Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

ఒక బలముగల క్రైస్తవునిగా నీవెట్లు కాగలవు
ఒక బలముగల క్రైస్తవునిగా నీవెట్లు కాగలవు
ఒక బలముగల క్రైస్తవునిగా నీవెట్లు కాగలవు
Ebook246 pages1 hour

ఒక బలముగల క్రైస్తవునిగా నీవెట్లు కాగలవు

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

యేసు క్రీస్తును నీ దేవునిగా రక్షకునిగా పొందుకొనుట ద్వారా నీవు రక్షింపబడ్డావు! నీవు ఒక తిరిగి జన్మించిన క్రైస్తవునివి మరియు నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడినది. నీ ప్రశ్న: “తీసికొనవలసిన తరువాత మెట్టు ఏమిటి?” క్రైస్తవునిగా మారడం ఒక మంచి మెట్టు, కాని అది కేవలం ఆరంభము. నీవు ఒక మంచి, బలమైన క్రైస్తవునిగా మారుటకు బద్ధుడవై యుండాలి. ‘నేను అది ఎలా చేయగలను?’ – ఈ ఉత్తమమైన పుస్తకములో, ఎవరైతే మరణమునకు లేక ఎత్తబడుటకు సిద్ధముగా నున్నాడో అలాంటి ఒక బలమైన క్రైస్తావునిగా ఉండుటకు మరియు నిలచుటకు తీసికొనవలసిన విధానములను నీవు నేర్చుకొందువు.

LanguageTelugu
Release dateMay 25, 2018
ISBN9781641348386
ఒక బలముగల క్రైస్తవునిగా నీవెట్లు కాగలవు
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to ఒక బలముగల క్రైస్తవునిగా నీవెట్లు కాగలవు

Related ebooks

Reviews for ఒక బలముగల క్రైస్తవునిగా నీవెట్లు కాగలవు

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    ఒక బలముగల క్రైస్తవునిగా నీవెట్లు కాగలవు - Dag Heward-Mills

    బలముగల క్రైస్తవునిగా ఉండుట అంటే ఏమిటి

    తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి.

    ఎఫెసీయులకు 6:10

    పరిశుద్ధగ్రంథమంతటిలో క్రైస్తవులు బలవంతులుగా ఉండునట్లు హెచ్చరించబడ్డారు. బలవంతులై యుండుడి అనే మాట పరిశుద్ధగ్రంథమంతటిలో అనేకమారులు పునరావృతమౌతుండడం నీవు చూస్తావు. బలవంతునిగా నీవు ఉండగోరినట్లయితే నిన్ను నీవే బలపరచుకోవాలి. చాలా మంది క్రైస్తవులు తమ శరీరములయందు, రాజకీయములలో, విద్యాభ్యాసములో, వ్యాపారములో, సంబంధబాంధవ్యములలో బలవంతులు కాని ప్రభువులో బలవంతులుగా లేరు. నీవు ప్రభువు యందు బలవంతునివిగా ఉండాలని దేవుడు ఉద్ఘాటిస్తున్నాడు.

    ప్రభువులో బలవంతులుగా ఉండడం అంటే బలమైన క్రైస్తవునిగా ఉండడం. చాల మంది ప్రభువును తెలుసుకుంటారు గాని ప్రభువునందు ఎన్నడు బలవంతులు కారు. వారి జీవితములో శేషభాగము అంతా ఆత్మ విషయములో నిర్బలులుగానే ఉంటారు. ఒక మంచి బలమైన క్రైస్తవునిగా నీవు ఎట్లు కాగలవో ఈ పుస్తకము నీకు బోధిస్తుంది. మంచి బలములగల క్రైస్తవునికి లక్షణాలు చాలానే ఉన్నాయి. ఒక బలమైన మంచి క్రైస్తవునిగా నీవు మారాలంటే ఈ గుణములన్నిటిని పెంపొందించుకొనుటకు నీవు దృష్టిచూపాలి. బలమైన క్రైస్తవునిగా ఉండాలంటే నీవు నీ ఆత్మీయతను, ఆశక్తిని, పరిణతిని, పరిశుద్ధతను, ప్రభువునందు అచెంచెలతను నీవు పెంపొందించుకోవాలి.

    ఒక బలమైన క్రైస్తవునిగా నీవు ఒకవేళ పిలువబడాలని ఆశించినట్లయితే నీ జీవితములో వృద్ధి పొందవలసిన కోణములు చాలానే ఉన్నాయి. ఒక బలమైన క్రైస్తవునిగా నీవు అగునట్లు నిన్ను వృద్ధిపరచుటకు ఈ పుస్తకము ఆద్యంతము నీకు దోహదపడుతుంది. ప్రభువునందు బలవంతునిగా నీవు ఉండాలని ఆశిస్తే నీవు పెంపొందించుకొనవలసిన తొమ్మిది విషయాలు ఈ క్రింది విధముగా ఉన్నాయి.

    బలముగల క్రైస్తవునిగా ఉండడం అంటే లోతైన క్రైస్తవ జీవితమును పెంపొందించుకోవడం.

    నీ జలప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా పొర్లి పారియున్నవి.

    కీర్తనలు 42:7

    బలముగల క్రైస్తవునిగా ఉండడం అంటే నిలకడగా నిలిచియుండడం.

    కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.

    1 కొరింథీయులకు 15:58

    బలముగల క్రైస్తవునిగా ఉండడం అంటే అచెంచెలునిగా ఉండడం.

    కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.

    1 కొరింథీయులకు 15:58

    బలముగల క్రైస్తవునిగా ఉండడం అంటే ఆత్మీయంగా ఉండడం.

    సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను.

    1 కొరింథీయులకు 3:1

    బలముగల క్రైస్తవునిగా ఉండడం అంటే పరిశుద్ధునిగా మారడం.

    అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండ ఎవడును ప్రభువును చూడడు.

    హెబ్రీయులకు 12:14

    బలముగల క్రైస్తవునిగా ఉండడం అంటే పరిణతిగల వానిగా అవడం.

    అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక

    ఎఫెసీయులకు 4:14

    బలముగల క్రైస్తవునిగా ఉండడం అంటే మంచి చేయువిషయములో ఆశక్తిగలిగి ఉండడం. ప్రభువునందు బలవంతునిగా ఉండడం అంటే రోషముతో నిండుకొని ఉండడం.

    నేను మీయొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక యెల్లప్పుడును మంచి విషయములో ఆసక్తిగానుండుట యుక్తమే.

    గలతీయులకు 4:18

    బలముగల క్రైస్తవునిగా ఉండడం అంటే ఫలాభివృద్ధి పొందడం.

    మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని.

    యోహాను 15:16

    బలముగల క్రైస్తవునిగా ఉండడం అంటే దేవుని ఏ సమయములోనైనా కలచుటకు సిద్ధముగా ఉండడం.

    కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీయెడల నేనీలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి.

    ఆమోసు 4:12

    నిన్ను నీవు బలపరచుకొనుటకు గల ఆరు కారణములు

    దుష్టుని జయించుటకుగాను నిన్ను నీవు బలపరచుకో.

    చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యౌవనస్థులారా, మీరు బలవంతులు, దేవునివాక్యము మీయందు నిలుచుచున్నది; మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను.

    1 యోహాను 2:14

    దుష్టుడైనవాడు బలహీనుడైతేకాదు. నీవు బలవంతునివిగా ఉన్నప్పుడు మాత్రమే నీవు దుష్టుని జయించగలవు. నీవు శత్రువుతో పరిహాసమాడినట్లయితే, నిన్ను నీవే నిందించుకొనవలసి వస్తుంది. సాతానుతో పోరాడడం అంటే ఎన్నో యుద్ధములను ఎరిగియున్న ఒక అలవాటుపడిన వీరునితో పోరాడినట్లే. అనేక సంవత్సరములలో అపవాది అనువాడు ఎందరో క్రైస్తవులతో పోరాడాడు. క్రైస్తవులను నాశనము చేయడంలో శోధించడంలో వాడు అనుభవజ్ఞుడు. యేసు సజీవునిగా ఉన్నప్పుడే అపవాది కూడా సజీవునిగా ఉన్నాడు. వాడు క్రొత్తగా వచ్చిన్వాడు కాదు, కాని నీవు క్రొత్తగా వచ్చినవాడవు! నీవు లేచి ఆ దుష్టుని జయించులాగున బలవంతునివి కమ్ము.

    నేను ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు, దుష్టులైన మా పెద్ద తరగతి వారిచే గేలిచేయబడేవాడిని. కేవలం నాకంటే ఒక సంవత్సరము మాత్రమే ముందు ఉన్న అనేకమంది నన్ను బాధించుట చేతను శిక్షించుట చేతను నేను అనేకవిధములైన బాధలను అనుభవించాను. ఈ సమయములో, మానవుని యొక్క హృదయములో కొలువుదీరియున్న దుష్టత యొక్క లోతును తెలుసుకొనగలిగాను. ఈ పదమూడు పదునాలుగు సంవత్సరముల వయసుగల బాలురు నాపై ఉన్నతమైన శక్తిని ప్రయోగించుటకు కారణము వారు నాకంటే ఒక సంవత్సరము ముందు వచ్చినవారు కావడం.

    కొన్నిసార్లు, వారు ‘కోతి నాట్యం’ అని పిలిచే ఒక నాట్యాన్ని చేయమని నన్ను అడిగేవారు. వేరొక సమయాలలో ‘విమోచనా గోపురము’లా నిలబడవలసి వచ్చేది. కొన్నిసార్లు, ఉదయము 3:00 గంటల వరకు మరుగుదొడ్లను మరియు స్నానపుగదులను కడగమనేవారు. కొనిసార్లు నన్ను నిలువబడి ఆ మంచము దరిదాపుల్లోకొచ్చే దోమలనన్నిటిని చంపమని చెప్పేవారు. ఇతర శిక్షలు ఎలా ఉండేవి అంటే పెండలం దుంపలను (వాటిని గారి అనేవారము) మరియు చేదుగా ఉండే మందుబిళ్ళలను పొడిచేసుకొని తినడం వంటివి. అనేక సంవత్సరముల పాటు, ఈ దుష్టులైన మా పెద్దతరగతి విద్యార్థులచే నేను బాధననుభవించాను. ఒక దినమున, నా తరగతి మిత్రులలో ఒకడిని వీరు ఎన్నడు పిలవడం, ఎక్కడికైనా పంపడం, లేదా వేధించడం శిక్షించడం అనేది నేను చూడలేదు! కాని ఎందుకు వారు అలా చేయలేకపోయారో నాకు తెలుసు! మా పెద్దతరగతి విద్యార్థులకంటే యీనా తరగతి మిత్రుడు మరింత బలవంతుడు! ఈ నా తరగతి మిత్రుడు పెద్దవాడు, బలవంతుడు మరియు నా తరగతిలో ఉన్న అందరి విద్యార్థుల కంటే వయసులో కూడా పెద్దవాడు గనుక వాస్తవముగానే మా పెద్దతరగతి విద్యార్థులు భయపడేవారు. ఒక హెచ్చరికతోనే వారిలో ఎవరినైనా బాధగలిగినవాడు వీడు.

    ఆ పెద్దతరగతి మిత్రులు కొన్నిసార్లు ఒక చిన్నవాడు! రావాలి అని అరచేవారు. దీని అర్థం మా చిన్నతరగతి విద్యార్థులంతా ఒక చిన్నవాడు! రావాలి అని పిలిచినవాని దగ్గరకు వెళ్లి నిల్చోవాలి. మేమంతా పరుగెత్తి వెళ్లేవాళ్ళమే గాని ఈ వయసుగలవాడు, పెద్దవాడు, బలవంతుడు అయిన వాడు మాత్రము ఈ పెద్దతరగతి విద్యార్థులందరినీ కూడా నిర్లక్ష్యపెట్టి వాడు చేస్తున్న పనినే చేసుకొంటూ ఉండేవాడు. వాడిని ప్రశ్నించేoత దమ్ము ఎవడికీ లేదు. వాడు ఎంతో బలవంతుడు గనుక వాళ్ళంతా వాడికి భయపడేవారు! కాని నేను బలవంతుడను కాను. నేను నిర్బలుడను, కొట్టడానికి శిక్షించదానికి అదునుగా ఉండేవాడను. దుష్టులైన మనసులేని ఆ పెద్దతరగతి విద్యార్థులకు నేను మంచి ఆటబొమ్మ. బలముగలిగి కండలు తిరిగియున్న నా తరగతి మిత్రునిలా నేను కూడా ఉండి ఉంటేనా.

    బలము యొక్క ప్రాముఖ్యతను నేను ఇక్కడే తెలుసుకున్నాను! నీవు బలవంతునివిగా ఉన్నప్పుడు, దుష్టులైన వారు నిన్ను నిన్నుగా వదిలేయవలసిందే. వారు ఒడింపబడతారు అని ఆ దుష్టులకు తెలుసు. సాతాను కూడా పోరాటమును మొదలెడితే వాడు అనుకున్నట్టుగా ముగియదు అని తెలుసు గనుక అసలు సమస్యను ప్రారంభించడానికి కూడా వాడు వెనుకాడతాడు. నీకంటే బలముగలది ఏదైనా నీమీదికి వచ్చినప్పుడు అది నిన్ను ఓడించి నిన్ను నాశనము చేస్తుంది గనుక నీవు బలవంతునివిగా ఉండాలి.

    బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతనికంటె బల వంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు, అతడు నమ్ముకొనిన ఆయుధముల నన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును.

    లూకా 11:21-22

    నిన్ను బలపరచుకొనుటకు గాను ఇది నీకు గొప్ప ప్రేరణగా ఉండాలి! నీవు బలవంతునివిగా అవుతున్నప్పుడు, నిన్ను నిన్నుగా దుష్టుడు విడిచిపెట్టునట్లు వాడు బలవంతము చేయబడతాడు ఎందుకంటే నీపై అనేకమైన శోధనలు అస్సలు పనిచేయలేవు అని వానికి తెలుసు. ప్రభువునందు బలవంతునివిగా ఉండు!

    నీ శత్రువైనవాడు మరలా నీపై దాడిచేయాలని చూస్తున్నాడు గనుక నిన్ను నీవు ప్రభువునందు బలపరచుకో.

    ప్రతివాడు తన్ను ఎదిరించిన వానిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఇశ్రాయేలువారు వారిని తరుము చుండగా సిరియా రాజైన బెన్హదదు గుఱ్ఱమెక్కి రౌతులతో గూడ తప్పించుకొని పోయెను.

    అంతట ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుఱ్ఱములను రథములను ఓడించి

    Enjoying the preview?
    Page 1 of 1