Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

మీరు అనుదినము దేవునితో ప్రభావవంతమైన నిశ్శబ్ద సమయం ఎలా గడుపగలరు
మీరు అనుదినము దేవునితో ప్రభావవంతమైన నిశ్శబ్ద సమయం ఎలా గడుపగలరు
మీరు అనుదినము దేవునితో ప్రభావవంతమైన నిశ్శబ్ద సమయం ఎలా గడుపగలరు
Ebook154 pages37 minutes

మీరు అనుదినము దేవునితో ప్రభావవంతమైన నిశ్శబ్ద సమయం ఎలా గడుపగలరు

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

Dr. Dag Heward-Mills, తన రహస్యములలో ఒకదానిని బయలుపరచుచున్న, ఒక అసాధారణమైన క్రైస్తవ నాయకుడు. “ఒకవేళ ఎవరైనా నన్ను దేవునితో నా సంబంధమునకు అతిగొప్ప రహస్యము ఏదని అడిగితే, నేను, ఏ అనుమానము లేకుండా, ఆయనతో నేను ప్రతిదినము కలిగియుండె నిశ్శబ్ద సమయము యొక్క శక్తి అని చెప్పుదును.” నీవు కూడ నిశ్శబ్ద సమయము యొక్క శక్తి నుండి లాభము పొందుటకు ఈ పుస్తకము వ్రాయుటకు అతడు నిర్ణయించుకున్నాడు

LanguageTelugu
Release dateMay 25, 2018
ISBN9781641348409
మీరు అనుదినము దేవునితో ప్రభావవంతమైన నిశ్శబ్ద సమయం ఎలా గడుపగలరు
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to మీరు అనుదినము దేవునితో ప్రభావవంతమైన నిశ్శబ్ద సమయం ఎలా గడుపగలరు

Related ebooks

Reviews for మీరు అనుదినము దేవునితో ప్రభావవంతమైన నిశ్శబ్ద సమయం ఎలా గడుపగలరు

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    మీరు అనుదినము దేవునితో ప్రభావవంతమైన నిశ్శబ్ద సమయం ఎలా గడుపగలరు - Dag Heward-Mills

    నిశ్శబ్ద సమయము – నీ జీవితములో అత్యంత ప్రాముఖ్యమైన అలవాటు

    మానవుని జీవితములోని రెండవ భాగము తాను మొదటి భాగములో సంపాదించుకొనిన అలవాట్లతోనే కూడుకొనినదిగా ఉంటుంది.

    Dosto yevsky

    మానవుని గుణము యొక్క బలము తనకు అలవాటైన కార్యములతో కూడుకొనినదిగా ఉంటుంది.

    Pascal

    అలవాటు అంటే ఏమంటే నీవు ఏ మాత్రము ఆలోచన చేయకుండా లేదా దానిని యోచించకుండా నీవు చేసే ఒక కార్యము. ప్రతి మంచి క్రైస్తవునికి చాలా మంచి అలవాట్లు ఉంటాయి. ఆ వ్యక్తి ఏమైయున్నాడో అలా చేసినది ఈ మంచి అలవాట్లే.

    గొప్ప వ్యక్తులందరికీ కూడా తమను గొప్పవారిగా చేసిన కొన్ని మంచి అలవాట్లు ఉంటాయి. మన ప్రభువైన యేసును కూడా అంతటి గొప్పవానిగా చేసిన అలవాట్లు కొన్ని ఉన్నాయి.

    యేసు క్రీస్తు

    క్రమముగా మందిరమునకు వెళ్ళడం

    యేసుకు కొన్ని మంచి అలవాట్లు ఉన్నాయని మీకు తెలుసా? విశ్రాంతి దినమున సమాజమందిరమునకు వెళ్ళే ఒక అలవాటు ఆయనకున్నదని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది.

    తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా.

    లూకా 4:16

    ప్రార్థనా పలాయమునకు వెళ్ళడం

    పలాయము నిమిత్తము కొన్ని ఏర్పరచబడిన తోటలకు వెళ్ళడం అనే అలవాటు కూడా యేసులో ఉంది. చాల తరచుగా ఆయన వెళ్ళిన ప్రదేశము అది. అంతేకాక ఆ తోటలోనికి ఆయన ప్రార్థించుటకు వెళ్ళేవాడని ప్రతి ఒక్కరికీ తెలుసు.

    యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడ కెద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక తోట యుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతోకూడ వెళ్లెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్లుచుండువాడు గనుక, ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను.

    యోహాను 18:1, 2

    దానియేలు

    దినములో ఒక ప్రత్యేకమైన సమయములో దానియేలు ప్రార్థించేవాడు. ఆయన ఈ విధంగా చేస్తూ వచ్చేవాడు. తన జీవితములోని ఒక గొప్ప రహస్యము ఇది.

    ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్లి, యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.

    దానియేలు 6:10

    అలవాట్లను గూర్చి ప్రతి క్రైస్తవుడు తెలుసుకొనవలసిన పది విషయములు

    అలవాటు అంటే ఆలోచించకుండా లేదా సంకల్పించకుండా తరచుగా చేసే ఒక క్రియ

    అలవాటు అంటే నీవు గమనించినా లేకున్నా నీకు వాడుకగా మారే ఒక క్రియ

    అలవాటు అంటే కొన్ని సందర్భములలో భవిష్యత్తును ఏ మాత్రము ప్రభావితము చేయలేని ఒక సాధారణమైన క్రియ. దీని వలననే చాలా మంది తమ భవిష్యత్తులో ఏదైనా సాధించాలని అనుకుంటే మంచి అలవాట్లు బలమైన సాధకముగా ఉంటాయని గుర్తించరు.

    అలవాటు అనేది మంచిదైనా కావచ్చు లేదా చెడ్డదైనా కావచ్చు, అలాగే సహజమైనదైన కావచ్చు లేదా ఆత్మీయమైనదైనా కావచ్చు. ఆత్మీయమైన అలవాట్లు ఏవంటే ప్రాతఃకాల ప్రార్థన మరియు ప్రతిరోజూ నిశ్శబ్ద సమయమును గడపడం. సహజమైన అలవాట్లు ఏవంటే పండ్లు తోముకోవడం మరియు రోజూ స్నానం చేయడం వంటివి.

    మంచి అలవాట్లు కూడా చెడ్డ అలవాట్ల వలెనే సునాయాసంగా పునరావృతమౌతూ ఉంటాయి.

    చెడ్డ అలవాట్లు అనేవి సదరు వ్యక్తికి ఏమౌతుందో అనేది అర్థం కాకుండానే నిత్య వైఫల్యాలకు మరియు ఓటమికి దారితీస్తాయి.

    మంచి అలవాట్లు అనేవి సదరు వ్యక్తి ఏమి చేస్తున్నాడో తనకు తెలియకుండానే నిత్య విజయాలకు మరియు జయానికి దారితీస్తాయి.

    చెడ్డ అలవాట్లు అనేవి ఏర్పరచుకోవడం తేలికే కాని వాటితో జీవించడమే కష్టం. కాగా, మంచి అలవాట్లు అనేవి ఏర్పరచుకోవడం కష్టం కాని వాటితో జీవించడం చాలా సులభం.

    ప్రతియొక్క విజయశీల క్రైస్తవుని విజయము దరికి నడిపించిన మంచి అలవాట్లు ఎన్నో ఉంటాయి. చాలా సంవత్సరముల క్రితము, ప్రతి ఉదయము దేవునితో కొంత నిశ్శబ్ద సమయమును గడపడం ఎలాగో నా స్నేహితుడు ఒకడు నేర్పించాడు. దానిని నేను వ్యక్తిగత అలవాటుగా పెంపొందించుకున్నాను మరియు ముందు క్రైస్తవునిగా ఆ మీదట క్రీస్తు పరిచారకునిగా ఉన్న నాకు ఇది ఒక గొప్ప రహస్యము. నేను ప్రసంగిస్తున్న ప్రసంగములు అన్నీ కూడా ఎక్కువగా ఈ మంచి అలవాటు నుండి నేను నేర్చుకొనినవే.

    అలవాట్లు అనేవి క్రైస్తవులకు రక్షణ విధానములు. ఇలా ఎందుకు అంటున్నానంటే ఒకవేళ నాయకుడు ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా, అలవాటుగా, సహజంగా మరియు సునాయాసంగా కొన్ని మంచి క్రియలను అతను చేయగలుగుతాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఏమి చేయాలో లేదా ఎలా స్పందించాలో అనేది ఆలోచించడానికి నాయకునికి సమయము ఉండకపోవచ్చు. ప్రార్థనను లేదా నిశ్శబ్ద సమయమును గూర్చిన మంచి అలవాటే ఆ క్లిష్ట సమయము నుండి ఆయనను గట్టెక్కిస్తుంది. యేసు వలెనె, తరచు నేను ప్రార్థించుటకు వెళ్లే సమయము నాకు కూడా ఉంది. నా తోటి దైవసేవకులతో కూడా కొన్ని సార్లు నేను వెళ్తుంటాను. నాకు రాబోయే విపత్తును గూర్చి తెలియని సమయములోనైనా ఆత్మీయమైన సంరక్షణలో ఉండటానికి ఈ అలవాటు నాకు సహాయపడుతుంది.

    అధ్యాయము 2

    నిశ్శబ్ద సమయము – అనేకమంది గొప్ప వ్యక్తుల యొక్క రహస్యము

    మోషే దేవునితో నిశ్శబ్ద సమయములను గడిపాడు

    మరియు యెహోవా మోషేతో – మొదటి పలకల వంటి మరి రెండు రాతిపలకలను చెక్కుము. నీవు పగులగొట్టిన

    Enjoying the preview?
    Page 1 of 1