Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

పరిశుద్ధాత్ముని అద్భుతములతో మరియు వ్యక్తీకరణములతో
పరిశుద్ధాత్ముని అద్భుతములతో మరియు వ్యక్తీకరణములతో
పరిశుద్ధాత్ముని అద్భుతములతో మరియు వ్యక్తీకరణములతో
Ebook462 pages2 hours

పరిశుద్ధాత్ముని అద్భుతములతో మరియు వ్యక్తీకరణములతో

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

ఈ రోజు సహజాతీతము ఉనికిలో నున్నదా? నేను సహజాతీతములో పనిచేయగలనా? ఒకవేళ దేవుడు ఇంకను ప్రజలను స్వస్థపరచగలిగితే, ఆయన ఎందుకు అందరిని స్వస్థపరచడు? నేను ఎలా స్వస్థత అభిషేకము పొందుకొనగలను? Dag Heward-Mills చేత ఈ అద్భుతమైన పుస్తకము యొక్క పేజీల ద్వారా పరిశుద్ధాత్మ వ్యక్తీకరణ మీద వీటికి ఇంకా అనేకమైన ప్రశ్నలకు సమాధానములను కనుగొనండి.

LanguageTelugu
Release dateMay 24, 2018
ISBN9781641352055
పరిశుద్ధాత్ముని అద్భుతములతో మరియు వ్యక్తీకరణములతో
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to పరిశుద్ధాత్ముని అద్భుతములతో మరియు వ్యక్తీకరణములతో

Related ebooks

Reviews for పరిశుద్ధాత్ముని అద్భుతములతో మరియు వ్యక్తీకరణములతో

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    పరిశుద్ధాత్ముని అద్భుతములతో మరియు వ్యక్తీకరణములతో - Dag Heward-Mills

    అధ్యాయము 1

    ఆత్మ యొక్క అద్భుతములు మరియు వ్యక్తీకరణములు ఎందుకు నీ పరిచర్యను విస్తృత పరుస్తాయి

    ఈ ప్రపంచమును యేసుక్రీస్తు కొరకు గెలచుటకు అద్భుతములు మరియు వ్యకీకరణలు మనకున్న ఒకే అవకాశము. ప్రతి జాతిని, దేశమును మరియు ప్రజలను రాజ్యము కొరకు గెలచుటకు మనకున్న ఏకైక అవకాశము అవి. దేవుడు ఎందు నిమిత్తము పరిచారకులను పిలిచాడో ఆ కార్యమును నెరవేర్చుటకు అవి అవకాశములు.

    పండ్రెండు మంది శిష్యులకు మరియు యేసు పంపిన డెబ్బది రెండు మందికి కూడా ఈ అద్భుతములు మరియు ఆత్మ యొక్క వ్యక్తీకరణలు అందుబాటులో ఉన్నాయి. గొప్ప ఆజ్ఞ ద్వారా మనందరికీ కూడా అవి అందుబాటులో ఉన్నాయి. మనము తెలుసుకోవడానికి మొదలుపెట్టి దేవుడు మనకు ఇచ్చిన వాటిని గ్రహిస్తే అవన్నీ కూడా మనకు చెందుతాయి.

    లోకమును క్రీస్తు కొరకు సంపాదించుకొనులాగున అద్భుతములు మరియు ఆత్మ యొక్క వ్యక్తీకరణలు నీకు సహాయము చేస్తాయి.

    ఒకసారి, నా దేశములోని వివిధ మూలలలో ఎన్నికల ఫలితాలు విడుదల చేసినప్పుడు, ఎన్ని లక్షణ ఆత్మలు మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్నాయో నేను గ్రహించాను. దేవుని హృదయము ఆత్మల కొరకు రక్తమును కార్చుతుంది. దేశమునకు సాంఘిక సేవ చేయునప్పుడు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవలసిన అవసరము మనకు లేదు. పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలు వంటి సాంఘిక సేవ అనే ఏర్పాతులు మాత్రమే మనలను దేశమునకు ఉపయోగకరముగా చేయవు.

    సంఘము అనేది దేవునిచే అభిషేకించబడి ప్రత్యేకమైన శక్తి మరియు అభిషేకము కలిగియున్న ఒక ప్రత్యేకమైన వ్యవస్థ. ఆ శక్తి మరియు అభిషేకము ద్వారా, మనము ఏమి చేయాలని దేవుడు పిలిచాడో దానిని మనము చేయగలుగుతాము. నశించుచున్న మానవజాతికి సహాయము చేయుటకు ఆయన ప్రకటించడం, బోధించడం మరియు స్వస్థపరచడం వంటివాటిని తన విధానముగా ఎన్నుకున్నాడు.

    అజ్ఞాతములో నుండి బయటకు వచ్చునట్లు అద్భుతములు మరియు ఆత్మ యొక్క వ్యక్తీకరణలు నిన్ను చేస్తాయి.

    నీవు అజ్ఞాతము నుండి బయటకు రావాలి! నీ పరిచర్య ఈ లోకములో ఉనికి తెలపాలి మరియు చూడబడాలి! నీకున్న తెలివి వినబడకుండా, లేదా చూడబడకుండా ఉన్నప్పుడు దానివల్ల ప్రయోజనమేమి? యేసు కూడా ఎవరికీ తెలియని ఒక వండ్రంగి యింటిలో పెరిగాడు, కాని దేవుడు ఆయనకు కొంత ప్రత్యేకమైన దానిని ఇచ్చాడు. యేసును ఆ అజ్ఞాతము నుండి బయటకు రప్పించింది ఏది? తన సందేశమును ఎవరైనా వినునట్లు చేసింది ఏది? ప్రకటనలను గూర్చిన నేటి పద్ధతులు లేకుండానే యేసు ఏమి చేసి ఉంటాడు? అద్భుతములు మరియు ఆత్మ యొక్క వ్యక్తీకరణములే యేసును ఆ అజ్ఞాతము నుండి బయటకు రప్పించాయి.

    అజ్ఞాతము నుండి బయటకు వచ్చుటకు అద్భుతములు మరియు ఆత్మ యొక్క వ్యక్తీకరణలు నీకు గొప్ప అవకాశములు. యేసు ఎప్పుడు ఒక పుస్తకము వ్రాయలేదు, ఒక కారులో పయనించలేదు, రైలులో వెళ్లలేదు లేదా విమానములో వెళ్ళలేదు కాని ఆయన ప్రసిద్ధి అయ్యాడు.

    ఆయనను గూర్చిన సమాచారము వ్యాపించెను మరియు పట్టణమంతయు వాకిట కూడియుండెను (మార్కు 1:28, 33) అని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. ఈ లోకములోని పట్టణములన్నీ కూడా మన మహాసభల గవిని దగ్గర కూడుకోవాలంటే, అప్పుడు మనకు స్వస్థత అభిషేకము కావాలి.

    ఈ లోకములోని పట్టణములు మన సంఘములలో కూడుకోవాలంటే, అప్పుడు అద్భుతములు మరియు ఆత్మ యొక్క వ్యక్తీకరణలు మూలము. స్వస్థత అభిషేకము పట్టణమంతటిని నీ వాకిట వద్దకు తెస్తుంది తద్వారా నీవు వారికి యేసుక్రీస్తును గూర్చి చెప్పగలుగుతావు.

    అనేకమంది విరిగిన హృదయముగల ప్రజలను అద్భుతములు మరియు ఆత్మ యొక్క వ్యక్తీకరణలు నీ పరిచర్యలోనికి ఆకర్షిస్తాయి.

    విరిగిన హృదయముగల వారిని స్వస్థపరచుటకు ఆయన అభిషేకించబడియున్నాడు అని యేసు చెప్పాడు. నీ ప్రియునితో లేదా ప్రేయసితో తెగతెంపులు చేసుకోవడం కంటే హృదయము విరగడములో ఇంకా ఎక్కువనే ఉంటుంది. సాధారణంగా నిరాశల వలన హృదయములు విరిగిపోతుంటాయి. జీవితము వారికి అందించిన వాటిని చూసి చాలా మంది ఆశ్చర్యపడిపోతుంటారు. అంతా సజావుగానే సాగుతుంది అన్నట్లుగా ప్రజలు జీవిస్తారు కాని వారు రక్తము కార్చుతున్నారు, నిరాశతో మరియు లోపల బాధతో ఉన్నారు.

    మానవుని అనేక సమస్యలు మందులచే, మనస్తత్వశాత్రజ్ఞులచే లేదా మానసిక నిపుణులచే నయము చేయవచ్చు. చాలా మందికి నిరీక్షణ ఇచ్చుటకు దేవుని యొక్క స్పర్శ వారికి అవసరము. తమ విరిగిన హృదయములను బాగుచేయడానికి ప్రజల జీవితములలోనికి వచ్చే పనిలో దేవుడు ఉన్నాడు.

    దైవజనులు జనాల నుండి డబ్బు సంపాదిస్తున్నారు అని చాలా మంది రాజకీయ నాయకులు భావిస్తారు గనుక ప్రజలు సంఘములోనికి ఎందుచేత వస్తూనే ఉంటారు అని వారు ఆశ్చర్యపడిపోతుంటారు. ఎందుచేత ప్రజలు అక్కడ జరుగుతున్నట్లు భావిస్తున్న మోసమును గ్రహించరు అని ఆశ్చర్యపడుతుంటారు. చూడండి, ప్రజలకున్న సమస్యలు చాలా సార్లు స్పష్టముగా కనబడవు. బయట ప్రజలు నవ్వుతూనే ఉంటారు కాని లోలోపల వారు ఏడ్చుచున్నారు. సంఘమును విమర్శించేవారికి అసలు సంఘము అనేది ప్రజలకు ఏమి చేస్తుందో సరిగా తెలియదు.

    సుప్రసిద్ధమైన స్వస్థత వరముగల ఒక సువార్తీకుడు దూరదర్శన్ చానెల్ లో ఒక ముఖాముఖి ఇవ్వడం నేను చూసాను. తన జీతము, ఇళ్లు మరియు కారులు గూర్చి అనేక ప్రశ్నలు అడగబడ్డాడు. ఆ కార్యక్రమమును నిర్వహిస్తున్నవాడు ఈయనను ఒక వెఱ్ఱివానిగా చేయాలని చూసాడు.

    అప్పుడు వారు ఫోన్ తీయగా ప్రార్థన అవసరతతో ఒక వ్యక్తి వారికి ఫోన్ చేసాడు. వెంటనే అక్కడి వాతావరణము మారిపోయింది. ఆ ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తికి కాన్సర్ ఉంది మరియు చావుకు దగ్గరగా ఉన్నాడు. ఆ సువార్తీకుడు తనకొరకు ప్రార్థన చేయాలని ఆయన కోరాడు. ఆ నిర్వాహకుడు అప్పటివరకు అడిగిన విరక్త ప్రశ్నలు ఇప్పుడు అర్థము లేకుండా పోయాయి. ఆ నిర్వాహకునికి నిస్పృహలో ఉండి, ఏడుస్తూ ఫోన్ చేసి తక్షణ సహాయము కోరిన వ్యక్తి ఆ ఫోన్ ద్వారా ఎదురయ్యాడు. కేవలము ఆ సువార్తీకుడు మాత్రమే ఆ సహాయము చేయగలడు. ఆ సువార్తేకుని పరిచర్య యొక్క సంబంధితత్వము అందరికీ స్పష్టమయ్యింది. అనేకమంది తరువాత ఫోన్లు చేసి తమ తమ నిస్పృహమైన మరియు నిరీక్షణలేని పరిస్థితుల కోసము ప్రార్థన చేయమని అర్ధించారు.

    ప్రజలకు అవసరతలు ఉన్నాయి మరియు స్వస్థత అభిషేకము ఆ అవసరతలను తీర్చుతుంది. అద్భుతములతో మరియు ఆత్మ యొక్క వ్యక్తీకరణలతో నీకు దేవుని శక్తి ఉన్నప్పుడు, విరిగిన హృదయముగల వారు నీవద్దకు పోటెత్తుతారు.

    నీ పరిచర్య సమాజమునకు సంబంధితముగా అద్భుతములు మరియు ఆత్మ యొక్క వ్యక్తీకరణలు చేస్తాయి.

    సంబంధితముగా ఉండడం అంటే ప్రాముఖ్యముగా ఉండడమే. స్వస్థతా అభిషేకము కార్యము చేస్తున్నప్పుడు మనము లోకమునకు సంబంధితముగా ఉంటాము. విరిగిన హృదయముగల వారు పునారావాస పరచబడినప్పుడు బీదలకు సువార్త ప్రకటించబడినప్పుడు మనము సంబంధితముగా అవుతాము. అపవిత్రాత్మలు ప్రజలను వేధిస్తాయి మరియు వారి జీవితాలలోనికి భయాన్ని తెస్తాయి. స్వస్థత అభిషేకము అపవిత్రాత్మల నుండి ప్రజలను విమోచిస్తుంది.

    చాలా దేశములు భయము మరియు మూఢనమ్మకములతో పాలించబడుతున్నాయి. అద్భుతములు మరియు ఆత్మ యొక్క వ్యక్తీకరణముల ద్వారా శాపములు విరుగగొట్టబడతాయి స్వస్థతవస్తుంది. చాలా మంది ప్రజలు మానవాతీతమైన శక్తిని అర్ధం చేసుకుంటారు. నీకు స్వస్థత అభిషేకము ఉంటే, దుష్టమైన మానవాతీత శక్తితో దేవులాడే స్థానికుల ముందు నిలువబడి వారిని సవాలు చేయగలుగుతావు! నీకు కేవలం ఒక చిన్న సండే స్కూల్ ప్రసంగం ఉంటే, మన కాలములో ఉన్న చేతబడులకు మరియు తంత్రములకు నీవు సరిపోవు.

    ప్రపంచములో ఎంతో మూఢనమ్మకము ఉంది. చేపలు పట్టడం అనుమతించబడని నదులు ఉన్నాయి! కొన్నిసార్లు ఈ నదుల నుండి ప్రజలు నీటిని కూడా చేదుకోకూడదు. మూఢనమ్మకముల వలన ఆనకట్టలను కూడా కట్టలేని పరిస్థితి ఉంది. ప్రజలు ఎన్నో వివిధమైన వాటిని గూర్చి భయపడుతున్నారు. కొన్నిసార్లు మూఢనమ్మకము వలన, కొన్ని సమయములలో కొన్ని రకములైన వస్త్రములను కూడా ధరించుటకు ప్రజలు భయపడుతున్నారు. కొన్ని వీధులలో దారులను కొన్ని దేవతలు ఆక్రమించుకొని ఉంటాయి గనుక అక్కడ వీధి దీపాలను కూడా వేయడానికి కుదరని పరిస్థితి ఉంది. కొన్ని సమయములలో కొన్ని దారులను వాడటానికి ప్రజలు భయపడుతున్నారు. లైట్లను ఆర్పడానికి వారు భయపడతారు. శుక్రవారములలో ప్రయాణము చేయడానికి ప్రజలు భయపడుతున్నారు. ఏదైనా నెలలో 13వ తారీఖున ప్రయాణము చేయకూడదు అని ప్రయాణమును చుట్టుకున్న ఒక విధమైన మూఢనమ్మకము కూడా ఉంది. ఒకవేళ 13వ తారీఖు శుక్రవారము వస్తే, అది ఇంకా భయంకరం. ఆఖరుకు విమానాలు కూడా ఈ విషయమును పట్టించుకుంటున్నాయి. చాలా విమానాలలో 13 అంకెగల సీటు లేదు. చాలా అపార్ట్ మెంట్ భవనాలలో 13వ అంతస్తు ఉండదు.

    ఒక దినమున, నేను ఒక విమానములో ప్రయాణము చేస్తున్నాను. మాకు చాలా కష్టమైన లాండింగ్ జరిగింది మరియు దాని విషయములో పైలట్ క్షమాపణ కోరుతూ ఆ విధముగా కష్టముగా ల్యాండ్ అవ్వడానికి గల కారణము అది 13వ తారీఖు మరియు శుక్రవారము కావడమే అని చెప్పాడు.

    కరుణించండి! చాలా మంది భయములోనే జీవిస్తున్నారు.

    అందించదానికి సంఘమునాకు ఏమైనా ఉన్నప్పుడు అది సంబంధితము అవుతుంది. ప్రజల యొక్క అవసరతలకు మనవద్ద సమాధానములు ఉంటే మనము సంబంధితము అవుతాము. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సంఘము అందించేది ఏ ప్రభుత్వమూ అందించలేదు. సంఘము ఇచ్చేది ఏ రాజకీయ నాయకుడు కూడా ఇవ్వలేడు. బోధకులు కాని లేదా వైద్యులు కాని సంఘము ఇచ్చేది ఇవ్వలేరు. కేవలము దేవుడు మాత్రమే విరిగిన హృదయము గలవారిని స్వస్థపరచి ప్రజలను రక్షించగలడు. ఈ ప్రపంచంలోని ప్రతి భాగమునకు కూడా అద్భుతములను పరిశుద్ధాత్మ వ్యక్తీకరణలు అవసరము.

    సంఘముగా మన సంబంధితత్వము పాఠశాలలు లేదా విశ్వవిద్యాలయాలు స్థాపించడం ద్వారా రాదు. విద్యను అందించవలసిన బాధ్యత ప్రభుత్వముపై ఉంది. సంఘము విద్యను అందిస్తున్నప్పుడు, అది వాస్తవానికి ఏమిటో అలాగే చూడబడాలి – అంటే దేశమునకు ఒక ప్రేమపూర్వకమైన బహుమానముగా. యేసుక్రీస్తు యొక్క సిలువ ద్వారా మానవాళి యొక్క రక్షణ అందించబడుతుంది.

    మనము గొప్ప ఆజ్ఞతో ఆజ్ఞాపించబడ్డాము. ఈ గొప్ప ఆజ్ఞతో ఏ ఒక్క సంస్థ కూడా ఆజ్ఞాపించబడలేదు. మన సంబంధితత్వము యేసును గూర్చి ప్రకటించడం మరియు బోధించడం నుండి వస్తుంది. బలహీనులను స్వస్థపరచడము నుండి మన సంబంధితత్వము వస్తుంది. అద్భుతములు మరియు పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తీకరణ నుండి మన సంబంధితత్వము వస్తుంది.

    బందీలైన ఆత్మలను అద్భుతములు మరియు ఆత్మ యొక్క వ్యక్తీకరణలు నీ సంఘమునకు తీసుకొస్తాయి.

    చాలా మంది ప్రజలు దయ్యములతో పీడింపబడుతున్నారు. ఒక దినమున, మాదకద్రవ్యములను ఎక్కువ మోతాదులో సేవించిన నా స్నేహితుని ఒకని చూచాను. చాలా బాధపడ్డాను. కేవలము దేవుని శక్తి మాత్రమే ప్రజలను మాదక ద్రవ్యముల నుండి, మద్యము మరియు అనైతికత నుండి విడుదల చేయగలదు. చాలా మంది బందీలుగా ఉంటున్నారు. వారు తమ్ముతాము విడిపించుకోలేరు. తమను బందీలుగా ఉంచుతున్న ప్రతిదాని నుండి స్వస్థత అభిషేకము ప్రజలను విడిపించగలుగుతుంది.

    స్వస్థతలు మరియు ఆత్మ యొక్క వ్యక్తీకరణములు గొడ్రాళ్లైన స్త్రీలకు నిరీక్షణ ఇస్తుంది. గొడ్రాలితనమునకు విరుగుడుగా ఒక స్త్రీలోనికి సర్పమును పంపిన ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని ఒకసారి చూడడం జరిగింది. సహాయార్థమై ఈమె మంత్రశక్తులున్న ఒక పూజారిని కలిస్తే ఆయన ఈమెకు పిల్లలు కలుగునట్లు ఈ విధమైన సహాయాన్ని చేసాడు.

    నాతో నేను, గొడ్రాలితనము వలన కలిగే కష్టాలు అగోచారమైనవి అని అనుకున్నాను. మనము పాములంటే చాలా భయపడుతుంటాము మరియు అవి బోనులో ఉన్నప్పుడు కూడా వాటి దగ్గరకు వెళ్ళడానికి ఇష్టపడము. దూరదర్శన్ లో కూడా పాములను చూస్తే మనకు ఒళ్లు జలజరించిపోతుంది. అటువంటిది, బిడ్డను కనడానికి ఒక స్త్రీ తన శరీరములోనికి పామును కూడా పంపించుకోడానికి ఇష్టపడుతుంది అంటే ఆమె యొక్క అవసరత ఎలా ఉందో అర్థమౌతుంది.

    ప్రకటించు నిమిత్తము నా వైద్య వృత్తిని ఎందుకు వదిలాను అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. ఒక ప్రసంగీకునిగా నేను ముఖ్యమైన పని ఏదైనా చేస్తున్నానా లేదా అని వారు ఆశ్చర్యపడుతుంటారు. నేను నేడు చేస్తున్న ఈ పని వైద్య వృత్తిలో నేను చేయగలదానికంటే ఎక్కువ. ఈ లోకము వైద్యము ద్వారా మెరుగుపడాలని యేసు భావించియుంటే, ఆయన కూడా వైద్యునిగానే ఉండేవాడు. కాని ఆయన ప్రకటించువాడు కాబట్టి ఈ విషయము మనకు ఏదైనా బోధించాలి!

    నలిగినవారిని విడిపించుటకు వచ్చినట్లుగా యేసు తనగూర్చి ప్రకటన చేసాడు. చాలా బాధతో కృంగిపోయేవాడే నలిగినవాడు. జీవితము బాధతో,వేదనతో మరియు నిరాశలతో నిండుకొని ఉంది మరియు యేసు యొక్క స్వస్థత అభిషేకము బాధింపబదినవారిని మరియు నలిగినవారిని స్వస్థపరచడం.

    ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును

    లూకా 4:18

    పట్టణములోని నీటితో సమస్య వచ్చినది గనుక ఎలీషా ఆ నీటిని బాగుచేయుటకు వెళ్ళాడు.

    అంతట ఆ పట్టణపువారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా యేలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై యున్నదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పువేసి నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పెను. వారు దాని తీసికొని రాగా అతడు ఆ నీటి ఊటయొద్దకు పోయి అందులో ఉప్పువేసి, యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ నీటిని నేను బాగు చేసియున్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగకపోవును. భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటివరకు ఎలీషా చెప్పిన మాటచొప్పున ఆ నీరు మంచిదైయున్నది (2 రాజులు 2:19-22).

    దేవుడు నీ నీటిని బాగుచేసినప్పుడు, నీ జీవితము యొక్క మూల అవసరతలను తీర్చుతున్నాడు. ఈ లోకములో అవసరతలలో ఉన్నవారు అనేకమంది ఉన్నారు అని దేవుడు నీకు చూపిస్తున్నాడు. తమ బలహీనతలకు స్వస్థత లేనివారు అనేకమంది ఉన్నారు. పేద దేశములలో, కొంత మంది స్త్రీలు తమ బిడ్డలను చెట్ల క్రిందనే కంటున్నారు. ఇందువలననే పేదలకు సువార్త ప్రకటించుటకు మనము అభిషేకింపబడుతున్నాము.

    ఈ లోకములోని బీదవారు ధనికులకంటే ఎంతో సంఖ్యలో ఎక్కువగా ఉన్నారు. మన హృదయములను దేవుడు పేదలవైపు త్రిప్పుతున్నాడు. నీవద్ద కొంత శుభవార్త లేనిదే ఈ లోకపు బీదల వద్దకు వెళ్లి వారితో నీవు మాట్లాడలేవు. తమ జీవితములను సువార్త ప్రయోగాత్మకముగా ఎలా ప్రభావితము చేయగలదో అని తెలుసుకోవాలని అనుకొంటున్నారు వారు. తమ సమస్యలతో, బలహీనతలతో మరియు తమ కడు బీదరికము అన్నిటితో సువార్త యొక్క సిద్ధాంతములను వారు ఎలా అర్థము చేసికొనగలరు?

    మరిన్ని అద్భుతముల కొరకు మనము ప్రార్థించాలి. మన హృదయములు మరిన్ని అద్భుతములను కోరుకోవాలి! లేనియెడల, జనసమూహములు అగ్నిగుండములో పడవేయబడుతుండగా మనము మాత్రము మన చిన్న చిన్న మూలలలోనే ఉండి మంచిగా కాలాన్ని గడుపుతాము.

    అద్భుతములు మరియు ఆత్మ యొక్క వ్యక్తీకరణలు నీ పరిచర్యలో దేవుని ఘనపరుస్తాయి.

    యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థతనొందుదును, నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు.

    యిర్మీయా 17:14

    యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థతనొందుదును అని యిర్మీయా మొఱ్ఱపెట్టాడు. దేవుడు నిన్ను స్వస్థపరచినట్లయితే, నీవు నిజముగా స్వస్థతనొందుతావు! దేవుడు నిన్ను రక్షిస్తే, నీవు నిజముగానే రక్షింపబడతావు! మానవుల యొక్క స్వస్థత పద్ధతులు చాలా తక్కువ శక్తిగలవి. స్వస్థత అభిషేకము ద్వారా, ప్రజల జీవితములలో దేవుడు చేయగల కార్యములను నీవు మరింత బలోపేతము చేయగలుగుతావు.

    దేవుడు స్వస్థపరుస్తాడు అంటే దేవుడు వైద్యశాస్త్రాన్ని సమర్ధించడం లేదు అని అర్థము కాదు. దేవుడు వైద్యమునకు వ్యతిరేకము కాదు. నిజానికి, మందులను ఉత్పన్నం చేయుటకు మానవులకు ఇవ్వబడిన తెలివితేటలు దేవుడు ఇచ్చినవే. ఆ వరమునకు మూలము ఆయనే. ఒక వైద్యునిగా, వైద్యశాస్త్రమును నేను నమ్ముతున్నాము. వైద్యశాస్త్రమును బట్టియు వైద్యులను బట్టియు దేవునికి స్తోత్రము. వారు లేకుండా మనకు చాలా కష్టము అవుతుంది.

    అయినప్పటికీ, వైద్యశాస్త్రము కంటే అధికమైన సంగతులు దేవుని వద్ద గుప్తమై యున్నవి. వైద్యశాస్త్రము చేయలేనిది ఆయన చేయగలడు. వైద్యశాస్త్రము చేయలేని వాటిని దేవుడు చేయగలడు. కొన్నిసార్లు, వైద్యశాస్త్రము కూడా చేయలేని పనులను ఆయన చేస్తుంటాడు. మనకు తెలిసినదల్లా ఆయన మంచి కార్యములు చేస్తాడు అని మాత్రమే.

    సాన్ ఫ్రాన్సిస్కో అనే దేశములో భూకంపం నుండి రక్షింపబడిన ఒక వ్యక్తిని గూర్చిన కథను చెప్పాలని అనుకొంటున్నాను. భూకంపంలో తనకు కలిగిన అనుభవము తరువాత అతడు ముఖాముఖిగా మాట్లాడబడ్డాడు. ఆ భూకంపంలో ఒక భవనము క్రింద ఆ శిధిలముల మధ్యలో మూడు దినములు మరియు రాత్రులు బ్రతికాడు. అంత దీర్ఘకాలముపాటు అట్టి శిధిలమైన గుట్టల క్రింద ఎలా జీవించియుండ గలిగావని అతనిని అడిగారు.

    అందుకు ఆయన, నేను చాలా బలమైన దృఢసంకల్పం గల వ్యక్తిని. నేను ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు, నన్ను ఏదియు ఆపలేదు. నేను ఆ రంగములో అలానే ఉండగలుగుతాను! నేను కుడికి గాని ఎడమకు గాని కదలను! నేను బలమైన నిశ్చయత మరియు దృఢసంకల్పంగల వ్యక్తిని గనుక నేను చనిపోకూడదని అనుకొన్నాను! నేను జీవించాలని అనుకొన్నాను అందుకే నేను ఇంకను జీవించే ఉన్నానని భావిస్తున్నాను అని చెప్పాడు.

    తన భార్యతో కూడా ముఖాముఖిగా మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ, మంచిది, నాకు నా భర్తను గూర్చి తెలుసు మరియు మేమిద్దరమూ అనేక సంవత్సరములుగా వివాహము చేసుకొనియున్నాము. చాలా బలమైన దృఢసంకల్పంగల వ్యక్తి ఆయన! ఏదైనా చేయాలని ఆయన అనుకొంటే, ఆయనను కుడికి గాని ఎడమకి గాని ఏదీ కూడా కదిలించలేదు. ఆయన చాలా గట్టిమనిషి. ఆయన చాలా నిశ్చయతగల మనిషి. తన పథకములను ఆయన అలా ముందుకు తీసుకెళ్తాడు! ముందుకు కదులుతాడు. విపత్తులు ఉన్నప్పటికీ కూడా కదలని విధానముగల వ్యక్తి ఆయన. నా వాడిని గూర్చి నాకు తెలుసు! నేను అతనితో ఇరువది వై ఏడు సంవత్సరములుగా వివాహము చేసుకొనియున్నాను మరియు జీవించాలని ఆయన అనుకున్నప్పుడు, ఆయన జీవిస్తూనే ఉన్నాడు అని చెప్పింది.

    ఈ వ్యక్తి యొక్క వైద్యునితో

    Enjoying the preview?
    Page 1 of 1