Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

సంఘస్థాపన
సంఘస్థాపన
సంఘస్థాపన
Ebook369 pages1 hour

సంఘస్థాపన

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

సంఘముల నిర్మాణము ఆకర్షణీయ కాపరులలో బహుగా వ్యాపించిన విషయము. ఆరంభ శిష్యులకు ఇది ప్రధాన క్రియ. విజయవంతమైన సంఘ స్థాపన, ఏదైనప్పటకీ, నైపుణ్యత మరియు అనేక విషయాలను హత్తుకొనుట కోరును. Dag Heward-Mills ఈ పుస్తకములో సంఘ స్థాపనలో అనేక భాగములను వర్ణించును. ఇది తన జీవితము కొరకు సంఘ నిర్మాణం దర్శనము చేసికొనవలనంటే ఏ కాపరికైనా తర్ఫీదు పుస్తకం.

LanguageTelugu
Release dateMay 24, 2018
ISBN9781641347990
సంఘస్థాపన
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to సంఘస్థాపన

Related ebooks

Reviews for సంఘస్థాపన

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    సంఘస్థాపన - Dag Heward-Mills

    సంఘ విస్తరణ

    ఎదగడం

    కొ న్ని సార్లు అసలు సంఘము అనునది ఎదుగుతుందా లేదా అని కొందరు ఆశ్చర్యపడుతుంటారు. సంఘములో ఎన్నో కార్యక్రమములు ఉంటున్నాయి మరియు ఎన్నో కార్యక్రమములను జరుపుతుంటారు. కాని నిజానికి దేవుని యొక్క రాజ్యము ముందుకు సాగుతుందా లేక అది కేవలం ఒక వృత్తంలో మాత్రమే తిరుగుతుందా?

    కొన్నిసార్లు పెద్ద పట్టణాల్లో కొన్ని సంఘాలు వెలియడం మీరు చూస్తుంటారు. తరచుగా, ఈ క్రొత్త సంఘాలను గూర్చే ఎక్కువగా ఆ పట్టణవాసులు మాట్లాడుతుంటారు మరియు దేవుడు ఏదో ఒక నూతనమైన క్రియను చేస్తున్నాడు అన్నట్లుగా ఆ సంఘాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ సంఘమునకు వెళ్లడం ప్రారంభిస్తారు మరియు ఈ నూతనమైన కార్యమును అందరు మెచ్చుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ నూతనమైన ఉద్యమాలను చాలా దగ్గరగా చూచినప్పుడు, కేవలం దగ్గరలో ఉన్న మరొక సంఘమునుండి వలస వచ్చినవారితోనే ఆ సంఘము నిండుతుంది తప్ప మరేమీ లేదు అని అర్థమౌతుంది.

    దేవుని యొక్క రాజ్యము అనునది ఎప్పుడు ఏదో ఒక క్రొత్త కొరకు లేదా ఆసక్తికరమైనదానికొరకు ఎదురుచూచే శరీరానుసారమైన క్రైస్తవులతో నిండి ఉంది. వారి సంఘాలు ఎదుగుతున్నాయి మరియు వారి సంఘములలో ఉజ్జీవం ఉంది అని చూచి చాలా మంది దైవసేవకులు చాలా ఉత్సుకతతో ఉంటారు. వాస్తవానికి, ఆ సంఘములో చాలా తక్కువ సమిష్టమైన ఎదుగుదల కనిపిస్తుంది. ప్రజలు కేవలం ఒక సంఘము నుండి మరొక సంఘమునకు తిరుగుతున్నారు అంతే. వాస్తవికతలో దేవుని రాజ్యము అనునది ఎదగవలసిన అవసరత ఎంతైనా ఉంది.

    చాలా సంవత్సరముల క్రితము, ఆఫ్రికా మరియు ఆసియా ఖండములకు ఐరోపా వారు సువార్తీకులను పంపారు. సమర్పణతో కూడిన ఈ పని ద్వారా, చాలా దేశములు క్రైస్తవీకరణ చేయబడ్డాయి. మునుపు అన్యజనులుగా ఉన్నవారు క్రీస్తులోనికి మార్చబడ్డారు. మనలను మనం మోసపరచుకొనకూడదు: నేటి ప్రపంచంలో ఇంకా అనేకమంది అన్యులుగానే ఉన్నారు. ప్రభావవంతమైన సంఘము లేదా సేవకుడు అనే సౌకర్యాలు లేని సమాజాలు నేటికి కూడా చాలానే ఉన్నాయి. క్రైస్తవీకరణ చేయబడని ప్రదేశాలలో సంఘమును వృద్ధిపరచుటకు గాను నిజమైన అవసరత ఈనాడు మరి ఎక్కువగా ఉంది.

    రెండువందల సంవత్సరముల క్రితము ఐరోపీయులు సువార్తీకులను పంపినప్పుడు, లోకములో కేవలం నూరుకోట్ల మంది ప్రజలు మాత్రమే ఉన్నారు. కాని నేటికాలంలో, 2004 సంవత్సరమును చూస్తే, ప్రపంచంలో 610 కోట్లమంది ప్రజలు ఉన్నారు. ప్రజల దామాషా ప్రకారం ఉన్న వైద్యుల సంఖ్యను గూర్చి లోకము ఎప్పుడు సణుగుతూనే ఉంటుంది.

    కాని ప్రజల దామాషా ప్రకారం దైవసేవకుల నిష్పత్తిని గూర్చి బాధపడేవారు అసలు ఎవరైనా ఉన్నారా? నేటికాలంలో జీవిస్తున్న కోట్లకొలది ప్రజల దృష్ట్యా ఎంతమంది సువార్తీకులు ఉన్నారు?

    రాజ్యమును వృద్ధిపరచుట ఎలా

    మనము క్రీస్తు యొక్క నిర్దేశములను అనుసరించినప్పుడు దేవుని రాజ్యము వాస్తవికమైన వృద్ధిని చూస్తుంది. యేసు యొక్క ఆఖరు ఆజ్ఞ ఈ లోకములోనికి వెళ్లి ప్రజలను శిష్యులనుగా చేయడం.

    అయితే యేసు వారియొద్దకు వచ్చి – పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.

    మత్తయి 28:18-20

    ఈ లేఖన భాగములో, దేవుని యొక్క వాక్యమును అందరికి బోధించమని యేసు మనందరికీ చెప్తున్నాడు. నీవు ప్రజలను క్రమముగా సమీకరించకుండా వారికి బోధించలేవు.

    వాస్తవానికి అసలు సంఘము అనగా ఏమి

    ఉపదేశమును పొందు నిమిత్తము క్రైస్తవులు క్రమముగా కూడుకోవడమే సంఘము. మరొక విధంగా చెప్పాలంటే, ఈ లోకము అంతటిలోనికి వెళ్లి వాక్యమును ప్రజలకు బోధించడానికి క్రమముగా వారిని సేకరించమని మన ప్రభువు మనకు చెప్తున్నాడు. ఉపదేశించదగిన ప్రజలను ఒకచోట కూర్చే పనిని దేవుడు పెట్టుకున్నాడు. ఈ లోకములోని అనేక ప్రాంతములకు వెళ్లి క్రమముగా ప్రజలను సమీకరించి వారికి తన వాక్యమును బోధించు నిమిత్తము దేవుడు తన ఆత్మ ద్వారా మనుష్యులను లేపుతున్నాడు.

    ఎన్ని అధికమైన సమూహాలు మరియు గుంపులు ఉంటాయో, అంత ఎక్కువగా ఈ గొప్ప ఆజ్ఞ నెరవేర్చబడుతుంది. ఎంత ఎక్కువగా గుంపులు బోధించబడతాయో, అంత ఎక్కువగా ఈ గొప్ప ఆజ్ఞ అనేది నెరవేర్చబడినట్లు అవుతుంది. ఈ గుంపులు యేవో కావు అవి ప్రభువునకు విధేయులుగా ఉండే సేవకులచే స్థాపించబడిన సంఘములే.

    ప్రజలను ఆకర్షించుకోవడానికి మనము ఇష్టపడతాము

    దురదృష్టవశాత్తు, ప్రజలు ఏమనుకుంటున్నారో అనే చాలా మంది దైవసేవకులు ఆలోచిస్తూ ఉంటారు గనుక, ఈ గొప్ప ఆజ్ఞను వారు అంతటి ప్రభావవంతంగా నెరవేర్చలేకపోతున్నారు. అందరు చూడటానికి బాగుండునట్లు పెద్ద పెద్ద సంఘమును కలిగి ఉండటానికి మనం ఇష్టపడతాము! మనము గొప్పవారమని ప్రజలు మనగూర్చి అనుకోవాలని మనం అనుకుంటాము. ఇంతా చూస్తే, మన సంఘములో ఎంత ఎక్కువగా ప్రజలు ఉంటే, అంత గొప్పవానిగా ఆ సంఘకాపరి కనబడతాడు అని మనం అనుకుంటాం.

    జనసమృద్ధి కలుగుటచేత రాజులకు ఘనత వచ్చును…

    సామెతలు 14:28

    ఈ గొప్ప ఆజ్ఞను నెరవేర్చుటకుగాను సాధ్యపడే ప్రతిఒక్క ప్రదేశములో ఒక్కొక్క సంఘమును స్థాపించవలసిన అవసతర ఉంది. ప్రపంచము యొక్క విస్తీర్ణత మరియు ప్రజల యొక్క దామాషా అనేకమంది సేవకులు మరియు ప్రజలు ఒక సంఘమునుండి బయటకు వెళ్లి వివిధ ప్రదేశాలలో అనేకమైన సంఘములను స్థాపించవలసిన అవసరతను కలిగిస్తున్నాయి. మన ప్రభువు యొక్క ఆజ్ఞకు విధేయులగుటకు సుముఖత చూపుతున్నట్లయితే, దీనికి విధేయులగుటకు మినహా మరేమీ చేయలేము.

    నాయకులు అనేవారు శిక్షణ పొందాలి. సేవకులు శిక్షణ పొందాలి. పనివారు శిక్షణ పొందాలి. సంఘములో ఉన్న సూపర్ స్టార్ ఆలోచనలు పోవాలి. ఈ విధమైన ఆలోచన ప్రతి ఒక్కరు గుర్తించి పొగుడునట్లుగా ఒక పెద్ద పాస్టరుగారు ఉంటే బాగుండు అని చెప్తుంది.

    బాగా పెద్దదైన సంఘమునకు కాపరియైనవాడు పరలోకములో చాలా గొప్పవాడుగా ఉంటాడు అని మనం అనుకుంటాము. కాని ఇది నిజం కాదు. పరలోకములో గొప్పవానిగా ఉండగోరు దైవసేవకుడైనవాడు అత్యంత దీనునిగా పసిపిల్లలకు ఉండే మనసును కలిగి ఉండేవానిగా ఉండాలి.

    ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారి మధ్యను నిలువబెట్టి యిట్లనెను – మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు.

    మత్తయి 18:1-4

    పరలోక రాజ్యములో ఎట్టివాడు గొప్పవాడిగా ఉండబోతున్నాడో యేసు చాలా స్పష్టంగా చెప్పాడు. నీ సంఘము యొక్క పరిణామమును చూచి నీ విధేయత ఎంత ఉందో ఎవరూ చెప్పలేరు. నిజానికి, పెద్ద సంఘములు ఉన్న సేవకులకంటే చిన్న చిన్న సంఘాలు ఉన్న సేవకులే ఎక్కువగా విధేయులుగా ఉంటారు (కాబట్టి వారు పరలోకరాజ్యములో గొప్పవారు).

    మనకు ఏది అవసరం అంటే అధిక సమాజాలు, అధిక సంఘాలు, మరియు మన యజమానుని కొరకు మరి యెక్కువ ఫలము. మనం సంఘాలను స్థాపిద్దాం! ప్రతి ఒక్క తలుపు దగ్గర ఒక సంఘము మరియు ప్రతి ఒక్క భాషలో ఒక సంఘము అనేది ప్రతి దైవసేవకుని నిజమైన గురియై ఉండాలి. ప్రతి ఒక్క కరెంటు స్తంభము క్రింద మరియు ప్రతి ఒక్క చెట్టు క్రింద ఒక సంఘము ఉంటే అప్పుడు రాజ్యము వృద్ధి చెందుతుంది.

    ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం మానేద్దాం! మన సంఘముల పరిణామమును బట్టి మన పరిచర్యలను అంచనా వేసుకోవడం మానేద్దాం. సమూహాలను నిర్మిద్దాం. ప్రియ సంఘ నాయకుడా, మనుష్యుల యొక్క మెప్పు కోసం చూడకు కాని దేవుని యొక్క మెప్పు (సమ్మతి మరియు మద్దతు) కొరకు చూడు.

    అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పునుకోరక (సమ్మతి మరియు మద్దతు) యొకనివలన ఒకడు మెప్పుపొందుచున్న (సమ్మతి మరియు మద్దతు) మీరు ఏలాగు నమ్మగలరు?

    యోహాను 5:44

    సువార్త చేయడం అంటే గొప్ప ఆజ్ఞను నెరవేర్చడమేనా?

    సువార్త పని మరియు బహిరంగ సభలు అనేవి మంచివే, ఎందుకంటే ఈ ఉపదేశములను ప్రజలకు ఇవ్వడానికి అవే ఆరంభ క్రియలు. సువార్తీకుడు అనేవాడు ముందుకు వెళ్లాలి. కాని అవి నిజంగా గొప్ప ఆజ్ఞను నెరవేర్చుచున్నాయా? అవును మరియు కాదు! అవును, ఎందుకంటే అవి ఈ క్రమాన్ని ప్రారంభిస్తున్నాయి మరియు కాదు, ఎందుకంటే సంఘములు స్థాపించుట ద్వారా కలుగు బోధ లేకుండా, ఈ గొప్ప ఆజ్ఞ నెరవేర్చబడలేదు.

    తేలికగా చెప్పాలంటే, గొప్ప ఆజ్ఞ అంటే ఏంటంటే సువార్తీకరణ మరియు తద్వారా జరిగే సంఘ స్థాపన. సంఘములు అనేవి కూడుకొనే సమూహాలు మరియు ఈ సమూహాలకు ఆ తరువాత దేవుని వాక్యము బోధింపబడుతుంది.

    ఎన్నడు సువార్త లేని ప్రదేశాలలో సంఘస్థాపన చేయండి

    అన్నిటికంటే ముఖ్యముగా ప్రభువు మనలను నడిపించిన స్థలములలో సంఘాల స్థాపన జరగాలి. పట్టణాలలో మరియు గ్రామాలలో సంఘాలు స్థాపించబడాలి.

    ఎన్నడు సువార్త లేని ప్రదేశాలలో సంఘ స్థాపన యొక్క ఆవశ్యకతను నేను చూడగలను. ఇప్పటికే సంఘములు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో మనము ఎక్కువగా దృష్టి నిలుపుతూ ఉంటాము. కాని, దేవుడు మనలను పిలిచి వెళ్లమని చెప్పిన అనేకమైన సువార్త వినని ప్రదేశాలు ఉన్నాయి. ఆత్మల రక్షణ మరియు సంఘముల స్థాపన పట్ల ఉన్న ఆసక్తి సంఘములోనికి రావాలి మరియు మన యౌవనులను ఈ పని నిమిత్తము మనము సమర్పించుకోవాలి.

    సంఘములు అసలు పట్టనట్లుగా ఉంటుండగా, ఆఫ్రికాలోని ఎక్కువ ప్రాంతాలలో మరియు ప్రపంచంలో కూడా ఇస్లాం మతము ప్రబలుతుంది అని సేవకులు జ్ఞాపకము ఉంచుకోవాలి. ముస్లింలు చాలా సమర్పణ కలిగినవారు గనుక అనేక దేశాలలో ఉన్న సుదూర పట్టణములకు గ్రామాలకు వెళ్లుటకు వెనకాడరు.

    ఈలోగా, భూదిగంతముల వరకు వెళ్లి సువార్త చేయమని ఆజ్ఞాపించబడిన క్రైస్తవులు, చాలా సమీప ప్రాంతాలలో మరియు అత్యంత సుఖవంతమైన ప్రపంచంలో కూర్చొని అసలు బయటకు వెళ్లుటకు ఇష్టపడట్లేదు!

    అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతట భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను! (ఇది ఏ బైబిల్ లో వాక్యం?)

    అధ్యాయము 2

    సంఘస్థాపకుల యొక్క ఆలోచనా విధానం

    ఈ మనస్సు మీరును కలిగియుండుడి.

    ఫిలిప్పీయులకు 2:5

    తా ను చేసిన పనులను క్రీస్తు చేయుటకు ఆయనకు ఒక ఆలోచనా విధానం ఉంది. క్రీస్తు ఆలోచించిన విధముగానే మనము కూడా ఆలోచించాలని ఈ వచనము మనకు బోధిస్తుంది. ఈ మనస్సు మీరును కలిగియుండుడి అంటే అర్థం ఇదే. నీ మనస్సు ఒక విధముగా పనిచేసినప్పుడు మాత్రమే నీవు దేవుని యొక్క చిత్తమును పూర్తిగా నెరవేర్చగలుగుతావు.

    నీవు ఒక సంఘ స్థాపకునిగా పనిచేయాలంటే నీ మనస్సు అనేది ఎలా పని చేయవలసి ఉంది అనే విషయాన్ని నేను వ్రాస్తున్నాను. ఈ పునాది లేకుండా, సంఘస్థాపన అనే ఒక కష్టతరమైన పనిలో ఎవరూ కూడా ముందుకు సాగలేరు.

    1. నీ పనులను దేవుడు చాలా విశదంగా పరిశీలిస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.

    ప్రియ స్నేహితులారా, నీవు ఈ భూమిపై చేస్తున్న పనులు దేవునిచే బేరీజు వేయబడుతున్నాయి. దేవుడు నీలో ఉంచినదానిని గూర్చి నిన్ను ఆయన లెక్క అడుగనైయున్నాడు. ఆయన ఇచ్చిన తలాంతులను ఉపయోగించి నీవు ఏమి చేసావో అడుగనైయున్నాడు. ఆయన నీకు దయచేసినవాటిని నీ దగ్గర నుండి తిరిగి కోరనైయున్నాడు. నీ పనులను గూర్చి ఆయన విచారణ చేస్తాడు!

    ఏడు సంఘములకు వ్రాయబడిన ఏడు పత్రికలలో కూడా, ఒక మాట మరలా మరలా పునరావృతం చేయబడింది – నీ క్రియలు నేనెరుగుదును. ఏమి క్రియలు ఇవి? ఇవి ఏవైనప్పటికీ కూడా, ప్రతి సంఘము కూడా ఈ క్రియలను తమ తమ స్థానములో సరిగా చేయవలసినవిగా ఉన్నాయి. ఈ క్రింది వచనములను గమనించండి:

    నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు...

    ప్రకటన గ్రంథము 2:2

    నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనువంతుడవే; తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము.

    ప్రకటన గ్రంథము 2:9

    సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియై యుండి నన్ను గూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును.

    ప్రకటన గ్రంథము 2:13

    నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటిక్రియలకన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును.

    ప్రకటన గ్రంథము 2:19

    సార్దీస్ లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము – ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు చెప్పు సంగతులేవనగా – నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే.

    ప్రకటన గ్రంథము 3:1

    నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచెమైయుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచియున్నాను; దానిని ఎవడును వేయనేరడు.

    ప్రకటన గ్రంథము 3:8

    నీ ఇల్లు మరియు నీ కారులు నాకు తెలుసు అని దేవుడు అనలేదు. నీకున్న మెర్సిడెస్ బెంజ్ కారు నాకు తెలుసు అనలేదు. కాని, నీ క్రియలు నేనెరుగుదును అని అన్నాడు! నీకున్న పట్టాలు నాకు తెలుసు అనలేదు; నీ తల్లిదండ్రులు నాకు తెలుసు అనలేదు. నీ క్రియలు నేనెరుగుదును అని అన్నాడు.

    2. దేవునితో కడవరకు వెళ్లుటకుగాను సంఘస్థాపన అనేది ముఖ్యమైన తాళపుచెవి.

    తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిపోగొట్టుకొనును; నా నిమిత్తమును సువార్తనిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొనును.

    మార్కు 8:35

    1985వ సంవత్సరములో దేవునితో కడవరకు వెళ్లాలని నేను నిర్ణయం తీసుకున్నాను. పాఠశాలలో నేను వైద్యంలో ఒక కష్టమైనా పరీక్షను కూడా వ్రాసాను. నా అభిప్రాయం ప్రకారం, నేను ఆ పరీక్షలో అరకొరగా పాసయ్యాను. ఆ పరీక్ష కొరకు నేను పడిన ప్రయాసను తలచుకుంటే, ఇంకా అధిక ప్రయాసను తలచుకుంటే, అసలు నాకు వచ్చిన ఫలితం అంత సరిగా వచ్చినదనిపించలేదు. వైద్యవృత్తి కొరకు ఎందుకు నేను అంతగా ప్రయాస పడాలి? ఈ కారణము కొరకు నేను ఎందుకు నా జీవితాన్ని ధారపోయాలి?

    ఆ దినము మొదలుకొని దేవుని పని కొరకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అని నేను నిర్ణయించుకున్నాను. మొదటిలో నా జీవితములో

    Enjoying the preview?
    Page 1 of 1