Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

దశమభాగము ఇవ్వని క్రైస్తవులు ఎందుకు పేదవారిగానే ఉంటున్నారు
దశమభాగము ఇవ్వని క్రైస్తవులు ఎందుకు పేదవారిగానే ఉంటున్నారు
దశమభాగము ఇవ్వని క్రైస్తవులు ఎందుకు పేదవారిగానే ఉంటున్నారు
Ebook432 pages4 hours

దశమభాగము ఇవ్వని క్రైస్తవులు ఎందుకు పేదవారిగానే ఉంటున్నారు

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

Dag Heward-Mills, ఒక అంతర్జాతీయ సువార్తికుడు, అంతర్జాతీయ Healing Crusades మరియు ప్రపంచ వ్యాప్తంగా కూడికలలో పరిచర్య చేయును. మరిన్ని వివరములకు, సంప్రదించండి www.daghewardmills.org.

LanguageTelugu
Release dateMay 25, 2018
ISBN9781641348751
దశమభాగము ఇవ్వని క్రైస్తవులు ఎందుకు పేదవారిగానే ఉంటున్నారు
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to దశమభాగము ఇవ్వని క్రైస్తవులు ఎందుకు పేదవారిగానే ఉంటున్నారు

Related ebooks

Reviews for దశమభాగము ఇవ్వని క్రైస్తవులు ఎందుకు పేదవారిగానే ఉంటున్నారు

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    దశమభాగము ఇవ్వని క్రైస్తవులు ఎందుకు పేదవారిగానే ఉంటున్నారు - Dag Heward-Mills

    దశమభాగములు ఇవ్వని క్రైస్తవులు ఎందుకు పేదవారిగా అవుతున్నారు

    అధ్యాయము 1

    దశమభాగములు ఇవ్వని వారు పేదవారిగా అవ్వడానికి ఆరు కారణములు

    వారు కోయడానికి ఏమియు ఉండదు కాబట్టి దశమభాగము ఇవ్వని వారు దరిద్రులు అవుతారు.

    వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును; విత్తినది పైరుకాదు, మొలక కాదు, పంట యెత్తినది అది పంటకు వచ్చినయెడల అన్యులు దాని తినివేతురు.

    హోషేయా 8:7

    అభివృద్ధి అనేది ప్రధానమైన రూపములో ఒకరు ఒక విత్తనమును విత్తి ఆ తరువాత దాని ఫలములను కోయడం అనే నియమముపై ఆధారపడి ఉంటుంది. విత్తుట మరియు కోయుట అనే ఈ ప్రధానమైన నియమము నుండి దశమభాగము ఇవ్వకుండా ఉండడం అనే నీ అలవాటు నిన్ను దూరం చేస్తుంది. నీవు నీ దశమభాగమును ఇవ్వనప్పుడు అభివృద్ధికి గల మూల పునాదులను నీవు తీసివేస్తున్నావు గనుక నీవు నీ ఆర్థిక పరిస్థితులకు హాని చేసుకుంటున్నావు.

    తమ జీవితాలలో వారు ఆశీర్వాదములను ఆకర్షించుకొనలేరు కాబట్టి దశమభాగము ఇవ్వని వారు దరిద్రులు అవుతున్నారు.

    నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొని రండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టాజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

    మలాకీ 3:10

    దశమభాగము ఇవ్వడం అనేది పలువిధములైన ఆశీర్వాదములను ఆకర్షిస్తుంది, ఎందుకంటే దేవుని వాక్యము చెప్తున్నది ఇదే. ఆశీర్వదింపబడిన వ్యక్తి పట్ల అందరు అనుగ్రహము చూపుతారు మరియు సహాయపడతారు కూడా. ఈ భూమిపైన మన జీవితములు చాలా కష్టతరమైనవి. ఫరో తన జీవితమును గూర్చి నీవు జీవించిన సంవత్సరములెన్ని? అని యాకోబును అడిగినప్పుడు యాకోబు, నేను యాత్రచేసిన సంవత్సరములు నూట ముప్పది, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్రచేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్ని కాలేదని ఫరోతో చెప్పెను (ఆదికాండము 47:9).

    మానవుని యొక్క దినములు చాలా తక్కువైనవి మరియు చాల ఆయాసకరమైనవి అని యోబు కూడా అన్నాడు. నీ జీవితముపై ఒక శాపము లేకుండానే నీవు ఎన్నో సమస్యలను మరియు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నావు. నీవు నీ దశమభాగమును ఇవ్వనప్పుడు ఈ జీవితములో ఎదురయ్యే సమస్యలతో పోరాడటానికి నీకు ఏ ఆశీర్వాదము కూడా లేదు. ఆయాసకరమైన నీ మనుగడను గూర్చి ఏ ఒక్క ఆశీర్వచనము కూడా పలుకనప్పుడు నీ జీవితములో ఎలా బాగుండగలవు? నీవు నీ దశమభాగములను ఇవ్వకుండా ఉండినయెడల నీ జీవితములో వచ్చే అధికమైన దారిద్ర్యాన్ని చూచి ఆశ్చర్యపడవద్దు. ఒకరిని సంపన్నునిగా చేసే ఆశీర్వాదము మరియు విచారమును ఇవ్వని ఆశీర్వాదము దశమభాగములు సరిగా ఇచ్చేవారికే ఇంపుగా ఉంటాయి.

    వారు శాపగ్రస్తులు కాబట్టి దశమభాగము ఇవ్వని వారు దరిద్రులు అవుతున్నారు.

    మానవుడు దేవునియొద్ద దొంగిలునా? అయితే మీరు నాయొద్ద దొంగిలిరి; దేనివిషయములో మేము నీయొద్ద దొంగిలితిమని మీరందురు. పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరును నాయొద్ద దొంగిలుచునేయున్నారు, మీరు శాపగ్రస్తులై యున్నారు.

    మలాకీ 3: 8, 9.

    దశమభాగములు ఇవ్వని వారిపై ఒక ప్రత్యేకమైన శాపము పొంచి ఉంది. ఈ లోకములో ఉన్న ప్రధానమైన ఇరువది అయిదు శాపములలో ఇది ఒకటి. ఆదాము, నోవహు మరియు ఇతర వంశముల నుండి మనము వారసత్వముగా పొందుకొనియున్న అధికమైన శాపములతోబాటు దశమభాగములు ఇవ్వనివారిపై ఈ శాపము కూడా వస్తుంది. నీ తల్లిదండ్రులు మరియు పూర్వీకులు వారిపైన మరియు వారి వంశముల వారిపైన ఆపాదించిన ఆ శాపముల జాబితాతోబాటు దశమభాగములు ఇవ్వనివారిపై ఈ శాపము కూడా సమాహారంగా పనిచేస్తుంది. వారు చేసిన పనులను బట్టి ఏదోవిధంగా శపించబడియున్న ప్రజల యొక్క వారసులమే మనమంతా.

    ఒక దినమున, నా పూర్వీకులు బహుశ బానిసలతో వ్యాపారము చేసినవారుగా ఉండినవారు అని తెలిసి నేను చాలా బాధపడిపోయాను. నా తండ్రి యొక్క సొంత ఊరిలో ఒక పురాతమైన కోట కట్టబడి ఉండడం నేను చూసాను మరియు ఈ కోటనే బానిసలతో వ్యాపారము చేయుటకు వాడేవారు అని భోగట్టా. సుస్పష్టంగా, బానిసత్వములోనికి అమ్మబడని ఒకరి సంతానాన్ని నేను అని తెలిసింది. కాని, తన సహోదరుని ఇతర దేశమునకు బానిసగా అమ్మిన ఆ వ్యక్తుల యొక్క సంతానము నేను అని అర్థమైంది. నీ సహోదరుని అమ్మివేయడం అనేది నీ కుటుంబములోనికి ఖచ్చితంగా శాపాన్ని తెస్తుంది. కేవలం ఆటబొమ్మల కోసము మరియు అద్దముల కోసము తమ సొంత దేశీయులను అమ్మిన ఆ ప్రదేశాలే నేడు ప్రపంచంలో అత్యంత దారిద్ర్యత కలిగిన ప్రదేశాలు అనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా?

    నీ దశమభాగములను ఇవ్వకపోవడం అనేది మీ జీవితాలలో మరింత అధికమైన శాపములను తెస్తుంది. నీవు ఆదాము యొక్క శాపముక్రింద ఇప్పటికే మ్రగ్గుతున్నావనే విషయం మరువద్దు. అలానే, నీవు హాము యొక్క సంతానమైతే హాము యొక్క శాపముతో కూడా పోరాడుతున్నావు.

    ప్రియమైన స్నేహితుడా, ఎంతవరకు నీవు సహించగలవు? ఆశీర్వాదమును నీకు తెచ్చిపెట్టే ఆ కార్యాన్ని చేయడానికి ఇది సమయం కాదా? ఘోరమైన ఈ శాపాలన్నిటిని ఎదిరించడానికి నీకు దశమభాగములను ఇచ్చే వారికే ఇవ్వబడే ఆ ఆశీర్వాదం కావాలి! నీవు దశమభాగములను ఇవ్వడానికి సంకోచించినప్పుడల్లా నీవు మరింత దరిద్రుడవు అవుతున్నావని నీకేమైనా ఆశ్చర్యం కలిగిస్తుందా?

    వారి సంపాదనను ఎప్పుడు కూడా భక్షకులు భక్షించేస్తూ ఉంటారు కాబట్టి దశమభాగము ఇవ్వని వారు దరిద్రులు అవుతున్నారు.

    మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమిపంటను నాశనము చేయవు, మీ ద్రాక్షచెట్లు అకాలఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

    మలాకీ 3:11

    దశమభాగములను ఇవ్వడం వలన వచ్చే ప్రధానమైన ఆశీర్వాదం ఏమంటే దేవుడు నిన్ను భక్షించేవాటిని/వారిని గద్దిస్తాడు. దారిద్ర్యత ఎక్కువగా ఉన్న దేశముల యొక్క ప్రభుత్వాధికారుల మాటలను నీవు విన్నప్పుడు, కేవలం వారికి మరింత ఎక్కువ ధనము ఉంటే వారి సమస్యలు అన్ని సమసిపోతాయి అనే ఆలోచన నీకు వస్తుంది కదూ. అదృష్టవశాత్తు, ఇది నిజం కాదు. చాలా ఎక్కువ ఆర్థికమైన సహాయాన్ని పొందే ప్రదేశాలే ఎక్కువగా దారిద్ర్యతతో ఉంటున్నాయి. ఆ ధనమును స్వీకరిస్తున్న ఆ లబ్దిదారులు తమ ధనమును దాచుకోవడం చేతకాకపోవడం వలెనే ఈ విరుద్ధమైన పరిస్థితి తటస్థిస్తుంది.

    మొత్తం రంధ్రములతో నిండుకొనియున్న ఒక బకెట్ నింపడానికి ఏమి అవసరమో ఎప్పుడైనా నీవు ఆలోచించావా? ఒక ఐశ్వర్యములను నిండా నీటితో నిండుకొనియున్న ఒక బకెట్ తో పోల్చినట్లయితే, ఆ విధమైన బకెట్ నింపుటకు నీకు చాలా అవసరమౌతుంది. కాని నీవు ఆ రంధ్రములను ఒకవేళ పూడ్చినట్లయితే ఆ బకెట్ నింపుటకు నీకు చాలా తక్కువ నీళ్ళే అవసరమౌతాయి.

    గద్దించబడిన ఆ భక్షుకుడు వెళ్లిపోవుట వలన కలిగే ఆశీర్వాదం ఇలానే ఉంటుంది. ఆ భక్షకుడు గద్దింపబడిన తరువాత, నిన్ను తిరిగి ఐశ్వర్యవంతునిగా చేయుటకు చాలా తక్కువనే పడుతుంది. నీవు ఈ ఆశీర్వాదము లేకుండినవాడవుగా ఉన్నప్పుడు, నీవు ఉన్నతమైన ఉద్యోగాలను వెదకుతావు మరియు ఎక్కువ ధనాన్ని సంపాదించాలి అనుకుంటావు కాని ధనికునివి అవడంలో ఎప్పుడు విఫలమౌతూనే ఉంటావు. భక్షకుడు గద్దింపబడినప్పుడు, నీవు మరీ ఎక్కువ సంపాదించలేకపోవచ్చు కాని నీ బకెట్ చాలా త్వరగా నిండుతుంది మరియు త్వరలోనే అది పొర్లిప్రవహించడం మొదలెడుతుంది.

    ప్రియమైన స్నేహితులారా, నీవు నీ దశమభాగములను ఇచ్చినప్పుడు దేవుడు చేస్తాను అనేది ఇదే. నీ దారిద్ర్యతనుండి నీవు దూరముగా పారిపో మరియు భక్షకుడు గద్దింపబడడం వలన వచ్చే ఆశీర్వాదాన్ని సొంతం చేసుకో. ప్రజలు తమ నడివయసులో చాలా పెద్దవారిగా మరియు లావుగా ఎందుకు అవుతారో తెలుసా? తరచు వారు ఎక్కువగా తినరు.

    నిజానికి, నడివయస్కులలో చాలా మంది తమ బరువును తగ్గించుకోవడానికి కొంత ఆహార నియంత్రణ చేపడతారు కాని మరింత బరువు పెరుగుతుంటారు. వారు బరువు పెరుగుటకుగల కారణం ఏమిటో తెలుసా? ప్రజలు వయసు మీదపడుతుండగా, వారిలోని జీవక్రియ కొంచెం నిదానపడుతుంది. మరొక విధంగా చెప్పాలంటే క్రొవ్వును కరిగించే ఆ నిప్పు నిదానిస్తుంది. ఒకవేళ శరీరంలోని ఈ జీవక్రియ అనే నిప్పు ప్రతిదినము పది యూనిట్ల క్రొవ్వును కరిగిస్తున్నట్లైతే, అది కేవలం అయిదు యూనిట్లకు మాత్రమే పడిపోతుంది.

    అకస్మాత్తుగా, ప్రతిదినము కూడా అయిదు యూనిట్ల క్రొవ్వు అదనంగా నీకు అందుబాటులో ఉంటుంది. అసలు ఏవిధమైన ప్రయత్నాలు లేకుండా, నీవు బరువును పెంచుకొని మరింత పెద్దగా అడ్డంగా పెరుగుతావు. దీనివలననే ఒకరి వయసును అతడు లేదా ఆమె యొక్క ఆకృత్యాన్ని బట్టి చెప్పగలం. నీవు పెద్దవాడవు అవుతున్న కొలదీ జీవక్రియ నిదానిస్తుంది, (అంటే భక్షకుడు గద్దింపబడతాడు) మరియు నీ బరువు (అంటే అభివృద్ధి) మరింత ఎక్కువగా పెరుగుతుంది.

    వాస్తవానికి, తమ జీవితాలలో ఉండే భక్షకులను దశమభాగము ఇవ్వని వారు గద్దింపలేరు గనుక వారు మరింతగా దరిద్రులు అవుతుంటారు.

    వారి పొలముల యొక్క ఫలములు ఎప్పుడు నాశనము చేయబడుతూనే ఉంటాయి కాబట్టి దశమభాగము ఇవ్వని వారు దరిద్రులు అవుతున్నారు.

    మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమిపంటను నాశనము చేయవు, మీ ద్రాక్షచెట్లు అకాలఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

    మలాకీ 3:11

    వ్యర్థమైనవి చేయుట ద్వారా, అశ్రద్ధతో కూడిన నిర్వహణ వలన, నిర్లక్ష్యము వలన, అగ్ని ప్రమాదముల వలన, ఇతర ప్రమాదముల వలన, కొల్లగొట్టుకొనిపోవుట వలన, దొంగిలింపబడుట వలన మరియు యుద్ధముల వలనను నీవు పొందుకున్న నష్టములన్నీ కూడా చాలా బాధాకరమైనవే కాని నిజముగా అవి నాశకుని యొక్క క్రియలే.

    దశమభాగములను ఇవ్వడం వలన కలిగే ఆశీర్వాదములలో ఒకటి ఏమంటే ఆ నాశకుడు గద్దింపబడతాడు. ఈ నాశకుడు అనేవాడు భక్షకుని యొక్క సహోదరుడు. ఈ నాశకునికి మరియు భక్షకునికి గల వ్యత్యాసము ఏమంటే ఈ నాశకుడు నీ సంపదను ఒక బాధాకరమైన మరియు అనూహ్యమైన రీతిలో కొల్లగొడతాడు. నాశకుడు పనిచేస్తుండగా చూడడం చాలా బాధాకరం ఎందుకంటే నీవు అనుభవించే ఆ నష్టం ఊహించనిదిగా ఉంటుంది. నీవు నీ దశమభాగములను ఇవ్వడం మొదలుపెట్టు అప్పుడు ఈ నాశకుని కూడా గద్దిస్తానని దేవుడు నీకు వాగ్దానం చేశాడు.

    వారు ఫలములను కోయుటకు మునుపే ఫలములను కోల్పోతారు కాబట్టి దశమభాగము ఇవ్వని వారు దరిద్రులు అవుతున్నారు.

    మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమిపంటను నాశనము చేయవు, మీ ద్రాక్షచెట్లు అకాలఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

    మలాకీ 3:11

    దశమభాగములు ఇవ్వనివారు దరిద్రులుగా అగుటకు మరొక కారణం ఏమంటే వారి పొలముల యొక్క ఫలములను వారు కోయుటకు ఆశించే మునుపే అవి నాశనమైపోతున్నాయి. దశమభాగములు ఇవ్వనివారు విఫలమైన కోత ద్వారా శపించబడినవారు. విఫలమైన కోత అంటే నీవు పెట్టుబడి పెట్టిన దానికి తగిన విధముగా తగినంత ఫలాలను నీవు కోయడంలో విఫలమవ్వడమే.

    నీవు కష్టపడి పనిచేసినట్లయితే నీవు ఖచ్చితంగా ధనికుడవు అవుతావు అని ఒక వ్యక్తి చాలా స్థైర్యంతో బోధించేవాడు. సదరు వ్యక్తి ఇంకా మాట్లాడుతూ, ధనికులు కానివారు కష్టపడే వారు కారు. అభివృద్ధి చెందిన దేశములలోని ప్రజలు కేవలం వారి చొక్కాయి చేతులను పైకి మడతపెట్టి తమ ఉద్యోగములపై దృష్టి సారించినప్పుడు అభివృద్ధి అనేది వారి సొంతం అవుతుంది అన్నాడు.

    కాని నీవు చుట్టు చూచినట్లయితే, చాలా బాగా కష్టపడే వారు అనేకమంది ధనికులు కాలేకపోవడాన్ని చూడగలం! దినములో చెమటోడ్చి పండ్రెండు గంటలు కష్టపడి అసలు శూన్యాన్ని సంపాదించేవారు లేకపోలేదు. కాని వారి నుండి కేవలం కొన్ని మైళ్ళ దూరంలోనే ఒక దినములో కేవలం ఒక గంట మాత్రమే పని చేసి లక్షల కొలది సొమ్మును సంపాదించేవారు కూడా ఉంటుంటారు.

    అవును, కష్టపడి పనిచేయడం అనేది ఒకరిని అభివృద్ధి పథం వైపు నడపాలి కాని చాలా సందర్భాలలో ఇలా జరుగదు. స్వీడన్ దేశంలో ఒక బస్సు డ్రైవర్ ఘానా దేశంలో బస్సు నడిపే వ్యక్తితో పోల్చితే సగటున పంతొమ్మిది రెట్లు ఎక్కువ సంపాదిస్తాడు. ఎందుకు ఇలా? ఒకే వ్యవధి కలిగిన మరియు ఒకే విధమైన ఉద్యోగములకు ఈ రెండు దేశముల వారు ఎందుకు ఒకే మొత్తాన్ని పొందలేరు? ఒకరు నూరు విత్తనములను విత్తి నూరు శాతం పంటను కోస్తుండగా మరొకరు అదే నూరు విత్తనములను విత్తి కేవలం ఇరువది-మూడు శాతం మాత్రమే ఎందుకు కోస్తున్నారు?

    విఫలమైన పంటలు ఏ విధంగా ఉంటాయో నీవు ఇక్కడ వాస్తవముగా తెలుసుకొనగలుగుతావు. విఫలమైన కోత అంటే ఏమంటే ఒకరు పెట్టుబడి పెట్టిన దానికి తగిన విధముగా తగినంత ఫలాలను వారు కోయడంలో విఫలమవ్వడమే. చాలా మంది ప్రజలు ఈ విధంగా విఫలమైన కోతలను కోస్తుంటారు.

    ఈ విధంగా విఫలమైన కోతలను కోస్తున్న వ్యక్తి అనుభవిస్తున్న ఆ కోతవైఫల్యానికి గల కారణాలు ఎక్కువ సందర్భాలలో ఆ సదరు వ్యక్తి సామర్ధ్యానికి మించినవి అయి ఉండవచ్చు. తన ప్రయత్నాలకు ఒక మెక్సికో దేశస్థుడు సంపాదించేదానితో పోల్చితే అదే మెక్సికో నుండి కేవలం ఒక అయిదు మైళ్ళ దూరంలో ఉన్న అమెరికా దేశస్థుడు సంపాదించేది ఎందుకు ఎక్కువగా ఉంటుంది? అమెరికా భూమిలో ఒక వ్యక్తి మెక్సికో దేశములో వలెనే ఒకేవిధమైన సమయాన్ని మరియు కష్టాన్ని వెచ్చించి మెక్సికో దేశస్థుని కంటే పంతొమ్మిది రెట్లు ఎందుకు ఎక్కువగా పొందగలుగుతున్నాడు? ఈ సందిగ్ధత యొక్క కారణాలు మరియు పరిష్కారాలు సరిచేయగల ఒక వ్యక్తి సామర్ధ్యాలను మించినవిగా ఉన్నాయి. కాని దశమభాగములు ఇచ్చువారి యొక్క పంట ఈ విధముగా అపశకునంగా నేలపై రాలకుండా కాపాడతానని సర్వశక్తుడైన దేవుడు వారికి వాగ్దానము చేస్తున్నాడు. కోతకాలము రాక మునుపు నీ ఫలములు ఆయన నేలపాలు అవ్వనివ్వడు.

    వాస్తవికమైన అభివృద్ధికి దశమభాగము ఇవ్వడం అనేది ఒక ప్రధానమైన తాళపుచెవి అనే విషయం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందా? దశమభాగములు ఇవ్వనివారు తమ సంపాదనలోని పదియవ భాగమును దేవుని నుండి దూరముగా పెట్టుకొనుటవలన వారు దరిద్రులుగా అవుతారు అంటే నీవు ఆశ్చర్యపడతావా?

    దేవుని యొక్క సహాయము లేకుండా నీవు ఏమి చేయగలవు? దేవుడు నీకు సహాయపడనియెడల నీవు ఎంత దూరము మాత్రము పోగలవు? నీ లాభాలను నీవు అనుభవించక మునుపే అవి నేలపాలు కాకుండా ఉండాలంటే నీవు దశమభాగమును ఇవ్వడం ప్రారంభించడానికి ఇది ఇక సమయము.

    అధ్యాయము 2

    దశమభాగములు ఇవ్వని వారిని అనుసరించే శాపములు

    దశమభాగములను ఇవ్వకపోవడం అనేది అనేకమైన శాపములను క్రియాశీలం చేస్తుంది. చాలా మంది అనుకుంటారు గదా, దశమభాగములను ఇవ్వకపోవడం వలన కేవలం మలాకీ గ్రంథంలో ఉన్న శాపములు మాత్రమే వస్తాయి అని. కాని మలాకీ చెప్పిన ఆ శాపముల కంటే అధికమైన శాపములను దశమభాగమును ఇవ్వకపోవడం అనే పాపం క్రియాశీలం చేయగలదు. మరింత దుర్భరమైన పరిణామాలు గల అనేక ఇతర శాపములను కూడా ఇది క్రియాశీలపరుస్తుంది కాబట్టి ఈ అధ్యాయము వీటిని గూర్చే మాట్లాడుతుంది.

    ఇంతకీ, అసలు శాపము అంటే ఏమిటి? ఒక శాపాన్ని అనేక విధాలుగా నిర్వచించవచ్చు. శాపము క్రింద ఉండడం అంటే ఏమిటి అనే విషయాన్ని మీకు పూర్తిగా అర్థం చేయుటకు ఈ క్రింద ఇవ్వబడిన పండ్రెండు నిర్వచనాలు సహాయపడతాయి. బహుళ శాపముల క్రింద ఉండడం అంటే ఏమిటో ఇప్పటికి కూడా నేను

    Enjoying the preview?
    Page 1 of 1