Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

శాపములను నిర్వీర్యము చేయుట ఎట్లు
శాపములను నిర్వీర్యము చేయుట ఎట్లు
శాపములను నిర్వీర్యము చేయుట ఎట్లు
Ebook838 pages3 hours

శాపములను నిర్వీర్యము చేయుట ఎట్లు

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

Dag Heward-Mills ఉత్తమ అమ్మకమైన “నమ్మకత్వము మరియు అపనమ్మకత్వము” అనే దానితో కలిపి అనేక పుస్తకముల రచయిత. The Lighthouse Chapel International అని పిలువబడి రెండు వేలకు పైగా సంఘములు కలిగిన ఒక సంస్థ స్థాపకుడు.

LanguageTelugu
Release dateMay 24, 2018
ISBN9781641352062
శాపములను నిర్వీర్యము చేయుట ఎట్లు
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to శాపములను నిర్వీర్యము చేయుట ఎట్లు

Related ebooks

Reviews for శాపములను నిర్వీర్యము చేయుట ఎట్లు

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    శాపములను నిర్వీర్యము చేయుట ఎట్లు - Dag Heward-Mills

    ఖండము 1 శాపముల యొక్క వాస్తవికత

    అధ్యాయము 1

    శాపములను గూర్చిన ఈ పుస్తకము ఎందుకు?

    శాపము దేశమును నాశనము చేయుచున్నది దాని నివాసులు శిక్షకు పాత్రులైరి దేశనివాసులు కాలిపోయిరి శేషించిన మనుష్యులు కొద్దిగానే యున్నారు.

    యెషయా 24:6

    భూమిని దహించివేసేది దయ్యములో లేదా అపవిత్రాత్మలో కాదు శాపములే అని చెప్పే పైని వాక్యభాగమును గమనించండి.

    ఆధునిక క్రైస్తవులు శాపములను తగినంతగా లక్ష్యపెట్టాలి.

    నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు.

    కీర్తన 119:6

    ఆధునిక క్రైస్తవులు శాపముల కంటే అపవిత్రాత్మలు దయ్యములను గూర్చే ఎక్కువ అవగాహన కలిగియున్నారు. దయ్యముల యొక్క వాస్తవికతనే ఎక్కువగా నేటి క్రైస్తవుడు ఆదరిస్తున్నాడు గాని శాపములు కూడా వాస్తవమే అనే దానికి భయపడట్లేదు మరియు దానిని లక్ష్యపెట్టుటలేదు.

    నీవు ఈ పుస్తకమును చదువుతుండగా, శాపముల వాస్తవికత పట్ల నీవు సరియైన ఆరోగ్యకరమైన గమనింపును పెంపొందించుకోవాలనేది నా ప్రార్థన. దయ్యములు, అపవిత్రాత్మలు మరియు అపవాదుల వాస్తవికతను నేను నమ్ముతాను. ప్రతితోజు నేను వాటిని బంధించి నా జీవితములో నుండి వాటిని బయటకు త్రోలివేస్తాను. దయ్యములను గూర్చి నేను అనేకమైన పుస్తకములు కూడా వ్రాసాను. అయినప్పటికీ, ఈ అపవిత్రాత్మలు అవకాశము చూచుకొని నిరాశను, చెడుతనము మరియు మరణమును కలిగించుటకు గల నిజమైన కారణము శాపములే అని కూడా నేను నమ్ముతున్నాను. శాపములను అమలు చేసేది అపవిత్రాత్మలే! అపవిత్రాత్మలు తమ చెడుతనమును జరిగించుటకు శాపములు చట్టబద్ధమైన ఒక అమరికను అందిస్తాయి. శాపముల మనుగడను నీవు నమ్మినా లేకున్నా అవి వాస్తవమే!

    నేడు మానవుని జీవనము మనకు తెలిసిన విధముగా నిశ్చయించి రూపిస్తున్న శాపముల మనుగడను నీవు లక్ష్యపెట్టడం మొదలుపెట్టాలి! నేడు మనము అనుభవిస్తున్నదానిలో ఎక్కువ శాతము సంవత్సరముల క్రితము పలుకబడిన శాపములు మరియు ఆశీర్వాదములచే నిర్ణయించబడుతుంది. నిజానికి, పరలోకమును గూర్చిన ఒక ప్రధానమైన లక్షణము ఏమంటే అక్కడ శాపము అనేదే ఉండదు.

    ... అయినను దాని చేయించిన వానివైపు మీరు చూచినవారు కారు పూర్వకాలమున దాని నిర్మించినవానిని మీరు లక్ష్య పెట్టకపోతిరి.

    యెషయా 22:11

    శాపములు ఉన్నప్పుడు వాటిని చూపించే పని దేవుని పరిచారకునిదే.

    శాపము యొక్క మనుగడను ఒక దైవజనుడు గుర్తించడం తప్పుకాదు. దేవుని వాక్యమునకు విరోధముగా పోరాడవద్దు! దేవుని వాక్యము శాపములు ఉన్నాయి అని చెప్తున్నప్పుడు వాటి మనుగడను తిరస్కరించవద్దు! దేవుడు శాపములను తనకు చూపించినప్పుడు వాటిని గుర్తించడం అనేది దేవుని మంచి పరిచారకుని బాధ్యత. ఇశ్రాయేలీయులకు ప్రవక్తయైన మలాకీ చెప్పిన మాటను వినండి. ఆయన వారితో, మీరు శాపగ్రస్తులై యున్నారు! శాపమును గూర్చి వారికి చెప్పుటలో అతనేమి తప్పు చేయలేదు. ఆ శాపము వాస్తవమైనది మరియు మనుగడలోనే ఉన్నదని గుర్తించుటలో అతడు చేసినది సరైనదే. నీవు శాపమును చూపించగలిగినప్పుడు మాత్రమే దానిని అధిగమించగలుగుతావు. శాపము అసలు మనుగడలోనే లేదు అని నీవు అంటే, దానితో నీవెలా పోరాడగలవు దానిని నిర్వీర్యము ఎలా చేయగలవు?

    ఈ జనులందరును నాయొద్ద దొంగిలుచునే యున్నారు, మీరు శాపగ్రస్తులై యున్నారు.

    మలాకీ 3:9

    శాపము గుర్తించబడి ఎత్తి చూపబడినప్పుడు బాధపడవద్దు.

    మలాకీ దినములలో, శాపము వారిమధ్యలో ఉన్నదని దేవుడు వారికి తెలియజేసినప్పుడు దేవుని ప్రజలు బాధపడకుండా ఉండాలి. వివిధ కోవలకు చెందిన ప్రజలను ప్రభావితము చేసే శాపములను గూర్చి నేను ఈ పుస్తకములో మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా బాధపడకండి. ఏ ఒక్క కోవకు చెందిన ప్రజలనైనా నేను తక్కువ చేసి మాట్లాడుటకు నేను ఈ విషయాలు వ్రాయుటలేదు గాని మీరు శాపమును నిర్వీర్యము చేయులాగున దానిని గుర్తించేందుకే దీనిని వ్రాస్తున్నాను. ఈ పుస్తకములోని అధిక భాగములో శాపమును నిర్వీర్యము చేయడం మరియు అధిగమించడమును గూర్చే వ్రాయబడింది. శాపములు మరియు ఆశీర్వాదములను గూర్చి దేవుని వాక్యము ఏమి బోధిస్తుందో మీకు తెలియజేస్తున్నందున నన్ను మీకు శత్రువుని కానివ్వకండి.

    ప్రజలు శాపము క్రింద ఉన్నారు అని ప్రవక్తయైన మలాకీ సత్యమును ప్రకటిస్తూ ప్రజలకు ఏవిధంగా చెప్పాడో, శాపము యొక్క మనుగడను గూర్చి నేను కూడా మీతో అలాగే పంచుకొంటున్నాను.

    నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా?

    గలతీయులకు 4:16

    ప్రతి ఒక్క శాపము నిర్వీర్యపరచబడగలదు.

    ప్రతియొక్క శాపము నిర్వీర్యపరచబడగలదు అని నేను నమ్ముతున్నాను! దేవుని వాక్యమునకు తెరువబడినవారెవరైనా సరే శాపమును గమనించి దేవుని యొక్క జ్ఞానముతో దానిని అధిగమిస్తారు అని నేను ఈ పుస్తకమును వ్రాస్తున్నాను. ఒకదాని యొక్క మనుగడను నీవు విస్మరిస్తే దానినెలా నిర్వీర్యపరచగలవు? దాని మనుగడను నీవు తిరస్కరించడమే నీ యొక్క అతిపెద్ద బలహీనత!

    తక్కువ చేసి మాట్లాడుటకు, అవమానించుటకు లేదా ఏ ఒక్క కోవకు చెందినవారినైనా హేళన చేయుటకు ఈ పుస్తకములోని బోధలను ప్రయోగించకండి. గుర్తించబడుతున్న సకలవిధములైన శాపముల నుండి ప్రజలను పైకెత్తడానికి ఈ పుస్తకములోని బోధలను ప్రయోగించండి.

    ఈ పుస్తకము ఒక నిరీక్షణ! ఇది విజయ పుస్తకము! దేవుని జ్ఞానము మరియు శక్తి ద్వారా శాపములపై నీకున్న అధికారమును ఈ పుస్తకము నీకు వెల్లడిచేస్తుంది. ఈ లోకములోని అన్ని కోవలకు చెందిన ప్రజలు – ధనికులు, పేదవారు, పురుషులు, స్త్రీలు, యూదులు, యూదులు కానివారు, నల్లజాతీయులు, తెల్లజాతీయులు అందరు కూడా దేవునిచే లక్ష్యము చేయబడుతున్నారు మరియు తమ తమ జీవితములలో క్రియ చేస్తున్న ప్రతియొక్క ఎండిపోజేసే శాపమును ఓడించుటకు మరియు తప్పించుకొనుటకు అవకాశము ఉన్నది. దేవుడు నిన్ను లక్ష్యపెడుతున్నాడు మరియు నీవు లేచి గొప్పవానిగా ఉండాలని ఆశిస్తున్నాడు.

    మోసగించడానికి, ఒకరిని బానిసలుగా చేయడానికి లేదా ఎవరినైనా దొంగిలడానికి ఈ పుస్తకమును ఉపయోగించవద్దు. అలా చేస్తే నీవు శపించబడతావు! జయించడానికి, నిర్వీర్యపరచడానికి, నాశనము చేయడానికి మరియు మీ జీవితములో క్రియ చేస్తున్న అన్ని విధములైన శాపములను ఆర్పివేయడానికి దీనిని ఉపయోగించండి. ఈ క్రింద పేర్కొనబడిన వాక్యభాగమును చదివి నీవు మనుష్యులందరితో సమానుడవు మరియు అన్ని శాపములపై జయమునొందినవాడవు అనే దేవుని చిత్తములో బలమునొందుకో.

    అందుకు పేతురు నోరు తెరచి ఇట్లనెను - దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.

    అపొస్తలుల కార్యములు 10:34-35

    అధ్యాయము 2

    శాపము అంటే ఏమిటి?

    ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు.

    ప్రకటన గ్రంథము 22:3

    భూమిపైన మన జీవితము నిరంతర నిరాశ, సుదీర్ఘ దుఖం, ఎడబాటు, వివరణలేని దురదృష్టం, మరణము, శూన్యము, తరచు ఉండే వేధింపులు, కలవరము, నిరర్ధకత్వము, యుద్ధము, నిత్య గొడవలు మరియు పేదరికము అనే వాటితో మసకబారుతుంటుంది. ఇట్టి వివరణకు ఒకే ఒక్క నిర్వచనము ఉంది – శాపము!

    ఈ భూమిపై శాపములు ఉన్నాయి అనే విషయమును కూడా చాలామంది ఎరుగకనే ఉన్నారు. భూమిపైనున్న శాపములను నీవు గుర్తించి వాటిని సరిగా లక్ష్యపెట్టుటకు నీకు సహాయపడులాగున ఈ పుస్తకము తలంచబడింది. శాపముల పట్ల సరైన లక్ష్యము లేనివారు ఎవరైనా తమ జీవిత కాలములో బాధపడవలసివస్తుంది.

    నేటికాలములో భూమిపై పరివ్యాప్తమైయున్న ఒక విషయము శాపము మరియు దాని ఘోరమైన ప్రభావము. అనేకమైన ప్రాచీన శాపములు క్రియచేస్తూనే ఉన్నాయి అలాగే వేలకొలది క్రొత్తవైన మరియు మరింత ఆధునికమైన శాపములు కూడా ఉన్నాయి. ఈ భూమిపై నీ జీవితము ఎలా ఉందో ఒక సారి ఆలోచన చేయి ఆ తరువాత భూమిపై శాపము అనేది ఉన్నది అని నీవు వెంటనే ఒప్పుకుంటావు. శాపమును నిర్వచించడం అనేది అంతటి తేలిక కాదు కాబట్టి మనము పరిశుద్ధ గ్రంథమును పరిశీలన చేసి శాపము వాస్తవముగా ఏమిటో చూడాలి. పరిశుద్ధ గ్రంథములో శాపమును గూర్చి ఇవ్వబడిన పది నిర్వచనములను చూద్దాము.

    శాపమును గూర్చి పరిశుద్ధగ్రంథము ఇస్తున్న పది నిర్వచనములు

    ఒకరిని దుష్టత్వముతో బాధించుటకు వారిపై దురాత్మ రావాలని అసాధారణ శక్తులకు చేసే విన్నపమే శాపము, ఇది ఆపదను కలిగించవచ్చు లేదా మరణమునకు కూడా దారితీయవచ్చు. మోయాబు రాజైన బాలాకు ఇశ్రాయేలును శపించమని బిలాముకు విన్నవించుకున్నాడు.

    ఒకరిపై శాపము ఉన్నదని నీవు చెప్పినట్లయితే, వారికి అననుకూలమైన పరిస్థితులను కలిగించులాగున ఒక అసాధారణమైన శక్తి అక్కడ ఉందని నీవు చెప్తున్నట్లు. తీవ్రమైన ఇబ్బందిని మరియు హానిని కలిగించే ఒక కార్యముగా నీవు శాపమును గూర్చి చెప్పవచ్చు. నీకు ఎంతో తీవ్రమైన ఇబ్బందిని మరియు హానిని కలిగించే ఆ కార్యము నుండి నీవు విడిపించబడగలవు!

    అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను అరామునుండి బాలాకు తూర్పు పర్వతములనుండి మోయాబురాజు నన్నురప్పించి రమ్ము; నా నిమిత్తము యాకోబును శపింపుము రమ్ము; ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను.

    ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే.

    సంఖ్యాకాండము 23:7-8

    శాపము అనగా వేరొకరికి ఏదైనా ఉపద్రవ రూపమో లేదా దురదృష్టమో అంటిపెట్టుకొని ఉండాలని మరొకరు గట్టిగా భావించే ఒక కోరిక. ప్రత్యేకముగా చెప్పాలంటే, వేరొక వ్యక్తిపై దేవుడు లాంటి ఒక అసాధారణమైన శక్తితో తంత్రము, ప్రార్థన, మాయ, చేతబడి లేదా ఒక ఆత్మ ద్వారా హాని లేదా బాధ కలగాలని కోరుకొనే కోరికనే ‘శాపము’ అనవచ్చు. శాపమును త్రిప్పికొట్టడాన్ని లేదా తుడిచివేయడాన్ని తొలగించడం లేదా విరుగగొట్టడం అని అనవచ్చు మరియు ఇది చేయుటకు సమానమైన సుదీర్ఘ ఆచారాలు మరియు ప్రార్థనలు కూడా అవసరమౌతాయి.

    విగ్రహములను ఆరాధించే వారందరిపై దేవుడు ఒక శాపమును ఉంచాడు. విగ్రహారాధనతో ఏమీ చేయకండి తద్వారా భూమిపై అత్యంత భయంకరమైన శాపములలో ఒక శాపము నుండి మీరు తప్పించుకుంటారు. ధనమును సేవించకండి! ధనమును ఆరాధించకండి! డబ్బువలన ఏమీ చేయకండి తద్వారా మీరు శక్తివంతమైన శాపము నుండి విడిపింపబడతారు!

    యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునేగాని పోతవిగ్రహమునేగాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని యెలుగెత్తి ఇశ్రాయేలీయులందరితోను చెప్పగా ఆమేన్ అనవలెను.

    ద్వితీయోపదేశకాండము 27:15

    శపించబడడం అంటే హోదా తగ్గిపోవడం మరియు న్యూనతకు దిగజారిపోవడం. సర్పము దేవునిచే శపించబడినది తద్వారా హోదా తగ్గించబడి న్యూనతకు దిగజారిపోయింది. దేవుని కృప వలన, నీవు ఎన్నటికిని సర్పము వలె హోదాలో తగ్గింపబడి న్యూనతకు దిగజారిపోవు! ఈ భూమిపైని అత్యంత అధోగతమైన స్థితికి సర్పము తగ్గించబడింది. శాశ్వతకాలము వరకు నేలలోనిదానినే తినుటకు సర్పము అప్పగించబడింది. ఒక సృష్టి దిగజారగల హీనమైన స్థితి ఇది. నీవు శపించబడినప్పుడు, నీవు అధోగతికి పంపబడతావు. నీవు న్యూనతకు మరియు శాశ్వతముగా పదోచ్యుత స్థితికి తగ్గించబడతావు. తన శక్తితో నిన్ను పైకి లేవనెత్తుటకు దేవుడు నీ జీవితములోనికి వస్తున్నాడు.

    అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువు లన్నిటిలోను నీవు శపించబడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నియు మన్ను తిందువు.

    ఆదికాండము 3:14

    శపించబడడం అంటే నిరంతర దుఃఖం కలిగి ఉండడం. పునరావృతమౌతున్న, కొనసాగుతున్న, తరచుగా ఉంటున్న, తగ్గిపోకుండా ఉన్న మరియు నిలిచి ఉంటున్న దుఃఖాన్నే శాపము అనే ఒక క్రియగా నిర్వచించవచ్చు. తన శేషజీవిత పర్యంతము ఆదాము దుఃఖమునకు అప్పగించబడ్డాడు. ప్రపంచమంతటినీ ప్రభావితము చేస్తున్న మానవాళికి చోటుచేసుకొనే నిరంతర దుఃఖమునకు కారణము ఇదే. తిరిగివెళ్ళని విచారము, నిరాశ మరియు చీకటి అనేవి మనుగడలో ఉన్న ఆ శాపమునకు ఆధారాలు. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే ఆ సంతోషాన్ని పొందుకొని ఈ శాపమునకు పైగా ఎత్తబడండి!

    ఆయన ఆదాముతో - నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;

    ఆదికాండము 3:17

    శపించబడడం అంటే ఎల్లప్పటికీ ప్రతి ఒక్కటి కూడా నీకు వ్యతిరేకముగా పనిచేస్తూ ఉండడమే. శపించబడడం అంటే మంచితనము, అదృష్టము మరియు జీవాన్ని నీవు పొందుకొనవలసిన స్థానములో దుష్టత్వమును, దురదృష్టమును మరియు మరణమును అనుభవించడమే.

    అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు;

    ఆదికాండము 3:18

    శపించబడడం అంటే చెమటను, కష్టాలను, వ్యతిరేకించబడడం మరియు బాధించబడటమును అనుభవించబడడం. మన లోకములో ఉండే పోరాటము, కష్టము, కృషి మరియు ప్రయాస ఇవన్నీ కూడా శాపమునకు ఆధారాలే. ఈ కష్టములకు, ప్రయాసలకు మరియు భూమిపైని నిరర్ధకత్వమునకు పైగా ఎగురుటకు కృపను పొందుకో.

    ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;

    అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు;

    నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.

    ఆదికాండము 3:17-19

    శపించబడడం అంటే నిత్యమూ నిరాశపడుతూ, దుఃఖించుచూ నీ కష్టపని అంతటికి ఏదైతే నీవు పొందవలసి ఉన్నావో దానికి పూర్తి వ్యతిరేకమైన దానిని స్వీకరించడం. కయీను శపించబడ్డాడు అది తన శాపము యొక్క ఫలితమే. శూన్యత, వ్యర్థత, నిరాశ, రొప్పుట మరియు మంచి కార్యముల కొరకు ఎదురుచూచుట అనేవి శాపము మనుగడలో ఉన్నది అనుటకు ఆధారాలు. పాఠశాలకు, పనికి మరియు పాటవమునకు వెళ్లినప్పటికీ, శూన్యత మరియు నిరర్ధకత్వము మానవజాతిని కుక్కవలె అనుసరిస్తూనే ఉన్నాయి.

    యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడు నేనెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడాయననీవు చేసినపని యేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది.

    కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింప బడినవాడవు; నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను.

    ఆదికాండము 4:9-12

    శపించబడి ఎన్నటికినీ స్థిరపడక, పలాయనమై, నిత్యము పారిపోతూ, నిత్యమూ అడుక్కొనే వాడిగా, ఒక వలసవానిగా, దేశదిమ్మరిగా మరియు అయోగ్యమైన వ్యక్తిగా ఉండడమే. దేశదిమ్మరిగా ఉండడం అంటే శాపము క్రింద జీవించడమే. దేశదిమ్మరిని తలపెట్టే ప్రతి పరిస్థితి నుండి దేవుడు నిన్ను లేపుతున్నాడు!

    యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడు నేనెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడాయననీవు చేసినపని యేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది.

    కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింప బడినవాడవు; నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను.

    ఆదికాండము 4:9-12

    శపించబడడం అంటే దాసులకే ఒక దాసునిగా చేయబడడం. దాసులకే దాసునిగా ఉన్నవాడు శాశ్వతముగా చీడపట్టినవాడు (అంటే ఎదుగుదల మరియు అభివృద్ధి నుండి ఆటంకపరచబడినవాడు), శాశ్వతముగా ఆందోళనలో ఉంటూ భ్రమపడేవాడు. దాసులకు దాసునిగా ఉండడం అంటే ఎన్నటికి పైకి లేవకుండా, దౌర్భాగ్యంతో మరియు ఎడబాటులో బాధించబడడం. తప్పించుకోలేని ప్రతివిధమైన దాస్యము నుండి నీవు విడిపించబడతావు!

    కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.

    ఆదికాండము 9:25

    శపించబడడం అంటే ముట్టడి చేయబడడం, దయ్యంచే పీడించబడడం, నిరంతరం వేధించబడడం, నిరంతరం బాధించబడడం, తప్పించుకోలేకపోవడం మరియు నిరంతరమూ శపించబడిన మరియు నాశనకరమైన అంతములోనికి రావడం. నీవు లోనికి వెళ్తున్నా బయటకు వస్తున్నా, ఒకే ముగింపులోనికి ఒకే గందరగోళములోనికి వస్తున్నావు. నిన్ను చుట్టుకొనియున్న ఆ శత్రువుల నుండి విడిపించుటకు దేవుడు నీకు జ్ఞానము అనే తాళపుచెవిని ఇస్తున్నాడు!

    నీవు లోపలికి వచ్చునప్పుడు శపింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడును శపింపబడుదువు.

    ద్వితీయోపదేశకాండము 28:19

    శపించబడిన వాడు నిజముగానే ముట్టడిచేయబడినవాడు అని శాపమును గూర్చిన ఈ ప్రధానమైన నిర్వచనాలు మనకు తెలుపుతున్నాయి. శపించబడియుండడం అంటే ముట్టడిచేయబడి ఉండడం. నీవు ముట్టడి వేయబడినప్పుడు ఏమియు పనిచేయదు పనిచేయబోదు. శాపములను గూర్చిన నిర్వచనములన్నీ కూడా ఈ ముగింపులోకే నిన్ను నడిపిస్తాయి. నీవు ముట్టడిచేయబడతావు!

    కందిరీగలవలె నామీద ముసిరి యున్నారు.

    కీర్తనలు 118:12

    ముట్టడి వేయబడడం అంటే ఏమిటో ఒకసారి అర్ధం చేసుకొనుటకు ప్రయత్నిద్దాం. నీవు మరణముచే ముట్టడి చేయబడితే, నీవు వెళ్ళే ప్రతి దిశలో నీవు దానిని కనుగొంటావు. కాబట్టి, మృతినొందుటకు నీవు శపించబడినట్లైతే, నీవు ఏ దిశలో వెళ్ళినా నీవు తప్పక మరణిస్తావు. ఒక టీ నీవు చేసుకొంటుండగానే చనిపోవచ్చు. ఒక సుదీర్ఘమైన ప్రయాణమును చేపట్టి మరణించవచ్చు. తప్పించుకొనుటకు వ్యక్తికున్న సామర్ధ్యతపై శాపము ఆధారపడి ఉండదు. తప్పించుకొనుటకు శాపము నుండి వేరొక మార్గము ఉండదు గనుక శాపము జరుగుతుంది. కాబట్టి క్రైస్తవులు శాపములు మరియు ఆశీర్వాదముల పట్ల సరియైన లక్ష్యము కలిగి ఉండాలి.

    శపించబడడం అంటే బంధించబడడం. బంధించబడడం అంటే పోషణకు అవసరమైన అన్ని మార్గములు మరియు ఉపశమన కేంద్రాలు సంపూర్ణంగా మూసుకొనిపోయి చుట్టుముట్టబడడం. ఈ జీవితములోని అనేక విషయములు అర్ధం కాకుండా ఉండడం నీవు గమనిస్తావు. చాల విషయాలు అసలు అలా ఎందుకు జరుగుతున్నాయో అనే దానికి మంచి వివరణ ఉండదు. నీవు ఊహించిన దానికి పూర్తి వ్యతిరేకముగా చాలా సంగతులు జరుగుతుంటాయి.

    శాపము అనేది వివరించశక్యముగాని పొరపాటులేని ఒక చిత్రాన్ని సృష్టిస్తుంది. శపించబడినవారు ఎప్పుడైనా, ఎలాగైనా, ఎక్కడైనా ఉన్నప్పటికీ వారిని గూర్చి ఒకే కథనమును చెప్పడమునకు ఈ చిత్రము దారితీస్తుంది! ఆఫ్రికా యొక్క కథనమును ఒకసారి పరిశీలన చేయండి! ఆఫ్రికాలోని దేశములు వేరేవారికి సామంత దేశములుగా చేయబడినా లేదా వారు వర్ణవివక్షను అనుభవించినా, వారు ఎన్నటికిని వేరే దేశములకు సామంతులుగా చేయబడక లేదా వారికి విప్లవాలు, ప్రజాస్వామ్యము, మరియు స్వాత్రంత్ర్యము ఉన్నా ఆఫ్రికాను గూర్చి ఇవన్నీ ఒకవిధమైన చిత్రాన్ని ప్రజలకు అందజేశాయి.

    ఆఫ్రికాలో విస్తరించియున్న సమూల-దారిద్ర్య స్థితికి వివరణ ఏమిటి? నీవు ఆఫ్రికాలోని ఏ దేశమునకు వెళ్ళినా సరే ఇదేవిధమైన చిత్రాన్ని చూస్తారు. మనము బంధించబడి ముట్టడివేయబడ్డామా? నీవు దీని నుండి పారిపోలేవు, నీవు ఎక్కడికి వెళ్ళినా లేదా ఏమి చేసినా.

    ఉదాహరణకు ఒక కుటుంబముపై శాపము ఉన్నప్పుడు, అమ్మాయిలలో ఒక్కరికి కూడా పెండిండ్లు అవ్వవు. వారు పొడుగైనా, కురచైనా, తెలుపైనా నలుపైనా, అందమైనవారైనా అందహీనులైనా, ఫలితము ఒకటే. పెండిండ్లు జరగవు!

    మానవులకు మరణము అనే శాపము వారి తలపై నాట్యమాడుతుంటుంది. నీవు ధనికుడివైనా, పేదవైనా, ప్రసిద్ధిగాంచినవాడవైనా, తెలియనివాడవైనా, ఐరోపావాడవైనా, అమెరికావాడవైనా, ఆఫ్రికావాడవైనా, నలుపైనా తెలుపైనా, నీవు సంధించవలసిన శత్రువు మృత్యువు. నీవెవరివైనా సరే ఈ శత్రువు నుండి తప్పించుకొనే దారి లేదు.

    నీవు శాపమును జయించాలి అనుకుంటే శాపమును గూర్చి ఈ విధముగా ఆలోచించడం చాలా ప్రాముఖ్యం. మనము ముట్టడి వేయబడినప్పుడు దాని నుండి బయటకు ఎలా రావాలో మనకు తెలిపేది పరిశుద్ధగ్రంథము మాత్రమే. బలవంతుడైన ఒక రాజు యొక్క సైన్యములతో ఒక చిన్న పట్టణము ముట్టడి వేయబడినప్పుడు, మరణము మరియు నాశనము అనేవి తప్పక జరుగుతాయి. తప్పించుకోవడం ఉండదు మరియు పట్టణమునుండి బయటకు వెళ్లుటకు కూడా మార్గము ఉండదు. నీవేమి చేసినప్పటికీ, ఫలితము ఒకటే – మరణము!

    నీవు శపించబడ్డావా? నీవు ముట్టడివేయబడ్డావా?

    తప్పించుకొనుటకు అసలు మార్గమే తెలియక ముట్టడివేయబడియున్నావని నీకు తెలిపే పరిస్థితి ఏదైనా నీ జీవితములో ఉన్నదా? నీవు చేస్తున్న ప్రతిదీ కూడా వైఫల్యము మరియు నిరాశ అనే స్థితిలోనికే నిన్ను నడిపిస్తున్నాయా? బహుశ ఒక నిజమైన శాపము పని చేస్తుందేమో. చాలామంది క్రైస్తవులు తమ అమ్మమ్మల నుండో లేదా తమ పితరుల నుండో తమకేదైనా శాపము సంక్రమించిందేమోనని తెలుసుకొనే ప్రయత్నంలో చాల సమయాన్ని వెచ్చిస్తుంటారు. అవసరమైనది అది కాదు. నీ కుటుంబములోనికి ఆ శాపము తెచ్చిపెట్టింది నీ అమ్మమ్మా, లేక నీ జేజమ్మా అని తెలుసుకోవడంలో ఎందుకు కష్టపడతావు? భూమిపై శాపము ఉన్నదని పరిశుద్ధగ్రంథము సెలవిస్తుంది. శాపము విషయమునకొస్తే అది వాస్తవికమైనది మరియు మనుగడలో ఉంది! నీకు ఎంత విశ్వాసమున్నప్పటికీ, పరిశుద్ధగ్రంథములో వ్రాసియున్నదానిని మీరి నీ విశ్వాసము ముందుకు వెళ్ళలేదు. నీ కుటుంబములో నిజముగా శాపము ఉన్నదా లేదా అని కనుగొనుటలో నీ సమయమును వృధా చేసుకొనుటకు బదులు, శాపము అనేది ఉన్నది అని నీవు అనుకోవాలి. నీవు చేయవలసినదల్లా నీవు ముట్టడివేయబడిన ఆ పరిస్థితి నుండి బయటకు ఎలా రావాలో అని కనుగొనే ప్రయత్నం చేయడమే. భూమిపైనున్న అందరి వలెనే, బహుశ నీవు కూడా ముట్టడివేయబడి ఉంటావు. ముట్టడి వేయబడడం అంటే ఏమిటో ఒకసారి నీవు అర్ధం చేసికొనిన తరువాత, నీ దారిని నీవు కనుగొనవచ్చు.

    అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.

    నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.

    కందిరీగలవలె నామీద ముసిరి యున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించి పోయిరి యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.

    కీర్తనలు 118:10-12

    భూమిపైనున్న ఏ ఇతర కుటుంబమువలెనే నీ కుటుంబము కూడా చెడుతనము కలిగినదే. ఏ ఇతర కుటుంబములో వలెనే నీ కుటుంబములో కూడా సమానమైన చెడ్డవారు, పాపులు, భూతవైద్యులు మరియు గారడీగాళ్ళ సంఖ్య ఉన్నదని నేను అనుకొంటున్నాను. వేరొకరి కుటుంబములో భూతగాళ్లు మరియు గారడీగాళ్లు ఉన్నారని నీవెలా అనుకొనుచున్నావో, నీ కుటుంబములో కూడా అదే విధముగా భూతగాళ్లు మరియు గారడీగాళ్లు ఉన్నారని వేరొకరు అనుకొంటున్నారు. శాపముల మరియు చేతబడుల మూలము మరియు ఉద్భవములను గూర్చి వెదకడములో నీ కాలయాపన మానేయండి. ఏదో ఒక చోట శాపము క్రియ చేస్తుంది అని మీకు చెప్పడానికి నేను మిమ్ములను ఎక్కువగా ఒప్పించవలసిన అవసరత లేదు.

    సూర్యుని క్రింద శాపము అనేది క్రియ చేస్తుంది అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలుపుతుంది. నీవు ఘానా, నైజీరియా, రోమానియా, అమెరికా, ఇంగ్లండు, జర్మనీ లేదా మలేసియాలో ఎక్కడున్నా సరే నీవు తినే ముందు నీవు చెమటోడ్చుతావు. అదే విధమైన మరణము మరియు నిరర్ధకత్వము అనే నిరాశలు ప్రతిచోటా ఉన్నాయని నీవు కనుగొంటావు. ఈ లోకములోనుండి మనము రూపాంతరము చెందాము అనడానికి ఒక గొప్ప సూచన ఏమనగా శాపము మరియు దాని వివిధ రూపములు సమూలంగా లేకుండా పోవడం. పరలోకములో ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు (ప్రకటన 22:3) అనే ప్రసిద్ధ వాక్యము పూర్తిగా బయలుపరచబడుతుంది. శాపమును గూర్చి నీవు ఆలోచించేటప్పుడు ఎక్కువ దూరము ఆలోచన చేయవద్దు. శాపము అన్నిచోట్లా ఉంది. అది క్రియ చేస్తుంది మరియు భూమిపై మనము చేసే ప్రతి పనిలో గొప్ప నిరాశను మరియు శూన్యతను అది కలిగిస్తుంది. శాపము అనేది క్రియ చేస్తూనే ఉంది అని అత్యంత జ్ఞానవంతుడైన సొలొమోనుకు తెలుసు. నిజానికి, ఎక్కడో శాపము అనేది పనిచేస్తుంది అని గుర్తించడానికి చాలా జ్ఞానము అవసరమౌతుంది.

    ఈ భూమిపైన శాపమును సొలొమోను వివరించాడు

    అంతా వ్యర్థము అని సొలొమోను చెప్పినప్పుడు ఆయన ఏమనుకొని ఉంటాడు అని మీరు అనుకొంటున్నారు? అతడు చేసిన ప్రతిదీ కూడా ఒకే విధంగా ముగిసింది: వ్యర్ధము, నిరుపయోగము, శూన్యత్వము, దండన, నిరాశ మరియు కలవరము! భూమిపైని జీవితములో నిరాశ, వ్యర్ధత మరియు విషయము వెనుక పరుగెత్తుట వలన నిరర్ధకత్వము అనే శాపము ఉంది. తన తిరుగుబాటు నిమిత్తము ఆదాము అనుభవించిన శాపము నిజముగానే తీవ్రమైనది. అనేకమైన వేరువేరు కార్యములను చేయుట ద్వారా ఈ శాపము నుండి తప్పించుకోవాలని సొలొమోను ప్రయత్నించాడు. సొలొమోను ఏమి చేసినప్పటికీ, ఒకే స్థలములో వచ్చి ఆగాడు – వ్యర్ధము! జీవితము అంటేనే పూర్తి వ్యర్ధత అని తనంతట తానే తెలుసుకున్నాడు. సొలొమోను ప్రయత్నించిన అనేక విషయములను ఒకసారి చూద్దాము.

    రండి, సుఖాలను ప్రయత్నిద్దాము. జీవితములోని ‘మంచి కార్యములను’ వెదకుదాము అని సొలొమోను అన్నాడు. కాని ఇదియు అర్ధరాహిత్యమని తెలుసుకున్నాడు. కాబట్టి నవ్వు వెఱ్ఱితనము, సుఖమును అనుసరించుట వలన ఏమి ప్రయోజనము? అని అన్నాడు. చాలా ఆలోచన చేసినతరువాత, ద్రాక్షారసముతో తన్నుతాను సంతోషపరచుకోవాలనుకున్నాడు. జ్ఞానమును వెదకుచుండగానే, వెఱ్ఱితనమును పట్టుకున్నాడు. ఈ విధంగా, ఈ లోకములో ప్రజలకున్న కొద్దిపాటి ఈ సమయములో ఎక్కువమంది కనుగొనే ఆ ఆనందమును అనుభవించాలని అనుకున్నాడు.

    తనకొరకు పెద్దవైన యిండ్లను కట్టి మరియు అందమైన ద్రాక్ష తోటలను నాటించుట ద్వారా జీవిత పరమార్ధమును కనుగొనాలని అనుకొన్నాడు. అతడు తోటలను మరియు ఉద్యానవనములను చేసి, వివిధమైన చెట్లతో వాటిని నింపాడు. వికసిస్తున్న తన అనేక తోటలకు నీటిని సరఫరా చేయుటకు ఆయన ఆనకట్టలను కూడా కట్టించాడు. బానిసలను, పురుషులను మరియు స్త్రీలను కొన్నాడు, మరియు తన గృహములో తనకు జన్మించిన అనేకమంది దాసులు కూడా ఆయనకున్నారు. పెద్ద పశువుల మందలను మరియు గొఱ్ఱెల మందలను, అంటే తనకు ముందు యెరూషలేములో నివసించిన రాజులందరికి ఉన్న వాటికంటే ఎక్కువైన మందలను కలిగియున్నాడు.

    ఎక్కువ మొత్తములో వెండిని మరియు బంగారమును, అనేక రాజుల మరియు ప్రాంతముల నిధులను కూడా సేకరించాడు. అద్భుతమైన గాయకులను, పురుషులను మరియు స్త్రీలను అతడు పనిలో పెట్టుకున్నాడు అలాగే ఎందరో సుందరమైన భార్యలు మరియు ఉపపత్నులు కూడా ఆయనకు ఉన్నారు. ఒక మనిషి ఆశించదగినదంతయు ఆయనకు ఉండినది!

    కాబట్టి తనకంటే ముందు యెరూషలేములో ఉండిన వారందరికంటే గొప్పవాడయ్యాడు, మరియు తన జ్ఞానము అతన్ని తగ్గనివ్వలేదు. తనకు కావాల్సిందల్లా తీసుకున్నాడు. ఏ విధమైన సుఖమునైనను అనుభవించకుండా లేడు!

    తన కష్టములో కూడా సొలొమోను గొప్ప సుఖాన్ని పొందుకున్నాడు. కాని ఎంతో కష్టముతో సంపాదించిన ప్రతిదానిని ఒకసారి తను చూచినప్పుడు, అదంతయు చాలా అర్ధరహితముగా ఉంది – గాలి కొరకు ప్రయాసపడునట్లు. ఎక్కడా కూడా యోగ్యమైనది అంటూ ఏమీ లేదు. దీనిని అతడు స్పష్టముగా వివరిస్తూ అన్నాడు; అంతయు వ్యర్ధమే వ్యర్ధమే అని.

    సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటిచేతను, వానికేమి దొరుకుచున్నది? వాని దినములన్నియు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు, రాత్రియందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు; ఇదియు వ్యర్థమే.

    ప్రసంగి 2:22-23

    శాపము అనేది క్రియ చేస్తుంది అని నీవు కనుగొనడం నిజానికి మంచి పనే. ఎందుకు అలా? నీవు శాపమును గూర్చి తెలుసుకున్నప్పుడు, దానిని తిప్పికొట్టడానికి మరియు దాని ప్రభావమును అరికట్టడానికి కావాల్సిన జ్ఞానము కొరకు నీవు ప్రార్ధించవచ్చు. ఈ పుస్తకము ఆద్యంతము అనేక శాపములను గూర్చి మరియు అవి ఎంతటి వాస్తవికమైనవో నీవు తెలుసుకొంటావు. నీ జీవితములోని శాపముల నుండి నీవు రక్షింపబడి వాటిని జయించుటకు దేవుని జ్ఞానము నీకెలా సహాయపడుతుందో కూడా నీవు తెలుసుకొంటావు.

    అధ్యాయము 3

    భౌగోళిక శాపములు

    ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొర్రెపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు.

    ప్రకటన గ్రంథము 22:3

    లేఖనములలో స్పష్టముగా చూస్తే మూడు రకములైన శాపములు కనబడతాయి.

    భౌగోళిక శాపములు

    పరిశుద్ధ గ్రంథపు శాపములు

    వాడుకగా వచ్చే శాపములు

    భౌగోళిక శాపములు ఏవంటే చాలా ఆరంభము నుండే భూమిపైకొచ్చి ప్రపంచవ్యాప్తంగా నిరంతరం నిత్యం బాధించినవి.

    పరిశుద్ధ గ్రంథపు శాపములు ఏవంటే మనకు తెలిసినంతలో పరిశుద్ధ గ్రంథము శాపములుగా పరిగణించినవన్నీ. కొన్నికొన్ని పరిమితులను దాటిన ప్రతి కార్యము లేదా క్రియ ఈ పరిశుద్ధగ్రంథపు శాపములను తెస్తుంది. పరిశుద్ధగ్రంథ పర్యంతము, ఈ విధమైన పరిశుద్ధగ్రంథపు శాపములు క్రియ చేయడం మీరు చూస్తారు.

    వాడుకగా వచ్చే శాపములు ఏవంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తి కలిగించిన బాధ వలన సదరు వ్యక్తి పలికే శాపములు. కారణములేని శాపములు ఉండవు కాని అట్టి శాపములకు కారణము ఉన్నప్పుడు మాత్రం వాటికి చాలా శక్తి ఉంటుంది!

    రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవెలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును.

    సామెతలు 26:2

    ఈ అధ్యాయములో మరియు దీని తరువాతి రెండు అధ్యాయములలో, భౌగోళిక శాపములను, పరిశుద్ధగ్రంథపు శాపములను మరియు కొన్ని వాడుకగా వచ్చే శాపములను చూద్దాం.

    భౌగోళిక శాపములు

    పురుషులపై శాపములు.

    ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;

    అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు;

    నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.

    ఆదికాండము 3:17-19

    స్త్రీలపై శాపములు.

    ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.

    ఆదికాండము 3:16

    నోవహు పలికిన శాపము.

    కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.

    ఆదికాండము 9:25

    ఇశ్రాయేలుపై శాపము.

    నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును.

    ద్వితీయోపదేశకాండము 28:15

    ఇశ్రాయేలును ద్వేషించువారిపై శాపము.

    యూదులు ఆశీర్వదింపబడినవారు. వారిని ద్వేషించడం మరియు వారితో పోరాడడమంటే చాలా ప్రమాదకరమైన విషయం. రెండవ ప్రపంచ యుద్ధములో, అడాల్ఫ్ హిట్లర్ మరియు అతని హత్యాశగల బృందము అరవై లక్షల యూదులను చంపింది, కాని ఆఖరుకు డెబ్బై అయిదు లక్షల జర్మనీయులు కూడా చంపబడ్డారు. 1945 ఆఖరులో జర్మనీ దేశముకూడా నాశనపరచబడింది కాని 1945వ సంవత్సరము తరువాత ఇశ్రాయేలు దేశము పుట్టింది. యూదులను ద్వేషిస్తూ తమ జీవితములలో సంచరించేవారు నేరుగా శాపములోకే నడిపింపబడతారు. దేవుని ప్రజలను ద్వేషించేవారికై మరియు శపించేవారికై ఎదురుచూచే శాపములోనికి నడవడానికి నీకు అవసరము లేదు.

    వారిని ప్రేమించాలని మరియు దేవుని ఆశీర్వాదములోనికి నడిపింపబడాలని నిర్ణయించుకో. ఇశ్రాయేలునకు మద్దతు తెలపడం ద్వారా మరియు వారికి సహాయపడే పనులు చేయడం ద్వారా అనేకమైన పరిచర్యలవారు ఈ విధమైన ఆశీర్వాదములోనికే ప్రవేశించాలని అనుకుంటారు.

    ఇశ్రాయేలును ప్రేమించువారి కొరకు వేచియుండే ఆశీర్వాదములను దేవుని సంఘము గుర్తించాలి.

    జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక.

    ఆదికాండము 27:29

    నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా...

    ఆదికాండము 12:3

    అధ్యాయము 4

    పరిశుద్ధగ్రంథములోని ప్రధానమైన శాపములు

    ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించిన దేమనగా మీరు యొర్దాను దాటిన తరువాత షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు యోసేపు బెన్యామీను గోత్రములవారు ప్రజలనుగూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండమీద నిలువవలెను. రూబేను గాదు ఆషేరు జెబూలూను దాను నఫ్తాలి గోత్రములవారు శాపవచనములను పలుకుటకై ఏబాలు కొండమీద నిలువవలెను.

    ద్వితీయోపదేశకాండము 27:11-13

    పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రాముఖ్యమైన శాపములు మరియు ఆశీర్వాదములను ఎక్కువ శాతము రచించింది మోషేయే. ఇశ్రాయేలును ఒక దేశముగా నిర్మిస్తున్న క్రమములో ఈ శాపములను దేవుని ప్రజల కొరకు తెలియజేసాడు.

    నీవు నివారించవలసిన ప్రధాన పరిశుద్ధగ్రంథపు శాపములు ఇక్కడ పొందుపరచబడ్డాయి. వీటిలో ఏ ఒక్కదానిలోకైనా నీవు కనీసం అడుగు కూడా పెట్టకుండా ఉండునట్లు నీవు నీ జీవితమును జీవించాలి. ఇక్కడ లిఖితమైన ఈ శాపముల పట్ల సరైన లక్ష్యాన్ని ఉంచకపోతే, నీ జీవితమునే చుట్టేసి నీకున్న ప్రతిదానినీ మష్టుపట్టిస్తాయి. ఇశ్రాయేలు దేశములో యాద్ వషేమ్ అనే స్మృతివనములోనికి వెళితే మోషే ప్రకటించిన ఈ శాపములపట్ల సరైన అవగాహన నీకు కలుగుతుంది.

    Enjoying the preview?
    Page 1 of 1