Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

అభిషేకము యొక్క మధుర ప్రభావములు
అభిషేకము యొక్క మధుర ప్రభావములు
అభిషేకము యొక్క మధుర ప్రభావములు
Ebook256 pages1 hour

అభిషేకము యొక్క మధుర ప్రభావములు

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

"ఒక క్రైస్తవునిగా, నీ జీవితములో ఒక ఉత్తమమైన మరియు మధురమైన ప్రభావం పరిశుద్ధాత్మ అయ్యుండాలి. పరిశుద్ధంగా ఉండుటకు నీ గుణం, నీ మనస్సాక్షి, నీ సృజనాత్మకత మరియు నీ సామర్ధ్యత ఎలా పరిశుద్ధాత్మ ద్వారా ప్రభావితం అవ్వచ్చో అర్థం చేసుకొనుటకు ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది.
డగ్ హేవర్డ్-మిల్స్ చే వ్రాయబడిన ఈ అసాధారణ పుస్తకం ద్వారా, మిమ్మును ప్రభావితం చేయుటకు, ప్రేరేపించుటకు మరియు ఎప్పటికి మీ జీవితాన్ని మార్చుటకు మీరు పరిశుద్ధాత్మను అనుమతించవలెను. "

LanguageTelugu
Release dateAug 20, 2018
ISBN9781641357227
అభిషేకము యొక్క మధుర ప్రభావములు
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to అభిషేకము యొక్క మధుర ప్రభావములు

Related ebooks

Reviews for అభిషేకము యొక్క మధుర ప్రభావములు

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    అభిషేకము యొక్క మధుర ప్రభావములు - Dag Heward-Mills

    అధ్యాయము 1

    నిన్ను ఏది ప్రభావితము చేయగలదు?

    ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది.

    మత్తయి 13:33

    పుల్లని పిండి అనేది చూడలేనిది, ముద్ద అంతటిలో కలిసిపోయి అది ఉబ్బునట్లుగా చేసి, పైకి ఎగసి మరింత తేలికగా చేసే దాగియున్న ప్రభావమే. పరలోక రాజ్యము కూడా ప్రతి ఒక్క దానిని ప్రభావితము చేసే రహస్యమైన పర్యవసానములు గల ఒక విషయము అని యేసుక్రీస్తు చెప్పాడు.

    పిండి ముద్దపై పుల్లని పిండి యొక్క ప్రభావము వాస్తవము మరియు అద్భుతము కూడా. అయినను పుల్లని పిండి బలముగా పనిచేస్తున్నప్పటికీ కూడా అది అదృశ్యముగానే ఉంటుంది. అదృశ్య ప్రభావములు వాస్తవమైనవి. అదృశ్య ప్రభావములు మంచివి లేదా చెడ్డవై ఉంటాయి.

    క్రైస్తవుని జీవితములో గొప్పదైన మంచి మరియు అదృశ్య ప్రభావము పరిశుద్ధాత్ముని ప్రభావమే; మరియు అదృశ్యమైనదైనప్పటికీ వాస్తవికమైన ఆ ప్రభావమును గూర్చిన పుస్తకమే ఇది! పరిశుద్ధాత్ముని యొక్క మధురమైన పర్యవసానములు!

    మన జీవితములోని వివిధ కోణములలో పరిశుద్ధాత్ముని యొక్క ప్రభావమును ఆశించవలసిన వాటిని జాబితాగా ఈ పుస్తకములో పొందుపరచబడినవి. దానిని మనము కనుగొని దాని కొరకు ప్రార్థించాలి. పరిశుద్ధాత్ముని యొక్క ప్రభావము చాలా ప్రాముఖ్యము. మన మనుగడకు అది చాలా ప్రాముఖ్యమైనది.

    నిన్ను ప్రభావితము చేస్తున్నదేది? ఒక పరిచారకునిగా, నిన్ను ప్రభావితము చేస్తున్నదేది? నిన్ను నడిపిస్తూ నీవు చేస్తున్న క్రియలను చేయిస్తున్నది ఏది? నీవు ఒక మంచి ప్రభావము క్రింద ఉన్నావా లేదా దుష్ట ప్రభావము క్రింద ఉన్నావా?

    ఎక్కువ శాతము తెలియబడక మరియు క్రైస్తవులచే అపార్ధము చేసుకొనబడుచున్న అదృశ్యమైన దుష్ట ప్రభావములు మూడు ఉన్నాయి. క్రైస్తవులపై మొదటి అదృశ్యమైన ప్రభావము దయ్యములు. క్రైస్తవులపై రెండవ అదృశ్యమైన ప్రభావము ఈ ప్రపంచము లేదా లోకము. మూడవ అదృశ్యమైన ప్రభావము మన జ్ఞానేంద్రియములు/ప్రాకృతిక జ్ఞానము. పరిశుద్ధాత్ముని ప్రభావములో ప్రజలు లేనప్పుడు వారు ఈ మూడింటిలో ఏదో ఒకదాని ఆధీనములో ఉంటారు. ఇట్లు వారు భూసంబంధమైన వారిగానో, ప్రకృతి సంబంధమైనవారిగానో లేదా దయ్యముల జ్ఞానము సంబంధితముగానో ఉంటారు.

    గలతీయులకు వ్రాస్తున్నప్పుడు, సంఘమును ప్రభావితము చేస్తున్న అదృశ్యమైన మరియు నిలువరమైన ప్రభావములను గూర్చి అపొస్తలుడైన పౌలు వారిని హెచ్చరించాడు. ఈ ప్రభావములను ఆయన పులిసిన పిండిగా చెప్పాడు. పులిసిన పిండి యొక్క ప్రభావమును పౌలు వివరించాడు. పులిసిన పిండి అనేది ఒక విధమైన బోధన అని కూడా చెప్పాడు. దీని అదృశ్యమైన ప్రభావము ఎంతటి శక్తిగలది అంటే ఒక క్రైస్తవుని పరిచర్యలో ఇది అతనికి ఆటంకమును కూడా కలిగించగలిగినంత శక్తిగలది. లేఖనమును పరిశీలించండి: మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి; సత్యమునకు విధేయులు కాకుండ మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వానివలన కలుగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును (గలతీయులకు 5:7-9).

    ఈ పుస్తకము పరిశుద్ధాత్ముని యొక్క మధురమైన పర్యవసానములను గూర్చినది! పరిశుద్ధాత్మునిచే ప్రభావితము చేయబడగల నీ జీవితములోని వివిధమైన కోణములను ఈ పుస్తకము బయలుపరుస్తుంది. ఈ పుస్తకము ద్వారా దేవుడు నీతో మాట్లాడుచుండగా నీవు పరిశుద్ధాత్మునికి నిన్ను నీవు తెరచుకొంటావు. నీ జీవితములోని వివిధమైన ప్రదేశములను పరిశుద్ధాత్ముడు ప్రభావితము చేయులాగున నీవు ఆశిస్తావు మరియు అనుమతిస్తావు.

    అధ్యాయము 2

    మూడు దుష్ట ప్రభావములు

    ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది.

    యాకోబు 3:15

    పరిశుద్ధాత్ముని ప్రభావము యొక్క అంతిమ పర్యవసానము నిన్ను ఆత్మీయమైన వ్యక్తిగా మలచడం. ఆత్మీయమైన ప్రజలను గూర్చి క్రొత్తనిబంధన చాలా ఉన్నతముగా మాట్లాడుతుంది. సంఘములో ఆత్మీయులైన మనుష్యులు చాలా ప్రాముఖ్యమైనవారు. కాని ప్రతి మానవునికి ఎన్నుకొనుటకు నాలుగు ఎంపికలు ఉంటాయి. అతడు భూసంబంధమైనవానిగా, ప్రకృతి సంబంధమైనవానిగా, దయ్యముల జ్ఞాన సంబంధమైనవానిగా లేదా ఆత్మీయ సంబంధమైన వానిగా ఉండాలి.

    వాణిజ్య ప్రపంచములో వ్యాపారులు చాలా ముఖ్యులు. ఆరోగ్య విభాగములో వైద్యులు ముఖ్యులు కాని సంఘములో మాత్రము ఆత్మగల మనుష్యులు చాలా ముఖ్యమైనవారు. అపొస్తలుడైన పౌలు తన రచనలను ఆత్మసంబంధమైన మనుష్యులకు వ్రాసాడు ఎందుకంటే నిజముగా అతను చెప్తున్న విషయములు దేవుని నుండి వచ్చినవా లేదా అనేది కేవలము వారికి మాత్రమే తెలుస్తుంది గనుక. ఎవడైనను తాను ప్రవక్తననియైనను ఆత్మసంబంధినని యైనను తలంచుకొనిన యెడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువుయొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను (1 కొరింథీయులకు 14:37).

    పరిశుద్ధాత్ముని యొక్క ప్రభావములో జీవించగల ఆత్మసంబంధమైన వ్యక్తిగా ఉండుటకు నీవు చూడాలి. పరిశుద్ధాత్ముని యొక్క మధురమైన ప్రభావములు నిన్ను ఆత్మసంబంధమైన వ్యక్తిగా మార్చుతాయి. మరొక వైపున, నీవు పరిశుద్ధాత్ముని యొక్క ప్రభావముల క్రింద జీవించనట్లయితే నీవు ఖచ్చితముగా ఏదో ఒకదాని ప్రభావములోనికి తప్పక వస్తావు.

    భూసంబంధమైన, ప్రకృతి సంబంధమైన లేదా దయ్యముల జ్ఞాన సంబంధమైనటువంటిది!

    నీవు భూసంబంధమైన ప్రభావములో, లేదా ప్రకృతి సంబంధమైన లేదా దయ్యముల జ్ఞాన సంబంధమైన ప్రభావములోనే ఖచ్చితముగా ఉంటావు. భూసంబంధమైనవానిని, ప్రకృతిసంబంధమైనవానిని లేదా దయ్యముల జ్ఞాన సంబంధమైనవానిని కనుగొనడం అంతటి కష్టమేమీ కాదు. మన చుట్టూ వారిని ఎప్పుడు చూస్తూనే ఉంటాము. ఆత్మీయముగా ఉండడం కంటే, చాలా మంది క్రైస్తవులు భూసంబంధముగా, ప్రకృతి సంబంధముగా లేదా దయ్యముల జ్ఞాన సంబంధముగా ఉంటున్నారు!

    ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఎలా ఉంటాడు?

    ప్రకృతి సంబంధమైనవాడు తన జ్ఞానేంద్రియములను బట్టి మరియు భావోద్వేగములను బట్టి నడిపించబడుతుంటాడు. అతడు తన కోరికలను అనుసరిస్తాడు మరియు వాడు చూస్తున్న లేదా ఇష్టపడుతున్న వాటిని వెంటాడుతుంటాడు. ప్రకృతి సంబంధమైనవాడు ఎక్కువగా తింటాడు, నిద్రపోతాడు, ఎక్కువగా సంభోగములో పాల్గొంటాడు మరియు అందుబాటులో ఉన్న ప్రతివిధమైన సుఖాన్ని పొందాలనుకొంటాడు. తమ జ్ఞానేంద్రియములను అనుసరిస్తూనే చాలా మంది యౌవనులు తమ జీవితములను ప్రారంభిస్తారు. డిస్కోలు, రాత్రి క్లబ్లు మరియు పార్టీలు అన్నీ కూడా ప్రజలు తమ జీవితములను నాట్యములతో గడుపుతూ వీలైనంత వరకు తమ జ్ఞానేంద్రియములను అనుసరించేవారితోనే నిండుకొని ఉంటాయి. మాదక ద్రవ్యముల డీలర్లు మరియు వినియోగదారులు తమ సొంత వినాశనముకు తమ జ్ఞానమును వెంబడించువారు.

    నీవు చూడలేనివానిని తెలుసుకోవడం అంతటి తేలిక కాదు గనుక ప్రకృతి సంబంధమైన వ్యక్తి దేవుని ఎరుగుటకు చాలా కష్టపడతాడు.

    భౌతికము కానివారిని తెలుసుకొనడం తేలిక కాదు గనుక ప్రకృతి సంబంధమైన వ్యక్తి దేవుని ఎరుగుటకు చాలా కష్టపడతాడు. దేవుడు ఆత్మ.

    ప్రశ్నలకు జవాబునివ్వక మాట్లాడక యుండే ఒకని తెలుసుకోవడం తేలిక కాదు గనుక ప్రకృతి సంబంధమైన వ్యక్తి దేవుని ఎరుగుటకు చాలా కష్టపడతాడు.

    ప్రతినిధి ద్వారా ఒకరిని తెలుసుకోవడం తేలిక కాదు గనుక ప్రకృతి సంబంధమైన వ్యక్తి దేవుని ఎరుగుటకు చాలా కష్టపడతాడు.

    నీకంటే వేరుగా ఉన్న ఒక వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసుకోవడం తేలిక కాదు గనుక ప్రకృతి సంబంధమైన వ్యక్తి దేవుని ఎరుగుటకు చాలా కష్టపడతాడు.

    నీ అనుభవంలో లేని ఒకరిని గురించి తెలుసుకోవడం తేలిక కాదు గనుక ప్రకృతి సంబంధమైన వ్యక్తి దేవుని ఎరుగుటకు చాలా కష్టపడతాడు.

    ఒకరి స్వరమును నీవు వినలేనప్పుడు అట్టి వ్యక్తిని గూర్చి తెలుసుకోవడం తేలిక కాదు గనుక ప్రకృతి సంబంధమైన వ్యక్తి దేవుని ఎరుగుటకు చాలా కష్టపడతాడు.

    నీవు ఎన్నడును కలవని ఒక వ్యక్తిని తెలుసుకోవడం తేలిక కాదు గనుక ప్రకృతి సంబంధమైన వ్యక్తి దేవుని ఎరుగుటకు చాలా కష్టపడతాడు.

    మర్మమైన ఒక వ్యక్తిని గూర్చి తెలుసుకోవడం తేలిక కాదు గనుక ప్రకృతి సంబంధమైన వ్యక్తి దేవుని ఎరుగుటకు చాలా కష్టపడతాడు.

    భూసంబంధమైన వ్యక్తి ఎలా ఉంటాడు?

    భూసంబంధమైన వ్యక్తికి తన దృష్టి అంతా భూమిపైనే ఉంటుంది. మానవులను గూర్చి తాము భావిస్తున్నదే సరైన విధానము అనుకొని చాలామంది ప్రకృతిసంబంధమైనవారు అలా మారిపోతుంటారు. ఈ ప్రకృతి సంబంధమైన ప్రజలు భూసంబంధమైన మనుష్యులుగా ఊరకే మారిపోతుంటారు. భూసంబంధమైనవానికి పరలోకము లేదా నరకమును గూర్చిన ఆలోచనలే ఉండవు. ఈ భూసంబంధమైన జీవితము తరువాత ఏ విధమైన జీవితమును చూడడు. తన ప్రణాళికలు మరియు వెంపర్లాటలు అన్నీ కూడా నిత్యత్వము విషయములో తనకున్న మంద-దృష్టిని మరియు గ్రుడ్డితనాన్నే బయలుపరచుతాయి. అట్టి ప్రజలకు తీర్పును గూర్చిన ఆలోచనలే ఉండవు; వారి క్రియలు మరియు పనులు వెలుగులోనికి తేబడి తమ పాపములకు వారు మూల్యాన్ని చెల్లిస్తారు.

    ఎంతో మంచిగా అగుపడే అధ్యక్షులు మరియు ప్రధాన మంత్రులు, ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జి మరియు హార్వర్డ్ మొదలగు విశ్వవిద్యాలయాలలో చదివినవారు ఒకానొకప్పుడు యౌవనస్థులుగా చాలా విపరీతమైన జీవితమును జీవిస్తూ, మాదకద్రవ్యాలను, మద్యమును తీసుకొంటూ అలుపెరుగక పొగ త్రాగినవారే. కేవలము ప్రకృతి సంబంధమైనవారిగా ఉండుట నుండి భూసంబంధమైన వారిగా వారు ఊరకే మారిపోయారు. వారు

    Enjoying the preview?
    Page 1 of 1