Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

పరిచర్య యొక్క కళ
పరిచర్య యొక్క కళ
పరిచర్య యొక్క కళ
Ebook394 pages1 hour

పరిచర్య యొక్క కళ

Rating: 2 out of 5 stars

2/5

()

Read preview

About this ebook

ఒక కళను వృద్ధి చెయ్యటం అనేది ఒక సామర్ధ్యాన్ని లేక నైపుణ్యాన్ని వృద్ధి చెయ్యటం లాంటిది. పరిచర్య యొక్క పని గొప్ప సామర్ధ్యాన్ని కోరుకుంటుంది.
“ఆర్ట్అఫ్మినిస్ట్రీ” అనే ఈ కొత్తపుస్తకము, పరిచర్య చెయ్యాలి అని అనుకునేవారు చదవవలసినది. ఇది పరిచర్యపట్ల ఉన్న తప్పు ఒప్పు ఆలోచనలను, పరిచర్యయొక్క పనిని, పరిచర్య యొక్క సేవకునిగా నీ నుండి ఏమి అవసరము మరియు పరిచారకుడి పనులను ఎలా చెయ్యాలి అనే వాటిని మీ ముందు ఉంచుతుంది.
పరిచర్యలో మీ పనిని ఎలా చెయ్యాలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? డెగ్హెవార్డ్-మిల్స్ యొక్క పుస్తకము దేవుని పిలుపునకు యోగ్యముగా ఎలానడుచు కోవాలో మీకు సవాలు చేస్తుంది మరియు పరిచర్యకు సంపూర్తిగా మిమ్ములను మీరు ఇచ్చుకోవటానికి దారి చూపిస్తుంది.

LanguageTelugu
Release dateMay 24, 2018
ISBN9781641351423
పరిచర్య యొక్క కళ
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to పరిచర్య యొక్క కళ

Related ebooks

Reviews for పరిచర్య యొక్క కళ

Rating: 2 out of 5 stars
2/5

1 rating0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    పరిచర్య యొక్క కళ - Dag Heward-Mills

    పరిచర్య యొక్క కళ

    (ఆచరణాత్మక పరిచర్య యొక్క చేతి పుస్తకం)

    డేగ్ హేవార్డ్ మిల్స్

    పార్చమెంట్ హౌస్

    పేర్కొన బడితేనే తప్ప, అన్ని పరిశుద్ధ గ్రంథ లేఖనాలు కింగ్ జేమ్స్ వెర్షన్ నుండి తీసుకొనబడినవి.

    కాపీరైట్ © 2018 పార్చమెంట్ హౌస్

    మూలాంశము: పరిచర్య యొక్క కళ

    మొదటి ప్రచురణ 2018 పార్చమెంట్ హౌస్ ద్వారా

    డేగ్ హేవార్డ్ మిల్స్ గురించి మరి ఎక్కువ తెలుసుకొనుటకు:

    హీలింగ్ జీసస్ కాంపెయిన్

    ఈమెయిల్: evangelist@daghewardmills.org

    వెబ్ సైట్: www.daghewardmills.org

    ఫేస్ బుక్: Dag Heward-Mills

    ట్విట్టర్: @EvangelistDag

    ISBN :978-1-64135-142-3

    ఇంటర్నేషనల్ కాపీరైట్ లా క్రింద అన్ని హక్కులు మావే. విమర్శనాత్మక సమీక్షలు లేదా వ్యాస రచనలలో క్లుప్త ఉదహరణ కొరకు తప్ప ఈ పుస్తకములోని ఏ భాగమునైనా ఉపయోగించలన్నా, తిరిగి ప్రచురించాలన్నా ప్రచురణకర్త నుండి వ్రాత పూర్వక అనుమతిని ముందుగా పొందవలెను.

    విషయ సూచిక

    అధ్యాయము 1: దేవుని బహుమానాలు మరియు పిలుపు పశ్చాత్తాపముతో కూడినవి కావు

    అధ్యాయము 2: లౌకిక పని మరియు పరిచర్య పని మధ్య వ్యత్యాసము

    అధ్యాయము 3: మీ పిలుపునకు అర్హమైన నడత యొక్క అర్ధం ఏమిటి

    అధ్యాయము 4: పది రకాల పనివారు

    అధ్యాయము 5: మీ మిషన్ యొక్క పది సిద్ధాంతాలు

    అధ్యాయము 6: మంచి వ్యక్తిగత సహాయకుడుగా ఉండటం ఎలా?

    అధ్యాయము 7: ఉద్యోగ నియామకాలలోని సిద్ధాంతాలు

    అధ్యాయము 8: మీ విలువ ఎలాగున నిశ్చయించబడును

    అధ్యాయం 9: మీ పనిని ఎలా ఆనందించాలి

    అధ్యాయం 10: మీ జీవిత పనిని ఏలాగున కనుగొనగలరు

    అధ్యాయం 11: కొంతమంది ప్రజలు పనిలో ఎందుకు అభివృద్ధిచెందరు

    అధ్యాయం 12: నీ యజమానుని దయను ఎలా పొందుకోవాలి

    అధ్యాయం 13: అసంపూర్ణ మరియు సంపూర్ణ పరిచర్యల మధ్య దేనిని ఎలా ఎంచుకోవాలి

    అధ్యాయం 14: సంపూర్ణ సేవా పరిచర్య అవకాశమును అంగీకరించు

    అధ్యాయం 15: సంపూర్ణ పరిచర్యను గూర్చిన ఏడు తప్పుడు అభిప్రాయాలు

    అధ్యాయం 16: నీవు సంపూర్ణ పరిచర్యను ఎందుకు ఎన్నుకోవాలి

    అధ్యాయం 17: నా సంపూర్ణ సమర్పణ కొరకు దేవుడు నన్ను ఎలా పిలిచెను

    అధ్యాయం 18: సంపూర్ణ పరిచర్యయొక్క మర్మమైన ఉద్దేశాలు

    అధ్యాయము19: సంపూర్ణకాలసేవవెనుకనున్నముఖ్యసూత్రాలు

    అధ్యాయం 20: సంపూర్ణకాల సేవకు తప్పు కారణాలు

    అధ్యాయము 21: సంపూర్ణకాల సేవలో ఉండుటకు సరైన కారణాలు

    అధ్యాయము 22: సంపూర్ణకాల సేవకు మీ సిద్దపాటును ఎలా అంచనా వెయ్యాలి

    అధ్యాయం 23: పూర్తికాల పరిచర్యనుఎన్నుకోవడం ఆ౦టే ఏమిటి

    అధ్యాయం 24: సంపూర్ణకాల సేవకుల ప్రత్యేక ఆధిక్యతలు

    అధ్యాయము 25: పరిచర్య యొక్క పనిని కొంతమంది ఎందుకు వదలివేస్తారు

    అధ్యాయము 1

    దేవుని బహుమానాలు మరియు పిలుపు పశ్చాత్తాపముతో కూడినవి కావు

    మొదటి పిలుపు

    యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.నీనెవెపట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.

    యోనా 1:1-2

    రెండవ పిలుపు

    అంతట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగానీవు లేచి నీనెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము.

    యోనా 3:1-2

    దేవుడు దయగలవాడు! మీరు ఆయనకు విధేయులగుటకు ఆయన మీకు రెండవ అవకాశము ఇస్తాడు. వినుటకు మరియు విధేయత కలిగియుండుటకు రెండవ అవకాశము పొందుకున్న యోనాnh ఉదాహరణముగానున్నాడు. కొన్నిసార్లు మనకు కేవలము ఒక్క అవకాశము మాత్రమే ఉంటుంది!

    రెండవ అవకాశమునిచ్చే దేవుడు

    చర్చి పనిలో మిమ్ములను వాడుకోవాలని కోరుతున్నాడు గనుక ఆయన మిమ్ములను సృజించి యుండవచ్చు. మీరు దేవుని పిలుపునుండి దూరముగా పారిపోతుండవచ్చు. కాని దేవుడు మరల మీతో మాట్లడుచున్నాడు. దేవుడు యోనాతో రెండుసార్లు మాట్లాడాడు. మొదటి మాటకు మరియు రెండవ మాటకు మద్యలో, యోనాకు చాలా అనుభవాలు ఉన్నాయి. తుఫాను జీవితం మరియు చేపపొట్ట అనే చెరసాల లాంటివి అనుభవించాడు. చాలా క్లిష్ట అనుభవాల తరువాత, ఇప్పుడు మీరు దేవుని మాటలు వినుటకు సంసిద్ధముగా ఉన్నారు.

    మీరు ఈ పుస్తకమును చదువుతుండగా, ఆయన గృహములో పనిచేయుటకు దేవుడు మీకు రెండవ అవకాశము ఇచ్చియుండవచ్చు. మీరు చివరి యుద్ధము చేయుటకు ఇది సైన్యములో చేరే సమయమైయున్నది.

    పిలుపులో ఎటువంటి మార్పులు లేవు

    మొదటి పిలుపు మరియు రెండవ పిలుపు, ఈ రెండు పిలుపులు ఒకే విధముగనుండుట మనము గమనించగలము. మొదటి మరియు రెండవ పిలుపులో, ఒకటే ఖచ్చితమైన సందేశముతో ఒకటే పట్టణముకు(నీనెవే)యోనా పంపబడియున్నాడు. దేవుడు తన కృపావరముల విషయములోను, పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. (రోమ 11:29).

    కాలాలు మారుతున్నప్పటికి దేవుడు ఆయన మనసును మార్చుకోడు. మీరు తుఫానులు మరియు తిమింగలాలు లాంటి అనుభవాలు అనుభవిస్తునప్పటికి, ఆయన మిమ్మును ఉపయోగించుకోగలడు. దేవుడు మిమ్మును మొదటిగా పిలిచి పది సంవత్సరాలై యుండవచ్చు. మరి ఆయనకు విధేయత చూపుటకు యిక ఆలస్యముచేయవద్దు. ఎన్నటికి మనసు మార్చుకొనని దేవున్ని సేవిస్తున్నందుకు నేను చాలా సంతోషముగనున్నాను.

    దేవుని పిలుపును అంగీకరించడం అంటే మీరు అనర్హమైనదానిని అంగీకరించడమై యున్నది. పేతురు దేనికి అసమర్ధుడో దానికి సమర్ధుడుగ యేసు చేసియున్నాడు – అనగా మనుషులను పట్టే జాలరిగా చేసాడు!

    పరలోక రాజ్యము కొరకు గొప్ప విరాళాలు ఇచ్చుట అన్నది పరిచర్య యొక్క ఉద్దేశము కాదు. మీ యొక్క పరిచర్యను మీరు నిర్లక్షము చేయుటవలన పరిచర్యకు ఎటువంటి నష్టము లేదు మరియు పరిచర్యలో ఏది కూడా మీపై ఆధారపడి యుండదు. మనమందరము ఉపేక్షణీయులము మరియు ఖర్చుచేయబడువారమైయున్నాము.

    మేము సత్యమునకు విరోధముగా ఏమియు చేయనేరము గాని, సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము.

    2 కొరింథీయులకు 13:8

    దేవుని వాక్య సత్యమునకు విరోధముగామనము ఏమి చేయలేము అని లేఖనాలు బోధిస్తున్నాయి. మనము చేసే పెద్దతప్పులు సువార్తసత్యములను ఆటంకపరచలేవు. మన పిలుపును అధికముగా నిర్లక్ష్యము చేయడం వలన విజయము సాధిస్తున్న దేవుని సైన్యమును ఏమాత్రము మార్చలేము. ఇటువంటి పరిచర్య పనికొరకు పిలువబడడం మనకు గొప్ప ఆధిక్యతగనున్నది. పరిచర్యలో పాల్గొనుట మనకు గౌరవముగనున్నది. దేవునికొరకు ఏదో అపురూపమైనది చేస్తున్నాము అని ఇకనుండి ఆలోచించకూడదు.

    పరిచర్యలోనుండుట తగ్గింపుతో కూడిన అనుభవము, దానిలో దేవునిగూర్చి నేర్చుకుని ఆయన దయను పొందుకుంటాము. యేసు తన శిష్యులను ఏదో చేయదలచి, వారిని ఆయనను వెంబడించమని చెప్పాడు. మీరు పూర్తికాల పరిచర్యలో, దేవుడు వాడబడే పాత్రగా మలచబడుతారు.

    యేసు - నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను.

    మార్కు 1:17

    పూర్తికాల పరిచర్యలో, చాలా విధేయతతో కూడిన అనుభవాలను మీరు పొందుకుంటారు, మరియు మీ మనసును పునరుద్ధరించుట ద్వారా మీరు రూపాంతరం చెందుతారు. మిమ్మును దేవునికి సన్నిహితముగా చేర్చుటకు, పూర్తికాల పరిచర్య ఆరంభ ప్రయాణమై యున్నది. అది మిమ్మును వినయముగల వారిగా మార్చి మీలో మార్పును తీసుకొని వస్తుంది. తృణీకరింపబడే స్వభావముగల ఈ పని మరియు ఇతర క్రైస్తవ పరిచర్యలతో అన్యోన్యత, ఈ రెండు మిమ్మును విరచి మంచి వ్యక్తులుగా తయారు చేస్తుంది! పూర్తికాల పరిచర్య అంటే ఏంటో గ్రాహ్యముకాని బయటివారితో అన్యోన్యముగా నుండుట కూడా మిమ్మును దేవునితో అతి సమీపముగా నడుపుతుంది.

    పూర్తికాల పరిచర్య కానిది

    యేసు మిమ్ములను "మనుష్యులను పట్టే జాలరులుగా చేసినప్పుడు మాత్రమే మీరు పూర్తికాల పరిచర్యలో నుండగలరు. మీరు పనిచేస్తున్న పరిచర్య ద్వారా మీరు జీతం పొందినప్పటికీ అది మిమ్మును పూర్తికాల పరిచారకులుగా చేయలేదు.

    మీ జీతం యొక్క వనరులనంతటిని బ్యాంకు ద్వారా చర్చకి పంపినప్పటికీ మీరు పూర్తికాలపరిచర్యలో ఉన్నట్లు కాదు. పూర్తికాల పరిచర్య అనగ సంపూర్ణంగా ప్రభువును వెంబడించుటకు మీరు వేసే ధైర్యపు అడుగులై యున్నది. ఆయనను మీరు వెంబడించుటలో చాలా విషయాలు ఉన్నాయి, వాటిలో కొన్ని ఈ దిగువున ప్రస్తావించబడియున్నవి.

    పూర్తికాల పరిచర్య అనగ సులువుగా ఉద్యోగంలోనికి చేరడం కాదు. అది జీవిత కాలము వరకు చేసిన వాగ్దానమై యున్నది. అది మిమ్మును పూర్తిగా మ్రింగివేస్తుంది, తద్వారా దేవుని శక్తితో మీరు రూపాంతరం చెందుతారు.

    ఈ దిగువున ఇవ్వబడిన వాటిలో ఏఒక్కటికూడా పూర్తికాల పరిచర్యకు సంబంధించినవి కావు

    ¥ పూర్తికాల పరిచర్య అన్నది అనుకూలముగా పనిచేసే ఎంపికైయుండదు.

    ¥ పూర్తికాల పరిచర్య అన్నది సులభముగా పనిచేసే ఎంపికైయుండదు.

    ¥ పూర్తికాలపరిచర్య అన్నది పెద్దవాళ్ళు ఉద్యోగ విరమణ తరువాత చేసే ప్రణాళికలు కాదు.

    ¥ పూర్తికాల పరిచర్య అన్నది పనివారిని పెంచుటకు చేసే ఏర్పాటులు కాదు

    ¥ పూర్తికాల పరిచర్య అన్నది పసిబిడ్డల తల్లులకు ఆశ్రయము కాదు.

    ¥ పూర్తికాల పరిచర్య అన్నది బ్రతికినంతకాలము వేరే పనులు చేసుకొని, మరణముకు కొద్దినిమిషాలు ముందుండే కోరిక కాదు.

    ¥ పూర్తికాల పరిచర్య అన్నది మభ్యపెట్టే వ్యాపార ప్రణాళికలు కావు. కొంతమంది ప్రజలు పూర్తికాలపరిచర్యను కేవలము నిరంతర జీతం కొరకు చేస్తారు, మరోవైపున వారు వేరే పనులు చేస్తుంటారు. వ్యాపారము వ్యాపారమే మరియు పరిచర్య కేవలము పరిచర్యయైయున్నది!

    ¥ పూర్తికాలపరిచర్య అన్నది ఉద్యోగం మధ్యలో వచ్చి చేసే కార్యము కాదు.

    ¥ పూర్తికాల పరిచర్య అన్నది లౌకిక వాంఛలతోనున్న మనుష్యులపై ఆధారపడడం కాదు.

    ¥ పూర్తికాల పరిచర్య అన్నది పేదలను వృద్ధిలోనికి తెచ్చే పథకము కాదు. కొన్నిసార్లు పరిచర్యలో పనిచేయడం వలన ఆర్ధికముగా వృద్ధిచెందుతారు.

    ¥ పూర్తికాల పరిచర్య అన్నది మీవృతిని లౌకిక ప్రపంచము నుండి చర్చకి బదిలీ చేయడం వంటిది కాదు. లౌకిక ప్రపంచములో మీరు కారణమైయుంటేaccountan, వాస్తవానికి చర్చిలో కూడా మీరు కారణమైయుండాలినేమి లేదు.

    ¥ పూర్తికాల పరిచర్య అన్నది మీకు జీతం వచ్చే మూలాధారము కాదు.

    ¥ పూర్తికాల పరిచర్య అన్నది తాత్కాలిక పనికాదు. అది సెలవు కాలములో విద్యార్ధులు చేసే పని కాదు.

    పూర్తికాల పరిచర్యనుగూర్చిన భ్రమలు

    విభిన్న పరిస్థితిలోనున్న ప్రజలకు వ్యాపించే కొన్ని ప్రస్తుత సాధారణ భ్రమలున్నాయి. పూర్తికాల పరిచర్యలోనున్న ప్రజలు ఖచ్చితముగా ఒకరికొకరు చెప్పుకునే భ్రమలు. పూర్తికాల పరిచారకులను పీడించే కొన్ని భ్రమలు ఈ దిగువున ప్రస్తావించబడినవి:

    1. నేను పూర్తికాల పరిచర్యలోనున్నందున నేను ప్రత్యేకమైనవాడను.

    2. నేను పూర్తికాల పరిచర్యలోనున్నందున నేను మంచి జీతంను సంపాదిస్తాను.

    3. నేను పూర్తికాల పరిచర్యలోనున్నందున, ఇప్పటికే ఆత్మియతలో ఉన్నత మెట్టులోనున్నాను ఇంక ఎక్కుటకు ఎటువంటి ఆత్మీయ మెట్టులు లేవు.

    4. నేను పూర్తికాల పరిచర్యలోనున్నందున తర్ఫీదు లేని పరిచారకులకంటె గొప్ప వాడిని.

    5. నేను పూర్తికాల పరిచర్యలోనున్నందున విదేశాలకు ప్రయాణము చేస్తాను.

    6. నేను పూర్తికాల పరిచర్యలోనున్నందున పెద్ద ఇల్లు కలిగియుంటాను.

    7. నేను పూర్తికాల పరిచర్యలోనున్నందున కారుcaను కలిగి యుంటాను.

    8. నేను పూర్తికాల పరిచర్యలోనున్నందున ధనికుడనై యుంటాను.

    9. నేను పూర్తికాల పరిచర్యలోనున్నందున ఆత్మీయతను కలిగియున్నాను.

    10. నేను పూర్తికాల పరిచర్యలోనున్నందున నేను వైవాహిక జీవితము మరియు మంచి కుటుంబమును కలిగియుంటాను.

    11. నేను పూర్తికాల పరిచర్యలోనున్నందున ప్రార్థన, ఆరాధన మరియు వాక్య పఠనము చేయుటకు అధిక సమయము కలిగియుంటాను.

    12. నేను పూర్తికాల పరిచర్యలోనున్నందున నాపట్ల దేవుడు చాలా సంతోషముగనున్నాడు.

    13. నేను పూర్తికాల పరిచర్యలోనున్నందున ప్రేమతొ నడుచుచున్నాను.

    14. నేను పూర్తికాల పరిచర్యలోనున్నందున నా తీర్పులు చాలా సులువుగా ఉంటాయి.

    15. నేను పూర్తికాల పరిచర్యలోనున్నందున అభిషేకం మరియు రక్షణను కలిగియున్నాను.

    16. నేను పూర్తికాల పరిచర్యలోనున్నందున నా పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారు.

    17. నేను పూర్తికాల పరిచర్యలోనున్నందున ఏదేమైనా నేను పరలోకమునకు వెళతాను.

    18. నేను పూర్తికాల పరిచర్యలోనున్నందున స్థిరముగనున్నాను.

    పైన పట్టికలో ప్రస్తావించబడినవన్ని సత్యములు కావు. అవి నిజమైయుండవచ్చు, కాని మీ విషయములో నిజము కాకపోవచ్చు. అవి స్వతహసిద్ధంగా, ఖచ్చితముగా జరిగే విషయాలు కావు. మీరు పూర్తికాల పరిచర్యలో కేవలము దేవునిని మాత్రమే వెతకాలి, తద్వార ఆయన ప్రణాళికలన్నీ నెరవేరుతాయి.

    అధ్యాయము 2

    లౌకిక పని మరియు పరిచర్య పని మధ్య వ్యత్యాసము

    వ్యత్యాసము ఉన్నది

    అయితే నన్ను సేవించుటకును, భూరాజులకు దాసులై యుండుటకును ఎంత భేదమున్నదో వారు తెలిసికొనునట్లు వారు అతనికి దాసులగుదురు.

    2 దినవృత్తాంతములు 12:8

    రెహొబాము దేవునికి విరోధముగా తిరగబడినందున, ప్రవక్త అతనికి భయంకరమైన సందేశమును పంపించాడు. అతడు (ప్రవక్త), దేవుని కొరకు పనిచేయడం మరియు ప్రపంచ రాజ్యాలు కొరకు పనిచేయడం యొక్క వ్యత్యాసమును చూపిస్తానని అతనికి (రెహబాముకు) చెప్పియున్నాడు.

    దేవుని కొరకు పనిచేయడం మరియు ప్రపంచము కొరకు పనిచేయడం, ఈ రెండింటిలో వ్యత్యాసమున్నది. వాడిపోయే ఈ ప్రపంచములో పోగుచేయబడిన ఆస్తి దేవుని యొక్క ఉన్నత పిలుపుతో పోల్చలేము.వాడిపోయే ఈ ప్రపంచములో కూడబెట్టుకున్న ఆస్తి దేవుని యొక్క ఉన్నత పిలుపుతో పోల్చబడదు.

    మర్త్యమైన మనుష్యలకు నిజమైన పునాదులతో నిత్యత్వముగల పట్టణమును కట్టుట గొప్ప ఆధిక్యతయైయున్నది. భవిష్యత్తులేని తాత్కాలికమైన వాటిని నిర్మించుకొనుటకు చాలామంది ప్రజలు వారి జీవితములను గడుపుతుంటారు. సగటు మానవులు సాధారణముగా తాత్కాలిక ఇసుక కోటలకు నిర్మాణకులైయున్నారు.

    ఫరో ఎవరు?

    ఫరో ఒక రకమైన సైతానుడు. ఐగుప్తు ఒక రకమైన ప్రపంచము మరియు ఇశ్రాయేలు ఒక రకమైన దేవుని ప్రజలు. ఫరో దేవుని ప్రజల చేత కఠినమైన బానిసత్వ పనులు చేయించి వారి చేత ఐశ్వర్యవంతమైన పట్టణమును కట్టించాడు. ఇది ఈనాటి లౌకిక పనిని వివరిస్తుంది.

    లౌకిక ప్రపంచములో గడిపే చాలా సమయము, ఈ ప్రపంచములో పట్టణాలు నిర్మాణాల కొరకు గడుపుతుంటారు. మనము మరణించి ఈ లోకమును విడిచిపెట్టేసరికి, కేవలము ఈ ప్రపంచ పట్టణాలకు సుందరమైన భవనాలను మాత్రమె జతచేస్తున్నాము.

    ఈ ప్రపంచములోని పనులన్నీ చాలా కఠినముగా, చాలా ఉద్రిక్తతతో, మరియు చాలా కష్ట౦తో కూడి ఉంటాయి. ఈ ప్రపంచములోని ధనిక పట్టణములను నిర్మిస్తున్నాము అని గ్రహించకుండ మనము చాలా కష్టపడి పనిచేయుటకు ప్రేరేపించబడియున్నాము. న్యూ యార్క్ పట్టణము, ప్యారిస్, లండన్, అక్రా, మరియు నైరోబి – ఈ పట్టణాలన్ని మనుష్యుల చెమటతో కూడిన కష్టము ద్వారా కట్టబడినవి.

    నిర్మించిన ఈ మనుష్యులందరూ చనిపోయారు గాని ఆ ధనిక పట్టణాలు మాత్రం ఇప్పటికి ఉన్నాయి. ఈ ప్రపంచములోనున్న ధనిక పట్టణాల అభివృద్ధి కొరకు వీరి పని ఒక ధనముగా ఉన్నదని క్లుప్తపరచవచ్చు. సైతానుడు ఈ భూరాజ్యాలన్ని యేసుకు చూపిస్తునప్పుడు ఏమి చెప్పాడో అన్నది ఒక్కసారి గ్రహించండి:

    ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును;

    లూకా సువార్త 4:6

    వాస్తవముగా, ఈ ప్రపంచములోని పట్టణాలపై సాతనుడే అధికారము చలాయిస్తున్నాడని పైవాక్యము తెలియజేస్తున్నది. ఈ యుగసంబంధమైన దేవత సాతానుడై యున్నాడు (2 కొరింథీ 4:4). ఈ ప్రపంచములోనున్న పట్టణములను నిర్మించుటకు మనుషష్యులకు కఠినమైన పని ఇచ్చి నడిపిస్తున్నవాడు సాతనుడై యున్నాడు.

    క్రైస్తవులు నిర్మాణము చేసే వారి సైన్యములో చేరి, వారికి కావలసిన ధనిక పట్టణములను నిర్మించుకొనుటకు వారి భాగమును విరాళముగానిస్తారు.

    అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్తరాజు ఐగుప్తును ఏల నారంభించెను.

    అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది.

    వారు విస్తరింప కుండునట్లు మనము వారియెడల యుక్తిగా జరిగించుదము రండి; లేనియెడల యుద్ధము కలుగునప్పుడుకూడ మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధముచేసి యీ దేశములోనుండి, వెళ్లిపోదురేమో అనెను.

    కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారిమీద నియమింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి.

    అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యెడల అసహ్యపడిరి.

    ఇశ్రాయేలీయులచేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి;

    నిర్గామకాండము 1:8-13

    ఫరో ఐగుప్తును వశము చేసికొనినట్లు, సాతాను కూడా ఈ ప్రపంచము మరియు దాని పట్టణములను వశపరచుకుంటున్నాడు. అందుచేత ఈ ప్రపంచములో జడోష్ణత మరియు కలవరములు క్రమంగా పెరుగుతూ పతాకస్థాయికి చేరుకున్నాయి.

    మీరు ఆర్ధికసంభందమైన సంస్థలలో, బ్యాంకులో,

    Enjoying the preview?
    Page 1 of 1