్వాలేదు, ఒకసారి నింద మోపబడిన తరువాత సదరు వ్యక్తి కొంత గందరగోళమునాకు గురవుతాడు. అసలు నన్ను గూర్చి వీరు ఎందుకు ఈ విధంగా అనుకుంటున్నారు? అని ఆయన అనుకుంటాడు. ఈ నిందలు అనునవి ఎంతటి బలమైనవి అంటే, ఆఖరుకు అవి చెప్పగా చెప్పగా ఒక అమాయకమైన వ్యక్తి కూడా వాటిని నమ్మేయగలుగుతాడు. నిందితుని ఈ నిందలు కుంటివానిగా చేయగలవు. ఒకసారి కుంటుపడిపోయిన తరువాత, వారు అసలు పనిచేయలేని స్థితిలో నెట్టివేయబడతారు. ఆ నిందలు వ్యాపించగా, ఆ విషము వ్యాపించబడిన ఆ ప్రదేశాలలో సదరు నిందితుడు అసలు వెళ్లుటకు కూడా సాహసించడు. అపవాదు, కొండెము మరియు తప్పులు కనుగొనడం అనేవి అన్ని కూడా నిందలో భాగములే. ఈ విషయములన్నియు సంఘమును బలహీనపరచి, కుంటుపరచి గందరగోళములోనికి నెట్టివేస్తాయి. ఈ గందరగోళము సంఘములోను అలాగే సంఘము వెలుపల కూడా ఉంటుంది. నిందితుడు గందరగోళములో ఉంటాడు అలాగే వాటిని వినేవారు కూడా గందరగోళములో ఉంటారు. ఈ గందరగోళమును చాలా మంది అధిగమించలేరు కూడా. కొందరు వీటిని అసలు స్వీకరించలేరు మరియు ఇంకొందరైతే అసలు పరిచర్యలోనే కొనసాగలేరు. శత్రువు చేతిలో ఇది అంతటి బలమైన ఆయుధం! ఈ విధమైన నిందకులను జయించినప్పుడు సంఘమునకు బలము వస్తుంది అని లేఖనములు చెప్పడం అంత విశేషం ఏమి కాదు. నిందితుని స్వరము నీవు వినినంత వరకు, కొంతమట్టుకు నీవు బలహీనపడతావు.

    మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్లు మన దేవుని యెదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడియున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.

    ప్రకటన గ్రంథము 12:10

    దేవుని ప్రజలపై విరామము లేకుండా నిందలు వస్తూనే ఉంటాయి ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక పెద్ద పట్టణములో ప్రారంభ సేవ చేసిన ఒక దైవసేవకుని గూర్చి నాకు తెలుసు. ఆయన ద్వారా, చాలా మంది రక్షింపబడ్డారు మరియు అనేకమంది సేవకులు కూడా తర్ఫీదు పొందారు. ఆయన ఆ పట్టణమును వదులునంత వరకు నిందలు మోపబడ్డాడు మరియు కొండెములాడబడ్డాడు. ఆయన తప్పులు ఎంతగా ఎక్కువగా చూపబడ్డాయి అంటే అసలు ఆయనలో ఏమి మంచి లేదా అనునంతగా చూపబడ్డాయి. ఫలిగంతా, ఆయన ఆ పట్టణమును విడచి అసలు పరిచర్యనే వదిలేసాడు. సాతాను పనితీరు చాలా సులభం – వారిలో అసలు ఆత్మస్థైర్యం అయిపోయేవరకు వారిని నిందించడం! అసలు సమాజములోని వారిలో ఎవరు కూడా వారిని గూర్చి మంచిగా ఆలోచించనంతగా వారిని నిందించడం. వారు చేయుచున్నదానిని ఆపివేయడం.

    కాని, ఆయన విడచి వెళ్లిన చాలా సంవత్సరములకు ఆయనచే దీవించబడిన ప్రజలు ఆయనను తిరిగి పిలచి అభినందించారు. తన పరిచర్య యొక్క ఫలమును అక్కడ చూసినప్పుడు ఆయన ఆశ్చర్యపడిపోయి ఉంటాడు అని నేను భావిస్తున్నాను. నిందకుడు మరియు దాని సమూహము అంతయు కలిసి చేసిన ఆ నిర్విరామమైన దాడిలో ఓడిపోకుండా ఉంటే బాగుండేది అని ఆయన అప్పుడు గ్రహించి ఉండి ఉంటాడు. ఈ సంగతి జరిగిన తరువాత ఆయన తన పరిచర్యను పునఃప్రారంభించాడు అని చెప్పుటకు నేను సంతోషిస్తున్నాను.

    ఈ పుస్తకములో మరొక అద్భుతమైన ప్రత్యక్షత ఏమంటే అపవిత్రాత్మ శక్తులు గుఱ్ఱముల మీద కాక క్రైస్తవుల మీదనే స్వారీ చేస్తున్నాయి అని. మరొక విధంగా చెప్పాలంటే, అసలు వారికి తెలియకుండానే క్రైస్తవులు సాతానుచే ఉపయోగించబడుతున్నారు!

    క్రీస్తు సంఘమును విభజించుటలో అందవేసిన చేయి కలిగిన ఒక సేవకుడు నాకు తెలుసు. ఆయన పరిచర్యను గత పదిహేను సంవత్సరములుగా నేను పరిశీలించాను మరియు సంఘమును విభాజించుటకును సంఘములోనే వ్యతిరేక ‘గుంపులను’ తయారుచేయుటలో ఆయనకు ఒక ప్రత్యేకమైన వరము ఇవ్వబడినట్లుగా నేను గుర్తించాను. ఆయన యొక్క పనులు మరియు నిర్ణయాలు సంఘములో విభేదాలను సృష్టించడానికి దోహదపడుతున్నాయి అనే విషయం ఆయనకు కూడా తెలియదు అనుకుంటున్నాను. వీటన్నిటిని ఆయన అసలు కష్టం లేకుండానే మరియు అభినందనీయమైన దౌత్యంతో చేస్తున్నాడు! ఆయన ఎంతటి మర్యాదగా మాట్లాడగలడు, ఎంతటి మర్యాదగా కనబడతాడంటే, అసలు ఆయన సంఘములో విభజనలు తెస్తున్నాడని చెపితే నువ్వు నమ్మను కూడా నమ్మలేవు. ఆయన పనులను గూర్చి ఆలోచించుటకు నీవు కొంత సమయము తీసికొని కూర్చుంటేనే తప్పు ఆయన ఎంతటి గూండానో నీకు తెలియదు.

    సాతాను సైన్యములను గూర్చి Rick Joyner పొందిన ఆ దర్శనములోని కొన్ని పేరాలను నేను ఇక్కడ పెడుతున్నాను. మీరు స్పష్టంగా సాతాను యొక్క వ్యూహాలను చూస్తారని నేను ప్రార్థిస్తున్నాను:

    "ఆ అపవాది యొక్క సైన్యము

    Enjoying the preview?
    Page 1 of 1