Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

వారికి చెప్పండి
వారికి చెప్పండి
వారికి చెప్పండి
Ebook309 pages1 hour

వారికి చెప్పండి

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

Dag Heward-Mills ఉత్తమ అమ్మకమైన “నమ్మకత్వము మరియు అపనమ్మకత్వము” అనే దానితో కలిపి అనేక పుస్తకముల రచయిత. The Lighthouse Chapel International అని పిలువబడి రెండు వేలకు పైగా సంఘములు కలిగిన ఒక సంస్థ స్థాపకుడు.

LanguageTelugu
Release dateMay 24, 2018
ISBN9781641352048
వారికి చెప్పండి
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to వారికి చెప్పండి

Related ebooks

Reviews for వారికి చెప్పండి

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    వారికి చెప్పండి - Dag Heward-Mills

    అధ్యాయము 1

    నీవు ఆత్మలను సంపాదించేవాడవుగా ఉండుటకుగాను నూట ఇరువది కారణములు

    నీవు ఆత్మలను సంపాదించేవాడవుగా ఎందుకు ఉండాలంటే, మనకు మన ప్రభువును మరియు రక్షకుడునైన యేసుక్రీస్తు ఇచ్చిన గొప్ప శాసనము, గొప్ప ఆజ్ఞ, గొప్ప ఉత్తరువు, గొప్ప ఉపదేశము, గొప్ప విధి ఇదియే.

    అయితే యేసు వారియొద్దకు వచ్చి – పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.

    మత్తయి 28:18-20

    నీవు ఆత్మలను సంపాదించేవాడవుగా ఎందుకు ఉండాలంటే ఆత్మలను సంపాదించే ఈ ఉన్నతమైన పనికొరకు మనము పిలువబడియున్నాము.

    కాగా పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే.

    మత్తయి 22:14

    ఈ ప్రాకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.

    మత్తయి 20:16

    పిలుపును గూర్చి William Booth ఏమి చెప్పాడు

    పిలువబడలేదు! అని నువ్వు అన్నావా? పిలువబడగా వినలేదు, అని నువ్వు అనాలి అనుకుంటాను.

    నీ చెవిని పరిశుద్ధ గ్రంథము దగ్గర పెట్టు, దేవుడు నిన్ను వెళ్లమని చెప్పడం విను మరియు పాపము అనబడే అగ్ని నుండి పాపులను రక్షించు! నీ చెవిని భారముతో ఉన్నవారి పట్లను, మానవాళి యొక్క వేదనాభరితమైన హృదయము తట్టును పెట్టి సహాయము కొరకు వారు చేయు ఆర్తనాదాలను విను!

    వెళ్లు పాతాళ ద్వారబంధముల యొద్ద నిలువబడి, శిక్షార్హులైనవారు నిన్ను తమ తండ్రి యింటికి వెళ్లి తమ సహోదరులకును సహోదరీలకును మరియు సేవకులకును యజమానులకును వారున్న ఆ చోటికి వారెవరు రావద్దు అని వీరు చెప్పుచున్న మాటలను విను!

    అప్పుడు క్రీస్తును తన ముఖములో చూడు – ఆయన కరుణకే నీవు విధేయునిగా ఉంటానని ఒప్పుకున్నావు – మరియు ఈ లోకమునకు తన కరుణను ప్రచురము చేయుటకుగాను నీవు నీ హృదయమును మరియు ఆత్మను మరియు శరీరమును మరియు సందర్భములను కలుపుతావో లేదో ఆయనతో చెప్పు."

    William Booth, రక్షణ దళం అనే సంఘము యొక్క వ్యవస్థాపకుడు

    ఈ భూమిమీదనున్న తెగలలో ఎవరైతే ఇంకా సువార్తను వినలేదో అటువంటి వారికి సువార్తను అందించుటకుగాను దేవుడు ప్రతి తరములో కూడా తగినంత మంది స్త్రీపురుషులను లేపుతున్నాడు అని నేను నమ్ముతున్నాను. పిలువనివాడు దేవుడు కాదు, కాని స్పందించనివాడు మానవుడు.

    Isobel Kuhn, చైనా మరియు థాయ్ లాండ్ వెళ్లిన మిషనరీ

    నీవు ఆత్మలను సంపాదించేవాడవుగా ఎందుకు ఉండాలంటే ఆత్మలను సంపాదించే మంచి కార్యమును కొనసాగించుటకు నీవు సృష్టింపబడ్డావు.

    మరియు వాటియందు మనము నడచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్ క్రియలు చేయుటకై, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.

    ఎఫెసీయులకు 2:10

    లండన్ లోని ఒక టాక్సీ డ్రైవర్ తో ఒకసారి నేను మాట్లాడాను. నేను క్రైస్తవుడను అని చెప్పి, ఆయనతో క్రీస్తును గూర్చి పంచుకోవడం మొదలుపెట్టాను. పరలోకము మరియు నరకము అనేవాటి యొక్క వాస్తవికతను గూర్చి ఆయనతో చెప్పాను. ఆయన నవ్వి అన్నాడు నిజముగా నీవు చెప్పుచున్న వాటినన్నిటిని నీవు నమ్ముచున్నావా అని.

    ఆయన, ఒకవేళ పరలోకమే వాస్తవికమైనదైతే, క్రైస్తవులు తమను తాము చంపుకొని ఎందుకు పరలోకములోనికి ఎక్కి వెళ్లిపోకూడదు? అని అన్నాడు.

    ఆయన నాతో చెప్పాలని అనుకుంటున్న విషయం ఏమంటే పరలోకము అనేది చాలా చక్కని స్థలము కనుక, మరియు ఈ భూమిపైన క్రైస్తవులకు చేయవలసిన పని కూడా ఏమి లేదు గనుక, వారు ముందు స్వయంగా పరలోకములోనికి బదిలీ కావాలి.

    ఒకవేళ నిజముగానే క్రైస్తవులకు ఈ భూమిమీద చేయడానికి ఏ ఒక్క పని కూడా లేకుండా ఉన్నట్లయితే, అప్పుడు ఈ వ్యక్తి చెప్తున్న దానిలో ఒక మంచి విషయమే ఉంది. కాని, వాస్తవానికి పరలోకములోనికి వెళ్లుటకు మునుపు ఈ భూమిమీద చేయవలసిన సత్ క్రియలు క్రైస్తవులకు ఎన్నో ఉన్నాయి. మనము యేసుక్రీస్తు యొక్క సువార్తను గూర్చిన సాక్ష్యమునిస్తూ ప్రకటించాలి. ఏ విధముచేతనైనను నశించుచున్నవారిని మనము రక్షించాలి.

    కోట్లకొలది ప్రజల యొక్క రక్షణ అనేది మనమీదనే ఆధారపడి ఉంది. క్రైస్తవులలో అనేకులు అసలు వారు రక్షింపబడుటకు గల కారణములను తెలుసుకోకుండానే ఉన్నారు అని చెప్పడానికి నేను చింతిస్తున్నాను.

    మనము ఒక కారణము చేత రక్షింపబడియున్నాము అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది – అదే సత్ క్రియలు చేయడానికి!

    మరియు వాటియందు మనము నడచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్ క్రియలు చేయుటకై, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.

    ఎఫెసీయులకు 2:10

    ప్రతిదినము కూడా క్రైస్తవులు వెనుకకు వెళ్లిపోతున్నారు ఎందుకంటే సంఘములో ఉండుటకు వారికి మరియే ఉద్దేశమును తోచుటలేదు. ప్రజలు సంఘమునకు హాజరు అవుతున్నారు, కాని కొంత కాలము జరిగిన తరువాత, సంఘ జీవితములో అసలు అర్థాన్నే చూడలేకపోతున్నారు. ఆత్మల సంపాదనలో ఎవరైతే నిమగ్నమౌతారో వారు తమ రక్షణను గూర్చిన ఉద్దేశమును కనుగొనడం ప్రారంభిస్తారు. ఆత్మలను సంపాదించడం అనేది క్రైస్తవుని యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది.

    నీవు ఆత్మలను సంపాదించేవాడవుగా ఎందుకు ఉండాలంటే ఆత్మల సంపాదన గొప్ప ఆనందమును ఇస్తూ క్రైస్తవులను శక్తివంతులుగా చేస్తుంది.

    అటుతరువాత ప్రభువు డెబ్బదిమంది యితరులను నియమించి, తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతిచోటికిని తనకంటె ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. పంపినప్పుడాయన వారితో ఇట్లనెను – కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియె; కాబట్టి కోత యజమానుని తమ కోతకు పనివారిని పంప వేడుకొనుడి. మీరు వెళ్లుడి; ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱె పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను.

    ఆ డెబ్బదిమంది శిష్యులు సంతోషముతో తిరిగివచ్చి...

    లూకా 10:1-3, 17

    నీవు ప్రకటించుటకు బయటకు వెళ్లిన ప్రతిసారి కూడా నీవు సంతోషముతో తిరిగివస్తావు. ఆత్మలు రక్షింపబడినప్పుడు ఆనందము ఉంటుంది. నేను దానిని వివరించలేను. తనకు బిడ్డ పుట్టిన తరువాత కలిగే ఆనందమును ఒక తల్లి మాత్రమే వివరించగలదు. ప్రసవములో బాధను పొందడం నేను చాలామంది స్త్రీలలో చూసాను, కాని ఆ బాధ కాని వేదన కాని వారిని సంతొషించకుండా ఆపలేవు.

    నీవు ప్రజలను ప్రభువు యొద్దకు తెచ్చినప్పుడు, ప్రభువు యొక్క సంతోషమును కలిగి ఉండడం అంటే ఏమిటో నీవు కనుగొంటావు. నేను దానిని నీకు వివరించలేను. నీయంతట నీవే దానిని కనుగొనాలి. ఆత్మలను సంపాదించే పనిలో నిమగ్నమైనప్పుడు నా సంఘ బిడ్డలు గొప్ప శక్తిని పొందడం నేను చూసాను. ఆత్మలను సంపాదించడం అనేది సంఘములో ప్రభువు యొక్క సంతోషమును విడుదల చేస్తుంది.

    నీవు ఆత్మలను సంపాదించేవాడవుగా ఎందుకు ఉండాలంటే ఒక సంఘము యొక్క నిజమైన గొప్పదనము ఆ సంఘములో ఎంతమంది కూర్చొనగలరో కాదు ఎంతమందిని ఆ సంఘము బయటకు పంపుతుందో అనేదానిపై ఆధారపడి ఉంటుంది.

    నీవు ఆత్మలను సంపాదించేవాడవుగా ఎందుకు ఉండాలంటే ఆత్మల సంపాదన అనేది యేసు యొక్క గుండె చప్పుడు.

    కొన్ని సంవత్సరముల క్రితము, ఒక దర్శనాన్ని చూసాను. ఆ దర్శనములో, రక్తముతో నిండుకొనియున్న ఒక మానవ హృదయమును చూచాను. ఆ గుండె కొట్టుకుంటుంది. యేసుక్రీస్తు యొక్క హృదయ వేదన, పంటలను కోయడమే అని దేవుడు ఆ దినమున నాలో ముద్రించాడు. యేసు ఊరకనే తన సింహాసమును విడిచి రాలేదు! పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకములోనికి వచ్చాడు.

    నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను.

    లూకా 19:10

    నీవు ఆత్మలను సంపాదించేవాడవుగా ఎందుకు ఉండాలంటే ఆత్మల సంపాదన అనునది సంఘములలో చీలికలు రాకుండా నిరోధిస్తుంది.

    ఫలభరితమైన కార్యకలాపాలలో నీ సంఘ బిడ్డలు నిమగ్మమైయుంటే, విభజనలను తెచ్చే చిన్న చిన్న గొడవలకు వారికి సమయము ఉండడు. ఒక ఆత్మ ఆత్మయే అని, అది దేవునికి ఎంతో ప్రశస్తమైనదని సదరు సేవకుడు తన సంఘస్థులకు చెప్పాలి.

    రక్షింపబడవలసిన ఆత్మలను గూర్చిన భారము సంఘ సభ్యులకు కలిగినప్పుడు, వారి ప్రాధాన్యతలు అన్నీ కూడా లేఖనానుసారమైన ప్రాధాన్యతలే అవుతాయి.

    సంఘములో వచ్చే విభజనలు మరియు చీలికలు ఆగుతాయి. అనేకమంది క్రైస్తవులు ఏమీ చేయకుండా ఒకే స్థలములో ఉన్నప్పుడు, అది తరచు బాధలను, గొడవలను మరియు గాయాలను కలిగిస్తుంది.

    నీవు ఆత్మలను సంపాదించేవాడవుగా ఎందుకు ఉండాలంటే ఆత్మల సంపాదన దైవికమైన మద్దతును మరియు భద్రతను పెంపొందిస్తుంది.

    సువార్తను వ్యాపింపచేయడం అనేది మనకున్న ఒక ఎంపిక కాదు. ఒకవేళ అది చేయకపొతే అది మనకు మరణాన్ని తెస్తుంది.

    Peter Taylor Forsyth

    నీవు ఆత్మలను రక్షించినప్పుడు, నీవు చేస్తున్న పనులన్నిటికీ కూడా దైవికమైన మద్దతును కూడగట్టుకుంటున్నావు.

    నీవు లేఖనమును చదివినప్పుడు, ఆత్మల సంపాదన అనేది పరలోకానందాన్ని తెస్తుంది అని నీవు కనుగొంటావు. ప్రభువు కొరకు గెలిచిన ప్రతి ఒక్క ఆత్మ విషయమై పరలోకము నుండి ఒక స్పందన ఉంటుంది.

    అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటే మారుమనస్సుపొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.

    అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాననెను.

    లూకా 15:7, 10

    సంఘములు అసలు మనుగడలో ఎందుకు ఉంటున్నాయా అని అవి తెలిసికోవాలి: పరలోకమునకు ఆత్మలను ఉత్పన్నం చేయుటకు. అవి చెందిన దేశములకు ప్రాతినధ్యం వహించడానికి ప్రతిదేశపు దౌత్య కార్యాలయాలు కొన్ని దేశాలలో ఉంటాయి. అలాగే, సంఘములు పరలోకమునకు దౌత్యకార్యాలయాలుగా ఉన్నాయి.

    దేవుడు తమను దుష్టుని నుండి కాపాడాలని చాలా మంది ప్రార్థిస్తారు. దేవుని చిత్తాన్ని జరిగించుటలో ఎంతమందైతే పాలుపంచుకుంటారో అటువంటి వారికి దైవికమైన భద్రత అందుబాటులో ఉంటుందనే విషయం మీకు తెలుసా?

    కీర్తన 91లో, నీవు నీ ప్రేమను దేవునిపై ఉంచుకొనియున్నావు గనుక దేవుడు నిన్ను కాపాడి భద్రపరుస్తాడు అని చెప్పబడింది.

    అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను.

    అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను.

    దీర్ఘాయువుచేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను.

    కీర్తన 91:14-16

    నీవు దేవునికి ఇష్టునిగా ఉండుటకు దేవునిపై నీ ప్రేమను ఉంచినప్పుడు, నిన్ను విడిపిస్తాను అని దేవుడు చెప్తాడు. నేను దేవుని యొక్క చిత్తాన్ని చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. నేను ఇంకను బ్రతికి ఉండటానికి బహుశా కారణం ఇదేనేమో. పౌలు వలె, మరణమునకు దగ్గరగా వెళ్లిన అనుభవాలు కొన్ని నాకు ఉన్నాయి, అంటే విమానములు కూలబోయిన మరియు కారు ప్రమాదములు జరగబోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

    వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదులచేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని; ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని.

    2 కొరింథీయులకు 11:23-25

    ఈ విషయములన్నిటిలో నేను కూడా పౌలు వలె మాటలాడి నా ఉపద్రవములన్నిటి నుండి ప్రభువు నన్ను విడిపించాడు అని చెప్పగలను.

    మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.

    రోమీయులకు 8:38-39

    దేవుడు ఇప్పుడు మిమ్మును విడిపించడం నేను చూడగలను! నీ కష్టకాలములో ఆయన నీకు సహాయము చేయడం నేను చూడగలను! నీవు నీ ప్రేమను ఆయనపై ఉంచుకొనియున్నావు గనుక దేవుడు నీతో నిలువబడియుండుట నేను చూడగలను!

    నీవు దేవుని చిత్తములో ఉండాలని అనుకుంటున్నావా? నీ సంఘము వృద్ధిచెందాలని అనుకుంటున్నావా? నేడే ఆత్మలను సంపాదించేవాడవుగా కమ్ము. నీ సంఘములో గొప్ప మార్పును చూడగలగుతావు.

    ఒక సంఘ సభ్యుని ఒక సువార్తికునిగా మార్చగలిగినప్పుడే నేను నా కాపరి వృత్తి పూర్తిగా నెరవేరినట్లుగా అనుకుంటాను. నా సంఘములోని ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఆత్మలను సంపాదించేవాడు కావాలని అనుకుంటున్నాను. ఒక దినమున చూపుటకు కొన్ని ఫలాలను పొందాలని అనుకుంటున్నాను. ఆత్మల

    Enjoying the preview?
    Page 1 of 1