Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

భ్రష్టత్వము
భ్రష్టత్వము
భ్రష్టత్వము
Ebook224 pages1 hour

భ్రష్టత్వము

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

Dag Heward-Mills ఉత్తమ అమ్మకమైన “నమ్మకత్వము మరియు అపనమ్మకత్వము” అనే దానితో కలిపి అనేక పుస్తకముల రచయిత. The Lighthouse Chapel International అని పిలువబడి రెండు వేలకు పైగా సంఘములు కలిగిన ఒక సంస్థ స్థాపకుడు.

LanguageTelugu
Release dateMay 25, 2018
ISBN9781641347983
భ్రష్టత్వము
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to భ్రష్టత్వము

Related ebooks

Reviews for భ్రష్టత్వము

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    భ్రష్టత్వము - Dag Heward-Mills

    భ్రష్టత్వము అనగా ఏమి?

    బబులోను దేశమునకు ఇశ్రాయేలు మరియు యూదా దేశములు బందీలుగా కొనిపోబడపోనున్న సమయములో దేవుడు ప్రవక్తయైన యిర్మీయాను లేవనెత్తాడు. తమ హృదయముల భ్రష్టత్వపు స్థితిని ఇశ్రాయేలు ప్రజలకు చూపించడానికి ఆయన యిర్మీయాను వాడుకున్నాడు.

    యిర్మీయా, నీవెందుకు ఏడ్చుచున్నావు?

    భ్రష్టత్వపు స్థితిని గూర్చి యిర్మీయా గ్రంథము అనేక విపులమైన వివరణలను ఇస్తుంది. ప్రలాపించు ప్రవక్తగా కూడా పిలువబడే యిర్మీయా భ్రష్టత్వము అను అంశము మీదనే ఎక్కువగా తన సందేశమును వినిపించాడు. ఆయన తరచుగా ఇశ్రాయేలీయుల ప్రజలతో యుద్ధములో ఉన్నాడనే చెప్పాలి, మారుమనస్సు పొంది తమ చెడు నడతలను విడువమని ఎప్పుడూ వారికి హెచ్చరిక చేస్తూ వచ్చాడు. తన ప్రజల యొక్క అవిధేయ ప్రవర్తనను గూర్చి ఈ ప్రలాపించు ప్రవక్త ఎక్కువగా బాధపడ్డాడు. మీ చెడుతనమును విడవండి. దుర్మార్గతను చేయడం వీడండి! మారుమనస్సు పొంది దేవుని వద్దకు తిరిగిరండి అని మరలా మరలా వారిని బ్రతిమాలాడు.

    భ్రష్టత్వము అంటే ఏమిటో అనేక విధాలుగా వారికి చూపించాలని ఆయన భావించాడు. కాని ఇశ్రాయేలు మరియు యూదా ప్రజలు మారకుండా నిరాకరించారు.

    భ్రష్టత్వమును దిక్సూచిలు లేని ఒక రహదారిపై నడవడముతో పోల్చవచ్చునని నేను చాలా సంవత్సరముల క్రితము అనుభవము ద్వారా తెలుసుకున్నాను. మన క్రైస్తవ నడకలో నీవు భ్రష్టత్వమునకు గురి అవుతున్నావని నీకు చెప్పడానికి దిక్సూచిలు లేవు. పాతాళము మరియు నాశనము – 200 మీటర్ల దూరములో ఉన్నది’ అని మీకు చెప్పుటకు దిక్సూచిలు ఉండవు. అట్టి సూచనలు అసలు లేవు అంతే! భ్రష్టత్వము అనునది నీవు ఎన్నడు ఊహించని ఒక స్థితికి నిన్ను నెట్టువరకు తెలియకుండానే క్రమక్రమముగా జరిగిపోతుంది. క్రమక్రమముగా అయినప్పటికీ ఖచ్చితముగా నీవు ఆ స్థితికి జారిపోతావు.

    భ్రష్టత్వము అనేది వాస్తవికమైనది మరియు భ్రష్టత్వము చెందుటలో ఉన్న అనేక విధములను వివరించిన యిర్మీయా ద్వారా వీటిని అధ్యయనము చేయగలము. చాలా సాధారణమైన ఈ ఆత్మీయ ద్రుగ్విషయమును వివరించుటకు ప్రవక్త వాస్తవికమైన జీవన పరిస్థితులను ఉపయోగించాడు. క్రైస్తవ ప్రపంచంలో ఇవి మామూలుగా సంభవించే సంఘటనలే.

    పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది,

    ... కడపటివారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.

    మత్తయి 20:16

    వేరొక విధంగా చెప్పాలంటే, చాలా మంది క్రీస్తుతో ప్రారంభిస్తారు కాని తరువాత చాల మంది పడిపోతారు. పరిశుద్ధ గ్రంథము ఇంకా సెలవిస్తుంది,

    ...అంతమువరకు సహించిన వాడు రక్షింపబడును.

    మత్తయి 10:22

    క్రీస్తు వద్దకు వచ్చే చాలా మంది, తరువాతి కాలములో అభ్యంతరపడిపోతారు.

    నీవు కూడా అభ్యంతరపడగలవు తస్మాత్!

    ఈ అంశమును కొంతమంది వెక్కిరింతగా చూసి నేను భ్రష్టపడడం జరగదు అని అనుకుంటారు. ఇటువంటి ప్రవర్తనే నీవు భ్రష్టపడడానికి అవకాశము ఉన్నదని తెలుపుతుంది. 1 కొరింథీయులకు 10:12లో పరిశుద్ధ గ్రంథము తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అని హెచ్చరిస్తుంది.

    క్రైస్తవ పందెములో నీవు నిలిచియుండుటకు శక్తిని పెంపొందించుకొనుటకు ఈ పుస్తకము నీకు సహాయపడుతుంది. నీవు ఎంతగా తెలుసుకుంటావో, అంత సురక్షితముగా ఉంటావు – మరియు మరింత నిలదొక్కుకొనే శక్తి నీకు ఉంటుంది. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది,

    ... సాతాను తంత్రములను మనము ఎరుగనివారము కాము.

    2 కొరింథీయులకు 2:11

    ఈ పుస్తకములో ఇవ్వబడిన బోధ అజ్ఞానము అనబడే తెగులును దూరము చేస్తుంది. చదవని వారు చదవడం రానివారు కంటే ఉత్తములు ఏమీ కాదు అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోండి. మరొక మాటలలో, జ్ఞానమును పొందుటకు నిరాకరించేవారు యధార్ధముగానే జ్ఞానమును పొందుటకు సామర్థ్యము లేనివారికంటే ఉత్తములేమీ కారు.

    తరువాతి అధ్యాయములో, భ్రష్టత్వము అను విషయమును మీరు వివిధ విధాలలో ఎలా చూడగలరో మీకు చూపించబోతున్నాను.

    అధ్యాయము 2

    భ్రష్టత్వమును గూర్చి పరిశుద్ధ గ్రంథము యొక్క వివరణ

    బద్దలైన తొట్టులకు బదులు నీటిబుగ్గలు

    ...జీవజలముల ఊటయైన నన్ను విడిచియున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.

    యిర్మీయా 2:13

    నేను వైద్య విద్యార్థిగా ఉన్నపుడు, దాన్ఫా అనే ఒక ఘానా దేశపు గ్రామమునకు రెండు వారముల కొరకు పనిచేయడానికి మేము పంపబడ్డాము. ఒకసారి ఈవిధంగా నేను సందర్శనార్ధం వేరే ప్రాంతమునకు వెళ్ళినప్పుడు అసలు నీరే లేని ఒక కుగ్రామమును మేము చూసాము. ఆ గ్రామములో నీటి సదుపాయము లేదుగనుక, ఆ గ్రామస్తులు ఒక పెద్ద గుంట త్రవ్వారు ఆ గుంటలో నీళ్లు ఊరేవి; తరచు, ఈ నీళ్లు మురికిగా మరియు ముదురు ఎరుపు రంగులో ఉండేవి.

    వారు ముదురు రంగులో ఉన్న మురికి నీరు త్రాగేవారు!

    ఆ గ్రామపు ప్రజలు అందులోనే స్నానం చేసి, మలమూత్ర విసర్జనలు చేసేవారు. అదే సమయములో వారు దాని నుండే త్రాగి ఆ నీళ్లతోనే వంట చేసుకొనేవారు. ఈ నీటి వలన వారికి అనేకమైన వివిధ రోగాలు బలహీనతలు వచ్చేవి.

    పరిశుద్ధ గ్రంథములో, భ్రష్టత్వము చెందే ప్రజలు శుభ్రమైన నీరు ఉన్నప్పటికీ కూడా మురికిది మరియు దుర్వాసన వెదజల్లే నీటి కొరకే ప్రాకులాడే వారితో పోల్చాబడ్డారు – నేను ఆ గ్రామములో చూసిన విధముగానే.

    ఒకరు తీపియైన, శుభ్రమైన, తెగులు సోకని నీటిని విడచి తెగుళ్లను వ్యాపింపజేసే మరియు మురికి నీటిని ఎందుకు ఆశ్రయిస్తారో అని మీరు ఆశ్చర్యపడుతుంటారు అని నాకు తెలుసు. పరిశుద్ధత మరియు దైవత్వము అను జీవితములను జీవించుటకు అవకాశము ఉన్న విశ్వాసులు చాలా మంది ఉన్నారు. కానీ, ఒక పాపపూరితమైన మరియు దయ్యములచే నియంత్రించబడే జీవితమును జీవించడానికి ఈ జీవితాన్ని వారు నిరాకరించారు.

    ముదురు రంగుతో మురికిగా ఉన్న నీటికి బదులు దేవుడు నీకు ప్రత్యామ్నాయం ఇస్తున్నాడు. నీవు భ్రష్టత్వము చెందినప్పుడు నీవు మరింత ఘోరమైన దాని దగ్గరకు తిరిగి వెళ్తున్నావు మరియు అది ఆఖరుకి నిన్ను చంపుతుంది అని దేవుడు చెప్తున్నాడు. ఆ మురికి నీటివంటి నీటిని మరలా త్రాగే ప్రయత్నము నీవు చేయకూడదు అని ఆయన నీతో చెప్తున్నాడు.

    చెడిపోయిన కారుద్రాక్షగా మారడం

    ... జాతిహీనపు ద్రాక్షావల్లివలె నీవెట్లు భ్రష్టసంతానమైతివి?

    యిర్మీయా 2:21

    భ్రష్టత్వమును గూర్చి పరిశుద్ధ గ్రంథము ఇస్తున్న తదుపరి వివరణ ఏమనగా ఒక మంచి మొక్క ముళ్ళుగల ఒక వింతైన ద్రాక్షావల్లిగా మారిన విధానం.

    ఇక్కడ, ఒక మంచి దిగుబడిని ఆశిస్తున్న రైతు యొక్క మొక్కలు ఏ విధంగా ముళ్ళకంపలుగా మరియు కలియమొక్కలుగా మారాయో దేవుడు చూపుతున్నాడు. విశ్వాసివైన నీవు ప్రభువు యొక్క సుందరమైన ఒక మొక్క. ఈ భూమి మీద నిన్ను నీవు ఒక ముళ్ళతో నిండిన పనికిమాలిన కంపగా మార్చుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? నీవు భ్రష్టత్వము చెందినప్పుడు దేవుడు నిన్ను ఈ విధముగానే చూస్తాడు.

    ఇశ్రాయేలు తో దేవునికున్న సమస్య ఏమనగా ఆయన ఎంతో ప్రేమను, దయను, మృదుత్వాన్ని మరియు సమయమును వారి జీవితాలలో ధారబోసాడు. అయినను వారు అవిధేయమైన, హృదయకాఠిన్యముతో చెడిపోయినవారిగా మారారు. దేవుని ముందు నిన్ను నీవు ఒక పనికిమాలిన సృష్టిగా మార్చుకొనుటకు ఇష్టపడతావా? దీనికి సమాధానం ఖచ్చితముగా కాదు అనే ఉండాలి.

    ఒక క్రూరమైన ఒంటెగా మారడం

    ...నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల ఒంటెవు.

    యిర్మీయా 2:23

    భ్రష్టత్వము పొందిన క్రైస్తవుడు తన మార్గములలో అడ్డదిడ్డముగా పరుగులెత్తు ఒంటెవలె ఉన్నాడు. ఇది మామూలు ఒంటె కాదు కాని అడివి ఒంటె. ఇది క్రూరమైనది మరియు వేగముగా ప్రయాణించే ఒక జీవి, ఇది ఎక్కడికైనా తిరుగులాడగలదు.

    భ్రష్టత్వము చెందుతున్న వ్యక్తి యొక్క హృదయము క్రూర ఒంటె వలెనె అసలు తీరిక లేకుండగా ఉంటుంది. అది ఎవరి అధీనములోను ఉండడు. అది స్వేచ్ఛగా మరియు క్రూరంగా ప్రవర్తిస్తుంది. కొన్ని సంవత్సరముల క్రితము లండన్ పట్టణములో విశ్వాసములో దిగజారిపోతున్న ఒక క్రైస్తవుని దర్శించడానికి వెళ్ళడం నాకు జ్ఞాపకమొస్తుంది.

    నా స్నేహితుడు క్రూరుడుగా తయారయ్యాడు

    ఈ వ్యక్తిని వివరించుటకు ఉత్తమమైన మార్గము ఆయనను ఒక స్వేచ్ఛగల మరియు క్రూరమైన వానిగా అభివర్ణించడం. ఆయనను తిరిగి ప్రభువు వద్దకు తీసుకొనిరావడానికి నేను ప్రయతిస్తున్నాను. తన ఇంటిని కనుగొనుటకు నాకు చాలా సమయము పట్టింది. మధ్యరాత్రి అయ్యే సరికి నేను తన ఇంటికి చేరుకోగలిగాను. నన్ను చూచి చాలా ఆశ్చర్యపడిపోయి, నన్ను తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. మేము మాట్లాడుతూ ఉండగా, నేను ఎందుకు వచ్చానో ఆయన గ్రహించాడు. ఒక సమయములో పరిణతి పొందిన క్రైస్తవుడుగా ఉండి ప్రస్తుతం దిగజారిన స్థితిలో ఉన్న ఆ వ్యక్తికి నేను చెప్పాలని అనుకుంటున్న లేఖనభాగములు అన్నీ తెలుసు.

    కాబట్టి ఒకానొక సందర్భములో ఆయన నన్ను ఆపి, చూడండి, మీరు ఏమి చెప్పదలచుకున్నారో నాకు తెలుసు, మరియు ఈ రాత్రి నా మీద వదలడానికి మీరు సంధించబోతున్న ఆ వాక్యములన్నీ కూడా నాకు తెలుసు. కానీ నేను అసలు వీటన్నిటిని పట్టించుకోను అని మీరు తెలుసుకుంటే మంచిది అన్నాడు.

    కాబట్టి ఆయన తన సిగరెట్ తీసికొని నా ముందు పొగ త్రాగడం మొదలు పెట్టాడు. నేను పొగ త్రాగడం మీరు చూడాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎవరి నియంత్రణలోనూ లేను అని అన్నాడు.

    అప్పుడు ఆయన ఒక ఫోటో ఆల్బం తీసి తన ప్రియురాలితో దిగిన చిత్రాలన్నిటిని నాకు చూపిస్తున్నాడు. వాటిలో కొన్ని చిత్రాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి.

    "నేను నిజముగా ఎలా

    Enjoying the preview?
    Page 1 of 1