Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

తెలుగు కొరియన్ బైబిల్: తెలుగు బైబిల్ 1880 - 한국의 거룩한 1910
తెలుగు కొరియన్ బైబిల్: తెలుగు బైబిల్ 1880 - 한국의 거룩한 1910
తెలుగు కొరియన్ బైబిల్: తెలుగు బైబిల్ 1880 - 한국의 거룩한 1910
Ebook18,093 pages128 hours

తెలుగు కొరియన్ బైబిల్: తెలుగు బైబిల్ 1880 - 한국의 거룩한 1910

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

ఈ ప్రచురణలో తెలుగు బైబిల్ (1880) మరియు 한국의 성서 (1910) సరిసమానమైనతర్జుమ ఉంది. దీనిలో 173,585 రిఫరెన్స్ లు మరియు బైబిల్ యొక్క 2 ఫార్మాట్లను చూపుతుంది. దీనిలొ తెలుగు బైబిల్ 1880 మరియు 한국 성경 ఫార్మెట చెయబడిన రీడ్ మరియు నెవిగెషన్ ఫ్రెండ్లి గా చిన్నదిగా చెప్పాలంటే ఫార్మెట్, లెకా నెవీ-ఫార్మెట్. ఇక్కడ మీరు ప్రతి వచనాన్ని మీరు సమాంతరంగా(ప్యారలెల్గా) tel-kor క్రమంగా వుంటుంది. దినిలొ పూర్తి , విడిగానె తప్ప సమాంతరంగా వుండదు, ఇంకా ఒ కాపీ తెలుగు బైబిల్ 1880 మరియు 한국 성경 , టెక్షట్ టూ స్పీచ్ టిటియెస్ (tts) మీ డివైజ్లొనె మీరు చదవడానికి అనువుగా, పెద్దగా వినబడుతుంది.


బైబిలు నావిగేషన్ తేలికగా ఎలా పనిచేస్తుంది:


పుస్తకాల విషయసూచిక ఉన్న ఓ టెస్టమెంటు. పుస్తక విషయ సూచిక తర్వాత టిటియస్ పుస్తకాల లిస్టువుంది ఇంకా అధ్యాయనాలు వున్నాయి. పుస్తక విషయ సూచికలో ప్రతీ టెస్టమెంటులు వుంటాయి. ప్రతి పుస్తకం ఎ టెస్టమెంటుకు చెందినదో తెలియజెస్తుంది. ప్రతి పుస్తకం ముందటి ఇంకా తర్వాతి పుస్తకానికి రిఫెరెన్స్ చూపించండి. ప్రతీ పుస్తకానికి దాని అధ్యాయాల విషయసూచిక కలిగివుంది. ప్రతీ అధ్యాయనం అది చెందిన పుస్తకంతో రిఫెరెన్స్ కలిగింది. ప్రతీ అధ్యాయం దాని ముందటి లేక తర్వాతి అధ్యాయంకి రిఫరెన్స్ ఇస్తుంది. ప్రతి అధ్యాయానికి దాని వచనాల విషయసూచిక కలిగి వుంది. నావీ-ఫార్మెట లొ ప్రతీ అధ్యాయానికి దాని టిటియకి రిఫెరెన్స్ కలిగివుంది. ప్రతి వచనానికి సంఖ్య వుంది, ఇంకా ఎ అధ్యాయనానికి చెందిదో రిఫెరెన్స్ చూపిస్తుంది. ప్రతి వచనం చదవడానికి అనువుగా తర్వాతి లైన్లో ప్రారంభమవుతుంది. టిటియెస్ ఫార్మెట్ లో వచనాల సంఖ్య చూపించదు. విషయసూచికి లోని ఎ రిఫెరెన్స్ అయిన మిమ్మల్ని సరియైన చోటుకి పంపిస్తుంది. లొపల వున్న విషయసూచిక పుస్తకాల రిఫెరెన్స్ లో వుంటాయి. ప్రతి ఫార్మెట్ లలో ఉంటాయి.


ఈ బుక్ లో కనబడే నావిగేషన్ ఖచ్చితంగా చాలా మంచిది మా నమ్మకం మేమోక అధ్బుతమైన దానిని తయారు చేసాము! వచనాలన్ని మీకు ఇట్టే చూపిచేస్తుందిస ఇంకా తర్వగా వెతికి చూపించటానికి ఇది బాగా పనిచేస్తుంది.వీటితో పాటు తెలుగు బైబిల్ 1880 మరియు 한국 성경 ఇంకా మరియు ఈ నావిగేషన్ ఈ ఈబుక్ ను ప్రత్యేకం చేసాము.


టెక్స్ట్-టూ-స్పీచ్ (TTS) సపోర్టు పరికరం నుండి పరికరానికి మారుతుందని గమనించండి. కొన్ని పరికరాలు దీనికి మద్దతు ఇవ్వవు. కొన్ని చాలా భాషలకు మద్దతు ఇస్తాయి మరియు మరికొన్ని కేవలం ఒక్క భాషకు మాత్రమే మద్దతునిస్తాయి. ఈబుక్ లో TTS కోసం ఉపయోగించిన భాష తెలుగు.

LanguageTelugu
Release dateMar 17, 2018
ISBN9788233914158
తెలుగు కొరియన్ బైబిల్: తెలుగు బైబిల్ 1880 - 한국의 거룩한 1910

Related to తెలుగు కొరియన్ బైబిల్

Titles in the series (19)

View More

Related ebooks

Reviews for తెలుగు కొరియన్ బైబిల్

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    తెలుగు కొరియన్ బైబిల్ - TruthBeTold Ministry

    తెలుగు కొరియన్ బైబిల్

    తెలుగు బైబిల్ 1880 - 한국의 거룩한 1910

    ISBN  9788233914158 (epub)

    ఈ-బుక్ నిడివి: 10,698 పేజీలు

    (దాదాపు. ప్రింట్: 3,744 పేజీలు)

    మొదటి రిలీజ్ 2018-02-04

    ఫైల్ పేరు: 9788233914158.epub

    Copyright © 2016-2018 ట్రూత్ బి టోల్డ్ మిన్సిస్ట్రీ

    సమస్త హక్కులు మావే TruthBeTold Ministry కాని బైబిలు వచనాలకు, డిక్షనరికి, స్ట్రాంగ్ ఎంట్రీలు పబ్లిక్ డొమైన్ లో ఉంటే తప్ప. ఈ పుస్తకంలోని క్రమాన్ని మరియు నావిగేషన్ ను ఎట్టి పరిస్థితిలో తిరిగి మార్చి తయారు చేయబడదు. వ్యాపార నిమిత్తం అమ్మకానికి, కాపి చేయడానికి తప్ప ఈ పుస్తకంలోని భాగాన్ని ఎంచుకోవడానికి చూపించుకోవడానికి ఎ పార్టి అయిన ప్రైవేట్ వారైన చూపించు కోవచ్చు. పైన చెప్పబడిన వాటికి ఎదైన మినహాయింపు కావాలనుకుంటే రాతపూర్వకమైన అనుమతిని పబ్లిషర్ నుండి పొందాలి.

    @ట్రూత్ బి టోల్డ్ మిన్సిస్ట్రీ

    జోయెర్న్ ఆండ్రూ హాల్సత్

    జిమ్బ్లెవ్వెన్ 63

    7607 లెవెన్గేర్

    నార్వే

    Org.nr: 917263752   పబ్లీషర్: 978-82-339

    ముందుమాట

    ఈ ప్రచురణలో తెలుగు బైబిల్ (1880) మరియు 한국의 성서 (1910) సరిసమానమైనతర్జుమ ఉంది.  దీనిలో 173,514 రిఫరెన్స్ లు మరియు బైబిల్ యొక్క 2 ఫార్మాట్లను చూపుతుంది. దీనిలొ తెలుగు బైబిల్ 1880 మరియు 한국 성경 ఫార్మెట చెయబడిన రీడ్ మరియు నెవిగెషన్ ఫ్రెండ్లి గా చిన్నదిగా చెప్పాలంటే ఫార్మెట్, లెకా నెవీ-ఫార్మెట్. ఇక్కడ మీరు ప్రతి వచనాన్ని మీరు సమాంతరంగా(ప్యారలెల్గా) tel-kor క్రమంగా వుంటుంది. దినిలొ పూర్తి , విడిగానె తప్ప సమాంతరంగా వుండదు, ఇంకా ఒ కాపీ తెలుగు బైబిల్ 1880 మరియు 한국 성경 , టెక్షట్ టూ స్పీచ్ టిటియెస్ (tts) మీ డివైజ్లొనె మీరు చదవడానికి అనువుగా, పెద్దగా వినబడుతుంది.

    బైబిలు నావిగేషన్ తేలికగా ఎలా పనిచేస్తుంది:

    పుస్తకాల విషయసూచిక ఉన్న ఓ టెస్టమెంటు.

    పుస్తక విషయ సూచిక తర్వాత టిటియస్ పుస్తకాల లిస్టువుంది ఇంకా అధ్యాయనాలు వున్నాయి.

    పుస్తక విషయ సూచికలో ప్రతీ టెస్టమెంటులు వుంటాయి.

    ప్రతి పుస్తకం ఎ టెస్టమెంటుకు చెందినదో తెలియజెస్తుంది.

    ప్రతి పుస్తకం ముందటి ఇంకా తర్వాతి పుస్తకానికి రిఫెరెన్స్ చూపించండి.

    ప్రతీ పుస్తకానికి దాని అధ్యాయాల విషయసూచిక కలిగివుంది.

    ప్రతీ అధ్యాయనం అది చెందిన పుస్తకంతో రిఫెరెన్స్ కలిగింది.

    ప్రతీ అధ్యాయం దాని ముందటి లేక తర్వాతి అధ్యాయంకి రిఫరెన్స్ ఇస్తుంది.

    ప్రతి అధ్యాయానికి దాని వచనాల విషయసూచిక కలిగి వుంది.

    నావీ-ఫార్మెట లొ ప్రతీ అధ్యాయానికి దాని టిటియకి రిఫెరెన్స్ కలిగివుంది.

    ప్రతి వచనానికి సంఖ్య వుంది, ఇంకా ఎ అధ్యాయనానికి చెందిదో రిఫెరెన్స్ చూపిస్తుంది.

    ప్రతి వచనం చదవడానికి అనువుగా తర్వాతి లైన్లో ప్రారంభమవుతుంది.

    టిటియెస్ ఫార్మెట్ లో వచనాల సంఖ్య చూపించదు.

    విషయసూచికి లోని ఎ రిఫెరెన్స్ అయిన మిమ్మల్ని సరియైన చోటుకి పంపిస్తుంది.

    లొపల వున్న విషయసూచిక పుస్తకాల రిఫెరెన్స్ లో వుంటాయి. ప్రతి ఫార్మెట్ లలో ఉంటాయి.

    ఈ బుక్ లో కనబడే నావిగేషన్ ఖచ్చితంగా చాలా మంచిది మా నమ్మకం మేమోక అధ్బుతమైన దానిని తయారు చేసాము! వచనాలన్ని మీకు ఇట్టే చూపిచేస్తుందిస ఇంకా తర్వగా వెతికి చూపించటానికి ఇది బాగా పనిచేస్తుంది.వీటితో పాటు తెలుగు బైబిల్ 1880 మరియు 한국 성경 ఇంకా మరియు ఈ నావిగేషన్ ఈ ఈబుక్ ను ప్రత్యేకం చేసాము.

    టెక్స్ట్-టూ-స్పీచ్ (TTS) సపోర్టు పరికరం నుండి పరికరానికి మారుతుందని గమనించండి. కొన్ని పరికరాలు దీనికి మద్దతు ఇవ్వవు. కొన్ని చాలా భాషలకు మద్దతు ఇస్తాయి మరియు మరికొన్ని కేవలం ఒక్క భాషకు మాత్రమే మద్దతునిస్తాయి. ఈబుక్ లో TTS కోసం ఉపయోగించిన భాష తెలుగు.

    Telugu Bible

    Please go to Wikipedia for more information.

    Korean Holy Bible

    Please go to the New Christian Bible Study page and to Korean Bible Translations for more information

    మన బైబిలు పరిచయం

    చరిత్ర అంతటిలోమానవ జాతికి సమాచారంలో దేవుని వాక్యం కచ్చితంగా ఎంతో అద్భుతమైన, ఆశ్చర్యకరమైనది.దాన్ని బాగా అధ్యయనం ద్వారానే దాని మర్మాలను తెలుసుకోగలరు.దేవుని వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకోవడం ప్రస్తుతం ఉన్న కాలం ఎంతో కష్టం అని మేము నమ్ముతాము.ప్రస్తుతం ప్రతిది తలకిందులైనట్టుగా మంచిది చెడుగా, చెడు మంచిగా అయింది. ఈ కాలంలో ఉన్న పరీక్షలలో నిలబడేందుకు దేవుడు తనను తెలుసుకోవడానికి ముందే నిర్దేశాన్ని మరియు దిక్సూచిని తన వాక్యం ద్వారా ప్రవచనార్ధకంగా రాయించి ఆది నుండి అంతాన్ని చూసాడు.మనకెలా తెలుసు ? ఎందుకంటే ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో సంఘటనల ద్వారా రూడిపరిచాడు. మరెన్నో మన కొద్ది పాటి జీవిత కాలంలో కూడా జరుగుతున్నాయి.దేవుని వాక్యం అయిన బైబిలులో ప్రపంచవ్యాప్త సంఘటనలను తెల్పుతు ప్రవచనార్ధకంగా తెలియజేసాడు. ఈ భూ గ్రహం మీద బైబిలు లాంటి ఖచ్చితమైన క్రమ పధ్దతిలో ఉన్న దేది మీకు దొరకదు. ప్రతి పురుషుడు మరియు స్త్రీ తమ మనసును సిద్ధం చేసుకొని దేవుడు ఎమి చెపుతున్నారో తెలుసుకొని నడిచేందుకు ప్రయత్నం చేయాలి. మనం కొన్ని అద్బూతాలని సూచనలను నెరవేరడాన్ని గమనించి దేవుని వాక్యం బైబిలు పై నమ్మకాని పెడుతూ చర్య తీసుకోవాలి. మన విశ్వాసానికి కర్త అని యేసు వ్రాయబడ్డారు, ఇంతకు మించి మనకు ఏమి కావాలి. నేను వ్యక్తిగతంగా ప్రజలకు hiv లాంటి నయం కాని రోగాలు స్వస్ధపరచబడటం చూసాను. క్రీస్తు మనకిచ్చిన అధికారంతో నేను శరీరంలో నుండి మెటల్ ని మాయం చేస్తూ మాములు ఎముకులతో మార్చబడటం చూసాను. నేను ప్రజలని చిన్న చిన్న రోగాల నుండి పెద్ద పెద్ద రోగాల దాక నయం చేసాను. నేను పెద్ద యుద్ధం గెలిచినంతగా ఆనందించడాన్ని నిరూపించగలను. ఈ సూచనలకు అద్భుతాలకి దేవుని నమ్మే వాళ్ళకి ఆయనతో పాటు నడుస్తున్న వాళ్ళకి ఎంతో మంది సాక్షులు ఉన్నారు. ఖచ్చితంగా క్రీస్తు శరీరం సజీవంగా ఉంది ఇంకా దేవుడు తన పిల్లలకి మంచే చేస్తాడు. కాని మనం ఆయన వాక్యాన్ని తెలుసు కొని మన కోసం ఆయన పెట్టిన జ్ఞానాన్ని వెతకాలి. కేవలం దేవుని వాక్యం ద్వారానే కాదు దేవునితో సన్నిహితమై మన సహోదర సహోదరిలతో సహవసిస్తూ ఉండాలి. నజరైయుడైన యేసు క్రీస్తూ మనతో పంచుకోవలను కున్న సత్యాన్ని, పరిశుద్దాత్మని ఎప్పుడూ అందిస్తుంది.

    దీనిని తెలికగా తీసుకోకండి.దేవుని వాక్యం ఖచ్చితంగా తవ్వి, పరీక్షించి, పరిశీలించి విలువైనదిగా కనుగొనచ్చు. కాని అది మీ జీవితంలో మెలవింపు చేసుకొని వాస్తవాన్ని చూడటానికి విశ్వాసం అవసరం. సజీవమైన విశ్వాసం మృతమైన విశ్వాసం కాదు. గుండె ఒక్కసారి కొట్టుకుంటూ, రోజు వెంబడి రోజు ఉంటదో దేవుని వాక్యం ద్వారా పోషించబడుతూ ఆత్మ ఫలాన్ని ఆనందించండి. ఆయన మన ముందు ఉంచిన సత్యాన్ని వెదుకుతూ ఆయనని ఎమైన అడిగినప్పుడు తగిన సమయంలో తప్పకుండా జవాబు యిస్తాడు. అదే మిమ్మల్ని ఎటు నడుస్తూందో అని చింతించదు. అవిశ్వసులు లాగా నిర్దేశం లేని వాళ్ళలాగా గోంగ్ హో లాగా మంచి అధ్బుతాల కథలతో ఉండదు, దానికి ఎంతో దూరంలో ఉంది. దీన్ని మేము పదే పదే చూసాము. సత్యం ఒక్కటే మన సృష్టి కర్త నిజమైనవాడు. కేవలం ఒక్కడే నేనే అనేకమైన దేవుళ్ళు లేరు ఇక్కడ అది అపవాది నుండి వచ్చిన అబద్ధం. ప్రతి సజీవమైన దానిపై ఎగురుతూ ప్రతి జీవికి తెలిసేలాగ దేవుడు కాదు. భూమి లేక గయా అని పిలవబడే కల్పన కథలు. మనం ఎందుకు మన చుట్టు ఉన్నవారిలాగ కదల్చబడకుండా, పడిపోకుండా మరణం అయ్యారు. కాని అది నజరైయుడైన క్రీస్తు వచ్చి సత్యాన్ని చెప్పి మనల్ని ఆధ్యాత్మికంగా ప్రకాశింప చేశాడు. ఆయనే ఖచ్చితంగా మార్గం, సత్యం ఇంకా జీవం కూడా. దేవుని జ్ఞానానికి అనుగుణంగా నడవక పోతే చివరిదాక ఆ వ్యక్తి నిదురలో నడుస్తున్నటే. ఆ అంతాన్ని గురించి తక్కువ మాట్లాడటమే చాలా మంచిది. ఇప్పుడే మేలుకోండి దేవుని మంచితనాన్ని రుచి చూడండి ఆయన మీకు సన్నిహితమవుతాడు! మీరు ఇప్పుడే మేలుకొని ఉంటే మత్తుగా నడిచినట్టు భావిస్తే మళ్ళి నిదుర పోకుండా ఉండేందుకు పోరాడండి. మీ తండ్రిని పూర్తి హృదయంతో, ఆత్మతో మరియు మనసుతో సమీపించేందుకు ప్రయత్నం చేయండి. అలా చేసేందుకు మెలుకువగా ఉండండి! ఆయన అనుకున్నట్టుగా దేవుడు బైబిలు ఒక చోటుగా ఎలా చేర్చడనేది నాకు నిజంగా తెలీదని ఒప్పుకోవాలి. నా సొంత తెలివితో బైబిలును చూసినప్పుడు ఎన్నో లోపాలు ఎవరు బాగు చేయలేరు. ఇంకా కట్టు కథలతో నిండిపోయిందని అనిపించింది. కాని అది నేను మన ప్రభువైన రక్షకుడైన యేసు క్రీస్తును పొందక ముందు, బైబిలును వాస్తవంగా తీసుకున్న సువార్తికుడుగా దేవుని శక్తిని అనుభవించాను. అప్పటి నుండి సూచనలు, అశ్చర్యకరమైనవి ఆగ లేదు, నన్ను బట్టి కాదు కాని దేవుడు ఎప్పటికి మారలేదు. అందరూ రక్షించబడాలని ఆయన స్పష్టంగా చూపించాడు. చేతులు దించి నేను విన్న మంచి వార్త అనుభవించింది ఇదే. మీ పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో మీకున్న సమస్తంతో దేవుని ప్రేమించండి. అప్పుడు మీకు ఎదురుగా వచ్చేది ఎంత ఉన్నప్పటికి దాని తీవ్రత ఎలా ఉన్నప్పటికి మీరు జీవిస్తారు. దేవుడు మీ హృదయాన్ని మీ అవధానాన్ని మీ ప్రేమను కోరుకుంచటున్నాడు. ఆయన ద్వారా మీరు కోరికలని ఈ లోకపు వాంఛలని అదిగమిస్తారు మరియు నిత్యం సంపూర్తిగా జీవిస్తారు.

    నేను ఉన్నది ఉన్నట్టుగా సూటిగా చెప్పినప్పుడు నన్ను క్షమించండి. దేవుడు మీ కోసం ఉంచిన ఆశీర్వాదాలతో నడవాలని కోరుకుంటున్నాను. మీలో కొంత మంది ఎడారిలో నడుస్తూన్నారు. కాని గుర్తు ఉంచుకోండి ఆయన ప్రేమించావారిని ఆయన పవిత్ర పరుస్తాడు. ఆయన మనల్ని ద్వేషించడు. మనం అనుమతిస్తే ఆయన మనకి తండ్రి అవుతాడు. మనం ఆయన చెప్పేది వినంత కాలం మన ఫలాలని అనుభవిస్తాము. కొన్ని సార్లు ఎడారిలో సమయం గడపడం అవసరం. అయినప్పటికి దయ చేసి భయపడదు. మీ పూర్ణ హృదయంతో మీరు ఆయనని వెదికినప్పుడు ఖచ్చితంగా ఆయన మీ పక్షన ఉంటాడు. పరలోకంలో ఉన్న మన తండ్రికి అసాధ్యమైనదేది లేదు. ఆయన చెప్పితే అది నెరవేరుతుంది! దేవుడు మహిమపర్చును గాక!

    ≡ యాకోబు 1:22-25

    22   మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. 23   ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. 24   వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా 25   అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును. ○-○

    మమ్మల్ని ఎలా సంప్రదించాలి!

    మీకు ఏవైనా ప్రశ్నలు లేదా సలహాలు ఉంటే లేదా కనెక్ట్ అవాలనుకుంటే, మీరు మాకు ఒక ఇమెయిల్ పంపవచ్చుtelluz@gmail.com.దయచేసి మీరు మమ్మల్ని సంప్రదించినప్పుడు ఇంగ్లీష్ లేదా నార్వేజియన్లో వ్రాయాలని గమనించండి. మీరు మమ్మల్ని అభినందించాలనుకుంటే అలాగే మా న్యూస్ లెటర్ పొందాలనుకుంటే దయచేసి ఈ లింక్ లోకి వెళ్ళండి http://eepurl.com/b9q2SL మరియు సబ్ స్క్రైబ్ అవ్వండి! మీరు మా పనిలో మాకు సహాయపడటానికి విరాళం ఇవ్వాలని అనుకుంటే దయచేసి paypal.me/JHalseth ఉపయోగించండి.

    దేవుడు నిన్ను ఆశీర్వదించును!

    ట్రూత్ టుబి టోల్డ్

    నార్వే 2012-2017

    పాత నిబంధన

    తెలుగు బైబిల్ (1880) మరియు 한국의 성서 (1910)

    కొత్త నిబంధన

    పుస్తక సూచీ:

    01: ఆదికాండము

    02: నిర్గమకాండము

    03: లేవీయకాండము

    04: సంఖ్యాకాండము

    05: ద్వితీయోపదేశకాండమ

    06: యెహొషువ

    07: న్యాయాధిపతులు

    08: రూతు

    09: సమూయేలు మొదటి గ్రంథము

    10: సమూయేలు రెండవ గ్రంథము

    11: రాజులు మొదటి గ్రంథము

    12: రాజులు రెండవ గ్రంథము

    13: దినవృత్తాంతములు మొదటి గ్రంథము

    14: దినవృత్తాంతములు రెండవ గ్రంథము

    15: ఎజ్రా

    16: నెహెమ్యా

    17: ఎస్తేరు

    18: యోబు గ్రంథము

    19: కీర్తనల గ్రంథము

    20: సామెతలు

    21: ప్రసంగి

    22: పరమగీతము

    23: యెషయా గ్రంథము

    24: యిర్మీయా

    25: విలాపవాక్యములు

    26: యెహెజ్కేలు

    27: దానియేలు

    28: హొషేయ

    29: యోవేలు

    30: ఆమోసు

    31: ఓబద్యా

    32: యోనా

    33: మీకా

    34: నహూము

    35: హబక్కూకు

    36: జెఫన్యా

    37: హగ్గయి

    38: జెకర్యా

    39: మలాకీ

    ఆదికాండము

    సంఖ్య 1/66

    పాత నిబంధన

    నిర్గమకాండము

    అధ్యాయం ఇండెక్స్:

    01 02 03 04 05 06 07 08 09 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50

    ఆదికాండము 1

    పాత నిబంధన

    ఆదికాండము

    ఆదికాండము 2

    వచనం ఇండెక్స్:

    01 02 03 04 05 06 07 08 09 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

    ఆదికాండము 1 :1

    tel ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.

    kor 태초에 하나님이 천지를 창조하시니라 !

    ఆదికాండము 1 :2

    tel భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.,,

    kor 땅이 혼돈하고 공허하며 흑암이 깊음 위에 있고 하나님의 신(神)은 수면에 운행하시니라

    ఆదికాండము 1 :3

    tel దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.

    kor 하나님이 가라사대 빛이 있으라 ! 하시매 빛이 있었고

    ఆదికాండము 1 :4

    tel వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.

    kor 그 빛이 하나님의 보시기에 좋았더라 하나님이 빛과 어두움을 나누사

    ఆదికాండము 1 :5

    tel దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.

    kor 빛을 낮이라 칭하시고 어두움을 밤이라 칭하시니라 저녁이 되며 아침이 되니 이는 첫째 날이니라

    ఆదికాండము 1 :6

    tel మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను.

    kor 하나님이 가라사대 물 가운데 궁창이 있어 물과 물로 나뉘게 하리라 ! 하시고

    ఆదికాండము 1 :7

    tel దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను.

    kor 하나님이 궁창을 만드사 궁창 아래의 물과 궁창 위의 물로 나뉘게 하시매 그대로 되니라

    ఆదికాండము 1 :8

    tel దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను.

    kor 하나님이 궁창을 하늘이라 칭하시니라 저녁이 되며 아침이 되니 이는 둘째 날이니라

    ఆదికాండము 1 :9

    tel దేవుడు ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను.

    kor 하나님이 가라사대 천하의 물이 한곳으로 모이고 뭍이 드러나라 ! 하시매 그대로 되니라

    ఆదికాండము 1 :10

    tel దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను.

    kor 하나님이 뭍을 땅이라 칭하시고 모인 물을 바다라 칭하시니라 하나님의 보시기에 좋았더라

    ఆదికాండము 1 :11

    tel దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను.

    kor 하나님이 가라사대 땅은 풀과 씨 맺는 채소와 각기 종류대로 씨 가진 열매 맺는 과목을 내라 하시매 그대로 되어

    ఆదికాండము 1 :12

    tel భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను

    kor 땅이 풀과 각기 종류대로 씨 맺는 채소와 각기 종류대로 씨 가진 열매 맺는 나무를 내니 하나님의 보시기에 좋았더라

    ఆదికాండము 1 :13

    tel అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను.

    kor 저녁이 되며 아침이 되니 이는 세째 날이니라

    ఆదికాండము 1 :14

    tel దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు,

    kor 하나님이 가라사대 하늘의 궁창에 광명이 있어 주야를 나뉘게 하라 또 그 광명으로 하여 징조와 사시와 일자와 연한이 이루라

    ఆదికాండము 1 :15

    tel భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశవిశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను, ఆ ప్రకారమాయెను.

    kor 또 그 광명이 하늘의 궁창에 있어 땅에 비취라 하시고 (그대로 되니라)

    ఆదికాండము 1 :16

    tel దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.

    kor 하나님이 두 큰 광명을 만드사 큰 광명으로 낮을 주관하게 하시고 작은 광명으로 밤을 주관하게 하시며 또 별들을 만드시고

    ఆదికాండము 1 :17

    tel భూమిమీద వెలుగిచ్చుటకును

    kor 하나님이 그것들을 하늘의 궁창에 두어 땅에 비취게 하시며

    ఆదికాండము 1 :18

    tel పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను, అది మంచిదని దేవుడు చూచెను.

    kor 주야를 주관하게 하시며 빛과 어두움을 나뉘게 하시니라 하나님의 보시기에 좋았더라

    ఆదికాండము 1 :19

    tel అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.

    kor 저녁이 되며 아침이 되니 이는 네째 날이니라

    ఆదికాండము 1 :20

    tel దేవుడు జీవముకలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను.

    kor 하나님이 가라사대 물들은 생물로 번성케 하라 땅 위 하늘의 궁창에는 새가 날으라 하시고

    ఆదికాండము 1 :21

    tel దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించువాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను.

    kor 하나님이 큰 물고기와 물에서 번성하여 움직이는 모든 생물을 그 종류대로, 날개 있는 모든 새를 그 종류대로 창조하시니 하나님의 보시기에 좋았더라

    ఆదికాండము 1 :22

    tel దేవుడు మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను.

    kor 하나님이 그들에게 복을 주어 가라사대 생육하고 번성하여 여러 바다물에 충만하라 새들도 땅에 번성하라 하시니라

    ఆదికాండము 1 :23

    tel అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను.

    kor 저녁이 되며 아침이 되니 이는 다섯째 날이니라

    ఆదికాండము 1 :24

    tel దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను, ఆప్రకారమాయెను.

    kor 하나님이 가라사대 땅은 생물을 그 종류대로 내되 육축과 기는 것과 땅의 짐승을 종류대로 내라 하시고 (그대로 되니라)

    ఆదికాండము 1 :25

    tel దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అదిమంచిదని దేవుడు చూచెను.

    kor 하나님이 땅의 짐승을 그 종류대로, 육축을 그 종류대로, 땅에 기는 모든 것을 그 종류대로 만드시니 하나님의 보시기에 좋았더라

    ఆదికాండము 1 :26

    tel దేవుడు మన స్వరూపమందు మన పోలికెచొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.

    kor 하나님이 가라사대 우리의 형상을 따라 우리의 모양대로 우리가 사람을 만들고 그로 바다의 고기와, 공중의 새와, 육축과, 온 땅과, 땅에 기는 모든 것을 다스리게 하자 하시고

    ఆదికాండము 1 :27

    tel దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.,,

    kor 하나님이 자기 형상 곧 하나님의 형상대로 사람을 창조하시되 남자와 여자를 창조하시고

    ఆదికాండము 1 :28

    tel దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.,,

    kor 하나님이 그들에게 복을 주시며 그들에게 이르시되 생육하고 번성하여 땅에 충만하라, 땅을 정복하라, 바다의 고기와 공중의 새와 땅에 움직이는 모든 생물을 다스리라 하시니라

    ఆదికాండము 1 :29

    tel దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీ కిచ్చియున్నాను, అవి మీ కాహారమగును.

    kor 하나님이 가라사대 내가 온 지면의 씨 맺는 모든 채소와 씨 가진 열매 맺는 모든 나무를 너희에게 주노니 너희 식물이 되리라

    ఆదికాండము 1 :30

    tel భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను.

    kor 또 땅의 모든 짐승과 공중의 모든 새와 생명이 있어 땅에 기는 모든 것에게는 내가 모든 푸른 풀을 식물로 주노라 하시니 그대로 되니라

    ఆదికాండము 1 :31

    tel దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగనుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.

    kor 하나님이 그 지으신 모든 것을 보시니 보시기에 심히 좋았더라 저녁이 되며 아침이 되니 이는 여섯째 날이니라

    ఆదికాండము 2

    పాత నిబంధన

    ఆదికాండము

    ఆదికాండము 1

    ఆదికాండము 3

    వచనం ఇండెక్స్:

    01 02 03 04 05 06 07 08 09 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25

    ఆదికాండము 2 :1

    tel ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను.

    kor 천지와 만물이 다 이루니라

    ఆదికాండము 2 :2

    tel దేవుడు తాను చేసిన తన పని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పనియంతటినుండి యేడవ దినమున విశ్రమించెను.

    kor 하나님의 지으시던 일이 일곱째 날이 이를 때에 마치니 그 지으시던 일이 다하므로 일곱째 날에 안식하시니라

    ఆదికాండము 2 :3

    tel కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను, ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించినట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.

    kor 하나님이 일곱째 날을 복 주사 거룩하게 하셨으니 이는 하나님이 그 창조하시며 만드시던 모든 일을 마치시고 이 날에 안식하셨음이더라

    ఆదికాండము 2 :4

    tel దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తిక్రమము ఇదే.

    kor 여호와 하나님이 천지를 창조하신 때에 천지의 창조된 대략이 이러하니라

    ఆదికాండము 2 :5

    tel అదివరకు పొలమందలి యే పొదయు భూమిమీద నుండలేదు. పొలమందలి యే చెట్టును మొలవలేదు, ఏలయనగా దేవుడైన యెహోవా భూమిమీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటక నరుడులేడు,

    kor 여호와 하나님이 땅에 비를 내리지 아니하셨고 경작할 사람도 없었으므로 들에는 초목이 아직 없었고 밭에는 채소가 나지 아니하였으며

    ఆదికాండము 2 :6

    tel అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంతటిని తడిపెను.

    kor 안개만 땅에서 올라와 온 지면을 적셨더라

    ఆదికాండము 2 :7

    tel దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.

    kor 여호와 하나님이 흙으로 사람을 지으시고 생기를 그 코에 불어 넣으시니 사람이 생령이 된지라

    ఆదికాండము 2 :8

    tel దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను.

    kor 여호와 하나님이 동방의 에덴에 동산을 창설하시고 그 지으신 사람을 거기 두시고

    ఆదికాండము 2 :9

    tel మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను.

    kor 여호와 하나님이 그 땅에서 보기에 아름답고 먹기에 좋은 나무가 나게 하시니 동산 가운데에는 생명나무와 선악을 알게하는 나무도 있더라

    ఆదికాండము 2 :10

    tel మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులోనుండి ఒక నది బయలుదేరి అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను.

    kor 강이 에덴에서 발원하여 동산을 적시고 거기서부터 갈라져 네 근원이 되었으니

    ఆదికాండము 2 :11

    tel మొదటిదాని పేరు పీషోను, అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది, అక్కడ బంగారమున్నది.,,

    kor 첫째의 이름은 비손이라 금이 있는 하윌라 온 땅에 둘렸으며

    ఆదికాండము 2 :12

    tel ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది, అక్కడ బోళమును గోమేధికములును దొరుకును.

    kor 그 땅의 금은 정금이요 그 곳에는 베델리엄과 호마노도 있으며

    ఆదికాండము 2 :13

    tel రెండవ నది పేరు గీహోను, అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది.

    kor 둘째 강의 이름은 기혼이라 구스 온 땅에 둘렸고

    ఆదికాండము 2 :14

    tel మూడవ నది పేరు హిద్దెకెలు, అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు

    kor 세째 강의 이름은 힛데겔이라 앗수르 동편으로 흐르며 네째 강은 유브라데더라

    ఆదికాండము 2 :15

    tel మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.

    kor 여호와 하나님이 그 사람을 이끌어 에덴 동산에 두사 그것을 다스리며 지키게 하시고

    ఆదికాండము 2 :16

    tel మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును

    kor 여호와 하나님이 그 사람에게 명하여 가라사대 동산 각종 나무의 실과는 네가 임의로 먹되

    ఆదికాండము 2 :17

    tel అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.

    kor 선악을 알게하는 나무의 실과는 먹지 말라 ! 네가 먹는 날에는 정녕 죽으리라 ! 하시니라

    ఆదికాండము 2 :18

    tel మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.

    kor 여호와 하나님이 가라사대 사람의 독처하는 것이 좋지 못하니 내가 그를 위하여 돕는 배필을 지으리라 하시니라

    ఆదికాండము 2 :19

    tel దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను.

    kor 여호와 하나님이 흙으로 각종 들짐승과 공중의 각종 새를 지으시고 아담이 어떻게 이름을 짓나 보시려고 그것들을 그에게로 이끌어 이르시니 아담이 각 생물을 일컫는 바가 곧 그 이름이라

    ఆదికాండము 2 :20

    tel అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశపక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేకపోయెను.

    kor 아담이 모든 육축과 공중의 새와 들의 모든 짐승에게 이름을 주니라 아담이 돕는 배필이 없으므로

    ఆదికాండము 2 :21

    tel అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను.

    kor 여호와 하나님이 아담을 깊이 잠들게 하시니 잠들매 그가 그 갈빗대 하나를 취하고 살로 대신 채우시고

    ఆదికాండము 2 :22

    tel తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను.

    kor 여호와 하나님이 아담에게서 취하신 그 갈빗대로 여자를 만드시고 그를 아담에게로 이끌어 오시니

    ఆదికాండము 2 :23

    tel అప్పుడు ఆదాము ఇట్లనెను నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును.

    kor 아담이 가로되 `이는 내 뼈 중의 뼈요 ! 살 중의 살이라 ! 이것을 남자에게서 취하였은즉 여자라 칭하리라' 하니라

    ఆదికాండము 2 :24

    tel కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైయుందురు.

    kor 이러므로 남자가 부모를 떠나 그 아내와 연합하여 둘이 한 몸을 이룰지로다 !

    ఆదికాండము 2 :25

    tel అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి.

    kor 아담과 그 아내 두 사람이 벌거벗었으나 부끄러워 아니하니라

    ఆదికాండము 3

    పాత నిబంధన

    ఆదికాండము

    ఆదికాండము 2

    ఆదికాండము 4

    వచనం ఇండెక్స్:

    01 02 03 04 05 06 07 08 09 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

    ఆదికాండము 3 :1

    tel దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను.

    kor 여호와 하나님의 지으신 들짐승 중에 뱀이 가장 간교하더라 뱀이 여자에게 물어 가로되 `하나님이 참으로 너희더러 동산 모든 나무의 실과를 먹지 말라 하시더냐 ?'

    ఆదికాండము 3 :2

    tel అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును

    kor 여자가 뱀에게 말하되 `동산 나무의 실과를 우리가 먹을 수 있으나

    ఆదికాండము 3 :3

    tel అయితే తోట మధ్యవున్న చెట్టు ఫలములనుగూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను.

    kor 동산 중앙에 있는 나무의 실과는 하나님의 말씀에 너희는 먹지도 말고 만지지도 말라 너희가 죽을까 하노라 하셨느니라'

    ఆదికాండము 3 :4

    tel అందుకు సర్పము మీరు చావనే చావరు

    kor 뱀이 여자에게 이르되 `너희가 결코 죽지 아니하리라

    ఆదికాండము 3 :5

    tel ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగినవారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా

    kor 너희가 그것을 먹는 날에는 너희 눈이 밝아 하나님과 같이 되어 선악을 알 줄을 하나님이 아심이니라'

    ఆదికాండము 3 :6

    tel స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను,

    kor 여자가 그 나무를 본즉 먹음직도 하고, 보암직도 하고, 지혜롭게 할 만큼 탐스럽기도 한 나무인지라 여자가 그 실과를 따먹고 자기와 함께 한 남편에게도 주매 그도 먹은지라

    ఆదికాండము 3 :7

    tel అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.

    kor 이에 그들의 눈이 밝아 자기들의 몸이 벗은 줄을 알고 무화과나무 잎을 엮어 치마를 하였더라

    ఆదికాండము 3 :8

    tel చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్ల మధ్యను దాగుకొనగా

    kor 그들이 날이 서늘할 때에 동산에 거니시는 여호와 하나님의 음성을 듣고 아담과 그 아내가 여호와 하나님의 낯을 피하여 동산 나무 사이에 숨은지라

    ఆదికాండము 3 :9

    tel దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను.

    kor 여호와 하나님이 아담을 부르시며 그에게 이르시되 네가 어디 있느냐 ?

    ఆదికాండము 3 :10

    tel అందు కతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయపడి దాగుకొంటిననెను.

    kor 가로되 `내가 동산에서 하나님의 소리를 듣고 내가 벗었으므로 두려워하여 숨었나이다'

    ఆదికాండము 3 :11

    tel అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను.

    kor 가라사대 누가 너의 벗었음을 네게 고하였느냐 ? 내가 너더러 먹지 말라 명한 그 나무 실과를 네가 먹었느냐 ?

    ఆదికాండము 3 :12

    tel అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను.

    kor 아담이 가로되 `하나님이 주셔서 나와 함께하게 하신 여자 그가 그 나무 실과를 내게 주므로 내가 먹었나이다'

    ఆదికాండము 3 :13

    tel అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది యేమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను.

    kor 여호와 하나님이 여자에게 이르시되 네가 어찌하여 이렇게 하였느냐 ? 여자가 가로되 `뱀이 나를 꾀므로 내가 먹었나이다'

    ఆదికాండము 3 :14

    tel అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువు లన్నిటిలోను నీవు శపించ బడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నియుమన్ను తిందువు.

    kor 여호와 하나님이 뱀에게 이르시되 네가 이렇게 하였으니 네가 모든 육축과 들의 모든 짐승보다 더욱 저주를 받아 배로 다니고 종신토록 흙을 먹을지니라

    ఆదికాండము 3 :15

    tel మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.

    kor 내가 너로 여자와 원수가 되게 하고 너의 후손도 여자의 후손과 원수가 되게 하리니 여자의 후손은 네 머리를 상하게 할 것이요 너는 그의 발꿈치를 상하게 할 것이니라 하시고

    ఆదికాండము 3 :16

    tel ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను.,

    kor 또 여자에게 이르시되 내가 네게 잉태하는 고통을 크게 더하리니 네가 수고하고 자식을 낳을 것이며 너는 남편을 사모하고 남편은 너를 다스릴 것이니라 하시고

    ఆదికాండము 3 :17

    tel ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది, ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు

    kor 아담에게 이르시되 네가 네 아내의 말을 듣고 내가 너더러 먹지 말라 한 나무 실과를 먹었은즉 땅은 너로 인하여 저주를 받고 너는 종신토록 수고하여야 그 소산을 먹으리라

    ఆదికాండము 3 :18

    tel అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు

    kor 땅이 네게 가시덤불과 엉겅퀴를 낼 것이라 너의 먹을 것은 밭의 채소인즉

    ఆదికాండము 3 :19

    tel నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.,,

    kor 네가 얼굴에 땀이 흘러야 식물을 먹고 필경은 흙으로 돌아가리니 그 속에서 네가 취함을 입었음이라 너는 흙이니 흙으로 돌아 갈 것이니라 하시니라

    ఆదికాండము 3 :20

    tel ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి.

    kor 아담이 그 아내를 하와라 이름하였으니 그는 모든 산 자의 어미가 됨이더라

    ఆదికాండము 3 :21

    tel దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను.

    kor 여호와 하나님이 아담과 그 아내를 위하여 가죽 옷을 지어 입히시니라

    ఆదికాండము 3 :22

    tel అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటివాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవవృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని

    kor 여호와 하나님이 가라사대 보라, 이 사람이 선악을 아는 일에 우리 중 하나같이 되었으니 그가 그 손을 들어 생명나무 실과도 먹고 영생할까 하노라 하시고

    ఆదికాండము 3 :23

    tel దేవుడైన యెహోవా అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను.

    kor 여호와 하나님이 에덴 동산에서 그 사람을 내어 보내어 그의 근본된 토지를 갈게 하시니라

    ఆదికాండము 3 :24

    tel అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టిఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.

    kor 이같이 하나님이 그 사람을 쫓아 내시고 에덴 동산 동편에 그룹들과 두루 도는 화염검을 두어 생명나무의 길을 지키게 하시니라

    ఆదికాండము 4

    పాత నిబంధన

    ఆదికాండము

    ఆదికాండము 3

    ఆదికాండము 5

    వచనం ఇండెక్స్:

    01 02 03 04 05 06 07 08 09 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26

    ఆదికాండము 4 :1

    tel ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను.

    kor 아담이 그 아내 하와와 동침하매 하와가 잉태하여 가인을 낳고 이르되 `내가 여호와로 말미암아 득남하였다' 하니라

    ఆదికాండము 4 :2

    tel తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొఱ్ఱల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు.

    kor 그가 또 가인의 아우 아벨을 낳았는데 아벨은 양 치는 자이었고, 가인은 농사하는 자이었더라

    ఆదికాండము 4 :3

    tel కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను.

    kor 세월이 지난 후에 가인은 땅의 소산으로 제물을 삼아 여호와께 드렸고

    ఆదికాండము 4 :4

    tel హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను

    kor 아벨은 자기도 양의 첫 새끼와 그 기름으로 드렸더니 여호와께서 아벨과 그 제물은 열납하셨으나

    ఆదికాండము 4 :5

    tel కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా

    kor 가인과 그 제물은 열납하지 아니하신지라 가인이 심히 분하여 안색이 변하니

    ఆదికాండము 4 :6

    tel యెహోవా కయీనుతో నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి?

    kor 여호와께서 가인에게 이르시되 네가 분하여 함은 어찜이며 안색이 변함은 어찜이뇨 ?

    ఆదికాండము 4 :7

    tel నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును, నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను.

    kor 네가 선을 행하면 어찌 낯을 들지 못하겠느냐 ? 선을 행치 아니하면 죄가 문에 엎드리느니라 죄의 소원은 네게 있으나 너는 죄를 다스릴지니라

    ఆదికాండము 4 :8

    tel కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను.

    kor 가인이 그 아우 아벨에게 고하니라 그 후 그들이 들에 있을때에 가인이 그 아우 아벨을 쳐 죽이니라

    ఆదికాండము 4 :9

    tel యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడు నే నెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను.

    kor 여호와께서 가인에게 이르시되 네 아우 아벨이 어디 있느냐 ? 그가 가로되 `내가 알지 못하나이다 내가 내 아우를 지키는 자이니까 ?'

    ఆదికాండము 4 :10

    tel అప్పుడాయన నీవు చేసినపని యేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది.

    kor 가라사대 네가 무엇을 하였느냐 ? 네 아우의 핏소리가 땅에서부터 내게 호소하느니라

    ఆదికాండము 4 :11

    tel కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింపబడినవాడవు,

    kor 땅이 그 입을 벌려 네 손에서부터 네 아우의 피를 받았은즉 네가 땅에서 저주를 받으리니

    ఆదికాండము 4 :12

    tel నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు, నీవు భూమిమీద దిగులుపడుచు దేశదిమ్మరివై యుందువనెను.

    kor 네가 밭 갈아도 땅이 다시는 그 효력을 네게 주지 아니할 것이요 너는 땅에서 피하며 유리하는 자가 되리라

    ఆదికాండము 4 :13

    tel అందుకు కయీను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది.

    kor 가인이 여호와께 고하되 `내 죄벌이 너무 중하여 견딜 수 없나이다

    ఆదికాండము 4 :14

    tel నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్లగొట్టితివి, నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను.

    kor 주께서 오늘 이 지면에서 나를 쫓아 내시온즉 내가 주의 낯을 뵈옵지 못하리니 내가 땅에서 피하며 유리하는 자가 될지라 무릇 나를 만나는 자가 나를 죽이겠나이다'

    ఆదికాండము 4 :15

    tel అందుకు యెహోవా అతనితో కాబట్టి యెవడైనను కయీనును చంపినయెడల వానికి ప్రతిదండన యేడంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక యుండునట్లు యహోవా అతనికి ఒక గురుతు వేసెను.

    kor 여호와께서 그에게 이르시되 그렇지 않다 가인을 죽이는 자는 벌을 칠배나 받으리라 하시고 가인에게 표를 주사 만나는 누구에게든지 죽임을 면케 하시니라

    ఆదికాండము 4 :16

    tel అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోనుండి బయలుదేరివెళ్లి ఏదెనుకు తూర్పుదిక్కున నోదు దేశములో కాపురముండెను.

    kor 가인이 여호와의 앞을 떠나 나가 에덴 동편 놋 땅에 거하였더니

    ఆదికాండము 4 :17

    tel కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకను పేరు పెట్టెను.

    kor 아내와 동침하니 그가 잉태하여 에녹을 낳은지라 가인이 성을 쌓고 그 아들의 이름으로 성을 이름하여 에녹이라 하였더라

    ఆదికాండము 4 :18

    tel హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమెకును కనెను.

    kor 에녹이 이랏을 낳았고, 이랏은 므후야엘을 낳았고, 므후야엘은 므드사엘을 낳았고, 므드사엘은 라멕을 낳았더라

    ఆదికాండము 4 :19

    tel లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసికొనెను, వారిలో ఒకదాని పేరు ఆదా రెండవదానిపేరు సిల్లా.

    kor 라멕이 두 아내를 취하였으니 하나의 이름은 아다요, 하나의 이름은 씰라며

    ఆదికాండము 4 :20

    tel ఆదా యా బాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించువారికి మూలపురుషుడు.

    kor 아다는 야발을 낳았으니 그는 장막에 거하여 육축 치는 자의 조상이 되었고

    ఆదికాండము 4 :21

    tel అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయువారికందరికిని మూలపురుషుడు.

    kor 그 아우의 이름은 유발이니 그는 수금과 퉁소를 잡는 모든 자의 조상이 되었으며

    ఆదికాండము 4 :22

    tel మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. తూబల్కయీను సహోదరి పేరు నయమా.

    kor 씰라는 두발가인을 낳았으니 그는 동,철로 각양 날카로운 기계를 만드는 자요 두발가인의 누이는 나아마이었더라

    ఆదికాండము 4 :23

    tel లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా, నా పలుకు వినుడి లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి నన్ను గాయపరచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని

    kor 라멕이 아내들에게 이르되 `아다와 씰라여 내 소리를 들으라 라멕의 아내들이여 ! 내 말을 들으라 나의 창상을 인하여 내가 사람을 죽였고 나의 상함을 인하여 소년을 죽였도다

    ఆదికాండము 4 :24

    tel ఏడంతలు ప్రతి దండన కయీను కోసము, వచ్చినయెడల లెమెకు కోసము డెబ్బది యేడంతలు వచ్చుననెను.

    kor 가인을 위하여는 벌이 칠배일진대 라멕을 위하여는 벌이 칠십 칠배이리로다' 하였더라

    ఆదికాండము 4 :25

    tel ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను.

    kor 아담이 다시 아내와 동침하매 그가 아들을 낳아 그 이름을 셋이라 하였으니 `이는 하나님이 내게 가인의 죽인 아벨 대신에 다른 씨를 주셨다' 함이며

    ఆదికాండము 4 :26

    tel మరియు షేతునకుకూడ కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.

    kor 셋도 아들을 낳고 그 이름을 에노스라 하였으며 그 때에 사람들이 비로소 여호와의 이름을 불렀더라

    ఆదికాండము 5

    పాత నిబంధన

    ఆదికాండము

    ఆదికాండము 4

    ఆదికాండము 6

    వచనం ఇండెక్స్:

    01 02 03 04 05 06 07 08 09 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32

    ఆదికాండము 5 :1

    tel ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను

    kor 아담 자손의 계보가 이러하니라 하나님이 사람을 창조하실 때에 하나님의 형상대로 지으시되

    ఆదికాండము 5 :2

    tel మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.

    kor 남자와 여자를 창조하셨고 그들이 창조되던 날에 하나님이 그들에게 복을 주시고 그들의 이름을 사람이라 일컬으셨더라

    ఆదికాండము 5 :3

    tel ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను.

    kor 아담이 일백 삼십세에 자기 모양 곧 자기 형상과 같은 아들을 낳아 이름을 셋이라 하였고

    ఆదికాండము 5 :4

    tel షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు, అతడు కుమారులను కుమార్తెలను కనెను.

    kor 아담이 셋을 낳은 후 팔백년을 지내며 자녀를 낳았으며

    ఆదికాండము 5 :5

    tel ఆదాము బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ముప్పది యేండ్లు, అప్పుడతడు మృతిబొందెను.

    kor 그가 구백 삼십세를 향수하고 죽었더라

    ఆదికాండము 5 :6

    tel షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను.

    kor 셋은 일백 오세에 에노스를 낳았고

    ఆదికాండము 5 :7

    tel ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిదివందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

    kor 에노스를 낳은 후 팔백 칠년을 지내며 자녀를 낳았으며

    ఆదికాండము 5 :8

    tel షేతు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల పండ్రెండేండ్లు, అప్పుడతడు మృతిబొందెను.

    kor 그가 구백 십이세를 향수하고 죽었더라

    ఆదికాండము 5 :9

    tel ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను.

    kor 에노스는 구십세에 게난을 낳았고

    ఆదికాండము 5 :10

    tel కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

    kor 게난을 낳은 후 팔백 십 오년을 지내며 자녀를 낳았으며

    ఆదికాండము 5 :11

    tel ఎనోషు దినములన్నియు తొమ్మిదివందల అయిదేండ్లు, అప్పుడతడు మృతిబొందెను.

    kor 그가 구백 오세를 향수하고 죽었더라

    ఆదికాండము 5 :12

    tel కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను.

    kor 게난은 칠십세에 마할랄렐을 낳았고

    ఆదికాండము 5 :13

    tel మహలలేలును కనినతరువాత కేయినాను ఎనిమిది వందల నలువది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

    kor 마할랄렐을 낳은 후 팔백 사십년을 지내며 자녀를 낳았으며

    ఆదికాండము 5 :14

    tel కేయినాను దినములన్నియు తొమ్మిదివందల పదియేండ్లు, అప్పుడతడు మృతిబొందెను.

    kor 그가 구백 십세를 향수하고 죽었더라

    ఆదికాండము 5 :15

    tel మహలలేలు అరువది యైదేండ్లు బ్రదికి యెరెదును కనెను.

    kor 마할랄렐은 육십 오세에 야렛을 낳았고

    ఆదికాండము 5 :16

    tel యెరెదును కనిన తరువాత మహలలేలు ఎనిమిదివందల ముప్పదియేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

    kor 야렛을 낳은 후 팔백 삼십년을 지내며 자녀를 낳았으며

    ఆదికాండము 5 :17

    tel మహలలేలు దినములన్నియు ఎనిమిదివందల తొంబదియైదేండ్లు, అప్పుడతడు మృతిబొందెను.

    kor 그가 팔백 구십 오세를 향수하고 죽었더라

    ఆదికాండము 5 :18

    tel యెరెదు నూట అరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను.

    kor 야렛은 일백 육십 이세에 에녹을 낳았고

    ఆదికాండము 5 :19

    tel హనోకును కనిన తరువాత యెరెదు ఎనిమిది వందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

    kor 에녹을 낳은 후 팔백년을 지내며 자녀를 낳았으며

    ఆదికాండము 5 :20

    tel యెరెదు దినములన్నియు తొమ్మిదివందల అరువదిరెండేండ్లు, అప్పుడతడు మృతిబొందెను.

    kor 그가 구백 육십 이세를 향수하고 죽었더라

    ఆదికాండము 5 :21

    tel హనోకు అరువది యైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను.

    kor 에녹은 육십 오세에 므두셀라를 낳았고

    ఆదికాండము 5 :22

    tel హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.

    kor 므두셀라를 낳은 후 삼백년을 하나님과 동행하며 자녀를 낳았으며

    ఆదికాండము 5 :23

    tel హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు.

    kor 그가 삼백 육십 오세를 향수하였더라

    ఆదికాండము 5 :24

    tel హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.

    kor 에녹이 하나님과 동행하더니 하나님이 그를 데려 가시므로 세상에 있지 아니하였더라

    ఆదికాండము 5 :25

    tel మెతూషెల నూట ఎనుబదియేడేండ్లు బ్రదికి లెమెకును కనెను.

    kor 므두셀라는 일백 팔십 칠세에 라멕을 낳았고

    ఆదికాండము 5 :26

    tel మెతూషెల లెమెకును కనిన తరువాత ఏడువందల ఎనుబది రెండేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

    kor 라멕을 낳은 후 칠백 팔십 이년을 지내며 자녀를 낳았으며

    ఆదికాండము 5 :27

    tel మెతూషెల దినములన్నియు తొమ్మిదివందల అరువది తొమ్మిదియేండ్లు, అప్పుడతడు మృతిబొందెను.

    kor 그는 구백 육십 구세를 향수하고 죽었더라

    ఆదికాండము 5 :28

    tel లెమెకు నూట ఎనుబది రెండేండ్లు బ్రదికి ఒక కుమారుని కని

    kor 라멕은 일백 팔십 이세에 아들을 낳고

    ఆదికాండము 5 :29

    tel భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను.

    kor 이름을 노아라 하여 가로되 `여호와께서 땅을 저주하시므로 수고로이 일하는 우리를 이 아들이 안위하리라' 하였더라

    ఆదికాండము 5 :30

    tel లెమెకు నోవహును కనిన తరువాత ఏనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

    kor 라멕이 노아를 낳은 후 오백 구십 오년을 지내며 자녀를 낳았으며

    ఆదికాండము 5 :31

    tel లెమెకు దినములన్నియు ఏడువందల డెబ్బది యేడేండ్లు, అప్పుడతడు మృతిబొందెను.

    kor 그는 칠백 칠십 칠세를 향수하고 죽었더라

    ఆదికాండము 5 :32

    tel నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.

    kor 노아가 오백세 된 후에 셈과, 함과, 야벳을 낳았더라

    ఆదికాండము 6

    పాత నిబంధన

    ఆదికాండము

    ఆదికాండము 5

    ఆదికాండము 7

    వచనం ఇండెక్స్:

    01 02 03 04 05 06 07 08 09 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

    ఆదికాండము 6 :1

    tel నరులు భూమిమీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు

    kor 사람이 땅 위에 번성하기 시작할 때에 그들에게서 딸들이 나니

    ఆదికాండము 6 :2

    tel దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.

    kor 하나님의 아들들이 사람의 딸들의 아름다움을 보고 자기들의 좋아하는 모든 자로 아내를 삼는지라

    ఆదికాండము 6 :3

    tel అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులైయున్నారు, అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను.,,

    kor 여호와께서 가라사대 나의 신(神)이 영원히 사람과 함께하지 아니하리니 이는 그들이 육체가 됨이라 그러나 그들의 날은 일백 이십년이 되리라 하시니라

    ఆదికాండము 6 :4

    tel ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే.

    kor 당시에 땅에 네피림이 있었고 그 후에도 하나님의 아들들이 사람의 딸들을 취하여 자식을 낳았으니 그들이 용사라 고대에 유명한 사람이었더라

    ఆదికాండము 6 :5

    tel నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి

    kor 여호와께서 사람의 죄악이 세상에 관영함과 그 마음의 생각의 모든 계획이 항상 악할 뿐임을 보시고

    ఆదికాండము 6 :6

    tel తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను.

    kor 땅위에 사람 지으셨음을 한탄하사 마음에 근심하시고

    ఆదికాండము 6 :7

    tel అప్పుడు యెహోవా నేను సృజించిన నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును, ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నాననెను.

    kor 가라사대 나의 창조한 사람을 내가 지면에서 쓸어 버리되 사람으로부터 육축과 기는 것과 공중의 새까지 그리하리니 이는 내가 그것을 지었음을 한탄함이니라 하시니라

    ఆదికాండము 6 :8

    tel అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.

    kor 그러나 노아는 여호와께 은혜를 입었더라

    ఆదికాండము 6 :9

    tel నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు.

    kor 노아의 사적은 이러하니라 노아는 의인이요 당세에 완전한 자라 그가 하나님과 동행하였으며

    ఆదికాండము 6 :10

    tel షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను.

    kor 그가 세 아들을 낳았으니 셈과, 함과, 야벳이라

    ఆదికాండము 6 :11

    tel భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను, భూలోకము బలాత్కారముతో నిండియుండెను.

    kor 때에 온 땅이 하나님 앞에 패괴하여 강포가 땅에 충만한지라

    ఆదికాండము 6 :12

    tel దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను, భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.

    kor 하나님이 보신즉 땅이 패괴하였으니 이는 땅에서 모든 혈육 있는 자의 행위가 패괴함이었더라

    ఆదికాండము 6 :13

    tel దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది, ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.

    kor 하나님이 노아에게 이르시되 모든 혈육있는 자의 강포가 땅에 가득하므로 그 끝날이 내 앞에 이르렀으니 내가 그들을 땅과 함께 멸하리라

    ఆదికాండము 6 :14

    tel చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను.

    kor 너는 잣나무로 너를 위하여 방주를 짓되 그 안에 간들을 막고 역청으로 그 안팎에 칠하라

    ఆదికాండము 6 :15

    tel నీవు దాని చేయవలసిన విధమిది, ఆ ఓడ మూడువందల మూరల పొడుగును ఏబది మూరల వెడల్పును ముప్పది మూరల యెత్తును గలదై యుండవలెను.

    kor 그 방주의 제도는 이러하니 장이 삼백 규빗, 광이 오십 규빗, 고가 삼십 규빗이며

    ఆదికాండము 6 :16

    tel ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను, ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను, క్రింది అంతస్థు రెండవ అంతస్థు మూడవ అంతస్థు గలదిగా దాని చేయవలెను.,,

    kor 거기 창을 내되 위에서부터 한 규빗에 내고 그 문은 옆으로 내고 상 중 하 삼층으로 할지니라

    ఆదికాండము 6 :17

    tel ఇదిగో నేనే జీవవాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండ నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును

    kor 내가 홍수를 땅에 일으켜 무릇 생명의 기식 있는 육체를 천하에서 멸절하리니 땅에 있는 자가 다 죽으리라

    ఆదికాండము 6 :18

    tel అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతోకూడ నీ కుమారులును నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను.

    kor 그러나 너와는 내가 내 언약을 세우리니 너는 네 아들들과 네 아내와 네 자부들과 함께 그 방주로 들어가고

    ఆదికాండము 6 :19

    tel మరియు నీతోకూడ వాటిని బ్రదికించి యుంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరులయొక్క ప్రతి జాతిలో నివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను, వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను.

    kor 혈육 있는 모든 생물을 너는 각기 암,수 한쌍씩 방주로 이끌어 들여 너와 함께 생명을 보존케 하되

    ఆదికాండము 6 :20

    tel నీవు వాటిని బ్రదికించి యుంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకువాటన్నిటిలోను, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును.

    kor 새가 그 종류대로, 육축이 그 종류대로, 땅에 기는 모든 것이 그 종류대로, 각기 둘씩 네게로 나아오리니 그 생명을 보존케하라

    ఆదికాండము 6 :21

    tel మరియు తినుటకు నానావిధములైన ఆహారపదార్థములను కూర్చుకొని నీదగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను.

    kor 너는 먹을 모든 식물을 네게로 가져다가 저축하라 이것이 너와 그들의 식물이 되리라

    ఆదికాండము 6 :22

    tel నోవహు అట్లు చేసెను, దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.

    kor 노아가 그와 같이 하되 하나님이 자기에게 명하신 대로 다 준행하였더라 !

    ఆదికాండము 7

    పాత నిబంధన

    ఆదికాండము

    ఆదికాండము 6

    ఆదికాండము 8

    వచనం ఇండెక్స్:

    01 02 03 04 05 06 07 08 09 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

    ఆదికాండము 7 :1

    tel యెహోవా ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటివారును ఓడలో ప్రవేశించుడి.

    kor 여호와께서 노아에게 이르시되 너와 네 온 집은 방주로 들어가라 네가 이 세대에 내 앞에서 의로움을 내가 보았음이니라 !

    ఆదికాండము 7 :2

    tel పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును

    kor 너는 모든 정결한 짐승은 암수 일곱씩 부정한 것은 암수 둘씩을 네게로 취하며

    ఆదికాండము 7 :3

    tel ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి యేడును ఆడువి యేడును, నీవు భూమి అంతటిమీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీయొద్ద ఉంచుకొనుము,

    kor 공중의 새도 암수 일곱씩을 취하여 그 씨를 온 지면에 유전케하라

    ఆదికాండము 7 :4

    tel ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్లును నలుబది రాత్రులును భూమిమీద వర్షము కురిపించి, నేను చేసిన సమస్త జీవరాసులను భూమిమీద ఉండకుండ తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను.

    kor 지금부터 칠일이면 내가 사십 주야를 땅에 비를 내려 나의 지은 모든 생물을 지면에서 쓸어 버리리라

    ఆదికాండము 7 :5

    tel తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను.

    kor 노아가 여호와께서 자기에게 명하신 대로 다 준행하였더라 !

    ఆదికాండము 7 :6

    tel ఆ జలప్రవాహము భూమిమీదికి వచ్చినప్పుడు నోవహు ఆరువందల యేండ్లవాడు.

    kor 홍수가 땅에 있을 때에 노아가 육백세라

    ఆదికాండము 7 :7

    tel అప్పుడు నోవహును అతనితోకూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహజలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి.

    kor 노아가 아들들과 아내와 자부들과 함께 홍수를 피하여 방주에 들어갔고

    ఆదికాండము 7 :8

    tel దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను, పక్షులలోను నేలను ప్రాకువాటన్నిటిలోను,

    kor 정결한 짐승과 부정한 짐승과 새와 땅에 기는 모든 것이

    ఆదికాండము 7 :9

    tel మగది ఆడుది జతజతలుగా ఓడలోనున్న నోవహు నొద్దకు చేరెను.

    kor 하나님이 노아에게 명하신 대로 암수 둘씩 노아에게 나아와 방주로 들어갔더니

    ఆదికాండము 7 :10

    tel ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహజలములు భూమిమీదికి వచ్చెను.

    kor 칠일 후에 홍수가 땅에 덮이니

    ఆదికాండము 7 :11

    tel నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరము రెండవనెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను.

    kor 노아 육백세 되던 해 이월 곧 그 달 십 칠일이라 그날에 큰 깊음의 샘들이 터지며 하늘의 창들이 열려

    ఆదికాండము 7 :12

    tel నలుబది పగళ్లును నలుబది రాత్రులును ప్రచండ వర్షము భూమిమీద కురిసెను.

    kor 사십 주야를 비가 땅에 쏟아졌더라

    ఆదికాండము 7 :13

    tel ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు షేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితోకూడ అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి.

    kor 곧 그 날에 노아와 그의 아들 셈, 함, 야벳과 노아의 처와 세 자부가 다 방주로 들어갔고

    ఆదికాండము 7 :14

    tel వీరే కాదు, ఆ యా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆ యా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆ యా జాతుల ప్రకారము నేలమీద ప్రాకు ప్రతి పురుగును, ఆ యా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానావిధములైన రెక్కలుగల ప్రతి పిట్టయు ప్రవేశించెను.

    kor 그들과 모든 들짐승이 그 종류대로, 모든 육축이 그 종류대로, 땅에 기는 모든 것이 그 종류대로, 모든 새 곧 각양의 새가 그 종류대로

    ఆదికాండము 7 :15

    tel జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవహునొద్ద ప్రవేశించెను.

    kor 무릇 기식이 있는 육체가 둘씩 노아에게 나아와 방주로 들어갔으니

    ఆదికాండము 7 :16

    tel ప్రవేశించినవన్నియు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను, అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను.

    kor 들어간 것들은 모든 것의 암,수라 하나님이 그에게 명하신대로 들어가매 여호와께서 그를 닫아 넣으시니라

    ఆదికాండము 7 :17

    tel ఆ జలప్రవాహము నలుబది దినములు భూమిమీద నుండగా, జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమిమీదనుండి పైకి లేచెను.

    kor 홍수가 땅에 사십일을 있었는지라 물이 많아져 방주가 땅에서 올랐고

    ఆదికాండము 7 :18

    tel జలములు భూమిమీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్లమీద నడిచెను.

    kor 물이 더 많아져 땅에 창일하매 방주가 물 위에 떠 다녔으며

    ఆదికాండము 7 :19

    tel ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను.

    kor 물이 땅에 더욱 창일하매 천하에 높은 산이 다 덮였더니

    ఆదికాండము 7 :20

    tel పదిహేను మూరల యెత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములును మునిగిపోయెను.

    kor 물이 불어서 십오 규빗이 오르매 산들이 덮인지라

    ఆదికాండము 7 :21

    tel అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద ప్రాకు పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి.

    kor 땅위에 움직이는 생물이 다 죽었으니 곧 새와 육축과 들짐승과 땅에 기는 모든 것과 모든 사람이라

    ఆదికాండము 7 :22

    tel పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చనిపోయెను.

    kor 육지에 있어 코로 생물의 기식을 호흡하는 것은 다 죽었더라

    ఆదికాండము 7 :23

    tel నరులతోకూడ పశువులును పురుగులును ఆకాశపక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచివేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితోకూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.

    kor 지면의 모든 생물을 쓸어버리시니 곧 사람과 짐승과 기는 것과 공중의 새까지라 이들은 땅에서 쓸어버림을 당하였으되 홀로 노아와 그와 함께 방주에 있던 자만 남았더라

    ఆదికాండము 7 :24

    tel నూట ఏబది దినముల వరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను.

    kor 물이 일백 오십일을 땅에 창일하였더라

    ఆదికాండము 8

    పాత నిబంధన

    ఆదికాండము

    ఆదికాండము 7

    ఆదికాండము 9

    వచనం ఇండెక్స్:

    01 02 03 04 05 06 07 08 09 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

    ఆదికాండము 8 :1

    tel దేవుడు నోవహును అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను.

    kor 하나님이 노아와 그와 함께 방주에 있는 모든 들짐승과 육축을 권념하사 바람으로 땅 위에 불게 하시매 물이 감하였고

    ఆదికాండము 8 :2

    tel అగాధ జలముల ఊటలును ఆకాశపు తూములును మూయబడెను, ఆకాశమునుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను.

    kor 깊음의 샘과 하늘의 창이 막히고 하늘에서 비가 그치매

    ఆదికాండము 8 :3

    tel అప్పుడు నీళ్లు భూమిమీదనుండి క్రమక్రమముగా తీసి పోవుచుండెను, నూట ఏబది దినములైనతరు వాత నీళ్లు తగ్గిపోగా

    kor 물이 땅에서 물러가고 점점 물러가서 일백 오십일 후에 감하고

    ఆదికాండము 8 :4

    tel ఏడవ నెల పదియేడవ దినమున ఓడ అరారాతు కొండలమీద నిలిచెను.

    kor 칠월 곧 그 달 십칠일에 방주가 아라랏 산에 머물렀으며

    ఆదికాండము 8 :5

    tel నీళ్లు పదియవ నెలవరకు క్రమముగా తగ్గుచువచ్చెను. పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను.

    kor 물이 점점 감하여 시월 곧 그달 일일에 산들의 봉우리가 보였더라

    ఆదికాండము 8 :6

    tel నలుబది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి

    kor 사십일을 지나서 노아가 그 방주에 지은 창을 열고

    ఆదికాండము 8 :7

    tel ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి భూమిమీదనుండి నీళ్లు ఇంకిపోవువరకు ఇటు అటు తిరుగుచుండెను.

    kor 까마귀를 내어 놓으매 까마귀가 물이 땅에서 마르기까지 날아 왕래하였더라

    ఆదికాండము 8 :8

    tel మరియు నీళ్లు నేలమీదనుండి తగ్గినవోలేదో చూచుటకు అతడు తన యొద్దనుండి నల్లపావుర మొకటి వెలుపలికి పోవిడిచెను.

    kor 그가 또 비둘기를 내어 놓아 지면에 물이 감한 여부를 알고자 하매

    ఆదికాండము 8 :9

    tel నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతనియొద్దకు తిరిగివచ్చెను. అప్పుడతడు చెయ్యిచాపి దాని పట్టుకొని ఓడలోనికి తీసికొనెను.

    kor 온 지면에 물이 있으므로 비둘기가 접족할 곳을 찾지 못하고 방주로 돌아와 그에게로 오는지라 그가 손을 내밀어 방주 속 자기에게로 받아 들이고

    ఆదికాండము 8 :10

    tel అతడు మరి యేడుదినములు తాళి మరల ఆ నల్ల పావురమును ఓడలోనుండి వెలుపలికి విడిచెను.

    kor 또 칠일을 기다려 다시 비둘기를 방주에서 내어 놓으매

    ఆదికాండము 8 :11

    tel సాయంకాలమున అది అతనియొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఓలీవచెట్టు ఆకు దాని నోటనుండెను గనుక నీళ్లు భూమిమీదనుండి తగ్గిపోయెనని నోవహునకు తెలిసెను.

    kor 저녁때에 비둘기가 그에게로 돌아왔는데 그 입에 감람 새 잎사귀가 있는지라 이에 노아가 땅에 물이 감한 줄 알았으며

    ఆదికాండము 8 :12

    tel అతడింక మరి యేడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు.

    kor 또 칠일을 기다려 비둘기를 내어 놓으매 다시는 그에게로 돌아오지 아니하였더라

    ఆదికాండము 8 :13

    tel మరియు ఆరువందల ఒకటవ సంవత్సరము మొదటినెల తొలిదినమున నీళ్లు భూమిమీదనుండి యింకిపోయెను. నోవహు ఓడ కప్పుతీసి చూచినప్పుడు నేల ఆరియుండెను.

    kor 육백 일년 정월 곧 그 달 일일에 지면에 물이 걷힌지라 노아가 방주 뚜껑을 제치고 본즉 지면에 물이 걷혔더니

    ఆదికాండము 8 :14

    tel రెండవ నెల యిరువది యేడవ దినమున భూమియెండి యుండెను.

    kor 이월 이십 칠일에 땅이 말랐더라

    ఆదికాండము 8 :15

    tel అప్పుడు దేవుడు

    kor 하나님이 노아에게 말씀하여 가라사대

    ఆదికాండము 8 :16

    tel నీవును నీతోకూడ నీ భార్యయు నీ కుమారులును నీ కోడండ్రును ఓడలోనుండి బయటికిరండి.

    kor 너는 네 아내와 네 아들들과 네 자부들로 더불어 방주에서 나오고

    ఆదికాండము 8 :17

    tel పక్షులు పశువులు భూమిమీద ప్రాకు ప్రతిజాతి పురుగులు మొదలైన సమస్తశరీరులలో నీతోకూడనున్న ప్రతిజంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమిమీద బహుగా విస్తరించి భూమిమీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను.

    kor 너와 함께 한 모든 혈육 있는 생물 곧 새와 육축과 땅에 기는 모든 것을 다 이끌어 내라 이것들이 땅에서 생육하고 땅에서 번성하리라 하시매

    ఆదికాండము 8 :18

    tel కాబట్టి నోవహును అతనితో కూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి.

    kor 노아가 그 아들들과 그 아내와 그 자부들과 함께 나왔고

    ఆదికాండము 8 :19

    tel ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమిమీద సంచరించునవన్నియు వాటి వాటి జాతులచొప్పున ఆ ఓడలోనుండి బయటికి వచ్చెను.

    kor 땅위의 동물 곧 모든 짐승과 모든 기는 것과 모든 새도 그 종류대로 방주에서 나왔더라

    ఆదికాండము 8 :20

    tel అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను.

    kor 노아가 여호와를 위하여 단을 쌓고 모든 정결한 짐승 중에서와 모든 정결한 새 중에서 취하여 번제로 단에 드렸더니

    ఆదికాండము 8 :21

    tel అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి ఇకమీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను.

    kor 여호와께서 그 향기를 흠향하시고 그 중심에 이르시되 내가 다시는 사람으로 인하여 땅을 저주하지 아니하리니 이는 사람의 마음의 계획하는 바가 어려서부터 악함이라 내가 전에 행한 것 같이 모든 생물을 멸하지 아니하리니

    ఆదికాండము 8 :22

    tel భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీతకాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను.

    kor 땅이 있을 동안에는 심음과, 거둠과, 추위와, 더위와, 여름과, 겨울과, 낮과, 밤이 쉬지 아니하리라

    ఆదికాండము 9

    పాత నిబంధన

    ఆదికాండము

    ఆదికాండము 8

    ఆదికాండము 10

    వచనం ఇండెక్స్:

    01 02 03 04 05 06 07 08 09 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29

    ఆదికాండము 9 :1

    tel మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.

    kor 하나님이 노아와 그 아들들에게 복을 주시며 그들에게 이르시되 생육하고 번성하여 땅에 충만하라 !

    ఆదికాండము 9 :2

    tel మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును, అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి.

    kor 땅의 모든 짐승과 공중의 모든 새와 땅에 기는 모든 것과 바다의 모든 고기가 너희를 두려워하며 너희를 무서워하리니 이들은 너희 손에 붙이웠음이라

    ఆదికాండము 9 :3

    tel ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను.

    kor 무릇 산 동물은 너희의 식물이 될지라 채소같이 내가 이것을 다 너희에게 주노라

    ఆదికాండము 9 :4

    tel అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము.

    kor 그러나 고기를 그 생명 되는 피 채 먹지 말 것이니라

    ఆదికాండము 9 :5

    tel మరియు మీకు ప్రాణమైన మీ రక్తమునుగూర్చి విచారణ చేయుదును, దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమునుగూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును.,,

    kor 내가 반드시 너희 피 곧 너희 생명의 피를 찾으리니 짐승이면 그 짐승에게서, 사람이나 사람의 형제면 그에게서 그의 생명을 찾으리라

    ఆదికాండము 9 :6

    tel నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును, ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.

    kor 무릇 사람의 피를 흘리면 사람이 그 피를 흘릴 것이니 이는 하나님이 자기 형상대로 사람을 지었음이니라

    ఆదికాండము 9 :7

    tel మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను.

    kor 너희는 생육하고 번성하며 땅에 편만하여 그 중에서 번성하라 하셨더라

    ఆదికాండము 9 :8

    tel మరియు దేవుడు నోవహు అతని కుమారులతో

    kor 하나님이 노아와 그와 함께 한 아들들에게 일러 가라사대

    ఆదికాండము 9 :9

    tel ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను,

    kor 내가 내 언약을 너희와 너희 후손과

    ఆదికాండము 9 :10

    tel పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను.

    kor 너희와 함께 한 모든 생물 곧 너희와 함께 한 새와 육축과 땅의 모든 생물에게 세우리니 방주에서 나온 모든 것 곧 땅의 모든 짐승에게니라

    ఆదికాండము 9 :11

    tel నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలములవలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను.,,

    kor 내가 너희와 언약을 세우리니 다시는 모든 생물을 홍수로 멸하지 아니할 것이라 땅을 침몰할 홍수가 다시 있지 아니하리라

    ఆదికాండము 9 :12

    tel మరియు దేవుడు నాకును మీకును మీతోకూడనున్న సమస్త జీవరాసులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే.

    kor 하나님이 가라사대 내가 나와 너희와 및 너희와 함께 하는 모든 생물 사이에 영세까지 세우는 언약의 증거는 이것이라

    ఆదికాండము 9 :13

    tel మేఘములో నా ధనుస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును.

    kor 내가 내 무지개를 구름 속에 두었나니 이것이 나의 세상과의 언약의 증거니라

    ఆదికాండము 9 :14

    tel భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును.

    kor 내가 구름으로 땅을 덮을 때에 무지개가 구름 속에 나타나면

    ఆదికాండము 9 :15

    tel అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు

    kor 내가 나와 너희와 및 혈기 있는 모든 생물사이의 내 언약을 기억하리니 다시는 물이 모든 혈기 있는 자를 멸하는 홍수가 되지 아니할지라

    ఆదికాండము 9 :16

    tel ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాని చూచి దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్యనిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను.

    kor 무지개가 구름 사이에 있으리니 내가 보고 나 하나님과 땅의 무릇 혈기 있는 모든 생물 사이에 된 영원한 언약을 기억하리라

    ఆదికాండము 9 :17

    tel మరియు దేవుడు నాకును భూమిమీదనున్న సమస్తశరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను.

    kor 하나님이 노아에게 또 이르시되 내가 나와 땅에 있는 모든 생물 사이에 세운 언약의 증거가 이것이라 하셨더라

    ఆదికాండము 9 :18

    tel ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు, హాము కనానుకు తండ్రి.

    kor 방주에서 나온 노아의 아들들은 셈과, 함과, 야벳이며 함은 가나안의 아비라

    ఆదికాండము 9 :19

    tel ఈ ముగ్గురు నోవహు కుమారులు, వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను.

    kor 노아의 이 세 아들로 좇아 백성이 온 땅에 퍼지니라

    ఆదికాండము 9 :20

    tel నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్షతోట వేసెను.

    kor 노아가 농업을 시작하여 포도나무를 심었더니

    ఆదికాండము 9 :21

    tel పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను.

    kor 포도주를 마시고 취하여 그 장막 안에서 벌거벗은지라

    ఆదికాండము 9 :22

    tel అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడైయుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను.

    kor 가나안의 아비 함이 그 아비의 하체를 보고 밖으로 나가서 두 형제에게 고하매

    ఆదికాండము 9 :23

    tel అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసికొని తమ యిద్దరి భుజములమీద వేసికొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి, వారి ముఖములు వెనుకతట్టు ఉండుటవలన తమ తండ్రి దిసమొలను చూడలేదు.

    kor 셈과 야벳이 옷을 취하여 자기들의 어깨에 메고 뒷걸음쳐 들어가서 아비의 하체에 덮었으며 그들이 얼굴을 돌이키고 그 아비의 하체를 보지 아니하였더라

    ఆదికాండము 9 :24

    tel అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్నకుమారుడు చేసినదానిని తెలిసికొని

    kor 노아가 술이 깨어 그 작은 아들이 자기에게 행한 일을 알고

    ఆదికాండము 9 :25

    tel కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.

    kor 이에 가로되 `가나안은 저주를 받아 그 형제의 종들의 종이 되기를 원하노라'

    ఆదికాండము 9 :26

    tel మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును.

    kor 또 가로되 `셈의 하나님 여호와를 찬송하리로다 ! 가나안은 셈의 종이 되고

    ఆదికాండము 9 :27

    tel దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను.

    kor 하나님이 야벳을 창대케하사 셈의 장막에 거하게 하시고 가나안은 그의 종이 되게 하시기를 원하노라' 하였더라

    ఆదికాండము 9 :28

    tel ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు మూడువందల ఏబది యేండ్లు బ్రదికెను.

    kor 홍수 후에 노아가 삼백 오십년을 지내었고

    ఆదికాండము 9 :29

    tel నోవహు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ఏబది యేండ్లు, అప్పుడతడు మృతిబొందెను.

    kor 향년이 구백 오십세에 죽었더라

    ఆదికాండము 10

    పాత నిబంధన

    ఆదికాండము

    ఆదికాండము 9

    ఆదికాండము 11

    వచనం ఇండెక్స్:

    01 02 03 04 05 06 07 08 09 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32

    ఆదికాండము 10 :1

    tel ఇది నోవహు కుమారులగు షేము హాము యాపె తను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి.

    kor 노아의 아들 셈과, 함과, 야벳의 후예는 이러하니라 홍수 후에 그들이 아들들을 낳았으니

    ఆదికాండము 10 :2

    tel యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.

    kor 야벳의 아들은 고멜과, 마곡과, 마대와, 야완과, 두발과, 메섹과, 디라스요

    ఆదికాండము 10 :3

    tel గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా అనువారు.

    kor 고멜의 아들은 아스그나스와, 리밧과, 도갈마요

    ఆదికాండము 10 :4

    tel యావాను కుమారులు ఏలీషా తార్షీషు కిత్తీము దాదోనీము అనువారు.

    kor 야완의 아들은 엘리사와, 달시스와, 깃딤과, 도다님이라

    ఆదికాండము 10 :5

    tel వీరినుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారివారి జాతుల ప్రకారము, వారివారి భాషలప్రకారము, వారివారి వంశముల ప్రకారము, ఆ యా దేశములలో వారు వేరైపోయిరి.

    kor 이들로부터 여러 나라 백성으로 나뉘어서 각기 방언과 종족과 나라대로 바닷가의 땅에 머물렀더라

    ఆదికాండము 10 :6

    tel హాము కుమారులు కూషు మిస్రాయిము పూతుకనాను అనువారు.

    kor 함의 아들은 구스와, 미스라임과, 붓과, 가나안이요

    ఆదికాండము 10 :7

    tel కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా అనువారు. రాయమా కుమారులు షేబ దదాను అనువారు.

    kor 구스의 아들은 스바와, 하윌라와, 삽다와, 라아마와, 삽드가요, 라아마의 아들은 스바와, 드단이며

    ఆదికాండము 10 :8

    tel కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను.

    kor 구스가 또 니므롯을 낳았으니 그는 세상에 처음 영걸이라

    ఆదికాండము 10 :9

    tel అతడు యెహోవాయెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టి యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తికలదు.

    kor 그가 여호와 앞에서 특이한 사냥군이 되었으므로 속담에 이르기를 아무는 여호와 앞에 니므롯 같은 특이한 사냥군이로다 하더라

    ఆదికాండము 10 :10

    tel షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు.

    kor 그의 나라는 시날땅의 바벨과, 에렉과, 악갓과, 갈레에서 시작되었으며

    ఆదికాండము 10 :11

    tel ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును

    kor 그가 그 땅에서 앗수르로 나아가 니느웨와, 르호보딜과, 갈라와

    ఆదికాండము 10 :12

    tel నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను, ఇదే ఆ మహా పట్టణము.

    kor 및 니느웨와 갈라 사이의 레센(이는 큰 성이라)을 건축하였으며

    ఆదికాండము 10 :13

    tel మిస్రాయిము లూదీయులను అనామీయులను లెహాబీయులను నప్తుహీయులను

    kor 미스라임은 루딤과, 아나밈과, 르하빔과, 납두힘과

    ఆదికాండము 10 :14

    tel పత్రుసీయులను కస్లూహీయులను కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూహీయులలోనుండి వచ్చిన వారు.

    kor 바드루심과, 가슬루힘과, 갑도림을 낳았더라 (블레셋이 가슬루힘에게서 나왔더라)

    ఆదికాండము 10 :15

    tel కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను

    kor 가나안은 장자 시돈과, 헷을 낳고

    ఆదికాండము 10 :16

    tel హివ్వీయులను అర్కీయులను సినీయులను

    kor 또 여부스 족속과, 아모리 족속과, 기르가스 족속과

    ఆదికాండము 10 :17

    tel అర్వాదీయులను సెమారీయులను హమాతీయులను కనెను.

    kor 히위 족속과, 알가 족속과, 신 족속과

    ఆదికాండము 10 :18

    tel తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను.

    kor 아르왓 족속과, 스말 족속과, 하맛 족속의 조상을 낳았더니 이 후로 가나안 자손의 족속이 흩어져 처하였더라

    ఆదికాండము 10 :19

    tel కనానీయుల సరిహద్దు సీదోనునుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజా వరకును, సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయిములకు వెళ్లు మార్గములో లాషావరకును ఉన్నది.

    kor 가나안의 지경은 시돈에서부터 그랄을 지나 가사까지와, 소돔과, 고모라와, 아드마와, 스보임을 지나 라사까지였더라

    ఆదికాండము 10 :20

    tel వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషల ప్రకారము తమతమ దేశములనుబట్టియు జాతులను బట్టియు హాము కుమారులు.

    kor 이들은 함의 자손이라 각기 족속과 방언과 지방과 나라대로이었더라

    ఆదికాండము 10 :21

    tel మరియు ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను.

    kor 셈은 에벨 온 자손의 조상이요 야벳의 형이라 그에게도 자녀가 출생하였으니

    ఆదికాండము 10 :22

    tel షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు.

    kor 셈의 아들은 엘람과, 앗수르와, 아르박삿과, 룻과, 아람이요

    ఆదికాండము 10 :23

    tel అరాము కుమారులు ఊజు హూలు గెతెరు మాషనువారు.

    kor 아람의 아들은 우스와, 훌과, 게델과, 마스며

    ఆదికాండము 10 :24

    tel అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.

    kor 아르박삿은 셀라를 낳고, 셀라는 에벨을 낳았으며

    ఆదికాండము 10 :25

    tel ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకనిపేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.

    kor 에벨은 두 아들을 낳고, 하나의 이름을 벨렉이라 하였으니 그 때에 세상이 나뉘었음이요 벨렉의 아우의 이름은 욕단이며

    ఆదికాండము 10 :26

    tel యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును

    kor 욕단은 알모닷과, 셀렙과, 하살마웹과, 예라와

    ఆదికాండము 10 :27

    tel హదోరమును ఊజాలును దిక్లాను

    kor 하도람과, 우살과, 디글라와

    ఆదికాండము 10 :28

    tel ఓబాలును అబీమాయెలును షేబను

    kor 오발과, 아비마엘과, 스바와

    ఆదికాండము 10 :29

    tel ఓఫీరును హవీలాను యోబాబును కనెను. వీరందరు యొక్తాను కుమారులు.

    kor 오빌과, 하윌라와, 요밥을 낳았으니 이들은 다 욕단의 아들이며

    ఆదికాండము 10 :30

    tel మేషానుండి సపారాకు వెళ్లు మార్గములోని తూర్పు కొండలు వారి నివాసస్థలము.

    kor 그들의 거하는 곳은 메사에서부터 스발로 가는 길의 동편 산이었더라

    ఆదికాండము 10 :31

    tel వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషలప్రకారము తమతమ దేశములనుబట్టియు తమతమ జాతులనుబట్టియు షేము కుమారులు.

    kor 이들은 셈의 자손이라 그 족속과 방언과 지방과 나라대로였더라

    ఆదికాండము 10 :32

    tel వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలోనుండి జనములు భూమిమీద వ్యాపించెను.

    kor 이들은 노아 자손의 족속들이요 그 세계와 나라대로라 홍수 후에 이들에게서 땅의 열국 백성이 나뉘었더라

    ఆదికాండము 11

    పాత నిబంధన

    ఆదికాండము

    ఆదికాండము 10

    ఆదికాండము 12

    వచనం ఇండెక్స్:

    01 02 03 04 05 06 07 08 09 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32

    ఆదికాండము 11 :1

    tel భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను.

    kor 온 땅의 구음이 하나이요 언어가 하나이었더라

    ఆదికాండము 11 :2

    tel వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి

    kor 이에 그들이 동방으로 옮기다가 시날 평지를 만나 거기 거하고

    ఆదికాండము 11 :3

    tel మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను.

    kor 서로 말하되 `자, 벽돌을 만들어 견고히 굽자' 하고 이에 벽돌로 돌을 대신하며 역청으로 진흙을 대신하고

    ఆదికాండము 11 :4

    tel మరియు వారు మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరముగల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా

    kor 또 말하되 `자, 성과 대를 쌓아 대 꼭대기를 하늘에 닿게 하여 우리 이름을 내고 온 지면에 흩어짐을 면하자' 하였더니

    ఆదికాండము 11 :5

    tel యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను.

    kor 여호와께서 인생들의 쌓는 성과 대를 보시려고 강림하셨더라

    ఆదికాండము 11 :6

    tel అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారికందరికి భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించియున్నారు. ఇకమీదట వారు చేయదలచు ఏపనియైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండదు,,

    kor 여호와께서 가라사대 이 무리가 한 족속이요, 언어도 하나이므로 이같이 시작하였으니 이후로는 그 경영하는 일을 금지할 수 없으리로다

    ఆదికాండము 11 :7

    tel గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను.

    kor 자, 우리가 내려가서 거기서 그들의 언어를 혼잡케 하여 그들로 서로 알아듣지 못하게 하자 하시고

    ఆదికాండము 11 :8

    tel ఆలాగు యెహోవా అక్కడనుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి.

    kor 여호와께서 거기서 그들을 온 지면에 흩으신 고로 그들이 성 쌓기를 그쳤더라

    ఆదికాండము 11 :9

    tel దానికి బాబెలు అను పేరు పెట్టిరి, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను.

    kor 그러므로 그 이름을 바벨이라 하니 이는 여호와께서 거기서 온 땅의 언어를 혼잡케 하셨음이라 여호와께서 거기서 그들을 온 지면에 흩으셨더라

    ఆదికాండము 11 :10

    tel షేము వంశావళి ఇది.

    Enjoying the preview?
    Page 1 of 1